Jump to content

వికీపీడియా:మంచి వ్యాసం ప్రమాణాలు

వికీపీడియా నుండి
(వికీపీడియా:మంచివ్యాసం ప్రమాణాలు నుండి దారిమార్పు చెందింది)
ప్రధాన పేజీచర్చప్రతిపాదనలుపునస్సమీక్షసూచనలుప్రమాణాలునివేదికసహాయ కేంద్రం

మంచి వ్యాసం అనేది మంచి వ్యాసం ప్రమాణాలను అందుకున్న సంతృప్తికరమైన వ్యాసం. అది మంచి వ్యాసం అయ్యేనాటికి విశేష వ్యాసం ప్రమాణాలను అందుకుని ఉండదు. మంచి వ్యాసం ప్రమాణాలు చక్కని వ్యాసాన్ని ఎంచేందుకు పనికివచ్చేలా వుంటాయి తప్ప, అత్యుత్తమ స్థాయి విశేష వ్యాసపు ప్రమాణాలంత నిర్దుష్టంగా ఉండవు.

ప్రమాణాలు

[మార్చు]

తక్షణ వైఫల్యం (ఫెయిల్)

[మార్చు]

ఏదైనా వ్యాసం ఈ క్రింద నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా లేకుంటే, సదరు వ్యాసాన్ని విపులంగా సమీక్షించకుండానే వెనువెంటనే విఫలం చెయ్యవచ్చు. అయితే అలా చేసి తీరాలనేమీ లేదు.

  1. మంచి వ్యాసానికి ఉండాల్సిన ఆరు ప్రమాణాల్లో ఏ ఒక్కదానినైనా అందుకోలేనంత దూరంలో వ్యాసం ఉంటే
  2. కాపీహక్కుల ఉల్లంఘనలు ఉంటే
  3. {{శుద్ధి}}, {{పక్షపాతం}}, {{unreferenced}} మొదలైన శుద్ధి మూసలు ఉండకూడదు. శుద్ధి చేయాల్సిన అవసరం ఉండకూడదు. అలాగే {{citation needed}}, {{clarify}}, తదితర నిర్వహణ ట్యాగులు పెద్ద సంఖ్యలో ఉండకూడదు. ({{QF-tags}} కూడా చూడండి.)
  4. వ్యాసంలో దిద్దుబాటు యుద్ధాలు జరుగుతూ, వ్యాసం స్థిరంగా లేకుండా పోతే

పై ప్రమాణాల ప్రకారం విఫలం కాని వ్యాసాలు పూర్తిస్థాయి సమీక్షకు అర్హత కలిగినవి. పూర్తిస్థాయి సమీక్షలో వ్యాసాన్ని విఫలం చేయడానికి ముందు, సమీక్షకులు తాము సూచించిన తప్పులను సరిచేసి వ్యాసాన్ని అభివృద్ధి చేసి మంచి వ్యాసంగా చేసేందుకు ప్రతిపాదకులకు అవకాశం ఇవ్వవచ్చు.

ఆరు మంచి వ్యాసం ప్రమాణాలు

[మార్చు]

ఒక మంచి వ్యాసం అన్నది—

  1. చక్కగా రాసినదై ఉండాలి:
    1. వ్యాసంలోని వచనంలో అక్షరదోషాలు, వ్యాకరణదోషాలు ఉండకూడదు.;
    2. అది శైలి మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండాలి..[1]
  2. మౌలిక పరిశోధన లేకుండా నిర్ధారించదగి ఉండాలి:[2]
    1. దానిలో అన్ని మూలాల జాబితా, వ్యాసం లేఅవుట్‌కి అనుగుణంగా ఉండాలి;[3]
    2. వ్యాసంలో వాక్యం పక్కనే ఇచ్చే మూలాలు వికీపీడియా:నమ్మదగ్గ మూలాల నుంచి ఉండాలి. నేరుగా ప్రస్తావిస్తున్న కొటేషన్లు, ప్రచురితమైన అభిప్రాయాలు, సహజ విరుద్ధమైన అంశాలు, వివాదాస్పదమైన వాక్యాలు వంటి ప్రశ్నించదగ్గ, సందేహించదగ్గ అంశాలు, జీవించి ఉన్న వ్యక్తులకు సంబంధించిన వివాదాస్పదమైన సమాచారం మరీ ముఖ్యంగా ఈ నమ్మదగ్గ మూలాలతో సమర్థించాలి.;[4]
    3. దానిలో మౌలిక పరిశోధనలు లేకుండా ఉండాలి;
    4. కాపీహక్కుల ఉల్లంఘనలు గాని, గ్రంథచౌర్యం గానీ ఉండకూడదు..
  3. విస్తృత పరిధి కలిగి ఉండాలి:
    1. వ్యాస విషయానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను పరామర్శించాలి;[5] and
    2. అనవసరమైన అంశాల జోలికి పోకుండా వ్యాస విషయంపైననే దృష్టిని నిలిపి ఉంచాలి (en) (వికీపీడియా:సారాంశం శైలి (en) చూడండి).
  4. తటస్థం: నిష్పాక్షికంగా ఉంటూ, వివిధ దృక్కోణాలకు తగు విలువను ఇస్తూ చూపించాలి..
  5. స్థిరత్వం: దిద్దుబాటు యుద్ధాల వలన గాని, పాఠ్య సంబంధ వివాదాల వలన గానీ వ్యాసంలో అనునిత్యం మార్పుచేర్పులు జరుగుతూ ఉండరాదు..[6]
  6. సచిత్రం: వీలైనంతవరకు బొమ్మలు, వీడియో (en), ఆడియో (en) వంటివి వాడాలి.:[7]
    1. మీడియాకు వాటి కాపీహక్కుల స్థితికి సంబంధించిన వికీపీడియా:బొమ్మల కాపీహక్కు పట్టీల జాబితా ఉండాలి. అలాగే, స్వేచ్ఛగా అందుబాటులో లేని (en) మీడియాకు సముచిత వినియోగపు హేతుబద్ధతను (en) సూచించాలి.;
    2. మీడియా, విషయానికి సంబంధించినవై (en) ఉండాలి. వాటికి సముచితమైన వ్యాఖ్యలు (en) ఉండాలి.

