వాడుకరి చర్చ:Vemurione

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
 • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
ఈ నాటి చిట్కా...
Wiki-help.png
వికీపీడియా శైలి

మీరు వ్యాసరచన కొనసాగించారా? మంచిది, కానీ మీరు వికీపీడియా:శైలి చూసారా? చూడకపోతే ఒకసారి చదవండి. వ్యాసాలన్నీ ఒకే శైలిలో ఉండాలనేదే ఈ వికీపీడియా శైలి ఉద్దేశ్యము.

ఇంకా చదవండి: వికీపీడియా:గైడు

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

సహాయ అభ్యర్ధన[మార్చు]

YesY సహాయం అందించబడింది

హోమియోపతీ, హోమియోపతీ వైద్యవిధానం అని రెండు పేజీలు ఉన్నాయి. ఇందులో మొదటిది ఖాళీ. ఈ పేజీని తీసేసి, రెండవ పేజీకి 'హోమియోపతీ' అని పేరు పెట్టాలి. టైటిల్‌ పేజి ని తీసెయ్యటం ఎలా? Vemurione 16:01, 10 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]


YesY సహాయం అందించబడింది

1. Carbon ని కార్బన్ అనీ కర్బనం అనీ అంటున్నారు. నేను కర్బనం అని వాడి దానికి హైపర్‌ లింకు పెడితే "కర్బనం" అన్న పేజీకి వెళుతున్నాది. కాని "కార్బన్" అన్న పేజీలో మరొక వ్యాసం ఉంది. ఈ సందిగ్ధం తేల్చటం ఎలా?

2. ఇదే కోవకి చెందిన మరొక ప్రశ్న. తెలుగులో "ము" కి మదులు "సున్న" వాడటం బాగా రివాజుగా జరుగుతోంది. ము అంటే గ్రాంధికపు ఛాయలు కనిపిస్తాయి. సున్న ఉంటే వ్యావహారికం లా ఉంటుంది. ఉదా. మూలకము - మూలకం, కర్బనము - కర్బనం. ప్రపంచాన్ని మార్చ్లేము కనుక మనం ఏ విధంగా వాడినా కంప్యూటరు ఒకే చోటికి వెళ్ళేలా చెయ్యటం ఎలా? Vemurione 13:43, 11 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]


ఇది వికీలో చేరిన తరువాత నేను అడిగిన మొదటి ప్రశ్న (రామాయణము, రామాయణం గురించి - వైజాసత్య జవాబిచ్చాడు) - ఇందుకు పరిష్కారం దారిమార్పుడు పేజీలు. కర్బనం అనే పేజీలో #REDIRECT [[కార్బన్]] అని వ్రాస్తే "కర్బనం" లింకు ఆటోమాటిక్‌గా "కార్బన్" వ్యాసానికి వెళుతుంది. సామాన్యంగా వాడుక భాషకు దగ్గరగా ఉన్నందున కనీసం వ్యాసాల పేర్లకు 'సున్న' వాడడం మన పాలిసీ (గ్రామం, భారతం, దేశం - ఇలా). కానీ ఇది నామమాత్రమే. ఎక్కువ మందికి ఇది అంత అవగాహన లేదు. తప్పు వాళ్ళది కాదు. వికీ విధానాలు స్పష్టంగా ఒక చోట లేవు. అన్నీ కలగా పులగంగా ఉన్నాయి. వాటిని క్రమబద్ధీకరించడానికి ప్రయత్నం చేస్తాను. మీరు మీకు సముచితమనిపించిన విధంగా ఎగుడు లంకెలిస్తూ ఉండండి. దారి మార్పులు పేజీలు అవసరమైనట్లు చేసుకోవచ్చును --కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:03, 11 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]


కార్బోహైడ్రేటు బొమ్మ[మార్చు]

YesY సహాయం అందించబడింది


ఇంగ్లీషు విక్కీ లో carbohydrates అన్న శీర్షిక కింద ఉన్న అనేక బొమ్మలలో ఒక దాని కింద ఈ దిగువ caption ఉంది. ఆ బొమ్మని తీసి తెలుగు విక్కీ లో నేను పని చేస్తూన్న "పిండిపదార్ధాలు" వ్యాసంలో నేను సూచించిన చోటుకి పక్కన వచ్చేలా అమర్చాలి. అక్కడే తెలుగులో caption కూడ రాసేను. "D-glucose is an aldohexose with the formula (C·H2O)6. The red atoms highlight the aldehyde group, and the blue atoms highlight the asymmetric center furthest from the aldehyde; because this -OH is on the right of the Fischer projection, this is a D sugar."

ఇది ఎప్పుడో ఒకప్పుడు నేను నేర్చుకోవాలి. కనుక నాకు నేర్పినా సరే లేక ఎవ్వరైనా అమర్చి పెట్టినా సరే. ధన్యవాదాలు.

Vemurione 23:04, 12 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

నేను చేసేసాను... ఆంగ్లవికీ వ్యాసాలలో ఉన్న బొమ్మలను తెలుగు వికీలో ఉపయోగించాలంటే మొదటగా ఆ బొమ్మ(ఫైలు) పేరును తెలుసుకోవాలి, అందుకోసం బొమ్మపై క్లిక్ చేయండి. ఆ తరువాత ఆ బొమ్మను తెలుగు వికీవ్యాసాలలో ఎలా ఉపయోగించాలో తెలుసుకునేందుకు వికీపీడియా:బొమ్మల పాఠం అనే వ్యాసాన్ని చూడండి. __మాకినేని ప్రదీపు (+/-మా) 03:12, 13 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

తుని రైల్వే స్టేషను బొమ్మ[మార్చు]

వెంకటేశ్వరరావుగారూ! తుని వ్యాసంలో మీరు బొమ్మ:Tuni Railway Stataion 2.jpg అనే బొమ్మ ఉంచారు. దానికి లైసెన్సు ట్యాగ్‌ చేర్చలేదు. ఇది మీరు తీసినదేనా? దీనిని ఉచిత లైసెన్సుతో సమర్పించడం మీకు సమ్మతమైతే నేను లైసెన్సు ట్యాగ్ పెడతాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:15, 24 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ బొమ్మకు {{GFDL-no-disclaimers}} అనే లైసెన్సు ట్యాగ్ ఉంచాను. మీకు అభ్యంతరం ఉండదనుకొంటాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:46, 25 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]
తుని పేజీలో మొట్టమొదట caption తో ఉన్న ఫొటో నేను తీసినదే. జనవరి 2004 లో తీసేను. పేజీ చెవర మరొక బొమ్మ ఎవ్వరో తుని అభిమానులు తగిలించేరు. దీనికి caption లేదు. ఇది నేను తీసినది కాదు. నేను తీసిన బొమ్మ ప్రచురించటానికి నాకు అభ్యంతరం లేదు. Vemurione 17:58, 25 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]
ఆ అభిమానిని నేనే. రైల్లో విశాఖపట్నం వెళుతూ తీశాను. అది అప్‌లోడ్ చేసినప్పుడే మీరు తీసిన బొమ్మను గమనించాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 20:08, 26 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]


సహాయ అభ్యర్ధన[మార్చు]

YesY సహాయం అందించబడింది

"వీరతాళ్ళకు వికీ సరి అయిన క్షేత్రం కాదు" అన్న వికీ పోలసీ మీద "వీలయినంత వరకు ప్రామాణిక పదాలు వాడండి" అన్న సలహా మీద నా అభిప్రాయం.

ఈ ప్రామాణిక పదాలు ఎక్కడ (ఏ పుస్తకంలో లేక ఏ వెబ్‌ సైట్‌ లో)దొరుకుతాయో, ఏ గ్రంధం వికీ కి ప్రామాణికమో, ఆ గ్రంధం ఎక్కడ దొరుకుతుందో నా బోంట్లకు ఎవ్వరైనా దయచేసి తెలియజేస్తే ఆ పదాలు వాడటానికి ప్రయత్నిస్తాను. నాకు కావలసిన మాటకి ఆ ప్రామాణిక గ్రంధం ఉపయోగపడకపోతే ఏమిటి చెయ్యాలో కూడ తెలిసున్న వారు సూచించగలరు. నేను రాసేవి ఎక్కువగా సైన్సు విషయాలు కనుక ఇది నాకు రోజూ ఎదురయ్యే సమస్య. ఈ సమస్య ఇటో అటో పరిష్కారం అయే వరకు నేను అనవసరంగా హైరాన పడి రాసినా ప్రయోజనం ఉండదేమోనన్న భయంతో ప్రస్తుతానికి నా ఉత్సాహానికి కళ్ళెం వేసి నా రాతలని ఆపుతున్నాను. నాకు 'కంటెంట్' గురించి తెలుసు తప్ప ఎడ్మినిష్ట్రేషన్‌ విషయాలు తెలియవు. Vemurione 04:28, 12 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగులో విజ్ఞాన నిషయాలు వ్రాసే ప్రయత్నంలో ఈ విచికిత్స తప్పదు. 'కంటెంట్'కే ప్రాధాన్యం అధికం. ప్రామాణిక పదం ఏదైనా ఉంటే బహుశా మీకు తెలిసి ఉంటుంది. కాకుంటే తెలిసినవారు ఎవరైనా సూచించాలి. అంతవరకూ మీరు వాడేదే సరైనదవుతుంది. ఇప్పటికే బహుళంగా ఆమోదించిన పదాలకు క్రొత్త పదాలు సృష్టించవద్దని నా ఉద్దేశ్యం. (ఈ చిట్కా నేను వ్రాస్తున్నప్పుడు మీకిలాంటి సందేహం రావచ్చునని ఊహించాను) దయచేసి మీ వ్రాతలను ఆపవద్దు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 05:36, 12 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]
  • వేమూరి గారు. మీ లాంటి విజ్ఞానవేత్తల అవసరం వికీపీడియాకి చాలా అవసరం. మా అభ్యర్ధనలను సరిగా అర్ధం చేసుకోండి. నేను కూడా వైద్య విజ్ఞాన నిపుణున్ని. నాకు కూడా వ్యాసాలు పూర్తి తెలుగులో రచించడానికి తెలుగు పదాల కొరత స్పష్టంగా తెలుస్తుంది. అయితే కొత్త పదాలు అన్నీ ఉపయోగిస్తే వ్యాసాలు సామాన్యమైన తెలుగు తెలిసిన ఆంధ్రులకు పూర్తిగా అర్ధం కాకుండా పోయే అవకాశం ఉన్నది. మీరు మామూలుగానే రచనలు చేయండి. పని, బలం వంటి వ్యాసాలలో చాలా తికమకగా ఉన్నది. నిర్ధారించబడిన వాటితో మొదలుపెట్టండి. క్లిష్టమైన విషయాలను తరువాత చేర్చవచ్చును.Rajasekhar1961 08:06, 12 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఓ. కె. "పని", "బలం" అన్న మాటలు వర్క్, ఫోర్స్ అన్న మాటలకి తెలుగు మాటలు. ఇవి తికమకగా ఉంటే తికమకగా లేనివి, సమానార్ధకమైనవి అయిన మాటలు ఏమిటి? ఎక్కడ దొరుకుతాయి? "నిర్ధారించబడిన వాటితో మొదలుపెట్టండి." అని రాసేరు. ఇవి ఎక్కడ దొరుకుతాయి? Vemurione 14:08, 12 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

