మెండలీఫ్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
'డిమిట్రి ఇవనోవిఛ్ మెండలీఫ్'
జననం క్రీ.శ.1834 ఫిబ్రవరి, 8
రష్యాలో "వెర్నీ అరెంజ్యాని"
మరణం క్రీ.శ.1907
రష్యాలో సెయింట్ పీటర్స్‌బర్గ్‌
జాతీయత రష్యా
రంగములు రసాయన శాస్త్రము
ప్రసిద్ధి మొట్టమొదటి ఆవర్తన పట్టిక నిర్మాత

డిమిట్రి ఇవనోవిఛ్ మెండలీఫ్ (రష్యన్: Дмитрий Иванович Менделеев ) (1834 - 1907) సోవియట్ యూనియన్కు చెందిన రసాయన శాస్త్రవేత్త. ఇతడు మొట్టమొదట రసాయనిక మూలకాలతో ఆవర్తన పట్టికను ఆవిష్కరించాడు.

మెండలీఫ్ 1834 ఫిబ్రవరి 8న రష్యాలో "వెర్నీ అరెంజ్యాని" (Verhnie Aremzyani) అనే గ్రామంలో జన్మించాడు. అధ్యాపక వృత్తిని స్వీకరించి అనేక పరిశోధనలు చేశాడు. శాస్త్రజ్ఞునిగా ప్రసిద్ధి చెంది అనేక సత్కారాలు పొదాడు. 1907లో రష్యాలో సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో మరణించాడు. అతని స్మృత్యర్ధం 101 పరమాణు సంఖ్య ఉన్న మూలకానికి మెండెలీవియం అని పేరు పెట్టారు.

మెండలీఫ్ ఆవర్తన పట్టికకు ఒక రూపాంతరం - 1891లో ఆంగ్లంలోకి అనువదించబడిన ఒక పాఠ్యపుస్తకం నుండి.
విజ్ఞాన శాస్త్రానికి మెండలీఫ్ చేసిన కృషి స్మృత్యర్ధం మూలకాల పట్టికతో రూపొందిచిన ఒక శిల్పం - స్లొవేకియాలోని బ్రాటిస్లావియాలో ఉన్నది.

టీచర్‌గా ఉన్న సమయంలో మెండలీఫ్ Principles of Chemistry (1868-1870) అనే రెండు భాగాల పాఠ్య పుస్తకాన్ని వ్రాశాడు. అందులో మూలకాలను వాటి రసాయన గుణాల క్రమంలో వర్గీకరించడానికి ప్రయత్నించాడు. అలా చేసే సమయంలో అతనికి కొన్ని సంఖ్యల తరువాత అవే రసాయన గుణాలు ఆ మూలకాలలో పునరావృతమవుతున్నాయని గమనించాడు. అతని ఆవర్తన పట్టిక తయారుకు అదే నాంది..

ఆ సమయంలోనే మెండలీవ్‌తో సంబంధం లేకుండా ఇతర శాస్త్రజ్ఞులు కూడా మూలకాలను పట్టీలలో అమర్చడానికి వివిధ విధానాలు రూపొందిస్తున్నారు. అలాంటివారిలో ఒకడైన జాన్ న్యూలాండ్స్, 1865లో అష్టక నియమం ప్రచురించాడు. అయితే అందులో ఇంకా తెలియని మూలకాలకు ఖాళీ స్థలాలు అట్టిపెట్టలేదు. కొన్ని పెట్టెలలో రెండేసి మూలకాలను ఉంచాడు. మరొక శాస్త్రవేత్త లోథర్ మెయర్ 1864లో 28 మూలకాల పట్టిక ప్రచురించాడు. కాని ఇతను కూడా క్రొత్త మూలకాలను ఊహించలేదు..


మెండెలీవ్ ముందుగా ఇలాంటి పట్టిక తయారు చేసుకొన్నాడు.

Cl 35.5 K 39 Ca 40
Br 80 Rb 85 Sr 88
I 127 Cs 133 Ba 137

అదే విధమైన లక్షణాలున్న మూలకాలను పట్టికలో చేరుస్తూ ఆవర్తన పట్టిక తయారు చేశాడు. మార్చి 6, 1869మ మెండలీవ్ రష్యన్ కెమికల్ సొసైటీలో The Dependence between the Properties of the Atomic Weights of the Elements, అనే ఉపన్యాసాన్ని సమర్పించాడు. ఇందులో మూలకాలు ద్రవ్యరాశి మరియు ఋణత్వం (valence) అనే గుణాలలో ఒక క్రమ పద్ధతిని ప్రదర్శిస్తున్నాయని చర్చించాడు. అందులో అతను చెప్పిన ముఖ్య విషయాలు.

