Jump to content

వికీపీడియా:గ్రంథచౌర్యం

వికీపీడియా నుండి

వేరొకరి రచనను తగినంత క్రెడిట్ ఇవ్వకుండా (భాష కానీ, ఆలోచనలు కానీ) తమ స్వంతం అన్నట్టు చూపుతూ క్రెడిట్ తీసుకోవడం గ్రంథచౌర్యం.[1] కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం గ్రంథచౌర్యాన్ని "మోసం చేయాలన్న ఉద్దేశం ఉందా లేదా అన్నదానితో సంబంధం లేకుండా, తగిన గుర్తింపునివ్వకుండా ఇతరుల కృతి నుంచి పూర్తిగానో, భాగమో తీసుకోవడం"గా నిర్వచించింది.[2]

వికీపీడియాకు మూడు మౌలిక వ్యాసరచన సూత్రాలు (en) ఉన్నాయి, వాటిలో రెండు ఉద్దేశించకుండా, అనుకోకుండా గ్రంథచౌర్యం జరగే అవకాశాన్ని తేలిక చేస్తున్నాయి. మౌలిక పరిశోధనలు నిషిద్ధం అన్నది మన స్వంత ఆలోచనలు వ్యాసాల్లో చేర్చడాన్ని నిషేధిస్తోంది, నిర్ధారత్వం వ్యాసాలు నమ్మదగ్గ ప్రచురితమైన మూలాల ఆధారంగానే రూపొందడాన్ని తప్పనిసరి చేస్తోంది. ఈ విధానాల వల్ల మూలాలకు దగ్గరగా ఉండడం వల్ల వికీపీడియన్లు గ్రంథచౌర్యం ఆరోపణలు ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కానీ "మరీ దగ్గరగా" ఉండకూడదు. ఎందుకంటే మోసగించే ఉద్దేశం లేకపోయినా అచ్చంగా మూలాలను తీసేసుకుంటే గ్రంథచౌర్యం, గ్రంథచౌర్యమే అవుతుంది. గ్రంథచౌర్యం విషయంలో వాడుకరిని ఎడ్యుకేట్ చేసి, వ్యాసాన్ని శుద్ధి చేయాలి.

మూలాలు సంబంధిత వాక్యాల్లో ఇన్‌లైన్ సైటేషన్లుగా చేరుస్తూ సాధారణంగా ఫుట్‌నోట్‌ల రూపంలో జాబితా వేయాలి.[3] ఇన్‌లైన్ సైటేషన్‌లతో పాటుగా వాక్యాలను కొటేషన్ చేస్తున్నప్పుడు కానీ, అతికొద్ది మార్పులతో వాక్యాలను తెచ్చి రాస్తున్నప్పుడు కానీ పాఠ్యంలో కూడా రచయితను ప్రస్తావించాలి. (ఉదాహరణకు: "కృష్ణారావు నగరం అత్యద్భుతంగా ఉండేదని రాశాడు" అని కానీ, "కృష్ణారావు (2012) ప్రకారం..." అని కానీ రాయాలి.[4]

మూలాలు

[మార్చు]
  1. "What Constitutes Plagiarism?", Harvard Guide to Using Sources
  2. "University-wide statement on plagiarism", University of Cambridge. ఒక్కో అంశానికి ప్రత్యేకించిన మార్గదర్శకాల కోసం "Guidance provided by Faculties and Departments", కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం చూడండి.
  3. For example, Smith 2012, p. 1, or Smith, John. Name of Book. Name of Publisher, 2012, p. 1.
  4. "What Constitutes Plagiarism?", Harvard Guide to Using Sources, Harvard University (see "Uncited paraphrase" and "Uncited quotation").

    కాపీహక్కులు వదిలివేసిన లేక స్వేచ్చగా వాడదగ్గ మూలాల నుంచి తీసుకున్నప్పుడు కొద్దిపాటి మినహాయింపు వర్తించినా కింద ఫుట్‌నోట్స్‌గా మూలాల తప్పకుండా ప్రస్తావించాలి.