Jump to content

వాడుకరి చర్చ:Vemurione/పాత చర్చ 1

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

కొత్త స్వాగత సందేశం

[మార్చు]

Vemurione/పాత చర్చ 1 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. రవిచంద్ర(చర్చ) 04:30, 30 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
నా అభిరుచులు లో ఇటీవలి మార్పులను ఉత్కృష్టపరచుకోండి

మీ అభిరుచులు పేజీలో "మెరుగైన ఇటీవలి మార్పులు" అంశాన్ని వాడి చూసారా? డిఫాల్టుగా అది అచేతనమై ఉంటుంది. అది పని చెయ్యాలంటే బ్రౌజరు జావాస్క్రిప్టును సపోర్టు చేసేదిగా ఉండాలి. మామూలు ఇటీవలి మార్పులు పేజీలోవలె కాక, ఒక పేజీలో జరిగిన మార్పులన్నిటినీ ఒకచోట సమీకరించి చూపిస్తుంది. ఒకేపేజీలో జరిగిన మార్పుచేర్పులన్నిటి చరితాన్నీ చూపించే లింకు కూడా ఉంటుంది.

మరిన్ని వివరాలకు సహాయము:ఇటీవలి మార్పులు చూడండి


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల


hi there,

Are you sure about what you've been adding here? Please read

Your contributions to the wiki is appreciated, Looking forward to your greater participations.

cheers,


--HPNadig 07:07, 25 Nov 2004 (UTC)


పునస్వాగతం

[మార్చు]

Vemurione గారూ! నమస్కారం.

  • మీ రచనలను బట్టి నేను గమనించినదేమంటే మీరు నవంబర్ 2004 నుండీ, అంటే తెలుగు వికీ ప్రాంరంభ దశనుండీ, నేను చేరడానికి చాలా ముందునుండీ సభ్యులు. కాని షుమారు మూడేళ్ళు సుదీర్ఘవిరామం తరువాత మళ్ళీ రచనలు మొదలు పెట్టారులా వుంది . అందుకేననుకొంటాను. మీ చర్చా పేజీలో స్వాగత సందేశం లేదు. ఏమయినా వికీకి పునస్వాగతం.
  • మీరు వివిధ వర్గాలలో "ఇది సుప్రసిద్ధ ఆంధ్రులు కోవలో ఉండవలసిన వ్యాసం కాదు. వీరి గొప్పతనాన్ని కించపరచాలనే ఉద్దేశ్యం కాదు. ఇది ఇక్కడ నప్పదు. తొలగించండి." అని వ్రాశారు. ఈ విషయంలో మీరు పొరపాటు పడ్డారని నా అభిప్రాయం. ఇవి "శాస్త్రవేత్తలు" వగైరా వర్గాలు కాని "సుప్రసిద్ధ ఆంధ్రులు" వర్గం కాదు కదా! తెలుగు వికీలో తెలుగువారి గురించే వ్రాయబడుతుందని మీరు భావించారనిపిస్తున్నది. కాని అది సరికాదు. లేదా మీ సూచన నాకు సరిగ్గా అర్ధం కాలేదు.
  • సుప్రసిద్ధ ఆంధ్రులు గురించి మీరు ఎన్నుకొన్న వ్యాసాలకు ప్రత్యేక అభినందనలు. దయచేసి వాటిని కొనసాగించండి. అయితే వాటికి సరైన వర్గాలు చేర్చలేదు. తరువాత చేద్దాము. వ్యక్తుల గురించిన వర్గాల విషయంలో చాలా అయోమయం నెలకొన్నది. స్పష్టమైన వర్గీకరణ గురించి ఆలోచించండి. అమలు చేద్దాము. ఈ విషయమై ఇక్కడ మరియు ఇక్కడ, ఇంకా ఇక్కడ కొన్ని సూచనలు, చర్చ ఉన్నాయి. గమనించగలరు.


అంకెల గురించి

[మార్చు]

Vemurione గారూ!.

  • మీ పరిచయం మీ సభ్యుని పేజీలో లేదు. చర్చ:వేమూరి వేంకటేశ్వరరావు లో చావాకిరణ్ వ్రాసిన దానిని బట్టి మీరే వేమూరి వేంకటేశ్వరరావు అనుకొంటున్నాను.
  • ఒకమారు మూస:సంఖ్యానుగుణ వ్యాసములు చూడండి. అందులో వివిధ సంఖ్యలకు అంబంధించిన వ్యాసాలున్నాయి.
  • http://eemaata.com లో మీరు వ్రాసిన "అంకెలు-సంఖ్యలు" గురించిన వ్యాసాలు వికీలో సంఖ్యానుగుణ వ్యాసములుకు సంబంధించిన వ్యాసాలుగా కూర్చడానికి చాలా బాగుంటాయి. మీరే వాటిని వికీలో పెట్టవచ్చును (కాస్త వికీకరించి). లేదా మీరు అనుమతిస్తే నేను ఆ కాపీ పని చేయగలను (అది నాకు బాగా వచ్చిన విద్య లెండి.).
  • అయితె 6 నుండి 10 వరకు "ఈ మాట"లో లేవు. "అమెరికాభారతి"లో వచ్చాయని వ్రాసారు.అవి కూడా మాకు లభించే అవకాశం ఏమయినా ఉందా?

--కాసుబాబు 07:10, 7 ఏప్రిల్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ఇక అంకెలు, సంఖ్యలు మీద నేను రాసిన వ్యాసాలు. ఇవి ఏళ్ళ తరబడి శ్రమించి, పరిశోధించి రాసిన వ్యాసాలు. వీటిని వికీలో పెడితే మరెవరైనా వీటిలో మార్పులు చేస్తే (తెలిసీ, తెలియని వాళ్ళు), నా శ్రమ వృధా అవుతుందేమో అని బెంగగా ఉంది. తెలిసిన వాళ్ళు మెరుగుగు దిద్దితే పరవా లేదు. తెలిసీ తెలియని వాళ్ళు unintentioanl గా పాడు చేస్తారేమోనని భయం. ఇది కొంచెం ఆలోచించవలసిన విషయం. (ఇదే భయం ఉన్నప్పటికీ దరిదాపు జనరంజక ప్రశ్నలు, సమాధామనాలు వికీ లో రాసేను.) - వేమూరి

మీ వ్యాసాలను ఎవరూ మార్చకూడదనుకుంటే, వికీమూలాల్లో పెట్టవచ్చు. వికీపీడియా వ్యాసంనుండి ఇదే అంశంపై వేమూరి రాసిన వ్యాసం వికీమూలాల్లో ఉంది అంటూ అక్కడికి లింకు ఇవ్వవచ్చు. —వీవెన్ 07:40, 8 ఏప్రిల్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
వేమూరి గారూ ! మీ సందేహాలు సరైనవే. ఇది వికీ సహజ స్వభావం. కనుక ఈ విషయమై వెనుకాడడానికి బలమైన కారణాలున్నాయి. అనుమతి కోసం మిమ్ములను ఇబ్బంది పెట్టడం నా అభిప్రాయం కాదు.
ఇక చావా కిరణ్ గారు అడిగిన ప్రశ్నకు --- 1, 2, 3 - ఇలా ఒకో అంకెకూ ఒకో వ్యాసం తయారు చేయాలని. (ఆంగ్ల వికీలో కూడా ఉన్నాయి). ఒకో అంకెకూ గణిత పరంగానూ, సంస్కృతి పరంగాను, తెలుగు సాహితీ పరంగానూ ఉన్న విశేషాలను ఆయా వ్యాసాలలో వ్రాయాలని నా ఉద్దేశ్యం.
--కాసుబాబు 05:38, 8 ఏప్రిల్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

నేను అంకెలమీద రాసిన వాటిలో మచ్చుకి కొన్నింటిని RTS file format లో మీకు పంపగలను. వాటిని మచ్చుకి వికీకరిస్తే ఎలా ఉంటుందో నాకు చూపించగలరా? ఏ ఎడ్రస్సు కి పంపమంటారు?


teluguwiki@yahoo.co.in కు పంపండి. (RTS file format నా కంప్యూటర్‌లో పనిచేస్తుందేమో చూడాలి. యూనికోడ్ అయితే ఇబ్బంది లేదు). నేను నా చేతనైన వికీరణ చేసి మళ్ళీ మీకు పంపుతాను. నేననుకొన్న 'వికీకరణ' అంటే పెద్ద మార్పులేమీ కాదు. "అని నా అభిప్రాయం", "నేను గమనించిందేమంటే" వంటి వాక్యాలు తీసి వేయాలి. మరీ నిర్దుష్టమైన అభిప్రాయమైతే "అని వేమూరి వేంకటేశ్వరరావు అభిప్రాయం" అని చేర్చవచ్చును. --కాసుబాబు 07:29, 8 ఏప్రిల్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
నాకిఫ్పుడే తట్టిన ఉపాయం. మీరు ఏమీ పంపనవసరం లేదు. "ఈ మాట" "జనవరి 1999" సంచికలో లో మీరు వ్రాసిన "ఒకటి" వ్యాసాన్ని (ముందు “ఒకటి” తో మొదలు పెడదాం)కాస్త "వికీకరించి", రేపు ఈ చర్చాపేజీలోనే వ్రాస్తాను. దానిని పరిశీలించగలరు --కాసుబాబు 07:37, 8 ఏప్రిల్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]


వనరులు

[మార్చు]



నేను చెయ్యదలుచుకున్న సవరణలు చేసేను. ఇది బాగా పెద్దది అయిపోయింది. ఇందులో ఏయే భాగాలు తొలగించవచ్చో సూచించేను. పైన చూపిన వాక్యం ఉన్నంత సేపూ నా అనుమతి మీకు ఇస్తున్నాను. వికీలో ప్రచురించండి.- వేమూరి