  • మీరు నన్ను సరిగా అర్ధంచేసుకోలేదు. నా ఉద్దేశం పేర్లు సరైనవే. సమాచారం నాకు సరిగా బోధపడలేదు. కొంచెం విపులంగా వివరించమని నా ఉద్దేశం. తప్పుగా రాస్తే క్షమించగలరు.Rajasekhar1961 06:57, 18 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మరల స్వాగతం[మార్చు]

Vemurione గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

 • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
 • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
 • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
 • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
 • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
 • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   అర్జున (చర్చ) 02:59, 12 జూన్ 2012 (UTC)[ప్రత్యుత్తరం]

పునఃస్వాగతం[మార్చు]

వేమూరి గారు, మీరు తిరిగి తెవికీ లో మార్పులు చేయడం మొదలుపెట్టడం సంతోషించదగిన విషయం. మీకు నా హార్థిక స్వాగతం. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 18:07, 27 డిసెంబర్ 2013 (UTC)

<br=clearall>

కొలరావిపు ప్రశంసాపత్రం[మార్చు]

Komarraju Lakshmana Rao Puraskaram 2013 prasamsa patakam.png కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం - ప్రశంసా పతకం (2013)
వేమూరి గారూ, తెలుగు వికీమీడియా ప్రాజెక్టులలో విజ్ఞాన సంబంధ వ్యాసాల పై మీరు చేసిన కృషిని గుర్తిస్తూ , పురస్కారాల ఎంపిక మండలి తరఫున ఈ ప్రశంసా పతకాన్ని బహూకరిస్తున్నాను. మీ కృషి సర్వదా అభినందనీయం. మున్ముందు కూడా మీ కృషిని ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నాం.

స్వాగతం[మార్చు]

Tewiki 11 logo.png

తిరుపతిలో జరుగనున్న తెవికీ 11వ వార్షికోత్సవాల ఉత్సవాలకు మిమ్ములను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ రెండు రోజులు అనగా ఫిబ్రవరి 14 మరియు 15 తేదీలలో (రెండవ శనివారం, ఆదివారం) మీరు రావడానికి ముందుగా నమోదు చేసుకున్న వికీ సభ్యులకు వసతి, రవాణా సదుపాయాలు సమకూరుస్తున్నది. కనుక ముందుగా ఇక్కడ మీ పేరు నమోదు చేసుకోండి.

విశేష వ్యాసాలని అనువదించడం[మార్చు]

YesY సహాయం అందించబడింది

I wish to translate one of the Featured Articles.

 1. How do I know that someone has already not chosen the same article that I have chosen?
 2. To preserve equations and figures, I'd like to copy the entire page into a private location and then replace the English matter - little at a time - while leaving the equations and other math so I do not have to worry about typesetting that matter?
 3. Do you have any preference as to what subset of articles that you most desire? Thanks

Vemurione (చర్చ) 21:10, 5 ఆగష్టు 2015 (UTC)

మీరు రచనా ప్రస్థానాన్ని కొనసాగించదలసినందుకు ధన్యవాదాలు. మీరు ఏదైనా విశేషవ్యాసాలను తెవికీలో వ్రాయవచ్చు. మీరు ఆ వ్యాస శీర్షికను పైన గల "వెతుకు పెట్టె" లో టైప్ చేసి వెతికినట్లయితే యిదివరకు ఆ వ్యాసం ఎవరైనా సృష్టిస్తే ఆ వ్యాసం వస్తుంది.లేకపోతే ఎర్రలింకుతో వ్యాసం సృష్టించమనే సూచన వస్తుంది. మీరు సృష్టించవచ్చు. మీ పేజీలో పైన గల "ప్రయోగశాల" లో మొదట వ్యాసాన్ని అనువాదం చేసి వృద్ధి చేయవచ్చును. తరువాత వికీలో చేర్చవచ్చును. లేదా నేరుగా వికీపీడియా వ్యాసంగా చేర్చి కొద్దికొద్దిగా విస్తరించవచ్చు. మీరు విస్తరించేటప్పుడు ఆ వ్యాసంలో ఇతరుల జోక్యాన్ని,ప్రవేశాన్ని వద్దనుకుంటే {{in use}} మూసను ఆ వ్యాసం పైన చేర్చండి. మీరు విస్తరించిన తదుపరి ఆ మూసను తొలగించండి. తెవికీలో సరైన మూలాలున్న ఏ వ్యాసమైనా చేర్చవచ్చు. మీ ప్రధాన రంగాలైన గణిత,భౌతిక మరియు రసాయన శాస్త్ర వ్యాసాలను చేర్చండి.ఏదైనా సహాయం కావాలంటె అభ్యర్థించండి. తెవికీలో తప్పకుండా ఉండవలసిన వ్యాసాల పేజీ వికీపీడియా:వికీపీడియాలో తప్పకుండా ఉండవలసిన వ్యాసాలు ఉన్నది. అందులో గల ఎర్రలింకులలో ఉన్న వ్యాసాలను కూడా తయారు చేయవచ్చు. ధన్యవాదాలు.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 00:42, 6 ఆగష్టు 2015 (UTC)

శీర్షిక మార్చడం ఎలా?[మార్చు]

YesY సహాయం అందించబడింది

ఇప్పుడు ఉన్న "మెండలీఫ్" అన్న పేరు ఉన్న శీర్షిక ని "మెండలియెవ్" అని స్పెల్లింగు మార్చాలి. ఎలా? —Vemurione (చర్చ) 15:39, 8 ఆగష్టు 2015 (UTC)

మెండలీఫ్ వ్యాసం ఉన్న పేజీ లో పై భాగాన ఉన్న ఉపకరణాలలో "చదువు" "సవరించు" "చరిత్రను చూడండి" తరువాత గల "మరిన్ని" ఉపకరణం క్లిక్ చేస్తే అందులో తరలించు అనే ఆప్షన్ ఉంటుంది. దీనిని క్లిక్ చేసిన తరువాత కొత్తపేరును చేర్చి సరియైన కారణాని తెలపాలి. తరువాత "పేజీని తరలించు" అనే బటన్ ఒత్తితే పాతపేజీ దారిమార్పుతో కొత్త పేజీ వస్తుంది.--K.Venkataramana (చర్చ) 16:06, 8 ఆగష్టు 2015 (UTC)

వేలన్సీ[మార్చు]

ఆంగ్లపదం "వేలన్సీ" కి సరైన తెలుగు పదం "సంయోజకత" "సంయోజనీయత" అని అర్థాలున్నాయి. బాహుబలం అనే అర్థం కూడా ఉన్నదా? సందేహనివృత్తి చేయగలరు.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 18:36, 8 ఆగష్టు 2015 (UTC)

