ఉబుంటు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


ఉబుంటు
Ubuntu10.04Telugu.png
ఉబుంటు 11.04 ( నాటీ నార్వాల్)
వెబ్‌సైట్ www.ubuntu.com
అభివృద్ధిచేసినవారు కెనానికల్ లిమిటెడ్  / ఉబుంటు ఫౌండేషన్
OS కుటుంబం యునిక్స్
మూలము నమూనా ఉచిత సాఫ్ట్వేర్ / స్వేచ్ఛాయుత మూలములు
మెదటి విడుదల 2004-10-20
సరికొత్త విడుదల 18.04 / 2018-04-26
భాషల లభ్యత అనేకమైన ( 55 కన్న ఎక్కువ)
నవీకరణ పద్ధతి ఆప్ట్ (జియుఐ )
ప్యాకేజీ నిర్వాహకం డిపికెజి
కెర్నల్ లినక్స్
వాడుకరి అంతరవర్తి గ్నోమ్ (రూపు రేఖలు కె డి ఇ, ఎక్స్ఎఫ్‌సిఇ మరియు ఎల్ఎక్స్‌డ్ఇ)
లైసెన్సు వివిధ, ముఖ్యంగా జి పి ఎల్ మరియు జి ఎఫ్ డి ఎల్
ప్రస్తుత స్థితి ప్రస్తుతము

ఉబుంటు లినక్సు [1] ఒక లినక్స్ పంపిణీ, ఇది డెబియన్ గ్నూ/లినక్స్ మీద నిర్మించబడింది. దీని పంపిణీదారు మార్క్ ‌ షటిల్‌వర్త్ స్థాపించిన కనోనికల్ లిమిటెడ్. ఈ పంపిణీ పేరు దక్షిణ ఆఫ్రికా భావన ఐన ఉబుంటు నుండి వచ్చింది. బంటు భాషలో ఉబుంటు అనగా ఇతరులపట్ల మానవత్వం. ప్రతి 6 నెలలకు ఒక కొత్త రూపాంతరం (వెర్షన్) విడుదలచేయబడుతుంది. ఉబుంటు లినక్స్ ను స్వేచ్ఛగా, ఉచితంగా వాడుకొనవచ్చును, మరియు కాపీలను సంకోచములేకుండా ఇతరులకు ఇవ్వవచ్చును. పాఠశాలల కొరకు ప్రత్యేక ఎడ్యుబుంటు అను రూపాంతరం, ఇంకా కుబుంటు, క్జుబుంటు మరియు ఇతర రూపాంతరములు గలవు.

లక్షణాలు[మార్చు]