పది పైన

[మార్చు]
  • తెలుగులో పది, ఒండు పదకొండు ఎలా అయిందో అదే విధంగా పాత ఇంగ్లీషులో 'ఎలెవెన్‌' అంటే "(పదిమీద) మిగిలింది ఒకటి” అని అర్థం. ఇదే విధంగా 'ట్వెల్వ్‌' అర్థం “మిగిలింది రెండు”. ఇది సంస్కృతంలో 'ద్వ+ దశ = ద్వాదశ' అయింది. ఇదే మాట లేటిన్‌లో 'డూవోడెసిమ్‌'. 'డూవో' అంటే రెండు, 'డెసిమ్‌' అంటే పది. మాటకట్టడిలో లేటిన్‌కీ సంస్కృతానికీ పోలిక ఉంది. పాత ఇంగ్లీషుకీ తెలుక్కీ పోలిక ఉంది. ఈ 'డూవోడెసిమ్‌' అన్న లేటిన్‌ మాట భ్రష్టయి ఇంగ్లీషులో 'డజన్' గా మారింది. కనుక డజనుని ద్వాదశికి భ్రష్టరూపంగా తెలుగులోకి తీసేసుకోవచ్చు. లేదా తెలుగులో డజనుని ద్వాదశం అనొచ్చు. ఇలాంటి నియమాలు ఒక డజను సంపాదించగలిగితే ఇంగ్లీషు మాటల్ని డజన్ల కొద్దీ తెలుగులోకి తీసుకురావచ్చు.
  • పాశ్చాత్యదేశాలలో, హోటేళ్ళు మొదలైన అంబరచుంబితాలలో (అంటే 'స్కైస్క్రేపర్‌'లలో) సాధారణంగా పదమూడో అంతస్తు ఉండదు. అంటే, పన్నెండు తర్వాత పద్నాలుగు వస్తుంది. తెలుగువారికి ఏడు ఎలాగో పాశ్చాత్యులకి పదమూడు అలాగ. పదమూడు వల్ల కీడు కలుగుతుందనే భయాన్ని 'త్రిస్‌కైడేకాఫోబియా' అంటారు. ఈ భయానికి కారణం లేకపోలేదు. ఏసుక్రీస్తు ఆఖరి భోజనం వేళప్పుడు పదముగ్గురు హాజరు అయేరుట. తెలుగువాళ్ళకి త్రయోదశభీతి లేదు కానీ అమావాశ్య అంటే కొంచెం భయం ఉంది.
  • ఇంగ్లీషులో 'ఎలెవెన్‌', 'ట్వెల్వ్‌' లకి తెలుగులో పదకొండు, పన్నెండు లతో పోలిక ఉన్నాదని చెప్పుకున్నాం కదా. ఈ పోలిక తర్వాత కనపడదు. 'థర్టీన్‌ = త్రీ + టీన్‌' అయితే తెలుగులో పదమూడు = మూడు + పది కాదు; పది+మూడు. ఇంగ్లీషులో ముందు మూడు, తర్వాత పది వస్తే తెలుగులో కొంచెం తిరకాసు వచ్చింది. ఇదే తిరకాసు 'నైన్‌టీన్‌' వరకు కనిపిస్తుంది.
  • ఇక్కడ సంస్కృతంలో లెక్క పెట్టే పద్ధతిని ఒకసారి పునర్విమర్శిద్దాం. ఉదాహరణకి, ఎనభైరెండుని ద్వ్యశీతి అంటే 2+80 అనీ, ఎనభై మూడుని త్య్రశీతి అంటే 3+80 అనీ చెబుతూ, ఎనభై తొమ్మిది దగ్గరికి వచ్చేసరికి 'నవాశీతి' అనకుండా 'ఏకోన నవతి' అన్నారు. అంటే “తొంభైకి ఒకటి తక్కువ” అని అర్థం. ఈ పద్ధతి ఇంగ్లీషులోనూ తెలుగులోనూ కూడ కనిపించదు. కాని రోమక సంఖ్యలని రాసేటప్పుడు ఈ సంస్కృతంలో వాడే పద్ధతినే ఇప్పటికీ వాడుతున్నాం అని గమనించండి. ఉదాహరణకి తొమ్మిదిని "పది కంటె ఒకటి తక్కువ" అనే అర్ధం స్పురించే విధంగా IX అని రాస్తాం.
  • మనం తొమ్మిది రాత్రులని నవరాత్రులు అన్నట్లే ఇంగ్లీషులో పద్నాలుగు రాత్రులని 'ఫోర్టీన్‌ నైట్స్‌' అంటారు. దీన్ని కుదిస్తే 'ఫోర్ట్‌నైట్‌' అవుతుంది.
  • పక్కా తెలుగు వాడికీ పదహారుకీ ఏదో తీయని సంబంధం ఉండబట్టే 'పదహారణాల ఆంధ్రుడు' అన్న పదబంధం వాడుకలోకి వచ్చింది. అణా నాణేలు పోయినా పదబంధం వాడుక మిగిలింది.
  • భారతంలో పద్ధెనిమిదికి చాలా ప్రాముఖ్యత ఉంది. అష్టాదశ పర్వాలు. భారతయుద్ధంలో పద్ధెనిమిది అక్షౌహిణుల సైన్యం. భగవద్గీతలో పద్ధెనిమిది అధ్యాయాలు. ఈ 18 అధ్యాయాలలో ఉన్న 700 చిల్లర శ్లోకాలనీ 18 శ్లోకాలలోకి కుదించి దానిని అష్టాదశగీత అన్నారు. పురాణాలు, ఉపపురాణాలు పద్ధెనిమిదేసి ఉన్నాయి.
  • పచ్చీస్‌పాళీ ఉత్తరాది వారి ఆట కాబోలు. ఈ ఆటలోనే దస్సు, దోదస్సు, పచ్చీసు వస్తాయి.
  • దేశానికి కొత్తగా వచ్చే మనుషులకి జబ్బు చేస్తే వారిని కొన్నాళ్ళు 'క్వారన్‌టీన్‌'లో పెడతారు అంటే. ఆగంతుకులకి ఏమైనా అంటురోగాలుంటే అవి మిగిలిన వాళ్ళకి సోకకుండా నలభైరోజుల పాటు ఏకాంతరవాసం ఏర్పాటు చేస్తారు. ఫ్రెంచి భాషలో 'క్వారంటె' అంటే నలభయ్‌!
  • అరవైకి మానవ సంస్కృతిలోనే ఒక ప్రత్యేక స్థానం ఉంది. భారతీయులకి సంవత్సరాలు అరవై. అరవై ఏళ్ళు బతికితే అదొక మైలురాయి లాంటిది. కనుక భారతీయ సంస్కృతిలో షష్టిపూర్తికి ఎంతో ప్రాముఖ్యత. గంటకి 60 నిమిషాలు, నిమిషానికి అరవై 'సెకండు'లు, సెకండుకి అరవై 'థర్డ్‌'లు. ఇదే విధంగా వృత్తంలో ఒక డిగ్రీకి అరవై నిమిషాలు, నిమిషానికి అరవై సెకండ్లు, సెకండుకి అరవై థర్డ్‌లు. ఇప్పటికైనా అర్థమయిందా “సెకండు” అన్న మాటలోని అంతరార్థం? కొందరు “సెకండు షో”, “సెకండు హేండు” మొదలైన ఇంగ్లీషు మాటలని నిర్మొహమాటంగా వాడేస్తూ నిమిషంలో అరవైయవ వంతైన సెకండు దగ్గరకు వచ్చేసరికి దానిని 'సెకను' అంటారు, అక్కడికేదో తెలుగు మీద అభిమానం మండిపడి పోతూన్నట్లు.
  • ఇరవై, ముప్ఫయ్‌, .. , తొంభయ్‌ అన్న అంకెలు దరిదాపు అన్ని భాషలలోనూ ఒకే బాణీలో వెళతాయి. ఇరు + పది = ఇరువది లేదా ఇరవై. ఏను + పది = ఏబది లేదా ఏభయ్‌. ఆరు + పది = అరువది లేదా అరవై. కాని అరవై దాటిన తరవాత వచ్చే అంకెలు అన్ని భాషలలోనూ పైన ఉదహరించిన బాణీలో నడవవు. ఉదాహరణకి, ఏడు + పది = డెబ్బది ఎలాగయిందో తెలియాలంటే కొంచెం వ్యాకరణసూత్రాలు బాగా రావాలి. ఇక్కడ పనిచేసే ధ్వని పరిణామాన్ని వర్ణవ్యత్యయం (metathesis) అంటారని ద్రావిడ భాషా కోవిదుడు ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి అంటారు. ఈ రకం ప్రవర్తన ఇంగ్లీషులో కనిపించదు కాని ఫ్రెంచి భాషలో ఎనభైని "నాలుగు ఇరవైలు" అనే అలవాటు ఉంది.
  • మనిషి పూర్ణాయుర్దాయం నూరేళ్ళు అని చాలమంది నమ్మకం. ఈ నమ్మకంతోటే 'నూరేళ్ళు నిండుగా బతుకు' అని ఆశీర్వదిస్తాం. దీన్నే వేదాల్లో “జీవేమ శరదః శతం” అంటే “నూరేళ్ళు జీవించాలి” అని కోరుకోవడం. ఈ నూరేళ్ళూ ఎలా జీవించాలి? ఆరోగ్యంగా, ఇంకొకరి మీద ఆధారపడకుండా, సంఘశ్రేయస్సుకి భంగం కలగకుండా, జబ్బుపడి మంచం పట్టిపోకుండా, పనిచేస్తూ జీవించాలి.
  • నూరు, వంద అన్న పేర్లు ఎలాగొచ్చేయో తెలియదు. “రెండు వందల”, “మూడు వందల” అని అంటాం కానీ “వంద పదహారు”కి బదులు “నూటపదహారు” అంటాం. ఈ నూటపదహారుకి భారతీయ సంస్కృతిలో ఒక ప్రత్యేకస్థానం ఉంది. కట్నం, పారితోషికం మొదలైనవి వంద ఇవ్వకూడదు, నూరు ఇవ్వకూడదు నూటపదహార్లు ఇవ్వాలి.
  • “నూరు” ఎప్పుడు వాడాలో, “వంద” ఎప్పుడు వాడాలో అన్న సందేహనివృత్తికి ఒక నియమమంటూ ఉన్నట్లు లేదు. అంతేకాదు, పేరుకి నూరే కాని ఆచరణలో నూరుని నూరులా వాడని సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకి - శతకంలో నూరు కాదు, నూట ఎనిమిది పద్యాలుంటాయి. కాని “వేమన శతకం”లో వందల కొద్దీ పద్యాలున్నాయి కనుక వాటిని వేమన పద్యాలంటేనే మెరుగేమో. పూజ చేయించేటప్పుడు చదివే అష్టోత్తరశత నామాలు నూట ఎనిమిది.
  • విశాఖపట్నం జిల్లాలో వంద మామిడి పళ్ళు కొంటే నూటపన్నెండు వస్తాయి. మామూలు వంద 100 అయితే “పెద్ద వంద” 112. ఈ ఆచారం ఇంగ్లండులోనూ ఉంది. “హండ్రెడ్‌వెయిట్‌” అంటే 112 పౌనులు. “హండ్రెడ్‌కౌంట్‌” అంటే 112 శాల్తీలు.
  • గాంధీ “నూట ఇరవై ఏళ్ళు బతుకుతాను” అని అనేవారు. ఈ నూట ఇరవై ఎక్కడి నుండి వచ్చిందా అని ఆలోచన చేస్తే మన జాతకశాస్త్రంలో ఒక ఆధారం దొరుకుతుంది. నవగ్రహాల దశలనీ కూడితే 120 వస్తుంది: రవి-6, చంద్ర-10, కుజ-7, రాహు-18, గురు-16, శని-19, బుధ-17, కేతు-7, శుక్ర-20, వెరసి 120.
  • డాలర్లో నూరోవంతు సెంటు. సెంటు అంటే నూరు అనే అర్థం కూడా ఉండబట్టే “సెంటు పెర్సెంటు” అంటే నూటికి నూరు అయింది. క్రికెట్‌లో వంద పరుగులు చేస్తే అది “సెంచెరీ”. వంద సంవత్సరాల కాలమైన శతాబ్దం కూడ సెంచెరీయే.
  • సహస్రం అంటే వెయ్యి. విరాట్‌పురుషుడికి వెయ్యి తలలు, వెయ్యి కళ్ళు, వెయ్యి పాదాలు ఉన్నాయని వర్ణిస్తాం; “సహస్ర శీర్షం దేవం, సహస్రాక్షం సహస్రపాత్‌”. ఇక్కడ “వెయ్యి” అంటే “ఎన్నో” అని అర్థం చెప్పుకోకుండా, “వెయ్యి తలలుంటే రెండు వేల కళ్ళు ఉండొద్దా?” అని అడగటం అవివేకం. ఇది అలంకారాలలో ఒకటయిన అజహర్లక్షణానికి ఒక ఉదాహరణ అని సరిపెట్టుకోవాలి.
  • ఇంగ్లీషులో “మిలీనియమ్‌” అంటే వెయ్యి సంవత్సరాలు. దీన్నే మనం సహస్రాబ్దం అంటాం.
  • మిల్లీ అంటే వెయ్యో వంతు. ఈ “మిల్లీ”లో నుండి ఉద్భవించిన “మైలు” అంటే వెయ్యి అంగల దూరం.
