Jump to content

వికీపీడియా:మంచి వ్యాసాలను సమీక్షించడం

వికీపీడియా నుండి
Symbol for good article candidates
Symbol for good article candidates

మంచి వ్యాసాలు రచనా శైలి, వాస్తవాల ఖచ్చితత్వం, విస్తృత పరిధి, స్థిరత్వం, బొమ్మలను సరిగా ఉపయోగించడం వంటి అంశాలలో కొన్ని కనీస నాణ్యతా ప్రమాణాలను కలిగి ఉంటాయి. ఈ మార్గదర్శక పేజీ ఈ ప్రమాణాల పరంగా ఒక వ్యాసాన్ని న్యాయంగా సమీక్షించడం ఎలాగన్నది సూచిస్తుంది. తద్వారా సమీక్షిస్తున్న వ్యాసాన్ని మంచి వ్యాసంగా నిర్ణయించవచ్చా అన్న అంశంపై సమీక్షకులు నిర్ణయించగలుగుతారు.

సమీక్ష పద్ధతి గురించి

[మార్చు]

మంచి వ్యాసం పద్ధతి సులువైనది, ఇది ఉద్దేశపూర్వకంగా చేసినదే. ఎవరైనా ఒక వ్యాసాన్ని ప్రతిపాదించవచ్చు, (రానున్న రెండు పేరాలను అనుసరిస్తూ) నమోదైన వాడుకరులు ఎవరైనా సమీక్షించవచ్చు: ఓటింగు, ఏకాభిప్రాయం, కమిటీలు అవసరం లేదు.[1]

ఈ పద్ధతి సమీక్షకుని చిత్తశుద్ధి మీద ఆధారపడి ఉంది. సమీక్షకులు సాధారణంగా తాము సమీక్షిస్తున్న వ్యాసాల్లో చెప్పుకోదగినంత కృషిచేసినవారు కాకూడదు, వారు వ్యాసం మంచి వ్యాసం ప్రమాణాలు అందుకుందా అన్న అంశంపై దృష్టి కేంద్రీకరించాలి. ఒక వ్యాసం అత్యుత్తమమైనదిగా ఎలా మలచాలన్నదానిపై సమీక్షకుని నమ్మకాలు కానీ, సమీక్షకుడు/రాలు తానైతే ఎలా రాసేవారన్నది కానీ, ఆ అంశంపై వ్యక్తిగతంగా తన అభిప్రాయాలు, విశ్వాసాలు, వాదాలు కానీ సమీక్షకులను ప్రభావితం చేయకూడదు. [2]

  1. ఈ పద్ధతిలో సమీక్షకుడు/సమీక్షకురాలు ఒకరు అవసరం. ప్రతిపాదించినవారు స్వయంగా వారి వ్యాసాలను సమీక్షించరాదు. సమీక్ష జరిగి, అందులో సఫలం అయ్యేవరకూ వ్యాసాలను మంచి వ్యాసాలుగా నిర్ణయించలేం.
  2. This is a particular consideration for articles within the scope of a WikiProject where the reviewer is an active member. Sometimes it is helpful for an article to have an expert reviewer, but on other occasions it is preferable that the reviewer is not too close to the topic.