Jump to content

చర్చ:మంచుమనిషి/GA1

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

ప్రతిపాదకుడు: చదువరి (చర్చరచనలు)

సమీక్ష ప్రతిపాదన పురోగతి

[మార్చు]

ఈ పేజీలో మంచుమనిషి (చర్చ) వ్యాసాన్ని సమీక్షించేందుకు నేను స్వీకరించాను. ఇక నా కామెంట్లు ఇదే పేజీలో రాస్తాను. --పవన్ సంతోష్ (చర్చ) 15:01, 15 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]

సమీక్షకుడు: Pavan santhosh.s

2వ అభిప్రాయం కోరుతున్నాను. దయచేసి వాడుకరి:రవిచంద్ర కానీ, ఆసక్తి ఉన్న ఇతర అనుభవజ్ఞులైన వాడుకరులు కానీ వ్యాఖ్యానించగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 13:49, 17 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]

సమీక్ష

[మార్చు]
Rate ప్రమాణం సమీక్షా వ్యాఖ్య
1. చక్కగా రాసినదై ఉండాలి:
వ్యాసంలోని వచనంలో అక్షరదోషాలు, వ్యాకరణదోషాలు ఉండకూడదు.. . ఒకే ఒక్క అక్షరదోషం ఉంది, సరిదిద్దడం జరుగింది.
అది శైలి మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండాలి.. . కొన్ని సూచనలు ఇచ్చాను, సమీక్షకులు సరిదిద్దారు.
2. మౌలిక పరిశోధన లేకుండా నిర్ధారించదగి ఉండాలి:
దానిలో అన్ని మూలాల జాబితా, వ్యాసం లేఅవుట్‌కి అనుగుణంగా ఉండాలి. .
వ్యాసంలో వాక్యం పక్కనే ఇచ్చే మూలాలు వికీపీడియా:నమ్మదగ్గ మూలాల నుంచి ఉండాలి. నేరుగా ప్రస్తావిస్తున్న కొటేషన్లు, ప్రచురితమైన అభిప్రాయాలు, సహజ విరుద్ధమైన అంశాలు, వివాదాస్పదమైన వాక్యాలు వంటి ప్రశ్నించదగ్గ, సందేహించదగ్గ అంశాలు, జీవించి ఉన్న వ్యక్తులకు సంబంధించిన వివాదాస్పదమైన సమాచారం మరీ ముఖ్యంగా ఈ నమ్మదగ్గ మూలాలతో సమర్థించాలి.. . ఇన్‌లైన్ సైటేషన్లు కోరుతూ సూచనలు చేశాను, అనుగుణంగా సరిదిద్దారు.
దానిలో మౌలిక పరిశోధనలు లేకుండా ఉండాలి. .
కాపీహక్కుల ఉల్లంఘనలు గాని, గ్రంథచౌర్యం గానీ ఉండకూడదు.. .
3. విస్తృత పరిధి కలిగి ఉండాలి:
వ్యాస విషయానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను పరామర్శించాలి. .
అనవసరమైన అంశాల జోలికి పోకుండా వ్యాస విషయంపైననే దృష్టిని నిలిపి ఉంచాలి (en) (వికీపీడియా:సారాంశం శైలి (en) చూడండి). .
4. తటస్థం: నిష్పాక్షికంగా ఉంటూ, వివిధ దృక్కోణాలకు తగు విలువను ఇస్తూ చూపించాలి..
5. స్థిరత్వం: దిద్దుబాటు యుద్ధాల వలన గాని, పాఠ్య సంబంధ వివాదాల వలన గానీ వ్యాసంలో అనునిత్యం మార్పుచేర్పులు జరుగుతూ ఉండరాదు..
6. సచిత్రం: వీలైనంతవరకు బొమ్మలు, వీడియో (en), ఆడియో (en) వంటివి వాడాలి.:
మీడియాకు వాటి కాపీహక్కుల స్థితికి సంబంధించిన వికీపీడియా:బొమ్మల కాపీహక్కు పట్టీల జాబితా ఉండాలి. అలాగే, స్వేచ్ఛగా అందుబాటులో లేని (en) మీడియాకు సముచిత వినియోగపు హేతుబద్ధతను (en) సూచించాలి.. .
మీడియా, విషయానికి సంబంధించినవై (en) ఉండాలి. వాటికి సముచితమైన వ్యాఖ్యలు (en) ఉండాలి. .
7. సమీక్షా ఫలితం.