  • ఇంగ్లీషులో “సెంటీపీడ్‌” అంటే వందపాదాలు కల పురుగు అని అర్థం. కాని సెంటీపీడులని పట్టుకుని వాటి పాదాలు లెక్కపెడితే అవి 30 కీ 42 కీ మధ్య ఉంటాయి కాని వంద ఎప్పుడూ ఉండవు. “మిల్లీపీడు” అంటే వెయ్యి పాదాలు కల పురుగు. కాని వీటికి సాధారణంగా ఏ రెండు వందల కాళ్ళో ఉంటాయి అంతే. (నేతిబీరకాయ లాంటి మాటలు ఇంగ్లీషులోనూ ఉన్నాయి.) ఈ మధ్య 750 కాళ్ళు ఉన్న మిల్లీపీడుని కనుక్కున్నారు. ఎక్కడైనా వెయ్యి కాళ్ళు ఉన్న మిల్లీపీడు దొరుకుతుందేమోనని వెతుకుతున్నారు. ఇవి పురాణాలలో పెట్టిన పేర్లు కావు కదా! శాస్త్రవేత్తలు వీటికి పేర్లు పెట్టడంలో పప్పులో కాలేసేరు! సెంటిపీడులనీ మిల్లిపీడులనీ కలిపి “మిరియపోడా” అంటారు. “మిరియడ్‌” అంటే పదివేలు. “మిరియపోడా” అంటే పదివేల కాళ్ళు ఉన్న పురుగు అని అర్థం. కనుక ఈ పేర్లన్నిటినీ అతిశయోక్తులుగా తీసుకోవాలి.
  • వెయ్యిని ఇంగ్లీషులో “థౌజండ్‌” అంటాం కదా! “థౌజండ్‌” అంటే “గట్టివంద” లేదా ”పెద్దవంద”, అని అర్థం. ఇటలీ వాళ్ళు తీసిపోయారా? వాళ్ళు వెయ్యికి “మిల్లీ” తగిలించి దానిని “గట్టివెయ్యి” లేదా “మిలియోన్‌” చేసేరు. అదే మిలియన్‌ అయింది. కాని గట్టి వంద వెయ్యి అయితే గట్టివెయ్యి పదివేలు అవాలి, న్యాయంగా. కాని ఇక్కడ అవలేదు.
  • పెద్ద పెద్ద అంకెలని ఊహించి లెక్క పెట్టడం భారతీయులకి వెన్నతో పెట్టిన విద్య. ఉదాహరణకి పెద్దపెద్ద అంకెలు ఎంతవరకు లెక్కపెట్ట వచ్చో చూద్దాం. ఒకటి పక్కన సున్న వేస్తే అది పది. పదిని ఊహించుకోవడం పెద్ద కష్టం కాదు. మన చేతులకి పది వేళ్ళు ఉన్నాయి కదా!
  • పది పక్కన సున్న చుడితే అది వంద. వందని ఊహించుకోవడం కూడ పెద్ద కష్టం కాదు. ఒకటి పక్కన మూడు సున్నలు చుడితే అది వెయ్యి.
  • ఒకటి పక్కన నాలుగు సున్నలు చుట్టడంతో పేర్లు పెట్టే పద్ధతిలో కొంచెం మార్పు వచ్చింది. 10,000 కి మరో కొత్తపేరు పెట్టకుండా “పదివేలు” అనేసి ఊరుకున్నాం. మనమే కాదు ఇంగ్లీషు వాడూ ఇదే పని చేసి, “టెన్‌, హండ్రెడ్‌, థౌజండ్‌” అయిన తర్వాత మనలాగే “టెన్‌ థౌజండ్‌” అన్నాడు. కాని ఇంగ్లీషు వాడు మన దేశం రాక పూర్వం దీనిని “మిరయడ్‌” అనే వాడు.
  • ఒకటి పక్కన ఐదు సున్నలు చుడితే అది లక్ష. దీన్ని హిందీలోనూ, ఇంగ్లీషులోనూ కూడ “లేక్‌” అంటారు.
  • ఒకటి పక్కన ఆరు సున్నలు చుట్టగా వచ్చిన సంఖ్య “పది లక్షలు”. కొత్తసున్న చుట్టినప్పుడల్లా ఒక కొత్త పేరు పెడదాం అనుకుంటే, ఆ కొత్త పేరే మిలియను. అమెరికాలో మిలియను డాలర్లు ఆస్తి ఉంటే మధ్య తరగతిలో కొంచెం పైమెట్టు లో ఉన్నట్లు లెక్క వేసుకోవచ్చు.
  • ఒకటి పక్కన ఏడు సున్నలు చుడితే అది కోటి. దీన్ని హిందీలో “కరోర్‌” అంటారు. ఇదే ఇంగ్లీషులో “క్రోర్‌”. ఈ రోజులలో గొప్పవాళ్ళు కోటీశ్వరులు, లేదా కరోర్‌పతులు. “వాళ్ళింట్లో డబ్బు కోటికి పడగలు ఎత్తిందిరా!” అనుకునే వారు. అంత డబ్బుంటే ఆ డబ్బు పాములుగా మారిపోతుందనే నమ్మకం ఉండేది. కోటిని ఊహించుకోవడం కొంచెం కష్టం.
  • మానవకోటి, జంతుకోటి అన్న మాటలలో మాత్రం కోటి అంటే ఎన్నో అనే అర్థం. కనుక 'ఏనిమల్‌ కింగ్‌డమ్‌' వంటి 'బయాలజీ' మాటని 'జంతుకోటి' అంటేనే బాగుంటుంది.
  • ఒకటి పక్కన ఎనిమిది సున్నలు చుడితే వచ్చే సంఖ్యకి మంచిపేరు, నలుగురికీ పరిచయం అయిన పేరు ఏదీ లేదు. పదికోట్లు అనో, దశకోటి అనో, వంద మిలియన్లు అనో అనవచ్చు; కాని అవి కొత్త పేర్లు కావు. 'వెంకట్రావ్‌, పెద వెంకట్రావ్‌' అన్నట్టు పాత పేర్లనే పునరావృతం చేసేం, అంతే.
  • ఒకటి పక్కన తొమ్మిది సున్నలు చుడితే వచ్చే సంఖ్య వంద కోట్లు లేదా బిలియను. మిలియను ఊహించుకోవడం చేతనయిన వాళ్ళకి కూడ బిలియను ఊహించుకోవడం కష్టం. వెయ్యికీ మిలియనుకీ మధ్య ఎంత దూరం ఉందో మిలియనుకీ బిలియనుకీ మధ్య అంత దూరం అని ఉపమానం చెప్పినా ఆ ఉపమానం ఉపయోగకారి కాదు.
  • అసలు ఆధునిక శాస్త్రీయ యుగం మొదలయే వరకూ పాశ్చాత్య దేశాలలో పెద్ద పెద్ద సంఖ్యలతో పనే ఉండేది కాదు. బిలియనుతో సామాన్యులకి అవసరం ఏముంటుంది? కనుక మొన్న మొన్నటి వరకూ పాశ్చాత్య భాషలలో పెద్ద పెద్ద సంఖ్యలకి పేర్లే లేవు. పని ఉంటే కదా పేర్ల అవసరం! కాని భారతదేశంలో ఏమి పని వచ్చిందో తెలియదు కాని పెద్ద పెద్ద సంఖ్యలకే కాదు, పేద్ద పేద్ద సంఖ్యలకి కూడ పేర్లు ఉన్నాయి. ఉదాహరణకి ఒకటి తర్వాత 11 సున్నలు చుడితే అది అర్బుదం, 13 సున్నలకి ఖర్వం, 15 సున్నలకి పద్మం, 17 సున్నలకి క్షోణి, 19 సున్నలకి శంఖం, ఇలాగే తరువాయి బేసి సున్నలుంటే వాటిని క్రమంగా క్షితి, క్షోభం, నిధి, సరి సంఖ్యలైన సున్నలుంటే వాటి పేరుకి “మహా” తగిలించి మహాపద్మం, మహాఖర్వం, వగయిరా పేర్లు. ఒకటి తర్వాత 27 సున్నలుంటే పర్వతం, 28 పరార్థం, 29 అనంతం. ముప్పయ్‌ సున్నలుంటే సాగరం, 31 అవ్యయం, 32 అచింత్యం, 33 అమేయం, … భూరి, వృందం, అన్న పేర్లు ఉన్నాయి. ఈ లెక్కలో వృందం తర్వాత ఏమి పేర్లు వస్తాయో ఇదమిద్ధంగా తెలియదు కానీ రావణాసురుడి సైన్యం ఎంత పెద్దదో వర్ణిస్తూ వాల్మీకి ఒకటి తర్వాత 55 సున్నలు చుడితే వచ్చే సంఖ్యంత అని చెప్పి దానికి మహౌఘం అని పేరు పెట్టేడు.
  • ఈ పేర్లు భారతదేశంలో వాడుకలో లేవు కానీ ఈ పేర్లు జపాను వాళ్ళు ఇప్పటికీ వీటిని వాడుతున్నారు. మచ్చుకి ఒకటి తర్వాత 80 సున్నలు వేయగా వచ్చిన సంఖ్యని జపాను వాళ్ళు “పుకషీగీ” అంటారు. పుకషీగీ అంటే “అచింత్యం”. ఒకటి తర్వాత 56 సున్నలు వేయగా వచ్చిన సంఖ్యని “కుగాషా” అంటారు. కుగాషా అంటే “గంగా నది ఒడ్డున ఉన్న ఇసకంత” అని అర్థం.
  • పేర్లు పెట్టడం అంటూ పెట్టేరు కానీ, ఈ పేర్లలో ఒక బాణీ లేకపోతే జ్ఞాపకం పెట్టుకోవడం కష్టం. అప్పుడు ఒకదానికి మరొక పేరు వాడే ప్రమాదం ఉంది. భారతీయ ప్రాచీన గ్రంథాలలో, మచ్చుకి, ఒకటి తర్వాత 12 సున్నలు ఉన్న సంఖ్యని ఒకచోట మహార్బుదం అన్నారు, మరొక చోట న్యర్బుదం అన్నారు. ఇలాంటి ఇబ్బందుల నుండి తప్పించుకుందికి అధునాతనులు ఒక పద్ధతి ప్రవేశపెట్టేరు. ఈ పద్ధతిలో సంఖ్యల పేర్లలో బాణీ ఈ విధంగా ఉంటుంది. పది, వంద, వెయ్యి మామూలే. తర్వాత కొత్త పేరు ఒకటి తర్వాత ఆరు సున్నలు చుట్టగా వచ్చిన మిలియను. తర్వాత కొత్తపేరు ఒకటి తర్వాత తొమ్మిది సున్నలు చుట్టగా వచ్చిన బిలియను. అలా మూడేసి సున్నలు అధికంగా చేర్చినప్పుడల్లా మరొక కొత్త పేరు. ఈ లెక్కని ఒకటి తర్వాత ఆరు సున్నలుంటే మిలియను, తొమ్మిది ఉంటే బిలియను, 12 అయితే ట్రిలియను, 15 సున్నలకి క్వాడ్రిలియను, తదుపరి క్వింటిలియను, అలా.
  • ఇవన్నీ “లియను” అనే శబ్దంతో అంతం అవుతున్నాయి. కాని ఈ “లియను” ముందుండే పూర్వప్రత్యయం జ్ఞాపకం పెట్టుకోవడం ఎలా? ఈ పూర్వ ప్రత్యయాలని విడిగా, వరసగా వాటి అర్థాలతో రాసి చూద్దాం. బి రెండు, ట్రి మూడు, క్వాడ్‌ నాలుగు, క్వింట్‌ అయిదు, సెక్స్‌ట్‌ ఆరు, సెప్ట్‌ ఏడు, ఆక్ట్‌ ఎనిమిది, నవ్‌ తొమ్మిది … అలా అలా వెళుతుందీ వరస. ఈ వరస అర్థం ఏమిటంటే మిలియనుని మూలంగా తీసుకుని ఆ మిలియనుని రెండు సార్లు వేసి హెచ్చవేస్తే వచ్చే సంఖ్య బిలియను, మూడు సార్లు గుణిస్తే వచ్చే సంఖ్య ట్రిలియను, నాలుగు సార్లు గుణకారం చెయ్యగా వచ్చింది క్వాడ్రిలియన్‌, .. బ్రిటిష్‌ వాళ్ళ హయాంలో ఈ ప్రపంచం ఉన్నప్పుడు వాళ్ళు అన్నీ తార్కికంగా ఆలోచించి ఒక పద్ధతిలో పేర్లు పెట్టేరు. ఒకటి తర్వాత 12 సున్నలుంటే దానిని బిలియను అనీ, 18 సున్నలుంటే దానిని ట్రిలియను అనీ, అలా అనుకుంటూ వెళ్ళమన్నారు. అలాగే వెళ్ళేవాళ్ళం. తర్వాత అమెరికా వాళ్ళు వచ్చేరు.అమెరికా పద్ధతిలో బిలియను అంటే ఒకటి తర్వాత తొమ్మిది సున్నలే. ట్రిలియను అంటే ఒకటి తర్వాత 12 సున్నలూ, అలాగ వెళుతోంది ఈ బండి. ఈ మార్పు వల్ల వచ్చిన నష్టం ఏమిటంటే పూర్వప్రత్యయాన్ని చూసి ఆ సంఖ్యలో ఎన్ని సున్నలుంటాయో చెప్పడం కష్టం; బట్టీ పట్టేయాలి అంతే.