వేమూరి వెంకటేశ్వరరావు గారూ, మీరు ఆంగ్లంలో గల రసాయన శాస్త్రనామాలను తెలుగులోకి అనువదించడం నవబరు-2007-సుజన రంజని] లో "వీరతాళ్ళు వేస్తాం, వస్తారా?! - 7" అనే శీర్షికతో వ్రాయడం చూశాను. వేలన్సీ అనే పదానికి బాహుబలం అని మీ వ్యక్తిగత అభిప్రాయమని తెలుస్తుంది. దీని అర్థం నిఘంటువులలో లేదు. వ్యక్తిగత అభిప్రాయంతో మీరు చేసిన అనువాదం ఎంతమందికి తెలుస్తుంది. రసాయన శాస్త్ర తెలుగు మాధ్యమ పాఠ్య పుస్తకాలలో "సంయోజనీయత" "సంయోగ సామర్థ్యం" అని ఉన్నది. దీని గూర్చి తెలుసుకోగోరు విద్యార్థులు అవే నామాలతో వికీలో,అంతర్జాలంలో శోధిస్తారు. మీరు వ్యక్తిగతంగా సృష్టించిన శీర్షికను తెవికీలోనికి ఎలా చేరుస్తారో దయచేసి తెలియజేయగలరు.దీనికి మూలాలు,ఆధారాలు ఉన్నవా? మూలాలు లేని వాక్యాలను తెవికీ అంగీకరించదు. --ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 01:32, 9 ఆగష్టు 2015 (UTC)
వేమూరి గారూ, మీరు "valency" కి సమానార్థాలు గల పదాల వ్యాసాలను సృష్టించి ఆ ఖాళీ వ్యాసంలో #దారిమార్పు[[బాహుబలం]] అనే కోడ్ వ్రాసి సేవ్ చెయ్యండి. అపుడు అంతర్జాలంలో శాస్త్ర విషయాలను శోధించే వాడుకరులు "సంయోజనీయత" అని గానీ "సంయోగ సామర్థ్యం" లేదా "వేలన్సీ" అని గానీ శోధించినా మీరు సృష్టించిన "బాహుబలం" వ్యాసానికి చేరుతుంది. ఈ విధంగా అందరికీ ఆ కొత్త పదం పరిచయమవుతుంది. ధన్యవాదాలు.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 02:09, 9 ఆగష్టు 2015 (UTC)

Help for translate[మార్చు]

Hello and sorry for writing in English. Can you help me translate a small article (2 paragraphs) from English to your language? Xaris333 (చర్చ) 23:19, 8 ఆగష్టు 2015 (UTC)

వర్గం:రసాయన శాస్త్రములో పేర్లు[మార్చు]

వేమూరి గారూ, మీరు వర్గం:రసాయన శాస్త్రములో పేర్లు అని వ్యాసం మొదలుపెట్టారు. ఆ శీర్షికలో "వర్గం" అనే పదాన్ని తీసివేసి రసాయన శాస్త్రములో పేర్లు అనే వ్యాసం ప్రారంభించండి. వర్గం అనేది వ్యాసాల కోవలోనికి రాదు. దాని యొక్క పేరును మార్చండి.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 18:18, 9 ఆగష్టు 2015 (UTC)

శీర్షికను మార్చివేసాను.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 18:50, 9 ఆగష్టు 2015 (UTC)

రసాయన శాస్త్ర నిఘంటువు[మార్చు]

వేమూరి గారూ, యిది వరకు నేను నాకు తెలిసిన పదాలతో భౌతిక శాస్త్రము - పారిభాషిక పదాలు (ఆంగ్లం - తెలుగు) అనే వ్యాసాన్ని వ్రాసాను. అందులో అనేక కొత్తపదాలు చేర్చవలసిన అవసరం ఉన్నది. మీరు అదే కోవలో రసాయనశాస్త్రానికి సంబంధించి రసాయన శాస్త్రము - పారిభాషిక పదాలు (ఆంగ్లం - తెలుగు) అనే వ్యాసం వ్రాస్తే బాగుంటుంది. అనేక తెలుగు పదాలు అందరికీ పరిచయం యేర్పడే అవకాశం ఉన్నది.మీరు పదాలు , వాటి అర్థాలు చేర్చితే ఫార్మాటింగ్ కు నేను సహకరిస్తాను. ధన్యవాదాలు.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 18:28, 9 ఆగష్టు 2015 (UTC)

రెండు ప్రశ్నలు[మార్చు]

 • "వర్గం" తీసేసి అదే వ్యాసాన్ని "రసాయనశాస్త్రంలో పేర్లు" అనే వ్యాసం కింద మార్చడం ఎలా?
 • ఇంగ్లీషు వికీపీడియా నుండి కొన్ని బొమ్మలు దింపుకుని నా బల్ల మీద పెట్టుకున్నాను. వాటిని నా తెలుగు వ్యాసంలోకి ఎక్కిద్దామని విజర్డ్ని ఉపయోగించినప్పుడు సవాలక్ష ప్రశ్నలు అడుగుతోందా విజర్డ్. ఇక్కడేదో కిటుకు ఉంది. అర్థం కావడం లేదు. ధన్యవాదాలు - వేమూరి.
యిది వరకు మీరు ఒకసారి మెండలీఫ్ వ్యాసానికి శీర్షికను మార్చారు. అదే విధంగా మార్చవచ్చు. నేను మారుస్తాను. రెండవది మీరు చేర్చవలసిన చిత్రాలు మీస్వంతమైనవైతే కామన్స్ విజార్డ్ ఉపయోగించండి. స్వంతకృతి అని తెలియజేసినట్లయితే వేగంగా అప్‌లోడు కాగలవు. అప్‌లోడు అయిన తదుపరి తెవికీ వ్యాసంలోనికి చేర్చవచ్చు.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 18:35, 9 ఆగష్టు 2015 (UTC)
ఆంగ్ల వికీపీడియా లోని కామన్స్ చిత్రాలైతే నేరుగా ఉపయోగించుకోవచ్చు. అప్‌లోడూ చేయవలసిన అవసరం లేదు.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 18:41, 9 ఆగష్టు 2015 (UTC)
Historic benzene formulae as proposed by Kekulé.
ఉదాహరణకు ఆంగ్ల వికీలో గల బెంజీని చిత్రం ఓపెన్ చేసినట్లయితే File:Historic Benzene Formulae Kekulé (original).png అని ఉంది. ఈ చిత్రం యొక్క పేజీలో క్రిందిభాగాన "This is a file from the Wikimedia Commons." అని ఉన్నది. కనుక ఈ చిత్రాన్ని వికీలో చేర్చవలెనన్న [[File:Historic Benzene Formulae Kekulé (original).png|thumb|right|300px|Historic benzene formulae as proposed by Kekulé.]] అని చేర్చినట్లయితే భద్రపరచిన తరువాత ప్రక్క గల చిత్రంలా కనబడుతుంది.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 18:49, 9 ఆగష్టు 2015 (UTC)

రసాయన శాస్త్రము - పారిభాషిక పదాలు (తెలుగు-ఇంగ్లీషు)[మార్చు]

రసాయన శాస్త్రము - పారిభాషిక పదాలు (తెలుగు-ఇంగ్లీషు) నిఘంటువు బాగుంది. చివర్లో "మూలాలు" అనే శీర్షిక చేర్చి అందులో ఈ నిఘంటువు దేని ఆధారంగా వ్రాసారో తెలియజెయండి. మీరు వ్రాసిన గ్రంథమైనా దానిని తెలియజేయండి. ఒకవేళ అంతర్జాల లింకు ఉన్నా తెలియజేయండి.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 01:02, 11 ఆగష్టు 2015 (UTC)

గణిత శాస్త్ర పదాలకు కూడా ఒక పారిభాషిక పదకోశము తయారుచేస్తే మంచిది అని నా అభిప్రాయం--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 01:02, 11 ఆగష్టు 2015 (UTC)
రసాయన శాస్త్రము - పారిభాషిక పదాలు (తెలుగు-ఇంగ్లీషు) లో "అ,ఆ" విభాగాన్ని ఫార్మాట్ చేశాను పరిశీలించండి. మీ అభిప్రాయం తేలియజేయండి.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 01:12, 11 ఆగష్టు 2015 (UTC)

రసాయన శాస్త్రము - పారిభాషిక పదాలు (ఆంగ్లం - తెలుగు)[మార్చు]

రసాయన శాస్త్రము - పారిభాషిక పదాలు (ఆంగ్లం - తెలుగు) వ్యాసాన్ని ఆంగ్ల,తెలుగు పదాలతో తయారుచేయండి.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 01:15, 11 ఆగష్టు 2015 (UTC)

సలహా కొరకు[మార్చు]

మీ సలహా ప్రకారం ప్రయోగాత్మకంగా నా నిఘంటువులోని A కి సంబంధించిన ఎంట్రీలు అన్నీ ఒక పేజీలో ఎక్కించేను. ప్రతి అంశానికి ముంది * పెట్టాలంటే సుళువయిన పద్ధతి ఉండాలి. ఆ పద్ధతి మీరు నాకు చెబితే దీనికి ఒక ఫార్మేట్ తీసుకు వస్తాను. అప్పుడు గణిత-భౌతిక శాస్త్రాలని ఒక విభాగం గాను, రసాయన జీవ శాస్త్రాలని ఒక భాగం గానూ విడగొడదామనుకుంటున్నాను. లేదా నిఘటువు అంతటిని యథాతథంగా ఉంచెయ్యవచ్చు. మీ సల్హా ఇవ్వండి. ధన్యవాదాలు - వేమూరి

