చర్చ:పనస పొట్టు కూర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పనస పొట్టు కూర వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2014 సంవత్సరం, 19 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


పవన్ సంతోష్ గారూ, ఈ వ్యాసంలో రాసిన తయారు చేయు విధానం వికీ విధానానికి అనుగుణంగా లేదని నా ఉద్దేశం. అయితే మిగతా విశేషాలు పనికివస్తాయి. ఆ కూర ప్రశస్తి గురించి రాయాలి. పనసను తరగడంలోని ప్రత్యేకతలు (చేతులకు నూనె రాసుకోవడం వంటివి), ఏయే ప్రాంతాల్లో ఎక్కువగా చేసుకుంటారు, పోషకవిలువలు, జనసామాన్యంలో/సాహిత్యంలో దీనికి ఉన్న చోటు ("పుస్తెలమ్మయినా పులస కూర తినాలి", "వంకాయ వంటి కూరయు" లాగా), వంటివి రాస్తే వ్యాసానికి విలువ చేకూరుతుంది. పరిశీలించగలరు. __చదువరి (చర్చరచనలు) 04:47, 19 జూలై 2018 (UTC) పనసపొట్టు కూర[ప్రత్యుత్తరం]

సరేనండీ. ఓ వారంలోపు దీన్ని సరిదిద్దుతాను. --పవన్ సంతోష్ (చర్చ) 04:55, 19 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]
బ్లాగు లింకు మూలంగా వాడారు. దానితో పాటు అందులోనుంచి కాపీ పేస్టు చేసిన సమాచారం ఏదైనా ఉంటే తొలగించాలి. రవిచంద్ర (చర్చ) 12:12, 19 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]
ఆయన తాయారు చేస్తే నేను తయారు చేశానండీ రవిచంద్ర గారూ! :-) పిండితార్థం ఏమంటే బ్లాగు మూలం ఇవ్వడం, వికీపీడియా పరిధిలో ఒదగనివి రాయడం తప్ప కాపీ చేయలేదండీ.--పవన్ సంతోష్ (చర్చ) 18:53, 21 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]