  1. మూలకాలను పరమాణు భారం (atomic mass) ప్రకారం అమర్చినట్లయితే వాటి గుణాలలో పునరుక్తి కనిపిస్తుంది.
  2. ఒకే విధమైన రసాయన గుణాలున్న మూలకాలు ఒకే విధమైన పరమాణు భారం కలిగి ఉండవచ్చును (ఉదా., Pt, Ir, Os) లేదా ఒకే విధమైన పెరుగుదల కలిగి ఉండవచ్చును.(ఉదా., K, Rb, Cs).
  3. ఈ క్రమం వాటి valencies క్రమానికి సరిపోతుంది. మరియు ఆ శ్రేణిలో వాటికి ప్రత్యేకమైన రసాయన గుణాలు ఒకేవిధంగా ఉంటాయి. ఉదా Li, Be, B, C, N, O, and F.
  4. ఎక్కువ వినియోగింపబడే మూలకాలు తక్కువ పరమాణుభారం కలిగి ఉఇంటాయి.
  5. మూలకం పరమాణు భారం దాని గుణాలను సూచిస్తుంది. అణుభారం compound body గుణాలను సూచిస్తుంది.
  6. ఈ పట్టికలో ఉన్న ఖాళీలు మరికొన్ని మూలకాలు కనుగొనబడవచ్చునని సూచిస్తున్నాయి. ఉదా: అల్యూమినియం మరియు సిలికాన్‌ల మధ్య, పరమాణుభారం 65 మరియు 75 మధ్య మరొక మూలకం ఉండాలి.
  7. ఒక మూలకం యొక్క లక్షణాలను బట్టి, దానికి ముందు వెనుకల ఉన్న మూలకాల పరమాణు భారాలను బట్టి, దాని పరమాణుభారం అంచనాను మార్చుకొనవచ్చును. ఉదాహరణకు టెల్లీరియం పరమాణు భారం 123 మరియు 126 మధ్య ఉండాలి. 128 కారాదు. (ఇక్కడ మెండెలీవ్ అంచనా తప్పింది. టెల్లీరియం పరమాణుభారం 127.6, ఇది అయొడీన్ పరమాణు భారమైన 126.9కంటే ఎక్కువ.)
  8. మూలకాల కొన్ని లక్షణాలను వాటి పరమాణు భారాలను బట్టి ఊహించవచ్చును.

ఇలా మెండెలీవ్ తన ఆవర్తన పట్టికను ప్రచురించి, ఆ పట్టిక పూర్తి చేయడానికి, అప్పటికి తెలియని అనేక మూలకాలను ఊహించాడు. కొద్ది నెలల తరువాత "మెయర్" షుమారు అలాంటి పట్టికనే ప్రచురించాడు. కనుక మెయెర్ మరియు మెండెలీవ్‌లు ఇద్దరూ ఆవర్తన పట్టిక ఆవిష్కర్తలని భావిస్తారు. కాని మెండెలీవ్ ఊహించినట్లుగా సరిగ్గా ఎకా సిలికాన్, (జెర్మానియం), ఎకా అల్యూమినియం, (గాలియం) మరియు ఎకాబోరాన్ (స్కాండియం) మూలకాలు కనుగొనడం వలన మెండలీవ్‌కు అత్యధికంగా గుర్తింపు వచ్చింది. కొందరయితే మెండలీవ్ చెప్పినట్లుగా ఇంకా చాలా క్రొత్త మూలకాలు కనుగోవడం భ్రమ అని కొట్టిపారేశారు కాని Ga (గాలియం), Ge (జెర్మానియం) మూలకాలను 1875లోను, 1886లోను సరిగ్గా మెండలీవ్ చెప్పిన ఖాళీలలో కనుగొన్నారు. [1]

మూలాలు[మార్చు]

  1. Emsley, John (2001). Nature's Building Blocks ((Hardcover, First Edition) ed.). Oxford University Press. pp. 521–522. ISBN 0-19-850340-7. 
"https://te.wikipedia.org/w/index.php?title=మెండలీఫ్&oldid=1203280" నుండి వెలికితీశారు