ఈ పేర్లు ఇంకా ఎంత దూరం వెళతాయి? మిలియనుని వంద సార్లు వేసి హెచ్చవేస్తే వచ్చే సంఖ్యని 'సెంటిలియన్‌' అనమన్నాడు బ్రిటీషువాడు. అప్పుడు సెంటిలియన్‌ అంటే ఒకటి తర్వాత 600 సున్నలు అని ఠకీమని చెప్పగలిగి ఉండేవాళ్ళం. కాని ఈ అమెరికా పద్ధతి వల్ల ఆ సౌలభ్యం పోయి ఒకటి తర్వాత 303 సున్నలు చుడితే అది సెంటిలియన్‌ అయింది.

  • వంద మన మస్తిష్కంలో ఎలా పాతుకుపోయిందంటే ఒకటి తర్వాత వంద సున్నలు వేస్తే వచ్చే సంఖ్యకి పేరేమిటి అనే సందేహం ఒకాయనకి వచ్చింది. సరదాగా పొడుపు కథలా కొడుకుని అడిగేడు. ఆ కొడుకుకి మాత్రం ఏం తెలుసు? సరదాగా ఒక పిచ్చి మాట తయారుచేసి “గూగోల్‌” అన్నాడు అదేదో సినిమాలో శివరావు “గిడిగిడి” అన్నట్టు. ఆ గూగోల్‌ స్థిరపడి పోయింది. ఒకటి తర్వాత గూగోల్‌ సున్నలు చుట్టగా వచ్చిన సంఖ్య? దీన్ని “గూగోప్లెక్స్‌” అనమని మరొక ప్రభృతుడు సలహా ఇచ్చేడు.

వనరులు

[మార్చు]

 

అంకెలలో రకాలు

[మార్చు]

అంకెలలో రకరకాల అంకెలు ఉన్నాయి.

1, 2, 3, వగైరాలని పూర్ణ సంఖ్యలు (integers) అంటారు. వీటినే సహజ సంఖ్యలు (natural numbers) అని కూడా అంటారు. పూర్ణ సంఖ్యల చరిత్ర మానవుడి చరిత్ర కంటె పురాతనమైనదని కొందరి నమ్మకం. పక్షులు గూటిలో పెట్టిన గుడ్లలోంచి ఒకటో, రెండో గుడ్లు మనం తీసేస్తే కొన్ని గుడ్లు లోపించాయనే విషయం తల్లి పక్షి గ్రహించగలదని ప్రయోగాత్మకంగా నిరూపించేరు. కనుక లెక్కపెట్టగలగటం అనే పని ఒక్క మానవుడే కాదు, తదితర జీవులు కూడా చెయ్యగలవన్న మాట.


మానవులకి మృగాలకి తేడా ఏమిటంటే, మానవుడు లెక్కించేటప్పుడు భాష వాడతాడు. కాని మనిషి లెక్కించేటప్పుడు వాడే భాషకి, దాని వెనక ఉన్న భావానికి మధ్య ఉండే లంకె తెగడానికి కొంత కాలం పట్టింది.


ఉదాహరణకి, ఫీజీ ద్వీప వాసులు పది పడవల్ని `బోలో` అంటారు, కాని పది కొబ్బరి కాయలని `కోరో` అంటారు. అంటే వారి భాషలో `పది` అనే భావానికి మాట లేదు. మన భాషలలో కూడ వెతికితే ఈ రకం మాటలు దొరుకుతాయి. ఉదాహరణకి ఇంగ్లీషు భాషలో సెంచరి (century) అనే మాట ఉంది. ఈ మాటకి ``నూరు పరుగులు`` అని క్రికెట్ తో పరిచయం ఉన్న ఇండియాలో ఎవరిని అడిగినా చెబుతారు. ఇదే మాట అమెరికాలో వంద సంవత్సరాలని సూచిస్తుంది. అలాగే `కపుల్` (couple) అంటే `జంట`. తెలుగులో `పుంజీ` అంటే నాలుగు. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే `నాలుగు చింత పిక్కలు`. ఈ రకం భావంతో లంకె పడ్డ మాటలు ఇంకా చాలా ఉన్నాయి - అన్ని భాషలలోను.

సరి, బేసి; ధన, రుణ సంఖ్యలు

[మార్చు]

సంఖ్యలలో సరి సంఖ్యలు, బేసి సంఖ్యలు అని మరొక విభేదం ఉంది. ఇవే కాకుండా సంఖ్యలలో ధన సంఖ్యలు, రుణ సంఖ్యలు అని ఇంకొక విభేదం ఉంది. రుణ సంఖ్యల గురించి బీజగణితానికి బీజం పోసిన భాస్కరాచార్య కి కూడా తెలుసు: 2x + 7 = 3 వంటి బీజగణిత సమీకరణాన్ని పరిష్కరించ వలసిన సందర్భంలో తప్పకుండా రుణ సంఖ్యల అవసరం కనిపిస్తుంది.