సవివరమైన సమీక్ష

[మార్చు]

వ్యాసంలో విభాగాల వారీగా సమీక్ష చేస్తున్నాను. అయితే బొమ్మలు, అక్షరదోషాలు, భాష వంటివి మాత్రం సాధారణంగా వ్యాసం మొత్తానికి చేశాను:

వ్యాస పరిచయం
  • వ్యాస పరిచయంలో ఈ మమ్మీ ఎక్కడ దొరికిందన్న విషయం (ఈట్జల్ ఆల్ప్స్ పర్వతాలు), దానికి ఆ పేరు ఎలా వచ్చిందన్న విషయం వివరించారు. మిగతా వ్యాస భాగంలో ఎక్కడా ఈ వివరం లేదు. వ్యాస పరిచయం అన్నది కేవలం "వ్యాసానికి పరిచయంగానూ, అత్యంత ముఖ్యమైన అంశాల సంగ్రహం/సారంశంగా ఉపయోగపడుతుంది" అనీ "ప్రాథమిక వాస్తవాలను తప్పించి మిగతా వ్యాసంలో ప్రస్తావించని సంగతుల వివరాలు వ్యాస పరిచయంలో ఉండకూడదు." అనీ చెప్తున్న మార్గదర్శకాన్ని ఇది ఉల్లంఘిస్తోంది. కాబట్టి వ్యాసంలో సరైన విభాగం ఎంచుకుని ఈ రెండు విషయాలు వివరంగా రాయాలి.
  • ఆవిష్కరణ, శాస్త్రీయ విశ్లేషణ, మరణ కారణం - ఈ మూడు విభాగాలను క్లుప్తంగా ఓ రెండు, మూడు పేరాలు మించకుండా వ్యాస పరిచయంలో సమీక్షించాలి. వ్యాస పరిచయం వెళ్ళిపోయినా ఎంతో కొంత క్లుప్తంగానైనా సమగ్రంగా అన్ని అంశాలూ స్పృశిస్తూ రాసిన పరిచయం పాఠకుడికి విజ్ఞానాన్ని అందించాలన్న ఉద్దేశం - వ్యాసంలో ముఖ్యమైన అంశాలకు సారాంశంగా వ్యాస పరిచయం ఉండాలన్న మార్గదర్శకంలో ప్రతిఫలిస్తోందని నమ్ముతున్నాను. దానిని అనుసరించి..
శాస్త్రీయ విశ్లేషణ
  • "ప్రస్తుత ఫెల్డ్‌తర్న్‌స్ గ్రామానికి.." అని ఉంది. అయితే ఈ ఫెల్డ్‌తర్న్‌స్ గ్రామం ఏ దేశంలో, ఏ ప్రాంతంలో ఉందో రాయాలి. ప్రస్తుతానికి పూర్వాపరాలు పైన వెతికి పాఠకుడు తెలుసుకోవాల్సివస్తోంది.
  • "అది బ్రెడ్ రూపంలో తిని ఉంటాడు. మరణానికి కొన్ని నెలల ముందు ఏమి తిన్నాడో అతడి వెంట్రుకలను విశ్లేషించి తెలుసుకున్నారు." ఈ రెండు వాక్యాలకు మూలాలు చేర్చాలి.
  • "(చివరిది, మరణించడానికి 8 గంటల ముందు తిన్నాడు)" "..మరణానికి రెండు గంటల ముందు అతడది తిన్నట్లుగా ఇది సూచిస్తోంది." ఈ రెండు వాక్యాలు ఒకదానిని ఒకటి విభేదిస్తూన్నాయి.[చిన్న ప్రేవులలోది 8 గంటల ముందు తిన్నది, పొట్టలోది రెండు గంటల ముందు తిన్నది.] చివరిది అన్న పదం అస్పష్టంగా ప్రయోగించారు.[మార్చాను.]
  • "2013 అక్టోబర్ 2013 లో, 19 మంది ఆధునిక టైరోలియాన్ పురుషులు ఈట్జి సంబంధీకులని తెలిసింది. ఇన్‌స్‌బ్రూక్ మెడికల్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు, 3700 మంది పురుష రక్తదాతల DNA పై చేసిన పరిశోధనలో 19 మందిలో మంచుమనిషికే చెందిన ఒక జన్యు మ్యుటేషన్ ఉందని కనుక్కున్నారు. " అన్న వాక్యాలకు మూలాలు చేర్చాలి.
  • "ఈ స్ట్రెయిన్ ఉత్తర భారతదేశంలోని ముగ్గురు వ్యక్తులకు బాగా సరిపోలి ఉంది;" ఎవరు ఆ ముగ్గురు వ్యక్తులు?
మరణ కారణం
  • "సా.పూ. ఒకటో శతాబ్దం" సా.శ.పూ. గా మార్చాలి.
అక్షరదోషాలు
  • అవిష్కరణ ఫీజు అన్నది ఆవిష్కరణ ఫీజుగా చేయాలి.
బొమ్మలు
  • ఓట్జి క్లైడంగ్ మ్యూజియంలోని బొమ్మ చిత్రానికి వివరణ ఇంగ్లీషు నుంచి తెలుగు చేయాలి.
మూలాలు
  • news.discovery.com సంబంధం లేని వెబ్‌సైట్‌కి దారితీస్తోంది. అంతేగాక ఆరోగ్యం ఉపవిభాగం నుంచి వస్తున్న ఈ రెండు మూలాలు, ఆంగ్ల శీర్షికలు ఉండీ ఆంగ్లంలో కాక తెలుగులో శీర్షికలు అనువదించారు, మూలం ఆంగ్ల శీర్షిక ఇవ్వలేదు. మూలం ఆంగ్ల శీర్షిక ఇచ్చి, వీలుంటే అనువదించి కొటేషన్లలో ఇవ్వాలి.[మూలాలను మార్చాను.]
  • WWI bodies are found on glacier, Ötzi: Iceman of the Alps: His health, Iceman is defrosted for gene tests: New techniques may link Copper Age shepherd to present-day relatives, Origin and Migration of the Alpine Iceman - ఈ మూలాలు సమస్యాత్మకమైనవి. వీటికి లంకెలు లేవు, అంతేగాక ఇవి గుర్తించేందుకు వీలూ లేదు (పుస్తకాలా? జర్నల్ వ్యాసాలా? ఏ తరహా మూలాలు అని కానీ, రచయితల పేర్లేమిటన్నది కానీ, ఏమీ లేవు). బహుశా డెడ్‌లింకులు తొలగించి ఉంటారనుకుంటున్నాను. ఇవి తీసివేసి సంబంధిత వాక్యాలను సమర్థిస్తూ వేరే నిర్ధారించదగ్గ మూలాలు కానీ, వీటికే లంకెలు, వివరాలు ఇచ్చి సైటేషన్ మూస వాడి కానీ చేర్చాలి. [మూలాలను సవరించాను.]
  • ఇవి కాక, మిగతా మూలాల సంగతి కూడా సరిజూసుకోవాలి. [మిగతా మూలాలను కూడా పరిశీలించి అవసరమైన చోట్ల సవరించాను]
భాష, శీర్షికలు
  • భాష తేటగా, సూటిగా ఉంది. బావుంది.
  • మంచుమనిషిపై మరింత సమాచారం కోసం అన్న శీర్షికలో కనీసం మంచుమనిషి అన్న పదం తొలగించాలి, ఎందుకంటే వ్యాసం పేరు శీర్షికలో ఉండరాదన్న మార్గదర్శకం ఒకటి ఉంది. మరింత సమాచారం కోసం అన్న పదంతో బయటి లంకెలు లేక మూలాలు ఇవ్వడం అనే సంప్రదాయం తెవికీలో లేదు కానీ సహజంగా, అందంగా ఇమిడింది. ఉంచవచ్చని భావిస్తున్నాను.
  • ఆవిష్కరించిన ప్రాంతం వంటి పదబంధాలు కన్నా కనుగొన్న ప్రాంతం మేలేమో.