ఉబుంటు ఉచిత సాఫ్ట్ వేర్, ఇది డెబియన్ లైనెక్స్ ఆధారిత సిస్టమ్ గా ఉద్బవించింది, ఉబుంటు సమాజ మరియు వృత్తి పరమైన మద్దతులకు అనుగుణంగావున్నది. ఇవి ప్రపంచంలోని అన్నీ ప్రాంతాలకు సాఫ్ట్ వేర్ప్రయోజనాలు ఉచితంగా అందించాలనే ఉద్దేశముతో నడపబడుతోంది, ఉబుంటు మొదట వెర్షన్ 4.10 అనునది అక్టోబరు 2004 లో విడుదల చేయబడింది. ఈ ఉబుంటు అతి పెద్దదైన లినెక్స్ సాఫ్ట్ వేర్ కమ్యూనిటి కింద డేబియన్ ప్రాజెట్క్ ద్వారా అభివృద్ధి చేయటం జరిగినది . సులువుగా వాడటం కోసం నిర్వహణ విధులకొరకు సుడో ఆదేశంతో సాధారణ వాడుకరి చేయకలిగే వీలుంది. స్థాపన మాధ్యమం నుండి హార్డుడిస్క్ లో స్థాపించవచ్చు. కంప్యూటర్ ని తిరిగి ప్రారంభించనవసరంలేదు. అశక్తులైనవారికి సౌకర్యాలు, అంతర్జాతీయంగా వాడటం దీనిలో ప్రాముఖ్యతకలిగివున్నది. యు టి ఎఫ్-8 అక్షరపు ఎన్కోడింగు 5.04 విడుదలతో అప్రమేయంగా వాడబడుతున్నది. దీనివలన అన్ని భాషల వారు వాడటం కుదురుతుంది. దీనితోపాటు కార్యాలయ పనుల కొరకు అనువర్తనం లిబ్రెఆఫీస్, అంతర్జాల విహరిణి ఫైర్‌ఫాక్స్, త్వరిత వార్తావాహినిపిడ్జిన్, చిత్రాలను మార్పుచేయు అనువర్తనముగింప్, రకరకాలైన ఆటలు సుడోకు, చదరంగం సాఫ్ట్వేర్ దొరకుతాయి. అవసరంలేని నెట్ వర్క్ పోర్టులు మూసి వుంటాయు కాబట్టి, కంప్యూటర్ ని రక్షణ పెరుగుతుంది. 11.04 విడుదలలో తెలుగు, కన్నడ భాషలతో సహా 10 భారతదేశ భాషలలో బూట్ నుండే తోడ్పాటు వుండటంతో, ఇంగ్లీషు అంతగా రాని వారు కూడా సులభంగా కంప్యూటర్ వాడవచ్చు.ఉబుంటు పూర్తి ఆధునిక ఆపరేటింగ్ సిస్టమ్, ఇందులో ప్రతిదీ విండోస్ లో కనుగొనే విధముగా వుంటుంది. ఉబుంటు ఆధునిక లక్షణాలను అందిస్తూ విషయాలను చాలా సులభంగా ఉంచుతుంది . ప్రతి ఆరునెలలను ఒక సారి ఉబుంటు కొత్త వర్షన్ ను విడుదలచేస్తారు . ఉబుంటు తయారు చేసే వారి లక్ష్యం లినెక్స్ ను ఒక సులభమైన లినెక్స్ డెస్క్ టాప్ ను తయారు చేయటం, ఇది ఎలాంటి ఖర్చు లేకుండా దొరికే ఓ ఉచిత సాఫ్ట్ వేర్. దీనిని ఇనిస్టాల్ చేయటం ఉపయోగించటం చాలా సుఉబుంటులో ప్రధాన వైరస్ లు ఏమీ లేవు, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ను క్రాష్ చేయగల వైరస్ లను ఉబుంటు నిరోధిస్తుంది, అందువలన ఆ వైరస్ లు సిస్టమ్ లను చెడగొట్టుట కష్టం. ఉబుంటులో స్పై వేర్ సమస్యలు లేవు. ఎప్పటికప్పుడు ఈ వైరస్లు సోకకుండా కొత్త వర్షన్ లను ప్రతి ఆరునెలలకు ఒకసారి ఉచితంగా రిలీజ్ చేస్తారు.లభం, ఇది ఇనిస్టాల్ చేయటం ఉపయోగించుకొనేందుకు నైపుణ్యం అంతగా అవసరం లేదు .ఈ ఆపరేటింగ్ సిస్టమ్ చాలా అందంగా, సొగసుగా ఉంటూనే స్థిరంగా వేగవంతంగా పనిచేస్తుంది. ఆధునిక కంప్యూటర్లలో ఒక నిమిషం కన్నా తక్కువ సమయం లోనే లోడ్ అవుతుంది . ఉబుంటు మ్యాక్ మరియు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లకు ప్రత్యాన్మాయం, ఉబుంటు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కంటే వేగంగా పనిచేస్తుంది .