నిష్ప సంఖ్యలు

[మార్చు]

పూర్ణ సంఖ్యల తరువాత మనకి తరచుగా తారసపడేవి భిన్న సంఖ్యలు. వీటిని ఇంగ్లీషులో `ఫ్రేక్షన్`లు అంటారు. తెలుగులో కాని, సంస్కృతంలో కాని `భిన్నం` అంటే మామూలుగా కాకుండా మరొక విధంగా ఉండటం; ఇక్కడ `భాగం` అనే సూచనే లేదు. కాని ఇంగ్లీషులో మాత్రం `ఫ్రేక్షన్` అంటే భాగం అనే అర్థం. కనుక భిన్న సంఖ్యలకి `నిష్ప సంఖ్యలు` అనే కొత్త పేరు పెడుతున్నాను. `నిష్ప సంఖ్యలు` అంటే లవము, హారము ఉండి నిష్పత్తి ని తెలియజేసేవి. భిన్నం అన్న మాటకి `ఫ్రేక్షన్` అనే ఇంగ్లీషు మాటని ఉండనిచ్చి, నిష్ప సంఖ్య అన్నదానిని 'రేషనల్ నంబర్" అన్నదానికి సమానార్ధకంగా వాడదాం.

భిన్నాలు ఎవరు ఎప్పుడు కనుక్కున్నారో ఎవ్వరికీ తెలియదు. కాని `భిన్నం` అనే భావం మానవుడి పుర్రెలో పుట్టినదే. క్రీస్తు పూర్వం 1650 ప్రాంతాలదైన `రిండ్ పపైరస్’ (Rhind papyrus) లో 1/2, 1/3, 1/4, 1/5 వంటి ఏకలవ భిన్నాలకి (అంటే లవంలో 1 ఉన్న భిన్నాలు), 2/3 కి ప్రత్యేకమైన మాటలు కనిపిస్తాయి. హిందీలో అర కి 'ఆదా' అనీ, ఒకటిన్నర కి 'అఢాయీ' అనీ, రెండున్నర కి 'డేడ్' అనీ ప్రత్యేకమైన మాటలు ఉన్నాయి. తెలుగులో 1/2 ని అర అనీ, 1/4 ని పావు అనీ అంటాం. మూడు పావులు అని చెప్పాలంటే సంధి చేసి ముప్పావు అంటాం. తెలుగులో 2/3 కి గానీ, తదితర భిన్నాలకి గాని ప్రత్యేకమైన పేర్లు ఉన్నట్లు లేదు. ముప్పేట అంటే 3/4 అనే అర్థం వస్తుంది, కాని ఈ మాట కొబ్బరి కాయ ఎంత ముదిరిందో చెప్పడానికే వాడటం కనబడుతుంది.

అనిష్ప సంఖ్యలు

[మార్చు]

పూర్ణ సంఖ్యలు, భిన్న సంఖ్యలు తరువాత వచ్చే భావాలు మన అనుభవ పరిధికి కొంచెం అతీతంగా ఉంటాయి. ఉదాహరణకి కొన్ని సంఖ్యలని ఇంగ్లీషులో `ఇర్రేషనల్` (irrational) సంఖ్యలు అంటారు. `రేషనల్` కానివి `ఇర్రేషనల్`. ఇక్కడ ఈ `రేషనల్` అన్న మాట `రేష్యొ` (ratio) అన్న మాటకి సంబంధించినది. ఒక నిష్పత్తి రూపంలో రాయగలిగే సంఖ్యలు నిష్ప సంఖ్యలు (rational numbers). నిష్ప సంఖ్యలు అన్నా భిన్నాలు అన్నా ఒక్కటే! ఒక సంఖ్యని నిష్పత్తి రూపంలో రాయలేని పక్షంలో ఆ సంఖ్య 'అనిష్ప సంఖ్య' (irrational number). పూర్ణ సంఖ్యలు కానివి, నిష్ప సంఖ్యలు కానివి అయిన సంఖ్యలు ఉన్నాయనే విషయం యవనులకి అవగతం అయేసరికి వారి ఆశ్చర్యానికి అంతు లేదు.


ఒక చతురస్రం లో కర్ణం యొక్క పొడుగుని లెక్క కట్టాలంటే భుజం పొడుగుని ఏ నిష్ప సంఖ్యతో గుణించినా సరి అయిన సమాధానం రాదని పైథోగరోస్ కనుక్కున్నాడు. ఇదే విషయం మరొక విధంగా చెప్పుకోవచ్చు. ఒక చతురస్రం లో కర్ణం పొడుగుకి, భుజం పొడుగుకి మధ్య ఉండే నిష్పత్తిని పూర్ణ సంఖ్యలతో వ్యక్త పరచ లేము. మన చతురస్రం యొక్క భుజం పొడుగు ఒక అంగుళం అనుకుంటే, కర్ణం పొడుగు (అంటే 2 యొక్క వర్గమూలం) అంగుళాలు. ఈ అనే సంఖ్యని మనం సౌలభ్యం కొరకు 22/7 అని రాస్తాం కాని నిజానికి ని ఏ విధమైన భిన్నంగానూ రాసినా అది ఉరమర లెక్కే!. కనుక అనిష్ప సంఖ్యకి ఒక ఉదాహరణ. పైథోగరోస్ కి అనిష్ప సంఖ్యకి మధ్య ఉన్న బాదరాయణ సంబంధాన్ని పురస్కరించుకుని కి పైథోగరోస్ సంఖ్య అని పేరు పెట్టేరు.


అనిష్ప సంఖ్యలు ఉన్నాయనే విషయం మొట్టమొదట పైథోగరోస్ మనోవీధిలోనే మెరిసి ఉండుంటుందని కొందరి సిద్ధాంతం. ఇది నిజమో కాదో ఇతమిద్ధంగా ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే బాబిలోనియా లోని మట్టి పలకల మీద చూపిన ఒక లెక్కలో యొక్క విలువ 14 దశాంశ స్థానాల వరకు తప్పు లేకుండా కట్టబడి ఉంది. కాని పైథోగరోస్ శిష్యులు తమ కూటమే ఈ ఘన విజయం మొట్టమొదటగా సాధించిందన్న అపోహతో 'శత వృషభ శిరచ్చేద యాగం' (అంటే వంద ఎద్దులని బలి ఇచ్చేరని) చేసేరని ఒక ఐతిహ్యం ఉంది.


ఒకొక్క బాహువు పొడుగు ఒకొక్క అంగుళం చొప్పున ఉన్న (సమబాహు) చతురస్రం యొక్క కర్ణం అయినట్లే, ఒకొక్క బాహువు పొడుగు ఒకొక్క అంగుళం చొప్పున ఉన్న (సమబాహు) పంచభుజి యొక్క కర్ణం కూడా అనిష్ప సంఖ్యే. దీనిని ముద్దుగా సువర్ణ నిష్పత్తి (golden ratio)అని పిలుస్తారు. దీని విలువ . ఒక దీర్ఘ చతురస్రం పొడుగు వెడల్పులకి మధ్య ఉండే నిష్పత్తి. ఈ సువర్ణ సంఖ్యకి దగ్గరగా ఉంటే ఆ దీర్ఘ చతురస్రం కంటికి ఎంతో ఇంపుగా కనిపిస్తుందని చిత్రకారులు అంటారు. అందంగా ఉన్న వాళ్ళ ముఖాలు కొంచెం పరిశీలించి చూడండి. అవి గుండ్రంగా చంద్రబింబాన్ని పోలి ఉంటే చలివిడి ముద్దలాగో, బోర్లించిన సిబ్బిలాగో ఉందంటారు. కోలగా పొడుగ్గా ఉంటే గజం బద్దలా ఉందంటారు. ముఖం పొడవు, వెడల్పు మధ్య ఉండే నిష్పత్తి సువర్ణ సంఖ్యకి దగ్గరగా ఉన్నప్పుడు ఆ ముఖం అందంగా కనిపిస్తుందిట. ఇలా చెప్పుకుంటూ పోతే అనిష్ప సంఖ్యలకి ఉదాహరణలు కొల్లలుగా దొరుకుతాయి.


సంక్లిష్ట సంఖ్యలు

[మార్చు]

బీజగణితం ధర్మమా అని లభించిన సంఖ్యలలో మరొక జాతివి సంక్లిష్ట సంఖ్యలు (complex numbers). ఇలా ఎన్నెన్నో రకాల సంఖ్యలు గణితంలో అలా తారస పడుతూనే ఉంటాయి.

అంకెలని రాసే పద్ధతులు

[మార్చు]

ఇప్పుడంటే అంకెలని రాయటంలో ఒక ఒరవడి స్థిరపడిపోయింది కానీ మొదట్లో ఇది అంత సులభ సాధ్యంగా ఉండేది కాదు.


అనాదికాలంలో, అంటే క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాలకి ముందే, మట్టి పలకల మీద ఘంటపుచీల (wedge) తో రాసిన అంకెలు సుమేరియాలో దొరికేయి. ఘంటపుచీలని లేటిన్ భాషలో ``క్యునియస్`` అంటారు కనుక ఈ రకపు రాతని ``క్యూనిఫారం`` రాత అంటారు. ఈ క్యూనిఫారం పద్ధతి నెమ్మదిగా బాబిలోనియా కి పాకిరింది. క్రీస్తు పూర్వం 1500 సంవత్సరపు కాలానికి, అంటే హామురాబీ రాజ్యం ఏలే రోజులకి, ఈ పద్ధతి బాగా చెలామణీలోకి వచ్చిన దాఖలాలు ఉన్నాయి. ఘంటపుచీల చివర “పక్కకి తిప్పి పడుక్కోబెట్టిన హంసపాదు ఆకారంలో” ఒక ముద్రని తయారు చేసి, ఆ ముద్రతో మట్టి పలకలమీద అద్దకం అద్దినట్లు అద్దేవారుట. ఆ ముద్ర 10 అంకెకి గుర్తుట. రెండు హంసపాదు ముద్రలు ఇరవై తో సమానం. నాలుగు హంసపాదు ముద్రల తర్వాత రెండు నిలువు గీతలు గీస్తే అది నలభైరెండు తో సమానంట.


ఈ కథనాన్ని బట్టి బాబిలోనియా వారికి స్థాన బలం సూత్రం తెలిసినట్లే అనిపిస్తోంది కదా. కాని వీళ్ళకి సున్న రాయటం ఎలాగో తెలియలేదు. తమాషా ఏమిటంటే వీరి తరువాత వచ్చిన యవనులు (గ్రీకులు), రోమకులు (రోమనులు) ఈ స్థాన బలం అనే కిటుకుని అవగాహన చేసుకున్నట్లు లేదు.

