వికీపీడియా:వికీప్రాజెక్టు/తెవికీ పాఠ్య ప్రణాళిక/పాఠ్యాశాలు/ప్రయోగశాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రయోగశాల

మనం ఏదైనా రాయాలనున్నప్పుడు, అది ఎలా రాస్తున్నామో అని పరిశీలించుకోవడంకోసం చిత్తుప్రతిగా ముందు వేరే దానిలో రాసుకొని ఆ తరువాత అసలైన దానిలో రాస్తాం. అలా చేయడం వల్ల తప్పులు రాయడమన్న సమస్య ఉండదు. అలాంటి మాదిరిగానే చిత్తుప్రతిగా ముందు వేరే దానిలో రాసుకోవడం కోసం వికీపీడియాలో ఒక పేజీ తయారుచేయబడింది. దానినే ప్రయోగశాల అంటారు. వికీపీడియా సైటు తెరిచినపుడు కుడివైపు పైభాగంలో ఈ ప్రయోగశాల మనకు కనిపిస్తుంది. దానిని క్లిక్ చేస్తే మరో పేజీ ఓపన్ అవుతుంది. ముందుగా మనం ప్రయోగశాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

1. ప్రయోగశాల అంటే ఏమిటి?

వికీపీడియాలో మొదటిసారి వ్రాయాలనుకుంటున్న కొత్త వాడుకరులకు వికీపీడియా ఇంటర్ ఫేస్ నేర్చుకునేందుకు ఈ ప్రయోగశాల ప్రవేశపెట్టింది. తప్పులు రాయకుండా వికీపీడియా రచన నేర్చుకునేందుకు తయారుచేయబడిన పేజీ ఇది.

2. ప్రయోగశాలలో ఏం చేయవచ్చు?

వికీపీడియాలో మీరు ఏదైనా సమాచారాన్ని చేర్చడంగానీ, కొత్త వ్యాసాలను రాయడంగానీ చేయాలనుకుంటే, మొదటగా ఈ ప్రయోగశాలలో ప్రాక్టీసు చేయవచ్చు. అయితే, వికీపీడియా వ్యాసానికి ఎటువంటి నింబంధనలు ఉంటాయో, ప్రయోగశాలలో ఉన్న వాటికి కూడా అవే వర్తిస్తాయి.

3. ప్రయోగశాలలో రాసుకోవాలంటే లాగిన్ అయి ఉండాలా?

అవును. వికీపీడియాలో లాగిన్ అయి ఉంటేనే మనకు ప్రయోగశాల అందుబాటులో ఉంటుంది.

4. ప్రయోగశాలో ఎన్ని వ్యాసాలు రాసుకోవచ్చు?

ప్రయోగశాలలో ఎన్ని వ్యాసాలైనా రాసుకోవచ్చు. పరిమతి అనేది లేదు.

5. ప్రయోగశాలకు ఉపపేజీలు పెట్టుకోవచ్చా?

పెట్టుకోవచ్చు. పరిమితి అనేది లేదు.

6. ప్రయోగశాలలో నేను రాసినది ఇతరులకు కనిపిస్తుందా?

మీరు ప్రయోగశాలలో ఏదైనా దిద్దుబాట్లు చేసినపుడు, ఇటివల మార్పులలో దిద్దుబాటు వివరాలు కనిపిస్తాయి, అలా మీ ప్రయోగశాలలో జరుగుతున్న దిద్దుబాట్లను ఇతరులు చూడవచ్చు. అంతేకాకుండా. ప్రత్యేకంగా మీ ప్రయోగశాల పేరుతో వెతికి కూడా చూడవచ్చు.

7. ప్రయోగశాలలో నేను రాసిన వ్యాసం పూర్తయ్యాక దాన్ని వికీలోకి తీసుకొని రావచ్చా? ఎలా తీసుకొని రావాలి?

చేయవచ్చు. ప్రయోగశాలలో రాసిన దానిని కాపీ చేసి, మీరు అనుకున్న వ్యాసంలో పెట్టవచ్చు. అలా కాకుండా తరలించడం ద్వారా కూడా ప్రయోగశాల నుండి వికీపీడియా పేరుబరీలోకి తీసుకొని రావచ్చు.