తాజా విశేషాలు[మార్చు]

యూనిటీ అంతర్వర్తి[మార్చు]

కొత్త యూనిటీ అంతర్వర్తి (ఇంటర్ఫేస్) తో కంప్యూటర్ వాడుక మరింత సులభం. 3D రూపంలో వుండే సచేతనంతో కూడిన ప్రతిమలతో పాటు బహుళ స్పర్శా సాంకేతికాల తోడ్పాటు కూడా ఉంది.సురక్షితమైన అందమైన, సహజవంతమైన, వేగవంతమైన ఇంటర్ ఫేస్ కలిగి ఉంటుంది. ఉబుంటు మీకు కావలసిన పనులను సులభతరం చేస్తూ ఒక క్రమబద్దీకరించిన అనుభూతి కలిగిస్తుంది .

ఉబుంటు ఒన్ (క్లౌడ్ నిల్వ స్థలము)[మార్చు]

క్లౌడ్ నిల్వ స్థలము ద్వారా డేటాని ఎప్పుడైనా ఎక్కడైనా వాడుకోటానికి, భద్రం చేసుకునేలా ప్రత్యేక సర్వీసుని రూపొందించారు. అదే ఉబుంటు ఒన్[2]. దీంట్లో ఉచితంగా ఖాతా సృష్టించుకొని ముఖ్యమైన దస్త్రాలను భద్రం చేయవచ్చు. దీంతో అంతర్జాల సంపర్కముతో ఎక్కడనుండైనా డేటాని పొందవచ్చు. ఇష్టాంశాలు, సంపర్కాలు, సంగీతం, ఫైళ్లు, బొమ్మలు దీంట్లోకి భద్రం చేసుకోవచ్చు. 2 జీబీ క్లౌడ్ నిల్వ స్థలము (క్లౌడ్‌ స్టోరేజీ స్పేస్‌) ను ఉచితంగా అందిస్తున్నారు. ఐఫోన్‌, ఆండ్రాయిడ్‌ ఫోన్ల నుంచి 1000 నెంబర్లను భద్రం చేసుకోవచ్చు.

తెలుగు రంగస్థలము[మార్చు]

తెరపై కీ బోర్డు స్థితి సూచిక
తెలుగు విధానంలో కీ బోర్డు పై బల్బు వెలగటం

ఉబుంటు తెలుగురూపంలో అందుబాటులో ఉంది. దీనికొరకు సిడి/డివిడి నుండి నేరుగా తెలుగు ఎంపిక చేసుకోవచ్చు. ఒకవేళ ఇంగ్లీషు స్థాపన పూర్తయివుంటే తర్వాత System->Administration->Language support లో Install/Remove Languages లో తెలుగును ఎంపికచేసుకొని స్థాపించుకోవాలి.తెలుగులోటైపుచెయ్యడానికి x కీ బోర్డు వ్యవస్థలో ఇన్స్క్రిప్ట్ వాడుకోవచ్చు. దానితో వాడినపుడుకూ బోర్డు తెలుగు విధానంలో వున్నప్పుడు తెరపై కీ బోర్డు స్థితి తెలుగుని సూచింటంతోపాటు, కీ బోర్డు పై బల్బు వెలుగుతుంది. దీనికొరకై ఉబుంటు (11.10 వర్షను) లో Applications=>Customisation=>Keyboard ని ఎంచుకుని, దానిలో Layouts ఎంచుకుని, '+" ని నొక్కి తెలుగు layout ను add చేయవలెను. Panel లో వచ్చిన Keyboard గుర్తును నొక్కి layout ను English, తెలుగు ల మధ్య మార్చ వచ్చును.

ఇతర కీ బోర్డు నమూనాలు కావలంటే ibus-m17n పేకేజి స్థాపించుకొని Keyboard input method system లో ఐబస్ ఎంచుకోవాలి.ఐబస్ ఆభీష్టాలలో(System->Preferences->Ibus Preferences) మనకు నచ్చిన ప్రవేశ పద్ధతులు అనగా కీ బోర్డు రూపాలు (ఇన్స్క్రిప్ట్,ఐట్రాన్స్,ఆర్టిఎస్, ఏపిల్,పోతన) ఎంచుకోవాలి.