యవనులు చేసినది ఏమిటంటే, వాళ్ళ భాషలో ఉన్న అక్షరాలనే అంకెలుగా కూడ వాడటం మొదలు పెట్టేరు. `అ` అంటే 1, `ఆ` అంటే 2, `ఇ` అంటే 3, `ఈ` అంటే 4... అలా వెళుతుందీ పద్ధతి. గ్రీకు భాషలో `అ, ఆ` లు అనడానికి బదులు, వాళ్ళ భాషలో ఆల్ఫా, బీటా, గామా, … అంటారు కనుక `ఆల్ఫా` అంటే 1, `బీటా` అంటే 2, `గామా` అంటే 3, `డెల్టా` అంటే 4, `ఎప్సిలాన్` అంటే 5, `ఈటా` అంటే 8, `తీటా` అంటే 9, `అయోటా` అంటే 10, `కప్పా` అంటే 20... అలా ... అలా, వెళుతుంది వీరి పద్ధతి.


పాత గడియారాలు చూచిన వారికి రోమక పద్ధతి కొట్టిన పిండే. ఫుస్తకాలలోని పీఠికలలోని పేజీల్లోను, పురాతన భవనాల మీద కూడ రోమక పద్ధతి అంకెలు కనబడుతూనే ఉంటాయి. ఈ పద్ధతిలో 1, 5, 10 లకి I, V, X వాడటం అందరికీ సుపరిచితమే. తరవాత 50 కి L, 100 కి C, 500 కి D, 1000 కి M వాడతారు. ఇక్కడ C అన్నది `సెంటం` అన్న లేటిన్ మాటకి, M అన్నది `మిల్లి` అన్న మాటకి మొదటి అక్షరాలు.


ఈ రోజులలో మనం వాడే 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అనే పది అంకెలని భారత దేశంలో అయితే ఇంగ్లీషు అంకెలనీ, పాశ్చాత్య దేశాలలో అయితే `అరబ్బు` అంకెలని కొందరు, ‘హిందూ-అరబ్బు’ అంకెలని కొందరూ అంటారు గాని, నిజానికి ఇవి హిందూ అంకెలు. ఏ కారణం వల్లనో భాతరదేశంలో మాత్రం పంచాంగాలలోను తదితర పవిత్ర స్థలాలలోను ఈ హిందూ అంకెలని వాడటానికి ఇష్ట పడరు; `తెలుగు` అంకెలు వాడతారు - అక్కడికి ఈ `అరబ్బు` అంకెలు అపవిత్రము, తెలుగు అంకెలు పవిత్రము అయినట్లు.


హిందూ అంకెలలో మొదటి అంకె సున్న, లేదా సూన్యం. ఈ సున్న అనే భావం భారతదేశంలోనే కనిపెట్టబడిందని ఇవ్వరూ కొప్పెక్కి కూయక్కర లేదు. ఇది భారతదేశపు సొంత మాట. పరాయి దేశాలలో, ముఖ్యంగా పాశ్చాత్య దేశాలలో, ఈ భావానికి సరిపడే మాట అప్పట్లో లేదు. తెలుగులో సాంకేతిక పదాలు లేవ్ని ప్రజలు ఇప్పుడు ఎలా తంటాలు పడుతున్నారో అలాగే పాశ్చాత్యులకి కూడ ఇబ్బంది వచ్చి ఉండుంటుంది. అందుకని వారు సంస్కృతంలోని `సూన్య` ని తీసుకుని `సిఫిర్` గాను తదుపరి ఈ సిఫిర్ ని `సైఫర్` (cipher) గాను మార్చి వాళ్ళ భాషలో వాడేసుకోవటం మొదలు పెట్టేరు. ఇదే సైఫర్ మరో అడ్డు దారి వెంబడి వెళ్ళి `జెఫిరో` గాను, ఆ జెఫిరో కాస్తా `జీరో` (zero) గాను అయేయి.


ఒక్క సున్నని ఒక్కటీ కనిపెట్టి ఊరుకుని ఉంటే భారతీయులకి ఇంత పేరు వచ్చేసి ఉండేది కాదేమో. సున్నతో పాటు స్థాన బలం సూత్రం అని మరొకటి కనిపెట్టేరు. అప్పటి నుంచే ఒకట్ల స్థానం, పదుల స్థానం, వందల స్థానం, అనుకుంటూ అలా ఎంతవరకునైనా లెక్క పెట్టుకుంటూ వెళ్ళగలిగే స్థోమత మనకి వచ్చింది.


ఇప్పటి వరకు చెప్పిన ముఖ్యమైన అంశాలని ఒక సారి పునర్దర్శనం చేసుకుందాం. హిందువులు అంకెలకి కొంత సహజ బలం, కొంత స్థాన బలం ఉంటాయని అన్నారు. ఒక అంకె ఏ స్థానాన్నైనా ఆక్రమించవచ్చు. ప్రతీ స్థానానికి కొంత స్థాన బలం ఉంటుంది. ఈ స్థాన బలం కుడి నుండి ఎడమకు పదేసి ఇంతలు చొప్పున పెరుగుతు వెళ్ళిన యెడల దానిని `దశాంశ పద్ధతి` అంటారు. ఒక సంఖ్య యొక్క నిజమైన విలువ కనుక్కోవాలంటే ప్రతి స్థానంలోను ఉన్న అంకెని ఆ అంకె ఉన్న స్థాన బలంతో గుణించి, ఆయా లబ్దాలని కలపాలి. దశాంశ పద్ధతిలో ప్రతి స్థానం లోను పది వివిధమైన గుర్తులు గల అంకెలని వాడ వచ్చు.


దశాంశ పద్ధతి మనకి బాగా అలవాటు అయిన పద్ధతి కనుక పైన క్రోడీకరించిన సంగ్రహం కొంచెం కృతకంగా కనిపించవచ్చు. కాని లెక్కించేటప్పుడు 0 నుండి 9 దాకా ఉన్న పది చిహ్నాలనే వాడి లెక్క పెట్టాలని ఎవరన్నారు? మన రెండు చేతులకి కలిపి పది వేళ్ళు ఉండబట్టి, మనం లెక్క పెట్టడానికి వేళ్ళు వాడతాము కాబట్టి, ఈ పదికి కొంత ప్రత్యేకత వచ్చి వుండవచ్చని విశ్వవ్యాప్తంగా ఉన్న అభిప్రాయం.


కాల గమనాన్ని కొలిచేటప్పుడు మనం దశాంశ పద్ధతిని వాడనేవాడం. చూడండి, అరవై సెకండ్లు ఒక నిమషం. అరవై నిమషాలు ఒక గంట. మొన్న మొన్నటి వరకు మూడు దమ్మిడీలు ఒక కాని, నాలుగు కానీలు ఒక అణా, నాలుగు అణాలు ఒక పావులా, నాలుగు పావులాలు ఒక రూపాయ. కనుక దశాంశ పద్ధతిలోనే లెక్క పెట్టాలని ఎవరూ శాశించ లేదు.


ఉదాహరణకి, అష్టాంశ పద్ధతిలో (octal system)ఎనిమిదే ఎనిమిది అంకెలు ఉంటాయి. అవి, 0, 1, 2, 3, 4, 5, 6, 7. ఈ పద్ధతిలో ఈ ఎనిమిది అంకెల తోటే లెక్కలన్నీ చేస్తాం. ఈ పద్ధతిలో 7 తరువాత ఏమిటి వస్తుంది? ఉన్న అంకెలన్నిటిని ఒక సారి లెక్క పెట్టడం అయిపోయింది కనుక, ఆ విషయం గుర్తు చేసుకుంటూ 1 వేసి, దాని తరువాత 0, 1, 2, అనుకుంటూ మళ్ళా 7 వరకు లెక్క పెడతాం. కనుక, అష్టాంశలో 7 తరువాత 10, 11, 12, 13, 14, 15, 16, 17 ఆ తరువాత 20, 21, ... వస్తాయి. ఇక్కడ వచ్చే 10 ని `పది` అనకూడదు. పది అనేది దశాంశ పద్ధతిలో వచ్చే మాట. అష్టాంశలో వచ్చే 10 దశాంశలో వచ్చే ఎనిమిదితొ సమానం. అలాగే అష్టాంశలో వచ్చే 11 ని `పదకొండు` అనకూడదు; ఇది దశాంశలో వచ్చే తొమ్మిదితో సమానం. కనుక 10 అనే సంఖ్య కనిపించినప్పుడు అది “ఆటోమేటిక్” గా “పది” అయిపోదు కనుక ఆ సందర్భం అర్ధం అయేవరకు దానిని “ఒకటీ సున్న” అనడమే మంచిది.


ఇదే విధంగా ద్వియాంశ పద్దతిని (binary system)నిర్వచించవచ్చు. ద్వియాంశ పద్ధతిలో రెండే రెండు అంకెలు ఉన్నాయి. అవి - 0, 1. ఉన్న రెండు అంకెలని ఒక సారి లెక్క పెట్టడం అయిపోయింది కనుక ఒక ఒకటి వేసి మళ్ళా లెక్క పెట్టాలి. కనుక 0, 1 తరువాత వచ్చేవి 10, 11. దశాంశ పద్ధతిలో 99 ఎలాంటిదో, ద్వియాంశలో 11 అలాంటిది. కనుక ద్వియాంశలో 11 తరువాత వచ్చే సంఖ్య 100 (ఇది ‘నూరు” కాదు, ‘వంద’ కాదు. దీని పేరు ఒకటీ సున్నా సున్న.”) ఈ పద్ధతిలోనే కంప్యూటర్లు లెక్కపెడతాయని ఈ రోజులలో సర్వులకు తెలిసిన విషయమే.





వనరులు

[మార్చు]




వివిధ ప్రశ్నలు

[మార్చు]

వేమూరి గారూ!