నోట్స్

[మార్చు]
  1. మంచి వ్యాసం వికీపీడియా:శైలి లోని ఇతర అంశాలకు అనుగుణంగా ఉండి తీరాలన్న నియమమేమీ లేదు.
  2. వికీపీడియా:మంచి వ్యాసాలను సమీక్షించడం ఇలా చెబుతోంది: "సమీక్షకుడికి మూలంలోని కంటెంటు మొత్తం అందుబాటులో ఉండాలి. ఆ కంటెంటును పరిశీలించి వ్యాసం ఆ కంటెంటును ప్రతిఫలిస్తోందో లేదో నిర్ధారించగలిగే నైపుణ్యం సమీక్షకుడు కలిగి ఉండాలి. అయితే సాధారణంగా ఇది నెరవేరదు. కనీస స్థాయిలో, ఉదహరించిన మూలాలు విశ్వసనీయమైనవో కాదో పరిశీలించండి (ఉదాహరణకు, బ్లాగులు విశ్వసనీయమైనవి కాదు). అలాగే మీకు అందుబాటులో ఉన్న మూలాలు వ్యాసపు కంటెంటును బలపరుస్తున్నాయని నిర్ధారించండి (ఉదాహరణకు, ఇన్‌లైన్ ఉల్లేఖనలు వ్యాసంలో చెప్పిన దాన్ని బలపరిచే మూలాలను సూచించాలి). గ్రంథచౌర్యం చెయ్యరాదు (ఉదాహరణకు, ఉన్నదున్నట్టుగా ఎత్తి రాయడమనేది సముచితమైన చోటనే, అదీనూ కొటేషన్ మార్కుల మధ్యనే రాయాలి.)."
  3. కేవలం URL మాత్రమే ఇచ్చి ఉంటే తప్ప ఇతర డెడ్ లింకులను నిర్ధారణా యోగ్యంగానే పరిగణిస్తారు. గ్రంథసూచీకి సంబంధించిన ప్రతీ అంశాన్ని చూపించాల్సిన అవసరం లేదు గానీ, మూలాన్ని నిర్ధారించుకునేందుకు సమీక్షకుడికి అవసరమైనంత సమాచారం మాత్రం ఇవ్వాలి.
  4. ఇన్-లైన్ ఉల్లేఖనలను బ్రాకెట్లలో చూపించడం గానీ, పాదపీఠిక రూపంలో గానీ మూలాలను ఇవ్వవచ్చు. కానీ ఒకే వ్యాసంలో రెండు రకాలనూ వాడకుండా ఉంటే మంచిది. ఇన్-లైన్ ఉల్లేఖనలన్నీ ఒకే శైలిలో ఉండాలి
  5. విశేష వ్యాసాలకు ఆవశ్యకమైన "సమగ్రత"తో పోలిస్తే "విస్తృత పరిధి" చాలా చిన్నది. చిన్న వ్యాసాలకు, ప్రతీ ముఖ్యమైన అంశాన్నీ, వివరాన్నీ పొందుపరచని వ్యాసాలకూ, విస్తారమైన విషయానికి సంబంధించి స్థూలదృష్టికీ వీటిలో చోటుంది.
  6. దుశ్చర్యలను తిప్పికొట్టడం, కంటెంటును విలీనం చెయ్యడం లేదా విడగొట్టడం, సమీక్షకుల సూచనల మేరకు చేసే మార్పుచేర్పులు - ఇవి "స్థిరత్వ" షరతుల కిందికి రావు. స్థిరత్వం లేని వ్యాసాలను తప్పించవచ్చు లేదా కొన్నాళ్ళపాటు ఆపి ఉంచవచ్చు.
  7. మీడియా కలిగి ఉండటం ఆవశ్యకమేమీ కాదు. అయితే, వ్యాస విషయానికి ఉచితమైన మీడియా అందుబాటులో ఉంటే, అటువంటి మీడియాను వ్యాసంలో చేర్చాలి.