చదువరి గారికి,చర్చా పేజీలో మూలాలజాబితా వాడం కాబట్టి స్పందనలు వ్యాఖ్య దగ్గరే చేర్చడం మంచిది.--అర్జున (చర్చ) 06:42, 13 ఆగస్టు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జున గారూ, సవరించాను. (అయితే.., చర్చా పేజీల్లో రిఫరెన్సులు ఇవ్వవచ్చు -{{Reflist-talk}} మూసను వాడి.) __చదువరి (చర్చరచనలు) 09:01, 13 ఆగస్టు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారికి, మూస గురించి తెలిపినందులకు ధన్యవాదాలు. అయితే అది ఒక విభాగం పరిధిలో వాడాలి.చర్చాపేజీలో విస్తరించితే ఉపపేజీలుగా విడదీశేఆవకాశంవున్నందున మూలాలు ఉపపేజీలమధ్య విడిపోకుండా వుండటానికి అలా పరిమితి వుందనుకుంటాను.--అర్జున (చర్చ) 06:22, 14 ఆగస్టు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జున సమీక్ష

[మార్చు]

నేను కాపీ శుద్ధి చేశాను. విషయానికి ఇంకంతకన్నా ఎక్కువ సమీక్షించవలసినది కనిపించలేదు.--అర్జున (చర్చ) 06:59, 13 ఆగస్టు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జున గారూ ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (చర్చ) 14:52, 14 ఆగస్టు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

నిర్ణయం

[మార్చు]

సమీక్ష ఇంతటితో ముగిస్తూ, ఒకసారి సముదాయం మంచి వ్యాసం పద్ధతిని పరిశీలించి చూడగానే తొట్టతొలి మంచి వ్యాసంగా అయ్యేందుకు వీలుగా నిర్ణయిస్తున్నాను. ప్రతిపాదకులు చదువరి గారికి శుభాభినందనలు, రెండో అభిప్రాయం చెప్పిన అర్జున గారికి ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (చర్చ) 14:52, 14 ఆగస్టు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

పవన్ సంతోష్ గారూ, తొట్టతొలి "మంచివ్యాసం సమీక్ష" చేసినందుకు అభినందనలు. మీ సమీక్ష ద్వారా కొన్ని విషయాలు నేర్చుకున్నాను, వికీపీడియా పేరుబరిలోని కొన్ని వ్యాసాలను చదివాను. ధన్యవాదాలు. అర్జున గారూ, రెండో అభిప్రాయం ఇచ్చి సమీక్షలో పాలుపంచుకున్నందుకు అభినందనలు, ధన్యవాదాలు. __చదువరి (చర్చరచనలు) 17:12, 14 ఆగస్టు 2018 (UTC)[ప్రత్యుత్తరం]