  • మొదటి పేజీ మార్చడం గురించి నేను మీతో ఏకీభవిస్తున్నాను. వైఙాసత్యతో చర్చిస్తున్నాను. త్వరలో చేద్దాం. ఎందుకంటే మరికొన్ని సమగ్రమైన మార్పులు మొదటి పేజీలో చేయాల్సి ఉంది.
  • కాని మీరు వ్యాసం మొదలు పెట్టడానికి వేచి ఉండనవుసరం లేదు. హోమియోపతీ వైద్య విధానం - ఈ లింకు (లేదా వేరే మాట వ్రాయండి) నొక్కి వ్యాసం మొదలెట్టండి. మొదటి పేజీలో తరువాత పెడదాం.
  • టేబుల్ వగైరాలు - నాకేదో వచ్చనుకొంటే మీరు పొరపడ్డారన్నమాటే! నేను ఏదో ఒక పాత టేబుల్ కాపీ చేసి, దాన్ని మారుస్తాను. మీకు ఆసక్తి ఉంటే ఆంగ్ల వికీలో టేబుల్స్ చేయడాన్ని గురించి వ్యాసం ఉంది.
  • నిన్ననే నవీన్ Excel Tables ని వికీ టేబుల్ గా చేసే ఒక tool పంపాడు. నేనింకా ప్రయత్నించలేదు. మీ మెయిల్ అడ్రెసు ఒకసారి teluguwiki@yahoo.co.in కు పంపగలారా? లేదా ఇక్కడ వ్రాస్తే నేను చూసి వెంటనే చెరిపేస్తాను. ఆ tool మీకు పంపుతాను.

--కాసుబాబు 20:03, 13 ఏప్రిల్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

Internet కు అంతర్జాలం అనే పదం (చాలా బాగుంది) బహుళంగా వాడుతున్నారా? లేక మీరే కనిపెట్టారా? మీరు కనిపెడితే 'వీరతాడు' వేసుకోవలసిందే.--కాసుబాబు 07:21, 14 ఏప్రిల్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

-- వీరతాడు అంటే జ్ఞాపకం వచ్చింది. ఏప్రిల్ నెల సుజనరంజని చూడండి - వీరతాళ్ళ మీద వ్యాసం ఉంది. మన వికీ అవసరాలకి సరిపోతుంది. http://www.siliconandhra.org/nextgen/sujanaranjani.html

- వేమూరి The forms of Ayurvedic medicaments are:

రసం: మూలికల నుండి పిండినది రసం

పసరు: ఆకుల నుండి పిండినది

కషాయం: నీళ్ళలో వేసి మరిగించగా వచ్చినది

చూర్ణం; నూరిన ముద్ద, గుండ

తైలం: నూనె

అరిష్టం: కొద్దిగా పులియబెట్టి చేసిన సారా వంటి ద్రవం

అర్క: దిగ మరిగించగా వచ్చినది.

రసాయనం: మూలికలతో లోహాలని కాని, లవణాలని కాని, జంతుకోటి నుండి వచ్చిన పదాశ్ర్ధాలని కాని కలఅపగా వచ్చినది


భస్మం; పుఠం వేసి కాల్చగా వచ్చిన నుసి లవణం:

లేహ్యం, మోదకం, పాకం: పాకంలో వేసి వండినవి.

ధూపం: పొగ వెయ్యగా వచ్చినది.

అంజనం: కాటుక


వనరులు

[మార్చు]

వేమూరి వేంకటేశ్వరరావు, "తెలుగు భాషలో అంకెలు, సంఖ్యలు - 3" ఈమాట - అంతర్జాల పత్రిక, జూలై 1999, http://www.eemata.com/em/issues/199907 వేమూరి వేంకటేశ్వరరావు, రసగంధాయ రసాయనం, 1991, 155 పుటలు

అంకెల వ్యాసాలు

[మార్చు]

వెంకటేశ్వరరావు గారూ! అంకెల వ్యాసాలు ఆంగ్లం నుండి కాపీ చేశాను.

  • మీరు అనువాదాలు ప్రారంభించినందుకు కృతజ్ఞతలు. వీలయినప్పుడల్లా నేను కూడా ప్రయత్నిస్తాను కాని నాకు పదజాలం చాలా కష్టంగా ఉంది. 10వ తరగతి వరకు నాది తెలుగు మీడియమే కాని ఇప్పుడు పుస్తకాలేవీ నాకు అందుబాటులో లేవు.
  • ఏ వ్యాసంలోనైనా అనవుసరమైన విషయాలు, మరీ టెక్నికల్ అనిపించినవీ మీరు వెనుకాడకుండా చెరిపేస్తూ ఉండండి. ముఖ్యంగా ఆంగ్ల సంస్కృతికి పరిమితమైన విషయాలు కూడాను.
  • మీరు "పది పైన" అని వ్రాసిన విషయం ఏ వ్యాసంలో ఉండాలా అని ఆలోచిస్తున్నాను. వ్యాసం పేరు ఏమని పెడదాము?

--కాసుబాబు 12:26, 29 ఏప్రిల్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

కాసుబాబు గారూ:

మీకు చేతి నిండా పని ఉంది కనుక అంకెల మీద వ్యాసాలు నాకు ఒదిలెయ్యండి. వీలు వెంబడి అన్నీ పూర్తి చేస్తాను. మీరు adminstrative విషయాలలో నాకు సహాయం చెయ్యండి, చాలు. మీరు బొమ్మలు, టేబుల్స్ వగైరా చేర్చి అందంగా చేసిపెట్టండి.

అంతే కాదు. 10 తరువాత 1000, 1116 అనుకుంటూ వేశారు. అవి అలానే ఉండాలనే నిబంధన ఏదీ లేక పోతే ఆ groupings ని మార్చి 10 నుండి 100 దాకా అని ఒకటి, 100 పైబడి అని ఒకటీ, infinity అని ఒకటీ పెడదామని అనుకుంటున్నాను. నా దగ్గర తయారైన matter చాలా ఉంది. ఇంగ్లీషు వికీ లో ఉన్న మేటర్ కి సమాంతరంగా ఉండదు - ఇండిపెండెంట్ గా రాసింది కనుక. అంతే.

నేనూ ఇంటర్ వరకే తెలుగు చదువుకున్నాను. అదీ ఎప్పుడో 50 ఏళ్ళ క్రితం. మీ తెలుగు బాగుంది. ఆ మాటకొస్తే ఇతరులు రాసిన తెలుగులో విశేషంగా దోషాలు కనిపిస్తున్నాయి -- వేమూరి```

Documentationకు తెలుగు పదం

[మార్చు]

వేమూరి గారూ! ఒకమారు ఇక్కడ జరుగుతున్న చర్చ చూడండి. Documentationకు తెలుగు పదం సూచించగలరా? --కాసుబాబు 06:07, 24 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

అన్నవరం గురించి

[మార్చు]
ఇక్కడి సమాచారాన్ని అన్నవరం పేజిలొకి మార్చాను. వీరవేంకట సత్యనారాయణ స్వామి మహిమ ఎటువంటిదో చూడండి ఇప్పుడే బస్సులొ వస్తూ అంకుడు చెట్టు అని అనుకొంటున్నాను. ఇక్కడ మీరు ఆ విశేషాలు వ్రాశారు.--బ్లాగేశ్వరుడు 19:42, 10 నవంబర్ 2007 (UTC)
వేమూరి గారూ నమస్కారం. ఇంతకు మునుపు వికీలో తుని వ్యాసాన్ని చూసాను అది మీదే కదా ?. చాలా బాగా రాసారు. దానిని కొంత తొలగించి మార్పులు చేసాను. కాని తొలగించినది మరెక్కడైనా ఉంటే బావుంటుందని బ్లాగులో పెట్టాను మీ అనుమతి లేకుండా. ఆ వ్యాసం చాలా బావుంది, బాగా రాసారు.విశ్వనాధ్. 04:24, 11 నవంబర్ 2007 (UTC)


శీర్షిక పాఠ్యం

[మార్చు]

రాకెట్ వ్యాసం

[మార్చు]

రాకెట్ వ్యాసంలోని పదాలు కొన్ని తెలుగులోకి అనువదించడం కొంచెం కష్టంగా ఉంది. అనువాదంలో కొద్దిగా సహాయపడగలరా? రవిచంద్ర(చర్చ) 13:56, 30 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

రవిచంద్రా... రాకెట్ మీద కొంత ఉపోద్ఘాతం రాసేను. చూసి ఆ రకంగా ప్రయత్నం చెయ్యండి. మీరు రాసినది చూసి అవసరం వెంబడి మార్పులు చేసిపెడతాను - Vemurione 17:32, 4 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

నా సహాయం

[మార్చు]

మీకు కష్టంగా ఉన్న పదాల జాబితా ఇవ్వండి. అన్నింటికి వెంటనే సమాధానం ఇవ్వలేక పోవచ్చు. కానీ ప్రయత్నిస్తాను. అలాగే మా ఊరు, తుని, బొమ్మని తుని వ్యాసం ఉన్న పేజీలోకి ఎలా ఎక్కించాలో తెలిస్తే చెప్పగలరు. అలాగే కెమెస్ట్రీ లో structural formulas యూనీకోడ్ లో ఎలా రాయటమో మీకు తెలుసా?

అయ్యా వేమూరి వారు , నేను తుని పేజి లొ మార్పులు చేశాను మరియు అక్కడ తుని రైలు స్టేషను బొమ్మ అతికించాను, చూడండి , ఇంకా ఏమైనా మార్పులు చెయ్యవలెనంటే సూచించండి --బ్లాగేశ్వరుడు 15:00, 30 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]
బొమ్మలను వ్యాసాలలో ఎలా చేర్చాలో తెలుసుకోవడానికి వికీపీడియా:బొమ్మల పాఠం అనే వ్యాసాన్ని చదవండి. మీరు ఇప్పటికే ఎక్కించిన బొమ్మలు - బొమ్మ:Tuni Raiway Station.jpg మరియూ బొమ్మ:Tuni Railway Stataion 2.jpg...
structural formulasను యూనీకోడ్ లో రాయలేము, వాటిని సాధారణంగా TeX లేదా LaTeX భాషలలో (ఈ మధ్యకాలంలో SVG వాడుతున్నారు) వర్ణించి బొమ్మలుగా తయారు చేస్తారు. అయితే ఇలా structural formulas అన్నిటికీ ఇప్పటికే బొమ్మలను సృస్టించారు వాటినే మనం ఉపయోగించేసుకోవచ్చు. అయితే ఉన్న వేలకొద్దీ బొమ్మలలో మనకు కావలిసిన వెతుక్కోవడం అన్నిటికన్నా పెద్ద సమస్య. మీకు కావలిసిన బొమ్మలను వెతుక్కోవడానికి వికీ కామన్సులో రసాయన శాస్త్రం వర్గం నుండీ మొదలు పెట్టవచ్చు. __మాకినేని ప్రదీపు (+/-మా) 15:24, 30 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]
బ్లాగేశ్వరుడు, చదువరి, వేమూరి - వీరందరూ సంక్రాంతికి స్వంతవూరికి తరలివచ్చినట్లుగా ఒక్కసారి తెవికీలో దర్శనమిస్తున్నారు. మహానందం. వేమూరిగారూ! ఏలూరు వ్యాసం చూడండి. అందులో లాకుల గురించి మీరచనలనుండి తస్కరించిన కొంత భాగం ఉంది. పన్నెండు పంపుల వీధి గురించి కూడా రాద్దామని (కాపీ కొడదామని) అనుకున్నాను గాని కుదరలేదు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 18:00, 30 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

నీలిమందు

[మార్చు]

దీనిని వికీకరించటానికి దీనిలో లంకెలు సరి చెయ్యాలి. బెంగాల్, బిహార్, గాంధి వంటి మాటలకే లంకెలు ఖాళీ పేజీలని చూపిస్తున్నాయి. ఈ వ్యాసంలో లంకెలన్నీ తనిఖీ చేసి చూడవలసినదిగా ప్రార్ధిస్తున్నాను.