వీడియో పాఠ్యం[మార్చు]

మనం ఏదైనా రాయాలనున్నప్పుడు, సరిగా రాస్తున్నామో.. లేదో.. అని పరిశీలించుకోవడంకోసం చిత్తుప్రతిగా ముందు వేరే దానిలో రాసుకొని ఆ తరువాత అసలైన దానిలో రాస్తాం. అలా చేయడం వల్ల తప్పులు రాయడమన్న సమస్య ఉండదు. అలాంటి మాదిరిగానే చిత్తుప్రతిగా ముందు వేరే దానిలో రాసుకోవడం కోసం వికీపీడియాలో ఒక పేజీ తయారుచేయబడింది. దానినే వికీపీడయా ప్రయోగశాల అంటారు. వికీపీడియా సైటు తెరిచి, లాగిన్ అయిన తరువాత, సైటు కుడివైపు పైభాగంలో ‘ప్రయోగశాల’ మనకు కనిపిస్తుంది. దానిని క్లిక్ చేస్తే మరో పేజీ ఓపన్ అవుతుంది. ఇందులో మీరు వికీపీడియా రచనపై ప్రయోగాలు చేయవచ్చు, ఎడిట్లు ప్రాక్టీస్ చేయవచ్చు లేదా పూర్తి వ్యాసాన్ని కూడా రాసుకోవచ్చు. ఈ ప్రయోగశాలలో రాసుకోవడానికంటే ముందు, ప్రయోగశాల అంటే ఏమిటి, అందులో ఏంఏం రాసుకోవచ్చు అనే అంశాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

వికీపీడియాలో మొదటిసారి వ్రాయాలనుకుంటున్న కొత్త వాడుకరులకు వికీపీడియా ఇంటర్ ఫేస్ నేర్చుకునేందుకు ఈ ప్రయోగశాల ప్రవేశపెట్టింది. తప్పులు రాయకుండా వికీపీడియా రచన నేర్చుకునేందుకు తయారుచేయబడిన పేజీ ఇది.

వికీపీడియాలో మీరు ఏదైనా సమాచారాన్ని చేర్చడంగానీ, కొత్త వ్యాసాలను రాయడంగానీ చేయాలనుకుంటే, మొదటగా ఈ ప్రయోగశాలలో ప్రాక్టీసు చేయవచ్చు. అయితే, వికీపీడియా వ్యాసానికి ఎటువంటి నింబంధనలు ఉంటాయో, ప్రయోగశాలలో ఉన్న వాటికి కూడా అవే వర్తిస్తాయి. ముఖ్యమైన విషయం ఏమిటంటే, వికీపీడియాలో లాగిన్ అయి ఉంటేనే మనకు ఈ ప్రయోగశాల అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా ప్రయోగశాలలో మనం ఎన్ని వ్యాసాలైనా రాసుకోవచ్చు, ఉపపేజీలు కూడా పెట్టుకోవచ్చు.

ఇప్పుడు ప్రయోగశాలలో వ్యాసాన్ని ఎలా రాయాలో తెలుసుకుందాం..

వికీపీడియా సైటు తెరిచి, లాగిన్ అయిన తరువాత, సైటు కుడివైపు పైభాగంలో మనకు ఈ ప్రయోగశాల లింకు కనిపిస్తుంది. దానిని క్లిక్ చేస్తే, ఇలా మరో పేజీ ఓపన్ అవుతుంది. అది మన వాడుకరి పేజీకి ఉపపేజీ అన్నమాట. ఈ పేజీలో కింద ఉన్న బాక్స్ లో మనం రాయాలనుకున్న సమాచారాన్ని రాసుకోవాలి. మనం రాసింది ఎలా కనిపిస్తోందనని చూసుకోవడం కోసం బాక్స్ కిందనున్న ‘మునుచూపు చూడు’ అనే బాక్స్ ను క్లిక్ చేస్తే, మనం రాసింది వ్యాసరూపంలో కనిపిస్తుంది. సరిగా ఉందో లేదో చూసుకున్న తరువాత, కిందనున్న ‘దిద్దుబాటు సారాంశం’ బాక్స్ లో వివరాలు రాసి, ‘ప్రచురించు’ బాక్స్ ను క్లిక్ చేస్తే మనం రాసిన సమాచారం ప్రచురించబడి, ఇలా వ్యాస రూపంలో కనిపిస్తుంది. మళ్ళీ దీనిలో ఎడిట్లు చేయడానికి ‘సవరించు’ అనేదానిని క్లిక్ చేసి, వ్యాసంలో మార్పులు చేయవచ్చు.

ప్రయోగశాలలో వ్యాసం పూర్తయిన తరువాత, ఆ సమాచారాన్నంతా కాపీ చేసి, మీరు రాయలనుకుంటున్న వ్యాసంలో పెట్టవచ్చు. అలాకాకుండా పేజీని తరలించడం ద్వారా కూడా ప్రయోగశాల నుండి వికీపీడియా పేరుబరీలోకి తీసుకొని రావచ్చు.

ఇదండీ, వికీపీడియా ప్రయోగశాలలో రాసే విధానం. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే వికీపీడియాలో అకౌంట్ ఓపన్ చేసి, చకచకా మీకు తెలిసిన సమాచారాన్ని వికీపీడియాలో రాసేయండి మరి.