వేమూరి గారూ మీరు వ్యాసాన్ని దిద్దిబాటు చేయాలనుకున్నప్పుడు మొదట వ్యాసం లో పై భాగాన కల ఉపకరణాలలో "మూలపాఠ్యాన్ని సవరించు" బొత్తం పై ఒత్తుతారు. తరువాత దిద్దుబాటు పెట్టె వస్తుంది. ఆ వ్యాస విషయాన్ని చేర్చునపుడు లేదా దిద్దుబాటు చేయునపుడు పై భాగంలో గల ఉపకరణాల లో "ఉన్నత" ఉపకరణం క్లిక్ చేస్తే దానిలో గల ఉప ఉపకరణాలలో పదాల ముందు స్టార్ గుర్తులు, సంఖ్యా గుర్తులు, పెద్ద అక్షరాలు, చిన్న అక్షరాలు, సూపర్ స్క్రిప్టు, సబ్ స్క్రిప్టు, వంటి అంశాలుంటాయి. మీరు టైప్ చేసిన పదాలనన్నింటిని ఒకేసారి డ్రాగ్ చేసి ఉపకరణాలలో గల "బిందు జాబితా" ను ఒత్తితే అన్ని పదాలకు ఒకేసారి ముందు బిందువులు వస్తాయి. ప్రయత్నించడి.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 17:59, 11 ఆగష్టు 2015 (UTC)

ఇంగ్లీషు-తెలుగు పదకోశం[మార్చు]

మీరు వ్రాసిన ఇంగ్లీషు-తెలుగు పదకోశం బాగుంది. కానీ మొత్తం నిఘంటువంతా ఒకే పేజీలో చేర్చితే పెద్దదై మార్పులు చేసినపుడు బిజీగా ఉండి వోపెన్ అయిన సందర్భాలు ఉండవు.అయినా సేవ్ చేయడానికి చాలా సమయం పడుతుంది. చూచేవారికి యిబ్బందిగా ఉంటుంది. కనుక ఆ నిఘంటువును ఇంగ్లీషు-తెలుగు పదకోశం-A, ఇంగ్లీషు-తెలుగు పదకోశం-B,ఇంగ్లీషు-తెలుగు పదకోశం-C.......యిలా పేజీలుగా సృష్టిస్తే బాగుంటుంది. అన్ని పేజీల వ్యాసాలను కలిపి ఒక వ్యాసంగా తయారుచేస్తే బాగుంటుంది.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 01:03, 12 ఆగష్టు 2015 (UTC)

మీరు తయారుచేసిన ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు (A) వ్యాసం చూసాను. బాగుంది. అందులో కొన్ని సూచనలు తెలియజేస్తున్నాను. మూలాల విభాగం వ్యాసం చివరి భాగంగా ఉండాలి. మీరు చిత్రాలను చేర్చేటప్పుడు అన్ని చిత్రాలను <!--- Insert ALL Images Below This Line (center|150px|thumb) ---> అనే వాక్యం దిగువన చేర్చాలి. అన్ని పదాల అర్థాల చిత్రాలకు స్థలం చాలదు కనుక విశేషమైన చిత్రాలను మాత్రమే చేర్చాలి. --ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 00:58, 15 ఆగష్టు 2015 (UTC)

ఫార్మాటింగ్ అంశాలు[మార్చు]

వికీలో ఫార్మాటింగ్ అంశాల కొరకు ఫార్మాటింగ్ అంశాలు చదవండి. మరిన్ని సహాయాల కొరకు నేవిగేషన్ సహాయం మరియు సహాయం మూసలలో ఉన్న అంశాలలో వివిధ విధములైన సహాయాలన్నీ లభిస్తాయి.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 01:12, 15 ఆగష్టు 2015 (UTC)

చిత్రాల గురించి[మార్చు]

"మీరు చిత్రాలను చేర్చేటప్పుడు అన్ని చిత్రాలను <!--- Insert ALL Images Below This Line (center|150px|thumb) ---> అనే వాక్యం దిగువన చేర్చాలి. అన్ని పదాల అర్థాల చిత్రాలకు స్థలం చాలదు కనుక విశేషమైన చిత్రాలను మాత్రమే చేర్చాలి"

మీరు చెప్పిన విధంగా ప్రయత్నిస్తే బొమ్మ ఒక చోట, entry word మరొక చోట వస్తున్నాయి. . entry word కి దగ్గరగా బొమ్మ వస్తే బాగుంటుంది. బొమ్మని "position" చెయ్యడానికి తేలిక మార్గం ఉంటే బాగుంటుంది. చాల ప్రయత్నం చేసేను. అర్థం కాలేదు. ధన్యవాదాలు. - వేమూరి

ఇదే సందర్భంలో --- మీరు అన్ని వరుసలని * తో మొదలు పెట్టమన్నారు. అన్నిటి ముందు * వెయ్యడం తేలికే కాని అన్నిటి ముందు ఎలా వెయ్యాలో తెలియలేదు. అన్నిటిని bold face చేసేసి తరువాత * వెయ్యవచ్చు కాని అప్పుడు మీరు అన్ని వరుసలని * తో మొదలు పెట్టమని చెప్పేవారు కాదు.

సమాధానం[మార్చు]

చిత్రాలలో ముఖ్యమైనవి చివరి వరుసలో వస్తాయి కానీ పదానికి సంబంధించిన చిత్రం ఈ విధానం వల్ల రాదు. కానీ మీరు ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు (A) నిఘంటువులో abacus అనే పదం అర్థం వ్రాసారనుకుందాం ఆ పదం పైభాగాన ఈ క్రింది విధం గా చేస్తే ఆ పదం ప్రక్కన చిత్రం కనబడుతుంది.

[[File:Boulier1.JPG|thumb|150px|right|పూసలపాటీ]]
*abacus, n. పూసలపాటీ; పూసల పలక; గణక ఫలకం;

పై విధంగా చేస్తే అబాకస్ యొక్క అర్థం మరియు చిత్రం ఒకే చోట కనిపిస్తాయి. కానీ అన్ని వేల అర్థాలయొక్క చిత్రాలను చేర్చలేము. ముఖ్యమైన పదాల యొక్క చిత్రాలను మాత్రమే చేర్చాలి.


ఇక రెండవది పదాలను * గుర్తుతో ప్రారంభించమని చెప్పాను. పదాలను డ్రాగ్ చేసి వాటిని బోల్డ్ ఫెస్ లోకి మారిస్తే ''' ''' ల మధ్య ఆ పదం చేరుతుంది.

మీ ప్రశ్నలకు సత్వర స్పందనకు మీ సందేహాన్ని నా చర్చా పేజీలో వ్రాసి పై భాగాన సంతకం ఉపకరణాన్ని ఒత్తితే --~~~~ ఇలా వస్తుంది. భద్రపరచిన తదుపరి మీ పేరు,సందేహం చేర్చిన సమయం వస్తుంది.ధన్యవాదాలు.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 12:59, 15 ఆగష్టు 2015 (UTC)

తప్పు లంకె సరి చెయ్యాలి[మార్చు]

వెతుకు పెట్టెలో "కార్బోహైడ్రేట్లు" అని కొట్టి వెతికితే మాంసకృత్తులు పేజీకి వెళుతోంది. ఇది తప్పు. పిండి పదార్థాలు, సగ్లూకోజు, సెల్యులోజు, వగైరాలు కార్బోహైడ్రేట్లు జాతివి. ఈ తప్పుని ఎవ్వరైనా సవరించండి. ధన్యవాదాలు Vemurione (చర్చ) 19:02, 15 ఆగష్టు 2015 (UTC)

మీ కోరిక ప్రకారం కార్బోహైడ్రేట్లు అనే వ్యాసాన్ని పిండి పదార్ధాలు కు దారిమార్పు చేసాను.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 01:48, 16 ఆగష్టు 2015 (UTC)

వర్గం: భారతీయ గణిత శాస్త్రం[మార్చు]

లో ఇచ్చిన జాబితాలో ఒక ఉప జాబితా ఉంది. ఆ ఉపజాబితాని సరి దిద్దాలి. ఒక "కాలమ్"లో ఇంగ్లీషు వర్ణక్రమంలో అక్షరాలు, రెండవ "కాలం" లో తెలుగు వర్ణక్రమం అక్షరాలు!! బాగు లేదు.

ఈ ఉప జాబితాలో భారతీయ గణిత శాస్త్ర వేత్తల పేర్లతోపాటు గణితంతో ఏ సంబంధమూ లేని అంశాలు చొరబడ్డాయి. వాటిని తీసివెయ్యాలి. ఈ "లిస్టు" ని సరి చెయ్యడానికి నాకు "అర్హత" ఉందో లేదో తెలియదు. కనుక ఆ "అర్హత" ఉన్నవారెవరో ఈ పని చెయ్యాలి.

ధన్యవాదాలు-- Vemurione (చర్చ) 02:02, 17 ఆగష్టు 2015 (UTC)

మీరు కోరినట్లు వర్గం:భారతీయ గణిత శాస్త్రవేత్తలు వర్గాన్ని సరిచేసితిని. దీనిలో భారతీయ గణిత శాస్త్రవేత్తలు మాత్రమే ఉంటారు. ఒక వాడుకరి {{భారతీయ ఖగోళశాస్త్రం}} మూసలో భారతీయ గణిత శాస్త్రవేత్తల మూసను చేర్చిన తప్పిదం వల్ల ఖగోళ శాస్త్ర విషయాలన్నీ ఈ వర్గంలోనికి చేరాయి. దానిని సరిచేసితిని.సమస్యను తెలియజేసినందుకు ధన్యవాదాలు.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 02:28, 17 ఆగష్టు 2015 (UTC)
{{భారతీయ గణిత శాస్త్రవేత్తలు}} మూసలో ఎర్రలింకులు గల శాస్త్రవేత్తల విషయాలు మీవద్ద ఉంటే వ్యాసాలు సృష్టించండి.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 02:41, 17 ఆగష్టు 2015 (UTC)

సమాధానం[మార్చు]

మీరు సూచించిన మూస:భారతీయ గణితశాస్త్ర వేత్తలు మూసలో ఎర్ర లంకెలలో మంజుల్ భర్గవ అని ఉంది. అక్కడ భార్గవ అని ఉండాలి. అక్కడ నొక్కితే ఆ అంశం లేదని కంప్యూటరు చెప్పింది. అప్పుడు భర్గవ అన్న శీర్షిక కింద నేను నా వ్యాసాన్ని ప్రయత్నం చేసేను. మీరు మూసలో వర్ణక్రమ దోషం సరి చేసి, నేను మొదలు పెట్టిన అంశాన్ని తీసివేయండి.

