భాట్టం శ్రీరామమూర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భాట్టం శ్రీరామమూర్తి(ఆంగ్లం:Bhattam Srirama Murthy) ప్రముఖ జర్నలిస్టు, రాజకీయవేత్త.

భాట్టం శ్రీరామమూర్తి
జననంభాట్టం శ్రీరామమూర్తి
(1926-05-12)1926 మే 12
India ధర్మవరం గ్రామం,విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
మరణంజూలై 6, 2015
విశాఖపట్టణం
మరణ కారణంఅనారోగ్యం
వృత్తిపార్లమెంటు సభ్యుడు
ముందు వారుకె.ఎ.స్వామి
తర్వాత వారుఅయ్యన్న పాత్రుడు
రాజకీయ పార్టీతెలుగుదేశం
మతంహిందూ
భార్య / భర్తభాట్టం సత్యవతి
తండ్రిసన్నయ్య

జీవిత విశేషాలు

[మార్చు]

ఇతడు విశాఖపట్టణం జిల్లా ధర్మవరం గ్రామంలో 1926, మే 12న జన్మించాడు[1]. ఇతని తండ్రి పేరు సన్నయ్య. బి.ఎ., ఎల్.ఎల్.బి వరకు చదువుకొన్నాడు. ఇతడి వివాహం సత్యవతితో జరిగింది. ఇతనికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు.

రాజకీయ ప్రస్థానం

[మార్చు]

ఇతడు భారత సోషలిస్టు పార్టీలో చురుకుగా పాల్గొన్నాడు. 1955లో ఆ పార్టీ రాష్ట్రశాఖకు జాయింట్ సెక్రెటరీగా, 1957లో జనరల్ సెక్రెటరీగా ఉన్నాడు. తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో సుమారు 16 సంవత్సరాలు సభ్యుడిగా కొనసాగాడు. ఇతడు 1957, 1962లలో విజయనగరం శాసనసభ నియోజకవర్గం నుండి, 1972, 1978లలో పారవడ శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఇతడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 1972లో విద్య, సాంస్కృతిక శాఖామాత్యుడిగా, 1974-78లో సాంఘిక సంక్షేమ శాఖకు మంత్రిగా, 1981లో సాంస్కృతిక వ్యవహారాల మంత్రిగా పనిచేశాడు. ఇతడు బి.సి.సంక్షేమం, హరిజన సంక్షేమం, గిరిజన సంక్షేమం, యువజన సర్వీసులు, ఆర్కియాలజీ, ఎండోమెంట్స్ శాఖలకు కూడా మంత్రిగా సేవలనందించాడు. ఇతడు 1984లో 8వ లోక్‌సభకు విజయనగరం నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ పక్షాన లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

ఇతడు 1945- 46మధ్యకాలంలో విజయనగరం టవున్ విద్యార్థి కాంగ్రెస్‌కు జనరల్ సెక్రెటరీగా, 1946-47లో విజయనగరం మహరాజా కళాశాల విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. సత్యాగ్రహంలో పాల్గొని రెండు పర్యాయాలు జైలుకు వెళ్లాడు. 1984లో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో పాల్గొన్నాడు. హంగేరీలో జరిగిన ప్రపంచ శాంతి సభలకు హాజరయ్యాడు.

పత్రికారంగం

[మార్చు]

ఇతడు జయభారత్ పత్రికకు 1947-48లో ఉపసంపాదకుడిగా ఉన్నాడు. 1969లో ప్రజారథం వారపత్రికకు, 1970-92లలో ఆంధ్రజనత దినపత్రికకు సంపాదకుడిగా పనిచేశాడు.

రచనలు

[మార్చు]

ఇతడు తెలుగుభాషలో 4 గ్రంథాలను రచించాడు. స్వేచ్ఛాభారతం[2] పేరుతో స్వీయచరిత్రను వ్రాశాడు.

పురస్కారాలు

[మార్చు]
  • 2011లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే సాంస్కృతిక రంగంలో చేసిన కృషికి గాను కళారత్న పురస్కారం.[3]

తుది శ్వాస

[మార్చు]

కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖపట్టణం లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో జూలై 6, 2015 న తుది శ్వాస విడిచారు.[4]

మూలాలు

[మార్చు]
  1. వెబ్‌సైటులో భాట్టం శ్రీరామమూర్తి బయోడేటా[permanent dead link]
  2. భాట్టం, శ్రీరామమూర్తి (2009). స్వేచ్ఛాభారతం (1 ed.). హైదరాబాద్: ఎమెస్కో పబ్లిషర్స్. Retrieved 17 January 2015.
  3. "కళారత్న - 2011 పురస్కార గ్రహీతలు". ఈనాడు ప్రతిభ. మార్చి 30, 2012. Retrieved 17 January 2015.[permanent dead link]
  4. Sakshi (7 July 2015). "బహుముఖ ప్రజ్ఞకు దర్పణం". Archived from the original on 7 సెప్టెంబరు 2021. Retrieved 7 September 2021.