Jump to content

మంగంపేట (శిథిల గ్రామం)

వికీపీడియా నుండి

మంగంపేట, తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ జిల్లా, మానోపాడ్ మండలానికి చెందిన అతి చిన్న గ్రామం. సంవత్సరాల చరిత్ర కలిగి, ఆరేడు సంవత్సరాల క్రితం వరకు ఉండి, ప్రస్తుతం కనుమరుగైన గ్రామం. ఒక ఊరు తన ఉనికిని కోల్పోయి అదృశ్యమవడం ఒక విషాదం.

ఉనికి

[మార్చు]

ఈ గ్రామానికి ఉత్తరాన కృష్ణానది, దక్షిణాన బోరవెల్లి గ్రామం, తూర్పున పల్లెపాడు, పశ్చిమాన రాజశ్రీగార్లపాడు సరిహద్దులుగా ఉండేవి. గద్వాల పట్టణానికి తూర్పున 28 కిలో మీటర్ల దూరంలో ఉండేది.

గ్రామ చరిత్ర

[మార్చు]

దీనికి మంగమ్మపేట, మంగపట్నం అని పూర్వనామాలు ఉండేవని చెబుతారు. కృష్ణానదికి అతి సమీపంలో ఉండటం వలన శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం వలన ముంపుకు గురైంది. 1980-81 ప్రాంతంలో కృష్ణకు దక్షిణాన నూతన గ్రామం నిర్మించబడింది. మూడు వరుసలలో 20 లోపు నివాసాలు ఉండేవి. అతి చిన్న గ్రామం కావడం వలన సమీపంలోని పల్లెపాడు పంచాయతీలో భాగంగా ఉండేది. రేషను, బడి, కిరాణం అన్నిటికి పల్లెపాడు ఆధారంగా ఉండేది. తరువాత ఏకోపాధ్యాయ పాఠశాల నిర్మించినా విద్యార్థులు చేరకపోవడం, ఉపాధ్యాయులను నియమించకపోవడం మొదలగు కారణాలచే నామ మాత్రంగా ఉండేది. తరువాత వలసల కారణంగా గ్రామం పలుచబడటం మొదలయ్యింది. దీనికి తోడు గ్రామంలో కొన్ని కుటుంబాల మధ్య వైరం మొదలయి గ్రామంలో జంట హత్యలకు ( దంపతుల హత్యకు) దారితీసింది. దీని కారణంగా ఉన్న కొద్ది కుటుంబాలు కూడా కొన్ని గార్లపాడు చేరితే, మరికొన్ని పల్లెపాడు చేరాయి. ఆవిధంగా ఊరు శిథిలమై, అదృశ్యమైపోయింది.

చిత్రమాలిక

[మార్చు]