వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/జులై 1, 2018 సమావేశం
అర్జున హైదరాబాద్ సందర్శనని పురస్కరించుకొని, కొద్దిమంది ఆసక్తిగల సభ్యులతో వికీసమావేశం నిర్వహించబడింది.
వివరాలు
[మార్చు]చర్చాంశాలు
[మార్చు]- తెలుగు లిపిలో డిఎల్ఐ కేటాలాగ్
- వికీపీడియా దశ, దిశ
- భాగస్వామ్యాలు
నిర్వహణ
[మార్చు]పాల్గొన్న వారు
[మార్చు]- అర్జున
- రాజశేఖర్
- చదువరి
- పవన్ సంతోష్
నివేదిక
[మార్చు]- తెలుగు లిపిలో డిఎల్ఐ కేటాలాగ్
డిఎల్ఐ కేటలాగ్ ను తెలుగులిపిలోకి మార్చటానికి, సాఫ్ట్వేర్ ఉపయోగించిన విధం చదువరి వివరించారు. దీనికి మైక్రోసాఫ్ట్ వర్డ్ లో RTS పద్ధతిలో ఆంగ్ల లిపిలో వివరాలు సరిచేయడం ఆ తరువాత లేఖిని ద్వారా తెలుగు లిపిలోకి మార్చడం, వాటిని తనిఖీ చేసి ఇంకా చేయవలసిన మార్పులను వర్డ్ లో చేయటం మరల లేఖిని వాడడం వున్నాయి. 1000 పుస్తకాల వివరాలను 2-4 గంటల సమయం కావాలి. నేరుగా మానవీయంగా అయితే దాదాపు 60 గంటలు కావాలి. దీని ద్వారా పూర్తి నాణ్యత రాదు కాని త్వరగా చేయలేము.
ఇప్పటికే 2000 పుస్తకాల వివరాలను చదువరి తెలుగు లిపిలోకి మార్చారు. వీటిని తనిఖీ చేసి ఆర్కీవ్.ఆర్గ్ లో తాజా చేయాలి. ప్రాగ్రామ్ ద్వారా మార్చడం చదువరి చేస్తే తనిఖీ పని ఇతర సభ్యులు సహాయంతో చేయాలని తీర్మానించడమైనది.
- వికీపీడియా దశ, దిశ
వికీపీడియా ప్రస్తుత స్ఖితి మరియు భవిష్యత్తు గురించి చర్చించాము. అర్జున చూస్తే వికీ ప్రాచుర్యం చేయడానికి చేసిన ప్రయత్నాలు అంత విజయవంతం కాలేదు కాబట్టి వికీపీడియా స్వర్ణయుగం అయిపోయినట్లేనని, క్షీణ యుగం ప్రారంభమైనదని చెప్పాడు. ఆంగ్ల వికీలో ఈ యుగం 2012 ప్రాంతాల్లో ప్రారంభమైంది. ఇటీవలి వార్తలలో అడ్మిన్ ల సంఖ్య తగ్గడం కూడా చూడవచ్చు.
చదువరి నెలకి కొత్తగా 600 మంది చేరుతున్న వారినుండి క్రియాశీలక వికీపిడియన్లు పెద్దగా రావటం లేదు కాబట్టి, కొత్త వారికి మెరుగైన శిక్షణ, తోడ్పాటు వుంటే పరిస్థితులు మెరుగవవచ్చు అని అన్నారు. అనుభవం వున్న వికీపిడియన్లు కొత్తవారికి శిక్షణ తోడ్పాటు ఇచ్చి తలా నలుగురు క్రియాశీలక వికీపీడియన్లను తయారు చెయ్యడం ప్రయత్నించాలి అన్నాడు. అంతేకాక, ప్రుస్తుతం క్రియాశీలకంగా లేని వికీపీడియన్లను మరల క్రియాశీలం చేయడానికి కృషి చేయాలన్నారు.
రాజశేఖర్ వికీపీడియా పని స్వయంతృప్తికి సంబంధించినది కావున పెద్ద లక్ష్యాలు పెట్టుకోవడం అర్ధవంతం కాదని అన్నారు.
పవన్ సంతోష్ వికీపీడియన్ సముదాయంలో కేవల మార్పుల పై ధ్యాసని, మంచి వ్యాసం వైపు మార్చగలగటానికి కృషి జరుగుతుంది ఇది మంచిపరిమాణం అన్నారు.ఆంగ్ల వికీపీడియాలో అనుభవం కలవారు తెలుగు లో కొంత కృషి చేసి తగిన గుర్తింపు పొందక మరల ఆంగ్ల వికీపీడియాకి వెళ్లారని చెప్పారు. తెలుగు వికీలో మంచి వ్యాసం గుర్తింపులు లేవు కాబట్టి, ఆ దిశగా కృషి చేయడం మంచిదన్నారు.
మంచి వ్యాసం లక్షణాల జాబితా నిర్ణయించి మరింత మందిని వ్యాసాలను మంచి వ్యాసాలుగా చేయటానికి కృషి చేయాలని అన్నారు. వికీ ప్రాజెక్టులో ఇప్పటికే మంచి అయ్యే వ్యాసాల లక్షణాలున్నాయన వాటిని మెరుగుపరచి బాబితా గా చేయటానికి సహాయం చేయవలసిందిగా కోరారు.
- భాగస్వామ్యాలు
పవన్ ప్రస్తుతం కల భాగస్వామ్యాలను ఒక దశకు చేర్చడానికి జరుగతున్న పని ని వివరించారు. తెలంగాణ ప్రభుత్వానికి బొమ్మలను CC-BY హక్కులతో విడుదల చేయడానికి ప్రయత్నిస్తామన్నారు.
చిత్రమాలిక
[మార్చు]-
సమావేశంలో సభ్యులు
-
సమావేశంలో సభ్యులు