విడుదలలు[మార్చు]

రూపాంతరం సంకేతం పేరు విడుదల తేదీ మద్ధతు
డెస్కుటాప్ సేవకం
4.10 వార్టీ వార్తాగ్ 2004-10-20 2006-04-30
5.04 హోరి హెడ్జ్ హాగ్ 2005-04-08 2006-10-31
5.10 బ్రీజీ బ్యాడ్జర్ 2005-10-13 2007-04-13
6.06 LTS డాపర్ డ్రేక్ 2006-06-01 2009-07-14 2011-06-01
6.10 ఎడ్జి ఎఫ్ట్ 2006-10-26 2008-04-25
7.04 ఫీస్టీ ఫాన్ 2007-04-19 2008-10-19
7.10 గస్టి గిబ్బన్ 2007-10-18 2009-04-18
8.04 LTS హార్డీ హిరాన్ 2008-04-24 2011-05-12 2013-04
8.10 ఇంట్రెపిడ్ ఇబెక్స్ 2008-10-30 2010-04-30
9.04 జాంటీ జాకలోప్ 2009-04-23 2010-10-23
9.10 కార్మిక్ కోలా 2009-10-29 2011-04-30
10.04 LTS ల్యూసిడ్ లినక్స్ 2010-04-29 2013-04 2015-04
10.10 మేవరిక్ మీర్కట్ 2010-10-10 2012-04
11.04 నాటీ నార్వాల్ 2011-04-28 2012-10
11.10 ఆనెరిక్ ఆస్లెట్ 2011-10-13 2013-04
12.04 LTS ప్రిసైజ్ పాంగోలిన్ 2012-04-26 2017-04
12.10 క్వాంటాల్ కెట్జాల్ 2012-10-18 2014-04
13.04 రేరింగ్ రింగ్ టెయిల్ 2013-04-25 2014-01
13.10 సాసీ సాలమాండర్ 2013-10-17 2015-04
14.04 LTS 2014-04-17 2019-04
14.10 2014-10-23 2015-07
15.04 2015-04-23 2016-01
15.10 2015-10-22 2016-07
రంగు అర్థం
ఎరుపు మద్ధతులేని విడుదల
పచ్చ ఇంకా మద్ధతు ఉన్న విడుదల
నీలం భవిష్యత్ విడుదల

ఉబుంటు ప్రతీ ఏటా ఏప్రిల్ మరియు అక్టోబరులో విడుదలవుతుంది. ప్రతీ విడుదలకూ రూపాంతరం సంఖ్య మరియు పేరు ఉంటాయి.

తెలుగు స్ధానికీకరణ[మార్చు]

తెలుగు అనువాదాన్ని మెరుగు పరచడానికి తెలుగు స్థానికీకరణ జట్టు [3] పనిచేస్తున్నది.

ఇవీ చూడండి[మార్చు]

ఉబుంటు వాడుకరి మార్గదర్శని ఎలక్ట్రానిక్ పుస్తకం

బయటిలింకులు[మార్చు]

  1. ఉబుంటు లినక్స్
  2. ఉబుంటు ఒన్
  3. ఉబుంటు తెలుగు స్థానీకరణ కోసం కృషి చేసే జట్టు


Tux.svg లినక్స్ పంపిణీలు edit

డెబియన్ | ఉబుంటు | రెడ్ హ్యాట్ లినక్స్ | ఫెడోరా | జెంటూ లినక్స్ | ఓపెన్ స్యూజ్ | సెంటాస్ | నాఁప్పిక్స్ | కుబుంటు | లినక్స్ ఫ్రమ్ స్క్రాచ్ | డామ్ స్మాల్ లినక్సు | పీసీ లినక్స్ ఓ యస్
మాండ్రివా | మెపిస్ | పప్పీ లినక్సు | స్లాక్ వేరు లినక్స్ | క్షాండ్రోస్ లినక్స్ | మరిన్ని...

"https://te.wikipedia.org/w/index.php?title=ఉబుంటు&oldid=2587147" నుండి వెలికితీశారు