ఈ రకం తెలుగు "స్పెల్లింగు తప్పులు" కొల్లలుగా కనిపిస్తున్నాయి. అందువల్లనే చాల వ్యాసాలు లింకులు లేక అనాథలుగా ఉండిపోతున్నాయి.

Vemurione (చర్చ) 15:54, 17 ఆగష్టు 2015 (UTC)

ఈ విధమైన అక్షరదోషాలు అనేకం తెవికీలో ఉన్నాయి. మీరు కోరినట్లు మూసలో దోషాన్ని సరిచేసితిని.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 16:46, 17 ఆగష్టు 2015 (UTC)

ఫిబొనాచీ

వర్గం: గణిత శాస్త్రం లో "ఫిబొనాకీ" అనే లంకె ఉంది. అది ఒత్తితే "ఫిబొనాకీ" అన్న పేజీకి వెళుతున్నాది. ఈ రెండు చోట్లా "కీ" అన్న ఉచ్చారణ తప్పు. ఫిబొనాచీ అని ఉండాలి. వ్యాసం రాసిన వ్యక్తి సరి అయిన ఉచ్చారణే ఉపయోగించారు, కాని లంకె "తలకట్టు" మాత్రం సరిగ్గా లేదు. లంకె పేరు, పేజీ తలకట్టు (heading) సరి చేస్తే బాగుంటుంది. ఇది భర్గవ, భార్గవ లాంటి సమస్యే!

Vemurione (చర్చ) 04:05, 18 ఆగష్టు 2015 (UTC)

గణితం వర్గం[మార్చు]

ఈ వర్గంలోనివి, ఉపవర్గాలలోని అంశాలు (titles and subtitles) ప్రయోగాత్మకంగా కనబడడం లేదు. పైపెచ్చు అక్కడ లంకెలని నొక్కి చూస్తే చాలమట్టుకు వ్యాసాలు అసంపూర్ణంగాను, అసంతృప్తికరంగాను ఉన్నాయి. "గణితం వర్గం" అనే major opening page లో ఉండవలసిన అంశాలేనా ఇవి అని అనిపిస్తోంది. ఉదా: మిలియను, బిల్లియను (బిలియను కాదు). పోనీ అని ఆ పేజీలకి వెళ్లి చూస్తే అక్కడ సమాచారం అంతా పేలవంగా ఉంది.-- Vemurione (చర్చ) 15:17, 18 ఆగష్టు 2015 (UTC)

వర్గం:గణిత శాస్త్రము ప్రయోగాత్మకంగా తీర్చిదిద్దుటలు ఏమి చేస్తే బాగుంటుందో తెలియజేయవలెను. కొన్ని వ్యాసాలు అసంపూర్తిగా యున్నవి. వాటిని విస్తరించవలసి యున్నది. వర్గాలు సరిగా లేకపోతే తొలగించి సరైన వర్గాలను చేర్చవలసి యున్నది. అందులో గల దోషాలను తెలియజేయండి.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 16:10, 18 ఆగష్టు 2015 (UTC)


మీరు గణిత శాస్త్ర విభాగాలుగా వర్గీకరించడం బాగుంది.దయచేసి పై వాటిని తెలుగు భాషలోకి అనువదించండి. వర్గీకరించే ప్రయత్నం చేద్దాం.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 12:41, 19 ఆగష్టు 2015 (UTC)

"ఇంటర్నెట్ మూవీ డేటాబేస్" అనే పేజీలో ఉన్న సమాచారాన్ని "ఇంటర్నెట్" అనే పేజీలోకి బదిలీ చేసి integrate చేసేను. "ఇంటర్నెట్ మూవీ డేటాబేస్" అనే పేజీని తొలగించవచ్చు.Vemurione (చర్చ) 21:11, 19 ఆగష్టు 2015 (UTC)

వర్గీకరణకి తెలుగు పేర్లతో జాబితా[మార్చు]

ఈ జాబు ద్వారా తెలుగు వికీపీడియా “గణితం” విభాగంలో ఉన్న అంశాలని వర్గీకరించడానికి ఒక ప్రతిపాదన చేస్తున్నాను.

వర్గీకరణ “ఇలా” చెయ్యాలని ఎక్కడా రాసి పెట్టి లేదు. లోకో భిన్న రుచి. నేను ప్రతిపాదించే వర్గీకరణ రుచించకపోతే ఒరిగే నష్టం ఏమీ లేదు.

ఒక పుస్తకం వాడుకునే వారు కావలసిన అంశాన్ని వెతుక్కోవాలంటే Table of Contents కైనా వెళ్లాలి, Index కయినా వెళ్లాలి. అలాగే వికీపీడియా వాడుకునే వారు వర్గాలని చూసి కాని, వెతుకు పెట్టెలో వేసి కాని కావలసిన పేజీకి వెళతారు.

తెలుగు రాతలో స్థాయీకరణ లేదు కనుక, వెతుకు పెట్టెకి వెళ్లి వెతికితే అక్కడ మనం వాడిన వర్ణక్రమం మీద మన ఫలితం (successful hit) ఆధారపడుతుంది. అందుకని వెతుకు పెట్టెకి తోడుగా మంచి వర్గీకరణ కూడ ఉంటే కావలసిన అంశం దొరకొచ్చు.
ఇక్కడ నేను ప్రతిపాదించేది వర్గీకరణ మేరకే. ఆ వర్గంలో వ్యాసాల నాణ్యత గురించి కాదు. ఇది కూడ కాలక్రమేణ మార్చుకోవచ్చు.
This is just enough information to convey the idea. This is not a comprehensive plan.

1. గణితంతో ఆటలు, చెలగాటాలు (recreational mathematics)
1.1 గణితావధానాలు (వికీలో ఉంది)
1.2 తమాషా లెక్కలు (వికీలో ఉంది)
1.3. ప్రహేళికలు (Puzzles) (ఉంది)
1.4 వగైరా

2. గణితం చరిత్ర, జీవిత చరిత్రలు (History & Biography)
2.1 ప్రాచీన భారతీయ గణితం
2.1.1.2 బక్షాళ వ్రాత ప్రతి (ఉంది)
2.1.1.3 బ్రహ్మస్పుట సిద్ధాంతం (ఉంది)
2.1.1.3 ఆర్యభట్టు ని సంఖ్యాపద్ధతి (ఉంది)
2.1.1.4 కటపయాది పద్ధతి (ఉంది)
2.1.1.5 వేద గణితం
2.2 వగైరా
2.2 భారతీయ గణిత శాస్త్ర వేత్తలు (ఉంది)
2.2.1 మొదటి భాస్కరుడు (ఉంది)
2.2.2 బ్రహ్మగుప్తుడు (ఉంది)
2.2.3 వగైరా
2.3 సున్న, స్థానబలం
2.4 గణితంలో బహుమానాలు, పురస్కారాలు
2.4.1 ఫీల్డ్స్ పతకం (Fields Medal)
2.4.2 ఉల్ఫ్ బహుమానం (Wulf Prize)
2.4.3 శాస్త్ర పురస్కారం (SASTRA prize
2.5 వగైరా

3. తత్త్వం, తర్క శాస్త్రం
3.1 భారతీయ తర్క శాస్త్రం
3.2 సమితులు, సమితి వాదాలు (Sets and Set Theories)
3.3 ఆధునిక తర్కం (Modern Logic)
3.4 నిరూపణ వాదం (Proof Theory )
3.5 వగైరా

4. వియుక్త గణితం (Abstract Mathematics)
4.1 అంకెలు, సంఖ్యలు, గణన పద్ధతులు, అంక గణితం (Numbers , Number systems and Arithmetic)
4.1.1 భారతీయ, పాస్చాత్య లెక్కింపు పద్ధతులు (Indian Vs Western system of counting)
4.1.2 దశాంశ, అష్టాంశ, ద్వియాంశ, షోడశాంశ పద్ధతులు (Decimal Vs Octal Vs binary Vs Hexadecimal Systems)
4.2 ప్రస్థానములు, మేళనాలు (Permutations and Combinations)
4.3 సంఖ్యా వాదం (Number Theory)
4.3.1 ప్రధాన సంఖ్యలు (Prime numbers) (ఉంది)
4.3.1.2 ప్రధాన కారణాంకాలు (Prime factors (ఉంది)
4.3.1.4 కవల ప్రధాన సంఖ్యలు (Twin Primes) (ఉంది)
4.4 వగైరా

5. బీజగణితం & విశ్లేషణ (Algebra & Analysis)
5.1 కలన గణితం (Calculus) (ఉంది)
5.1.1 అవకలనం (differentiation)
5.1.2 సమాకలనం (integration)
5.1.3 అవధి, పారం (limit and bound)
5.1.4 ప్రమేయాలు (functions)
5.2 సంకీర్ణ గణితం (Complex Mathematics)
5.3 అవకలన సమీకరణాలు (Differential Equations)
5.4 సదిశ రాసులు, మాత్రుకలు (Vectors and matrices )

6. రేఖా గణితం, సంస్థిత శాస్త్రం (Geometry and Topology)
6.1 విశ్లేషణ రేఖాగణితం (Analytic geometry)
6.2 సంస్థితి శాస్త్రం (Topology)
6.3 వగైరా

7. అనువర్తిత గణితం (Applied math)
7.1 సంభావ్య శాస్త్రం (Probability)
7.2 గణాంక శాస్త్రం (Statistics)
7.3 వగైరా


There is no need to organize the whole discipline. But we should leave enough flexibility to change things around, add new things, etc. as we go along.
While naming we should accommodate variations in spelling and naming conventions.
At the beginning of each new topic page, we should make an attempt to tell what the equivalent Telugu names are for an English name and provide some “etymological history” as to why that name makes sense. If possible we should always have the English name in the brackets (in Telugu script).

