వికీపీడియా:విశేష వ్యాసం లక్షణాలు
స్వరూపం
ఒక విశేష వ్యాసం మన అత్యుత్తమ కృషికి అద్దంపట్టే ఉదాహరణగా, రచనాశైలి, వ్యక్తీకరణ, మూలాలు ఇవ్వడం వంటివాటిలో ప్రొఫెషనల్ స్థాయి నాణ్యతతో విశిష్టంగా నిలుస్తుంది. అంతేకాక అన్ని వికీపీడియా వ్యాసాలకూ వర్తించే పాలసీలను అందుకోవడం విషయంగా చూస్తే, దానికీ ఈ క్రింది లక్షణాలు ఉండాయలి.
- విశేషవ్యాసం—
- చక్కగా వ్రాసినది: దాని వచనం ఆకట్టుకునేదిగా, ఇంకా చెప్పాలంటే అపురూపంగానూ, ప్రొఫెషనల్ స్థాయిని అందుకునేదిగానూ ఉండాలి;
- సమగ్రమైది: సంబంధించిన ముఖ్యమైన వాస్తవాలు, వివరాలు వదిలిపెట్టదు, విషయాన్ని దాని నేపథ్యంతో సహా అర్థంచేసుకునేందుకు ఉపకరిస్తుంది.;
- బాగా-పరిశోధించబడింది: విషయానికి సంబంధించిన సాహిత్యాన్ని పరిపూర్ణంగా అవలోకించి, ఆ సాహిత్యాన్ని కొద్దిలో ప్రతిబింబించేది. వ్యాసంలో ప్రతిపాదించిన విషయాలు అత్యుత్తమమైన నమ్మదగ్గ మూలాల నుంచి స్వీకరింపబడి, పరిశీలించి ధృవీకరించదగ్గవి అయివుండి, అవసరమైనచోట ఇన్లైన్ సోర్సులతో సమర్థింపబడివుండాలి;
- తటస్థమైనది: దృక్కోణాలను న్యాయంగా, నిష్పాక్షికంగా ప్రదర్శించాలి. మరియు
- స్థిరమైనది: వికీపీడియా ఎడిట్ వార్స్ ఆ వ్యాసంలో నడుస్తూండరాదు, అలాగే ఆ వ్యాసంలోని విషయం లెక్కించదగ్గ స్థాయిలో రోజురోజుకీ మారుతూండకూడదు, కేవలం విశేషవ్యాసంగా గుర్తించే క్రమంలో తప్ప.
- అది వికీపీడియా శైలి మార్గదర్శకాలను పాటించివుండాలి, ఈ కింది నిబంధనలతో సహా—
- లీడ్: క్లుప్తంగా స్వీకరించిన అంశంలోని సారాంశాన్ని కలిగివుండి, తర్వాత రాబోయే విభాగాల్లో విశదీకరించిన అంశాలకై పాఠకుణ్ణి సంసిద్ధపరిచే లీడ్ సెక్షన్‌తో కూడివుండాలి;
- తగిన నిర్మాణం: ఓ క్రమానుగతమైన విభాగపు శీర్షికలు ఎక్కువ విభాగాలుగా కాకుండా సరైన విషయసూచికతో; మరియు
- స్థిరమైన సైటేషన్లు: 1cలో వివరించినట్టుగా అవసరమైనచోట, స్థిరమైన నిర్మాణంలో చేసిన ఇన్లైన్ సైటేషన్లు పాదసూచికలు (<ref>వెల్చేరు 2007, పే. 1.</ref>)కానీ హార్వర్డ్ రిఫరెన్సింగ్ విధానంలో కానీ (Smith 2007, p. 1)—చేర్చాల్సిన మూలాల నిర్మాణం గురించి తెలుసుకునేందుకు చూడండి మూలాలను ఉదహరించడం. సైట్ మూసలు వినియోగించాలన్న నియమేమీ లేదు.
- మీడియా. ఆ వ్యాసంలో బొమ్మలు మరియు ఇతర మీడియా, అవసరమైనచోట, క్లుప్తమైన కాప్షన్‌తో, మరియు ఆమోదయోగ్యమైన కాపీరైట్ స్థితి. చేర్చిన బొమ్మలు బొమ్మలు వాడే విధానానికి అనుగుణంగా ఉండాలి. ఉచితం కాని బొమ్మలు లేదా మీడియా ఉచితం కాని సమాచారం చేర్చేందుకు ఏర్పరిచిన విధానాన్ని అనుసరించి వుండాలి, అలాగే తగిన వివరాలు చేర్చివుండాలి.
- పొడవు. అది ప్రధానమైన అంశంపై దృష్టి కేంద్రీకరించి అనవసరమైన సూక్ష్మవివరాల జోలికి వెళ్ళదు మరియు సారాంశం శైలిని అనుసరిస్తుంది.