పనస పొట్టు కూర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పనస పొట్టు కూర
Panasa pattu kura.JPG
ఆవపెట్టి వండిన పనసపొట్టు కూర
మూలము
మూలస్థానంభారత దేశం
వంటకం వివరాలు
ప్రధానపదార్థాలు పనస పొట్టు
చింత పండు పేస్టు
ఆవాలు
ఆవ నూనె

పనసకాయపై ఉండే పొట్టుతో ఆవపెట్టి చేసే కూరను పనస పొట్టు కూర అంటారు. శాకాహారులలో పనస పొట్టు కూరకు గొప్ప ఆదరణ ఉంది. మంచి రుచి ఉండడమనే కారణం వల్ల కష్టభరితమైన తయారీ పద్ధతిని కూడా లెక్కచేయకుండా వండుకుంటూంటారు.[1]

పనసపొట్టు కొట్టడం[మార్చు]

పనసకాయపైన ఉండే పచ్చని పొట్టు చెక్కుతున్న దృశ్యం

లేత పనస కాయను ఎంచుకుని కోస్తారు. ఆ కోసిన పనస కాయను పొట్టు కొట్టేందుకు ఒక ప్రత్యేకమైన కత్తిని వినియోగిస్తారు. సాధారణంగా పదునైన ఊచని కాయ మధ్య గుండా దింపుతారు. ఆ ఊచ సాయంతో పట్టుకుని పనసకత్తితో కాయపైన ఉన్న పచ్చని పొట్టు చెక్కి, బయట పారేస్తారు. అనంతరం ఆ కాయను పనసకత్తితో చిన్న చిన్న ముక్కలుగా అయ్యేవరకూ కొడతారు. ఆ చిన్న చిన్న ముక్కలనే పనస పొట్టు అని వ్యవహరిస్తారు.

ప్రత్యేకత[మార్చు]

అందరూ వండుకునే కూరే అయినా శాకాహారుల ఆహారంలో పనస పొట్టు కూరకు ప్రత్యేకమైన స్థానం ఉంది. మాంసాహారులు కొన్ని రకాల చేపల కూర, కోడి కూర వంటివాటికి ఇచ్చే స్థానాన్ని శాకాహారుల ఆవపెట్టిన పనస పొట్టు కూరకు ఇస్తారని ప్రతీతి.[1] ప్రత్యేకించి ఆవపెట్టి చేసిన పనసపొట్టు కూర చాలామంది ఇష్టపడి తింటారు. మిథునం సినిమాలోనూ దీని ప్రస్తావన డైలాగుల్లో వస్తుంది.[2] ఈ కూర ప్రాశస్త్యాన్ని వివరిస్తూండేలా కవులు పద్యాలు కూడా రాశారు. [3]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 పసంద్ పనస:సూర్య దినపత్రిక:13 మార్చి 2013[permanent dead link]
  2. మూర్తి, వైదేహి. "పనసపొట్టు కూరకి ఎందుకంత డిమాండ్". కోస్తాలైఫ్. Archived from the original on 2015-07-23. Retrieved 21 జూలై 2018. Check date values in: |accessdate= (help)
  3. భళ్లమూడి, శ్రీరామశంకర ప్రసాద్. "పనసపొట్టు కూర (పద్యాలు)". ప్రతిలిపి. Retrieved 21 July 2018.[permanent dead link]