While searching for a name we should allow flexibility in Telugu spelling (eg. Wors ending in “sunna” and “mu” are equivalent. We should also handle the problem of writing “internet” Vs “inter^net”

I will be happy to answer questions

Thanks Vemurione (చర్చ) 23:14, 19 ఆగష్టు 2015 (UTC)

orphan pages[మార్చు]

యూదృచ్ఛిక పేజీలు చూస్తూ ఉంటే చాల orphan pages ఉన్నాయేమో అని అనుమానంగా ఉంది. ఒక పేజీ ఆర్ఫన్ పేజీ అవునో కాదో తెలుసుకోవడం ఎలా? ఎక్కడైనా ఆర్ఫన్‌ పేజీల జాబితా ఉందా? ప్రతి పేజీకి బాహ్య ప్రపంచం నుండి కనీసం మూడు లంకెలయినా లేకపోతే ఆ పేజీ ఉనికి వల్ల ప్రయోజనం ఉండదు. Vemurione (చర్చ) 17:08, 21 ఆగష్టు 2015 (UTC)

అనాథ పేజీలు చూడండి.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 17:21, 21 ఆగష్టు 2015 (UTC)

ఐసొటోపు ఖాళీ పేజీ తొలగించాలి[మార్చు]

ఐసొటోపు, ఐసోటోపు, ఐసోటోపులు అన్న వాటిల్లో రెండింటిని కలిపేసేను. ఐసొటోపు అనే పేజీ ఖాళీగా ఉంది. దీనిని తొలగించాలి.

తరువాత, ఇలాంటి చిన్న చిన్న వర్ణక్రమం తేడాలు ఉంటే ఏమి చెయ్యాలి? తెలుగులో కొన్ని మాటలు "ము" తో అంతం అవతాయి. వాటిని కొందరు "అం" అంతం చేస్తారు. వెతికేటప్పుడు ఈ తేడాని విస్మరించడం ఎలా?

Vemurione (చర్చ) 15:03, 23 ఆగష్టు 2015 (UTC)

ఐసోటోపు అనే పేజీ ఖాళీగా యున్నప్పుడు, ఐసోటోపులు అనే పేజీలో సమాచారం ఉన్నప్పుడు, ఐసోటోపు పేజీని ఐసోటోపులు పేజీకి దారిమార్పు చేయాలి.

అనగా ఖాళీగా ఉన్న ఐసోటోపు పేజీలో #దారిమార్పు[[ఐసోటోపులు]] అని చేరిస్తే దారిమార్పు చెందుతుంది. ఆ పని చేసాను.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 02:25, 24 ఆగష్టు 2015 (UTC)

రెండు వ్యాసాలు ఒకే విషయానికి సంబంధించినపుడు చివరి అక్షరంగా కొన్ని "ము" తోను కొన్ని "అం" తోనూ అంతమైనపుడు ఒక వ్యాసాన్ని విస్తరించి, రెండవ వ్యాసాన్ని మొదటి వ్యాసానికి దారిమార్పు చేయాలి.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 02:27, 24 ఆగష్టు 2015 (UTC)

విజ్ఞాప్తి[మార్చు]

మీరు నిఘంటువును అక్షర క్రమ పేజీలలో చేసారు. మీరు రాసిన నిఘంటువు గూర్చి ఒక పేజీ వేమూరి వేంకటేశ్వరరావు ఇంగ్లీషు తెలుగు నిఘంటువు అనే వ్యాసాన్ని వ్రాయమని మనవి. మీరు వ్రాసిన వ్యాసాలన్నిటినీ ఈ వ్యాసానికి లింకులు యివ్వవచ్చు. --ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 02:56, 26 ఆగష్టు 2015 (UTC)

సమాధానం[మార్చు]

చేస్తున్నాను. రెండు, మూడు రోజులలో తయారవుతుంది.

మరొక మనవి.

వెతుకు పెట్టెలో "భాషా భాగాలు" అని కొట్టి ఆ పేజీకి వెళ్లండి. పేజీ మధ్యలో "ప్రస్తుత భాషా భాగాలు" శీర్షిక కింద "నామవాచకములు" ఉన్న లంకె నొక్కండి. మీరు వెళ్లే పేజీ లో ఉన్నది తెలుగు నామవాచకాల గురించి కాదు. ఆ పేజీ అలానే ఉంచి, తెలుగు వ్యాకరణానికి సంబంధించిన మరొక పేజీని సృష్టించాలి. కావలిస్తే ఆ పేజీని నేను నింపి పెడతాను. ఇప్పుడు ఉన్న "నామవాచకాలు" ఇంగ్లీషు వ్యాకరణానికి సంబంధించినది కాని, లేదా జనరల్ గా నామవాకాల గురించి మాట్లాడేది అని నా అభిప్రాయం. ధన్యవాదాలు.Vemurione (చర్చ) 20:16, 26 ఆగష్టు 2015 (UTC)

మీరన్నట్లు ఆంగ్లవ్యాసానికి లింకు ఉన్నది. "భాషాభాగాలు" అనే వ్యాసంలో నామవాచకాలు అనే లింకును నామవాచకం (తెలుగు వ్యాకరణం) అనే వ్యాసానికి ఇచ్చాను.ఎర్ర లింకుతో ఉన్న ఈ వ్యాసాన్ని మీరు తయారుచేయండి.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 02:33, 29 ఆగష్టు 2015 (UTC)

టైపు చెయ్యడంలో ఇబ్బంది[మార్చు]

తెలుగు వికి లో విజ్ఞఆనం సరిగ్గా వచ్చేటట్లు టైపు చెయ్యడం ఎలా? ధన్యవాదాలు Vemurione (చర్చ) 13:52, 28 ఆగష్టు 2015 (UTC)

విజ్ఞానం అనే పదానికి vij~nanaM అని టైపు చేయండి.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 02:28, 29 ఆగష్టు 2015 (UTC)

వేమూరి నిఘంటువు (ఇంగ్లీషు-తెలుగు)[మార్చు]

మీ సూచన బాగుంది. నిఘంటువు శీర్షిక మరీ పెద్దదిగా ఉంది. కనుక మీరు కోరిన శీర్షిక వేమూరి నిఘంటువు (ఇంగ్లీషు-తెలుగు) కు తరలిస్తే బాగుంటుంది.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 06:35, 30 ఆగష్టు 2015 (UTC)

వేమూరి నిఘంటువు (ఇంగ్లీషు-తెలుగు) వ్యాసంలోని కొన్ని వాక్యాలు మీరు చెబుతున్నట్లు ఉన్నవి. వ్యాసం లోని వాక్యాలు మార్చవలసియున్నది.

ఉదా: "అందుకని తెలుగులో రాయాలని కోరిక ఉన్న వారి సౌకర్యం కోసం ఈ నిఘంటువుని తయారు చేసేను" లా కాకుండా " అందుకని తెలుగులో రాయాలని కోరిక ఉన్న వారికోసం వారి సౌకర్యార్థం వేమూరి వేంకటేశ్వరవారు నిఘంటువును తయారుచేసారు" అని వ్రాస్తే బాగుంటుంది.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 12:07, 30 ఆగష్టు 2015 (UTC)

నిఘంటు ముఖచిత్రం గురించి[మార్చు]

మీరు తయారుచేసిన వ్యాసంలో ఆ నిఘంటువు యొక్క పుస్తకముఖచిత్రాన్ని చేర్చగలరా! --ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 12:09, 30 ఆగష్టు 2015 (UTC)

ముఖచిత్రం చేర్చేను[మార్చు]

ముఖచిత్రం చేర్చేను. ఇంకా చిన్న చిన్న సవరణలు చేస్తున్నాను. దరిదాపు ఇంగ్లీషు-తెలుగు భాగం అయిపోయినట్లే. మీ సహాయానికి ధన్యవాదాలు Vemurione (చర్చ) 18:18, 4 సెప్టెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

రేడియో, రేడియేషన్, రేడియో ఏక్టివిటీ[మార్చు]

