వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/సంభావ్యత
పరికరాలు
సాధారణం
ఇతర ప్రాజెక్టులలో
స్వరూపం
వికీపీడియా నుండి
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి
- శుద్ధి చేయబడని యాంత్రిక అనువాద వ్యాసం. " నాణెం సరసమైనది కాబట్టి, రెండు ఫలితాలు ("హెడ్" మరియు "టైల్") రెండూ సమానంగా సంభావ్యమైనవి;" వంటి కృతక భాషా దోషాలు ఉన్నాయి. తొలగించాలి.--కె.వెంకటరమణ⇒చర్చ 12:02, 2 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- "ఈ భావనలు ఒక ఇవ్వడం జరిగింది ప్రమాణ లో గణిత రూపంగా సంభావ్యత సిద్ధాంతం వంటి విరివిగా ఉపయోగించే, అధ్యయనం యొక్క ప్రాంతాల్లో వంటి గణిత, గణాంకాలు, ఫైనాన్స్, జూదం, సైన్స్ (ముఖ్యంగా భౌతిక ), కృత్రిమ మేధస్సు / యంత్ర అభ్యాస, కంప్యూటర్ సైన్స్, గేమ్ థియరీ, మరియు తత్వశాస్త్రం, ఉదాహరణకు, సంఘటనల frequency హించిన పౌన frequency పున్యం గురించి అనుమానాలను గీయండి." - ఈ చచ్చు అనువాదంలో ఇదొక పుచ్చు వాక్యం. అనువాద పరికరంలో కనీసం 15% మానవిక అనువాదాలుండకపోతే, అది ప్రచురించనీయదు. అందుకని మొదటి పేరాను కొంత సరిచేసి, సరిగ్గా 15% మానవిక అనువాదాలుండేలాగా చూసుకుని ప్రచురించి పారేసారు. దానికంటే ఒక్ఖ మిల్లీమీటరు కూడా శ్రమ పడదలచు కోలేదు.
- మనం ఇలాంటి యాంత్రికానువాదాలపై మొదలుపెట్టిన చర్చలో వెంటనే నియమాలను ఖరారు చేసుకోవాలని, కనీస మానవిక అనువాదాల స్థాయిని 15% నుండి 40% - 50% స్థాయికి తీసుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉందనీ ఈ వ్యాసం లక్షా తొంభయ్యో సారి నిరూపిస్తోంది.
- తక్షణం తొలగించాలి. తొలగించాక, ఆ పేజీని సృష్టించిన వాడుకరికి ఒక సూచన కూడా చెయ్యాలి, ఇలాంటి అనువాదాలను ప్రచురించవద్దని. __చదువరి (చర్చ • రచనలు) 13:53, 2 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- ఈ వ్యాసాన్ని తొలగించాలి. లేదా పూర్తిగా తిరగరాయాలి. ఇంతకీ ఈ వ్యాసాన్ని సృష్టించిన వాడుకరి ఐఐఐటీ ప్రాజెక్టును వాడుకుని చేసిందా ఏమిటి? ఒకవేళ అలా అయితే మన అనుమానాలన్ని నిజం అవుతున్నట్టే. రవిచంద్ర (చర్చ) 18:37, 10 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.