అంతే కాదు. నీలిమొక్క బొమ్మకి మరొక లంకె పెట్ట్టానికి బదులు ఆ బొమ్మనే ఈ వ్యాసంలో చేర్చితఏ బాగుంటుందని నా నమ్మకం. Vemurione 02:39, 1 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

హోమియోపతీ

[మార్చు]

ఈ వ్యాసం దరిదాపు పూర్తి అయింది. - ప్రస్తుతానికి Vemurione 23:38, 3 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

సహాయ అభ్యర్ధన

[మార్చు]

{{సహాయం కావాలి}}

  • రసాయనశాస్త్రం అనువాదం పూర్తి చేసేను. అనుభవం ఉన్న వారు ఎవ్వరైనా ఒక సారి చూసి, అవసరమైతే వికీకరించి, ఆశీర్వరదించండి

తప్పక చూస్తాను. ఎంత మాట వేమూరిగారూ! మిమ్ములను ఆశీర్వదించేంతవారు ఇక్కడ లేరనుకొంటాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 17:20, 3 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

నమస్సులు

[మార్చు]

వేమూరివారికి మన॰పూర్వక ప్రణామములు, మీరు తర్జుమా జేసిన 'రసాయనశాస్త్రం' చూశాను, ఆహా! రసాయనశాస్త్రాన్ని ఎంత సుళువుగా చెప్పగలిగారండి! అమోఘం, తెలుగుభాష మరియు విజ్ఞానశాస్త్రాలపై మీకున్న పటుత్వం శ్లాఘనీయం. మీరు సహాయ అభ్యర్థనలో 'ఆశీర్వాదం' అడగడం మీ గొప్పతనానికి నిదర్శనం, "ఫలాలతో నిండిన గొమ్మ ఎల్లప్పుడూ వంగియే వుంటుంది". మీ చల్లని ఆశీర్వచనాలు 'తెవికీ'కి ఎంతో అవసరం, సభ్యుడు nisar 20:36, 3 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

చిన్న సవరణ. వేమూరి గారు "తర్జుమా" చేయరు. స్వంతంగా రాస్తారు! --కాసుబాబు - (నా చర్చా పేజీ) 18:42, 4 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఈఫిల్ టవర్

[మార్చు]

తెలుగు ప్రసార మాధ్యమాల్లో దీనిని ఇలాగే వ్యవహరిస్తుండడంతో అలా పేరు పెట్టాను.ప్రజలు కూడా ఆ పేరుతోనే పరిచయముంటుంది కదా అని. అన్ని చోట్లా మారుద్దామంటారా? రవిచంద్ర(చర్చ) 06:58, 6 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఇది చాలా మంచి ప్రశ్న. ఒక పరాయి భాషలోని మాటని ఎలా ఉచ్చరించాలి అన్నది జటిలమైన ప్రశ్న. ఒకానొకప్పుడు ఇంగ్లీషు మాటలని తెలుగీకరించి వాడే వాళ్ళం. ఊ. కనిష్టీపు, బుడతగీచు, మొదలైనవి. క్రమేపీ ఇప్పుడు ఇవే మాటలని కాన్‌స్టబుల్‌ , పోర్చుగీసు అని వాడుతున్నాం. ఇప్పుడు కనిస్టీపు అంటే మనకి చదువు రాదనుకుంటారు.

కాని కొన్ని మాటలు(proper nouns)వీలయినంతవరకు మాతృ ఉచ్చారణలో ఉచ్చరించగలిగితేనే సుఖం. ఉ. అమెరికాలో ఉన్న San Jose అన్న ఊరుని 'సేన్‌ హొసే' అని పలకాలి. నిన్నరాత్రి మణిశర్మ బృందంతో వచ్చిన మిమిక్రీ ఆర్టిస్టు దీనిని 'సేన్‌ జోస్‌' అని పలికేరు. ఇది సర్వసాధారణంగా స్పేనిష్ సంప్రదాయం తెలియని వాళ్ళు చేసే తప్పు. స్పేనిష్‌లో Jose ని హొసే అని పలుకుతారు. కనుక మిమిక్రీ ఆర్టిస్టు దీనిని 'సేన్‌ జోస్‌' అని పలికినంత మాత్రాన అది సరి అవదు.

ఇంకా - Ohio ఓహియో కాదు, ఒహాయో; Kansas కన్‌సాసు కాదు, కేన్సస్‌; బ్రోచర్‌ కాదు, బ్రోషూర్‌; జిమ్మిక్‌ కాదు, గిమ్మిక్‌....


మరి మన భారతీయ మాటలని పలకలేక ఖూనీ చేసెస్తున్నారే వీళ్ళు అని మీరు పరితాపపడవచ్చు. హిమాలయాలని వీళ్ళు హిమలయాలు అంటారు - చెవిలో ఇల్లు కట్టుకుని పోరినా సరే. ఢిల్లీ ని డెల్‌హై అని కూడ అంటారు. ఇరాన్‌ ని ఎవ్వరైనా ఐరాన్‌ అని అంటే వారికి కొంచెం విద్యాగంధం తక్కువేమో అనుకుంటాను. అంతే కాని మరేమీ ప్రమాదం లేదు.


కనుక ఆలోచించండి. ఐఫిల్‌ టవర్ అంటే ప్రపంచవ్యాప్తంగా అర్ధం అవుతుంది. ఈఫిల్‌ టవర్‌ అంటే "ఏమిటీ?" అని మరో సారి అడిగినా అడుగుతారు. అంతే. మరేమీ ప్రమాదం లేదు. Vemurione 15:54, 10 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

సహాయ అభ్యర్ధన

[మార్చు]

{{సహాయం కావాలి}}

హోమియోపతీ, హోమియోపతీ వైద్యవిధానం అని రెండు పేజీలు ఉన్నాయి. ఇందులో మొదటిది ఖాళీ. ఈ పేజీని తీసేసి, రెండవ పేజీకి 'హోమియోపతీ' అని పేరు పెట్టాలి. టైటిల్‌ పేజి ని తీసెయ్యటం ఎలా? Vemurione 16:01, 10 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]


{{సహాయం కావాలి}} 1. Carbon ని కార్బన్ అనీ కర్బనం అనీ అంటున్నారు. నేను కర్బనం అని వాడి దానికి హైపర్‌ లింకు పెడితే "కర్బనం" అన్న పేజీకి వెళుతున్నాది. కాని "కార్బన్" అన్న పేజీలో మరొక వ్యాసం ఉంది. ఈ సందిగ్ధం తేల్చటం ఎలా?

2. ఇదే కోవకి చెందిన మరొక ప్రశ్న. తెలుగులో "ము" కి మదులు "సున్న" వాడటం బాగా రివాజుగా జరుగుతోంది. ము అంటే గ్రాంధికపు ఛాయలు కనిపిస్తాయి. సున్న ఉంటే వ్యావహారికం లా ఉంటుంది. ఉదా. మూలకము - మూలకం, కర్బనము - కర్బనం. ప్రపంచాన్ని మార్చ్లేము కనుక మనం ఏ విధంగా వాడినా కంప్యూటరు ఒకే చోటికి వెళ్ళేలా చెయ్యటం ఎలా? Vemurione 13:43, 11 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]


ఇది వికీలో చేరిన తరువాత నేను అడిగిన మొదటి ప్రశ్న (రామాయణము, రామాయణం గురించి - వైజాసత్య జవాబిచ్చాడు) - ఇందుకు పరిష్కారం దారిమార్పుడు పేజీలు. కర్బనం అనే పేజీలో #REDIRECT [[కార్బన్]] అని వ్రాస్తే "కర్బనం" లింకు ఆటోమాటిక్‌గా "కార్బన్" వ్యాసానికి వెళుతుంది. సామాన్యంగా వాడుక భాషకు దగ్గరగా ఉన్నందున కనీసం వ్యాసాల పేర్లకు 'సున్న' వాడడం మన పాలిసీ (గ్రామం, భారతం, దేశం - ఇలా). కానీ ఇది నామమాత్రమే. ఎక్కువ మందికి ఇది అంత అవగాహన లేదు. తప్పు వాళ్ళది కాదు. వికీ విధానాలు స్పష్టంగా ఒక చోట లేవు. అన్నీ కలగా పులగంగా ఉన్నాయి. వాటిని క్రమబద్ధీకరించడానికి ప్రయత్నం చేస్తాను. మీరు మీకు సముచితమనిపించిన విధంగా ఎగుడు లంకెలిస్తూ ఉండండి. దారి మార్పులు పేజీలు అవసరమైనట్లు చేసుకోవచ్చును --కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:03, 11 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

{{సహాయం కావాలి}}

ఇంగ్లీషు విక్కీ లో carbohydrates అన్న శీర్షిక కింద ఉన్న అనేక బొమ్మలలో ఒక దాని కింద ఈ దిగువ caption ఉంది. ఆ బొమ్మని తీసి తెలుగు విక్కీ లో నేను పని చేస్తూన్న "పిండిపదార్ధాలు" వ్యాసంలో నేను సూచించిన చోటుకి పక్కన వచ్చేలా అమర్చాలి. అక్కడే తెలుగులో caption కూడ రాసేను. "D-glucose is an aldohexose with the formula (C·H2O)6. The red atoms highlight the aldehyde group, and the blue atoms highlight the asymmetric center furthest from the aldehyde; because this -OH is on the right of the Fischer projection, this is a D sugar."

ఇది ఎప్పుడో ఒకప్పుడు నేను నేర్చుకోవాలి. కనుక నాకు నేర్పినా సరే లేక ఎవ్వరైనా అమర్చి పెట్టినా సరే. ధన్యవాదాలు.

Vemurione 23:04, 12 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]