వికీపీడియాలో వ్యాసాలను కలిపి వ్రాసేకన్నా విడివిడిగా ఒక్కొక్క అంశం మీద వ్రాస్తే బాగుంటుంది. మూడు వ్యాసాలను సంకలనంగా వ్రాస్తే ఒకే విషయాన్ని శోధించేవారికి యిబ్బందిగా ఉంటుంది. కనుక మూడు వ్యాసాలుగా వేరు చేయాలని విజ్ఞప్తి. వికీపీడియాలో రేడియో అనే వ్యాసం యిది వరకు ఉన్నది. అది చూసి అందులో చేర్చవలసిన అంశాలేమైనా ఉంటే చేర్చవచ్చు. శుద్ధి చేయవచ్చు. రేడియోధార్మికత, మరియు రేడియేషన్ అనే వ్యాసాలను విడిగా విస్తరించవచ్చు.ఆయా వ్యాసాలలో వీటి మధ్య తేడాలను మరియు పోలికలను ఒక విభాగంగా చర్చించవచ్చు. దయచేసి పరిశీలించండి.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 01:27, 5 సెప్టెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

అజ్ఞాత వాడుకరి సందేహం[మార్చు]

అయ్యా మీరు వ్రాసిన వేమూరి నిఘంటువు (ఇంగ్లీషు-తెలుగు) లో మీరు "విద్యుత్ ప్రసార మాధ్యమాలలో" అనే పదాన్ని ఉపయోగించారు. దాని గూర్చి ఒక అజ్ఞాత వాడుకరి చర్చ:వేమూరి నిఘంటువు (ఇంగ్లీషు-తెలుగు)లో తన సందేహాన్ని వెలిబుచ్చారు. సరైన వివరణ తెలియజేయగలరు.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 13:09, 14 సెప్టెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

science fiction[మార్చు]

తెలుగు వికీపీడియాలో యిదివరకు వైజ్ఞానిక కల్పన (Science fiction) అనే వ్యాసం ఉంది. మీరు తెలుగులో వైకల్పనలు(Science fiction) అనే వ్యాసం వ్రాసారు. రెండూ ఒక్కటేనా? లేనిచో తెలుగులో వైకల్పనలు పేజీ యొక్క సరియైన ఆంగ్ల నామం తెలియజేయగలరు.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 00:17, 18 సెప్టెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

ఊతపదం (ప్రొఫానిటీ) శీర్షిక మార్పుకు సహాయం[మార్చు]

Profanity అనగా ఆంధ్రభారతి నిఘంటువు ప్రకారం "అపచారము", "అపవిత్రము" అని అర్థం. కానీ గూగుల్ అనువాద పరికరంలో ఊతపదం అని అర్థం చూపించడం మూలంగా ఈ వ్యాస శీర్షిక మారింది. సరిచేయవలసి యున్నది. అందువల్ల profanity అనగా "అసభ్యపదం" అవుతుందేమో! దయచేసి సరియైన శీర్షిక సూచించగలరు. నూతన శీర్షికకు తరలించిన తరువాత పూర్వపు శీర్షికను తొలగించవచ్చు.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 02:33, 24 సెప్టెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

సంస్కృత న్యాయములు[మార్చు]

సంస్కృత న్యాయములు తెలుగు భాషలో ఏ విభాగానికి చెందుతాయి. దయచేసి తెలియజేయగలరు. ఇవి సామెతలా, తత్త్వమా, జాతీయాలా మరేదైనా. ఈ సంస్కృత న్యాయములు తెలుగువారికి అందజేయడానికి ప్రయత్నిస్తున్నాము. అందువలన తెలుగు సామెతల మాదిరిగా అక్షర క్రమంలో ఏర్పాటు చేస్తున్నాము. ఏదైనా న్యాయము గురించి ఎక్కువ సమాచారం లభిస్తే వేరుగా వ్యాసాన్ని చేయవచ్చును. దయచేసి ఈ విలువైన అభిప్రాయాన్ని తెలియజేయగలరు.--Rajasekhar1961 (చర్చ) 05:26, 17 నవంబర్ 2015 (UTC)

ధన్యవాదాలండి.--Rajasekhar1961 (చర్చ) 14:46, 17 నవంబర్ 2015 (UTC)
మేము సంస్కృత న్యాయములు పుస్తకాన్ని వికీసోర్సులో చేర్చుతున్నాము. అందులోని చాలా న్యాయాలను వికీపీడియాలో ఆకారాద్రి క్రమంలో అమర్చాలనుకొంటున్నాము. కొంత పని ప్రారంభించాము. ఈ లింకు [[1]] చూచి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయండి.--49.248.229.250 05:11, 19 నవంబర్ 2015 (UTC)

Nikolai Noskov[మార్చు]

హలో ప్రియమైన Vemurione! You can make article in your Telugu about singer Nikolai Noskov (Nikolai Noskov)? If you will make this article, i will grateful! ధన్యవాదాలు! --92.100.196.45 14:38, 6 ఏప్రిల్ 2017 (UTC)[ప్రత్యుత్తరం]

అడిగింది ఎవ్వరండీ? సంతకం పెట్టకుండా ఇలా అడగడం ఏమి సబబు? ధన్యవాదాలు Vemurione (చర్చ) 23:26, 6 ఏప్రిల్ 2017 (UTC)[ప్రత్యుత్తరం]

Speedy deletion nomination of బాట్[మార్చు]

If this is the first article that you have created, you may want to read the guide to writing your first article.

You may want to consider using the Article Wizard to help you create articles.

Hello, and welcome to Wikipedia. This is a notice that బాట్, a page that you created, has been tagged for deletion. This has been done under two or more of the criteria for speedy deletion, by which articles can be deleted at any time, without discussion. If the page meets any of these strictly-defined criteria, then it may be soon be deleted by an administrator. The reasons it has been tagged are:

 • It is a very short article providing little or no context to the reader. (See section A1 of the criteria for speedy deletion.) Wikipedia has standards for the minimum necessary information to be included in short articles; you can see these at Wikipedia:Stub. Also please note that articles must be on notable subjects and should provide references to reliable sources that verify their content.
 • It appears to be about a person, organization (band, club, company, etc.), individual animal, or web content, but it does not indicate how or why the subject is important or significant: that is, why an article about that subject should be included in an encyclopedia. (See section A7 of the criteria for speedy deletion.) Such articles may be deleted at any time. Please see the guidelines for what is generally accepted as notable.
 • It covers a topic on which we already have an article - [[:{{{article}}}]]. (See section A10 of the criteria for speedy deletion.) Please note that this is not a comment on you personally and we hope you will continue helping to improve Wikipedia. If the topic of the article you created is one that interests you, then perhaps you would like to help out at [[:{{{article}}}]], or to discuss new information at [[Talk:{{{article}}}|the article's talk page]].

If you think this page should not be deleted for this reason, you may contest the nomination by visiting the page and clicking the button labelled "Click here to contest this speedy deletion". This will give you the opportunity to explain why you believe the page should not be deleted. However, be aware that once a page is tagged for speedy deletion, it may be removed without delay. Please do not remove the speedy deletion tag from the page yourself, but do not hesitate to add information in line with Wikipedia's policies and guidelines. If the page is deleted, and you wish to retrieve the deleted material for future reference or improvement, you can place a request here. రహ్మానుద్దీన్ (చర్చ) 13:07, 17 ఏప్రిల్ 2017 (UTC)[ప్రత్యుత్తరం]

ఆండ్రాయిడ్ వెర్షన్[మార్చు]

వేమూరి గారూ... ఈ నిఘంటువు విద్యార్థులకు మరియు ఉద్యోగార్థులకు మిక్కిలి ఉపయోగకరంగా ఉన్నది. మీ కృషికి ధన్యవాదములు. ఈ నిఘంటువు ఆండ్రాయిడ్ వెర్షన్ లింకు ఇవ్వగలరు. ఇది మరింతమందికి ఉపయోగకరంగా ఉండును.
--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 05:38, 28 ఏప్రిల్ 2017 (UTC)[ప్రత్యుత్తరం]

ఆండ్రాయిడ్ వెర్షన్ లింకు అడిగేరు. ఆ లింకు ఎలా పెట్టడమో నాకు తెలియదు. మీరు చెప్పండి, అలాగే చేద్దాం.Vemurione (చర్చ) 13:25, 28 ఏప్రిల్ 2017 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు - సహాయ అభ్యర్థన[మార్చు]

మొదటిగా ఈ నిఘంటువు ను మాకు వికీపీడియా లో పొందుపర్చినందుకు కృతజ్ఞతలు.

కింది పదాల్ని పరిశీలించి నిఘంటువులో చేర్చగలరని ఆశిస్తున్నాను.

తెప్పరిల్లు, tepparillu : -v సేద తీరు, తెరుకోను : to recover

పరివేష్టితం, pariVeSTitaM : -n --Enrobed, covered lavishly, encrust

రూక్ష, rUkSa : -n --Hard, Fever

రజస్వల rajasvala : -n --Menarche ---see also పుష్పవతి SandeepLakka (చర్చ) 21:33, 10 నవంబర్ 2018 (UTC)

I will update the dictionary as per your request Vemurione (చర్చ) 16:04, 21 నవంబర్ 2018 (UTC)

సుజనా ఆంటే[మార్చు]

2405:204:6708:5FC6:4059:C82C:2CD:38A4 14:44, 13 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]

Community Insights Survey[మార్చు]

RMaung (WMF) 14:33, 6 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

Reminder: Community Insights Survey[మార్చు]

RMaung (WMF) 15:09, 20 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

Reminder: Community Insights Survey[మార్చు]

RMaung (WMF) 19:01, 3 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

mhtml images upload[మార్చు]

I have some images as mhtml files. How can I upload them to Wikipedia? Thanks Vemurione (చర్చ) 00:28, 22 మార్చి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

YesY సహాయం అందించబడింది


I have some images as mhtml files. How can I upload them to Wikipedia? Thanks Vemurione (చర్చ) 00:28, 22 మార్చి 2020 (UTC) —Vemurione (చర్చ) 02:05, 22 మార్చి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

Open with your browser, right click on image and save it. Then upload the saved file.అర్జున (చర్చ) 11:58, 27 మార్చి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

macbook air keyboard switch[మార్చు]

సహాయం కావాలి-విఫలం.
{{సహాయం కావాలి}} ద్వారా సహాయం కోరినప్పటికీ వారంరోజులలోగా స్పందనలు లేని వాటికి ఈ మూసను వాడాలి. అప్పుడు ఈ పేజీలు వర్గం:సహాయం లభించని పేజీలు అనే వర్గంలోకి చేరిపోతాయి.

 • సహాయపడే వారికి గమనిక: మీరు స్పందించదలిస్తే సహాయం కోరిన వారి వాడుకరి పేరుకి వికీలింకు మీ స్పందనలో చేర్చి, చర్చ కొనసాగించండి. ఆ తరువాత చర్చ ప్రారంభించినవారు {{సహాయం కావాలి-విఫలం}} అనే మూసను {{సహాయం చేయబడింది}} గా మార్చవచ్చు. నిర్వాహకులు అప్పుడప్పుడు ఈ మూస గల పేజీలను సమీక్షించి చర్చ ఒక దశకు చేరి ముందుకు పోయే అవకాశం లేనప్పుడు అదే పని చేస్తారు.
I am no longer able to use Telugu font. When I type Control-M, the font is not switching between Telugu and English. A while ago I had tinkered with "Keyboard preferences" and the trouble started after that. I use MacBook Air. Can someone help me with restoring my ability to type in Telugu. Thanks Vemurione (చర్చ) 03:02, 26 మార్చి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
{{సహాయం కావాలి-విఫలం}} చేర్చాను. --అర్జున (చర్చ) 04:57, 11 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

audio files of Telugu alphabet[మార్చు]

సహాయం కావాలి-విఫలం.
{{సహాయం కావాలి}} ద్వారా సహాయం కోరినప్పటికీ వారంరోజులలోగా స్పందనలు లేని వాటికి ఈ మూసను వాడాలి. అప్పుడు ఈ పేజీలు వర్గం:సహాయం లభించని పేజీలు అనే వర్గంలోకి చేరిపోతాయి.

 • సహాయపడే వారికి గమనిక: మీరు స్పందించదలిస్తే సహాయం కోరిన వారి వాడుకరి పేరుకి వికీలింకు మీ స్పందనలో చేర్చి, చర్చ కొనసాగించండి. ఆ తరువాత చర్చ ప్రారంభించినవారు {{సహాయం కావాలి-విఫలం}} అనే మూసను {{సహాయం చేయబడింది}} గా మార్చవచ్చు. నిర్వాహకులు అప్పుడప్పుడు ఈ మూస గల పేజీలను సమీక్షించి చర్చ ఒక దశకు చేరి ముందుకు పోయే అవకాశం లేనప్పుడు అదే పని చేస్తారు.

I am looking for public domain audio files of Telugu alphabetical characters. For example, one file each for అ, ఆ, ఇ, ఈ, etc. Similarly, one for each of క, కా, కి, కీ, etc. Are they available anywhere? Also, I am looking for animated files that show how to write these characters. Thanks. —Vemurione (చర్చ) 04:14, 1 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

{{సహాయం కావాలి-విఫలం}} చేర్చాను. --అర్జున (చర్చ) 04:57, 11 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

audio clip file .alfc upload[మార్చు]

YesY సహాయం అందించబడింది

I wish to insert short audio clips into a wikipedia page. I've prepared the clips using Apple's Quicktime Player. The resulting file has a .aifc extension. When I tried to upload that file, the system rejected it. How do I do this? Thanks Vemurione (చర్చ) 02:47, 4 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

Dear Vemurione, Download Audacity and convert to .ogg format for uploading to Wikimedia commons. అర్జున (చర్చ) 04:19, 4 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు. ప్రయత్నించి చూస్తాను. Vemurione (చర్చ) 00:59, 13 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

నిఘంటువు పేజీలు వికీబుక్స్ కు తరలింపు[మార్చు]

వేమూరి గారికి, మీరు కృషిచేస్తున్న నిఘంటువు పేజీలను వికీబుక్స్ కు తరలింపు గురించి ఉదాహరణ పేజీలలో చర్చ ప్రారంభించాను (చూడండిచర్చ:ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు (A) ,చర్చ:తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు (అ)). మీ స్పందన ఒక వారం రోజులలోగా తెలుపకోరుతున్నాను. --అర్జున (చర్చ) 23:37, 14 జూలై 2020 (UTC).[ప్రత్యుత్తరం]

చర్చ చర్చ:ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు (A) దగ్గర కొనసాగుతున్నది. --అర్జున (చర్చ) 05:43, 17 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
నిఘంటువు పేజీలన్నీ (దారిమార్పులు తప్పించి) వికీబుక్స్ లో నకలు చేయబడ్డాయి. మీరు ఒకసారి తనిఖీ చేసి ఏమైనా దోషాలుంటే తెలపండి. ఇకనుండి మార్పులు అక్కడే చేయమని కోరుతున్నాను. --అర్జున (చర్చ) 06:53, 30 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]

We sent you an e-mail[మార్చు]

Hello Vemurione,

Really sorry for the inconvenience. This is a gentle note to request that you check your email. We sent you a message titled "The Community Insights survey is coming!". If you have questions, email surveys@wikimedia.org.

You can see my explanation here.

MediaWiki message delivery (చర్చ) 18:54, 25 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters[మార్చు]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:39, 30 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.

copying the Periodic Table from English Wikipedia[మార్చు]

YesY సహాయం అందించబడింది


Vemurione (చర్చ) 01:23, 2 జూలై 2021 (UTC) I wish to copy this table and insert in my page on "lOhAlu". Then I may wish to edit a (delete) a few items. How do i do this? You can look at my page at లోహాలు. Thanks https://en.wikipedia.org/wiki/Periodic_table_(crystal_structure)[ప్రత్యుత్తరం]

{{Periodic table (by crystal structure)}} అనే ఆ మూసను తెవికీ లోకి దిగుమతి చేసాను. దాన్ని లోహాలు పేజీలో ట్రాన్స్‌క్లూడు చెయ్యవచ్చు. దానిలో దిద్దుబాటు చెయ్యాలంటే, మామూలుగా మిగతా మూసల్లో చేసినట్లుగా చెయ్యడమే సార్.__ చదువరి (చర్చరచనలు) 01:42, 2 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]
Many thanks. Vemurione (చర్చ) 01:49, 2 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]

[Wikimedia Foundation elections 2021] Candidates meet with South Asia + ESEAP communities[మార్చు]

Hello,

As you may already know, the 2021 Wikimedia Foundation Board of Trustees elections are from 4 August 2021 to 17 August 2021. Members of the Wikimedia community have the opportunity to elect four candidates to a three-year term. After a three-week-long Call for Candidates, there are 20 candidates for the 2021 election.

An event for community members to know and interact with the candidates is being organized. During the event, the candidates will briefly introduce themselves and then answer questions from community members. The event details are as follows:

 • Bangladesh: 4:30 pm to 7:00 pm
 • India & Sri Lanka: 4:00 pm to 6:30 pm
 • Nepal: 4:15 pm to 6:45 pm
 • Pakistan & Maldives: 3:30 pm to 6:00 pm
 • Live interpretation is being provided in Hindi.
 • Please register using this form

For more details, please visit the event page at Wikimedia Foundation elections/2021/Meetings/South Asia + ESEAP.

Hope that you are able to join us, KCVelaga (WMF), 06:35, 23 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]

2021 వికీమీడియా ఫౌండేషన్ బోర్డు ఎన్నికలలో ఓటు వేయండి[మార్చు]

నమస్తే Vemurione,

2021 వికీమీడియా ఫౌండేషన్ బోర్డు అఫ్ ట్రస్టీస్ ఎన్నికలలు మొదలయ్యాయి. ఈ ఎన్నిక 18 ఆగష్టు 2021 న మొదలైంది, 31 ఆగష్టు 2021 న ముగుస్తుంది. వికీమీడియా ఫౌండేషన్ తెలుగు వికీపీడియా వంటి ప్రాజెక్టులకు మద్దతు ఇస్తుంది. వికీమీడియా ఫౌండేషన్ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఉంటుంది. బోర్డ్ ఆఫ్ ట్రస్టీల గురించి ఈ లింకులో తెలుసుకోండి.

ఈ సంవత్సరం నాలుగు బోర్డు సీట్లకు ఎన్నిక జరుగుతుంది. వీటి కోసం 19 మంది అభ్యర్థులు ఉన్నారు. అభ్యర్థుల గురించి మరింత సమాచారం ఈ పేజీలో తెలుసుకోండి.

70,000 ఓటర్లు ఉన్నారు. ఓటింగ్ ప్రక్రియ 31 ఆగష్టు 23:59 UTC వరకు నడుస్తుంది.

మీరు ఇప్పటికే ఓటు వేసినట్టు అయితే, దయచేసి ఈ ఇమెయిల్‌ను విస్మరించండి. ఓటర్లు ఒక్కసారి మాత్రమే ఓటు వేయవచ్చు.

ఈ ఎన్నికలు గురించి మరింత సమాచారం తెలుసుకోండి. MediaWiki message delivery (చర్చ) 05:02, 29 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]