వికీపీడియా:డిజిటల్ మాధ్యమాల్లో తెలంగాణ సాహిత్యం, కళలు, సంస్కృతి, పండుగలు - సదస్సు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సదస్సు ప్రారంభోత్సవం

బతుకమ్మ పండగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో అక్టోబర్ 12,13 తేదీల్లో "డిజిటల్ మాధ్యమాల్లో తెలంగాణ సాహిత్యం, కళలు, సంస్కృతి, పండుగలు" అనే అంశంపై సదస్సు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వమైన తెలుగు వికీపీడియాను అత్యంత ఉపయోగకరమైన డిజిటల్ మాధ్యమంగా గుర్తించి, డిజిటల్ రంగానికే విశిష్టమైన వికీపీడియా ద్వారా తెలుగులో స్వేచ్ఛా విజ్ఞాన విస్తరణకు కృషిచేస్తున్న వారిని ఇదే సదస్సులో గౌరవించుకోవాలని సదస్సు నిర్వాహకులు ఆశిస్తున్నారు. కార్యక్రమంలో పలు భాష సాంస్కృతిక శాఖ ప్రచురణలను స్వేచ్ఛా నకలు హక్కుల్లోకి విడుదల చేయడం, తెలుగు వికీపీడియా, తెలుగు వికీసోర్సు, వికీడేటా వంటి ప్రాజెక్టుల గురించి అవగాహన పెంపొందించడం వంటి కార్యకలాపాలు చేపడతారు. అంతేకాకుండా, డిజిటల్ మాధ్యమాల్లో తెలుగు, సాంకేతిక తెలుగు మరియు తెలంగాణ సాహిత్యం, సంస్కృతి, కళలు వంటి అంశాలపై పత్ర సమర్పణలతోపాటూ వికీ ప్రాజెక్టులకు సంబంధించి సదస్సులో పాల్గొన్న వారికి అవగాహన కలిపించడం జరుగుతుంది.


తేదీ - స్థలం

[మార్చు]
స్వేచ్ఛా నకలు హక్కుల్లో భాషా సాంస్కృతిక శాఖ ప్రచురించిన పలు పుస్తకాల విడుదల
  • తేది: 12,13 అక్టోబర్, 2018
  • స్థలం: సమావేశ మందిరం, మొదటి అంతస్తు, రవీంద్ర భారతి, హైదరాబాదు

సమయం

[మార్చు]
  • ఉ. గం. 10.00 నుండి సా. గం. 5.00 వరకు

కార్యక్రమ వివరాలు

[మార్చు]

నిర్వహణ సంస్థ/లు

[మార్చు]
  1. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ
  2. సీఐఎస్-ఏ2కె

నిర్వాహకులు

[మార్చు]
  1. ప్రణయ్‌రాజ్ వంగరి
  2. పవన్ సంతోష్

హాజరవడానికి ఆసక్తి కల సభ్యులు

[మార్చు]
  1. పవన్ సంతోష్ (చర్చ)
  2. Ajaybanbi (చర్చ) 11:57, 2 అక్టోబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
  3. రహ్మానుద్దీన్ (చర్చ) 12:03, 2 అక్టోబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
  4. కట్టా శ్రీనివాస్ (చర్చ) 12:24, 2 అక్టోబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
  5. వాడుకరి:Nrgullapalli (Nageswara Rao Gullapalli)
  6. ఆదిత్య పకిడే)
  7. Kasyap (చర్చ) 15:11, 2 అక్టోబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
  8. B.K.Viswanadh (చర్చ)
  9. స్వరలాసిక (చర్చ) 11:15, 4 అక్టోబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
  10. Pranayraj Vangari (Talk2Me|Contribs) 18:26, 4 అక్టోబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
  11. --శ్రీరామమూర్తి (చర్చ) 16:24, 7 అక్టోబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
  12. T.sujatha (చర్చ)
  13. --యర్రా రామారావు (చర్చ) 16:38, 7 అక్టోబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
  14. YVSREDDY (చర్చ) 06:14, 11 అక్టోబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
  15. ఎల్లంకి భాస్కరనాయుడు. Bhaskaranaidu (చర్చ) 17:25, 12 అక్టోబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
  16. --Rajasekhar1961 (చర్చ) 03:07, 13 అక్టోబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>

నివేదిక

[మార్చు]

వనరులు

[మార్చు]

చిత్రమాలిక

[మార్చు]

వార్త పత్రికల కథనాలు

[మార్చు]

12.10.2018

[మార్చు]

"అందరికీ విజ్ఞానం అన్న స్వప్నాన్ని డిజిటల్ మాధ్యమాలు సాకారం చేస్తున్నాయి"

  • భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ

ప్రపంచంలోని అందరికీ స్వేచ్ఛగా విజ్ఞానం అందడం అన్నది ఎందరో తత్త్వవేత్తలకు, మహనీయులకు చరిత్రలో ఓ స్వప్నంగా మిగిలిపోయినా, అంతర్జాలంలో ప్రారంభమైన వికీపీడియా ఉద్యమం ఆ స్వప్నాన్ని డిజిటల్ సాంకేతిక సాయంతో సాకారం చేస్తున్నదని తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ పేర్కొన్నారు. భాషా సాంస్కృతిక శాఖ, డిజిటెల్ తెలంగాణ సంయుక్త ఆధ్వర్యంలో డిజిటల్ మాధ్యమాల్లో తెలంగాణ సంస్కృతి, భాష, సాహిత్యం, పండుగలు అంశంపై రవీంద్రభారతిలో నిర్వహిస్తున్న రెండురోజుల సదస్సులో భాగంగా మొదటి రోజున మామిడి హరికృష్ణ ప్రసంగించారు. కార్యక్రమంలో భాగంగా తెలంగాణ సంస్కృతి, భాష, సాహిత్యం, పండుగలు డిజిటల్ మాధ్యమాల్లో ప్రతిబింబిస్తున్న తీరును వివరిస్తూ పలువురు వక్తలు పత్ర సమర్పణలు చేశారు. కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ ప్రసంగిస్తూ తెలంగాణ ప్రాంతంలో లభించిన చారిత్రక ఆధారాలు చరిత్రనే తిరగరాయగలిగిన సాక్ష్యాలు ఇస్తున్నాయని, అలా చేయాలంటే చెదురుమదురుగా జరుగుతున్న తెలంగాణ చరిత్ర అన్వేషణ మరింతగా డిజిటల్ మాధ్యమాల ద్వారా ఒక త్రాటిపైకి తీసుకురావాలని అన్నారు. తెలంగాణ చరిత్ర పరిశోధకుడు పకిడె అరవింద్ ఆర్య మాట్లాడుతూ వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన శివనగర్ లోని మెట్లబావి అన్న గొప్ప చారిత్రక కట్టడం ప్రమాదకరమైన పరిస్థితిలో ఉండగా ఫేస్ బుక్ ద్వారా తాము ఉద్యమించామని, దానికి స్పందించిన నాటి జిల్లా కలెక్టర్ కాట ఆమ్రపాలి పది లక్షల రూపాయలతో మెట్లబావిని పరిరక్షించి, సుందరీకరించి పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దడం వంటి సంఘటనలు డిజిటల్ మీడియా బలాన్ని చాటిచెప్తున్నాయి అన్నారు. కార్యక్రమ నిర్వాహక బృందంలోని ప్రణయ్ రాజ్, పవన్ సంతోష్, అజయ్ బండి మాట్లాడుతూ తెలుగు వికీపీడియా, ఫేస్ బుక్ పేజీలు, ఇ-పత్రికలు వంటి అంతర్జాల వేదికలపై భాష, సంస్కృతుల పరిరక్షణకు జరుగుతున్న కృషిని చాటిచెప్పేలా సదస్సులో సమర్పించిన పత్రాలతో గ్రంథాన్ని వెలువరించనున్నట్టు తెలిపారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ పరిశోధక విద్యార్థినులు భారతి, ప్రియాంక, వే టు విలేజ్ సీఈవో సాయి వికాస్ తదితరులు పత్ర సమర్పణలు చేశారు. కార్యక్రమంలో తెలుగు వికీపీడియా, కొత్త తెలంగాణ చరిత్ర బృందం వంటి డిజిటల్ మాధ్యమాల స్వచ్ఛంద కార్యకర్తలు పాల్గొన్నారు.[1][2]

వీరు ఫోటో వికీపీడియన్లు

  • వందలాది ఫోటోల ద్వారా విజ్ఞానాన్ని, సంస్కృతిని భద్రపరిచారు
  • కృషిని అభినందిస్తూ వేడుక చేసిన వికీపీడియన్లు

ఒకరు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్, మరొకరు చరిత్ర, సంస్కృతులను కెమెరాలో భద్రపరిచే విద్యార్థి. కానీ ఇద్దరిదీ ఒకే ప్రవృత్తి. తాము తీసిన విజ్ఞానదాయకమైన ఫోటోలను వికీమీడియా కామన్సు ద్వారా ప్రపంచవ్యాప్తంగా వికీపీడియాలకు బహుమతిగా అందించారు. అది కూడా ప్రతీ రోజూ ఒక్కొక్క ఫోటో చొప్పున వందరోజులు వంద ఫోటోలు చేర్చినది ఒకరైతే, దాదాపు సంవత్సరం నుంచీ రోజుకొక ఫోటో చేరుస్తున్నది మరొకరు. ఒడిశాకు చెందిన వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ శివకుమార్, వరంగల్ పట్టణానికి చెందిన విద్యార్థి ఆదిత్య పకిడెలు చేస్తున్న ఈ కృషిని శుక్రవారం వికీపీడియన్లు కేక్ కోయించి వేడుకగా అభినందించారు. రవీంద్రభారతిలో జరుగుతున్న డిజిటల్ మాధ్యమాల్లో తెలంగాణ సాహిత్యం, కళలు, సంస్కృతి, పండుగలు సదస్సు సందర్భంగా ఈ వేడుక జరిగింది. శివకుమార్, ఆదిత్యల కృషిని ఈ సందర్భంగా తెలుగు వికీపీడియన్లు డాక్టర్ రాజశేఖర్, యర్రా రామారావు, భాస్కరనాయుడు, శ్రీరామమూర్తి, సుజాత, అహ్మద్ నిసార్, వైవిఎస్ రెడ్డి, అజయ్ బండి, గుళ్ళపల్లి నాగేశ్వరరావు ప్రశంసిస్తూ మాట్లాడారు. ఈ వేడుకను నిర్వాహకులు, వికీపీడియన్లు ప్రణయ్ రాజ్, పవన్ సంతోష్, కశ్యప్ నిర్వహించారు. ఈ సందర్భంగా తనకు వికీమీడియా కామన్సును పరిచయం చేసి ఫోటోలను చేర్చేలా ప్రోత్సహించిన పవన్ సంతోష్, ప్రణయ్ రాజ్ లకు శివకుమార్ తాను తీసిన అరుదైన ఛాయాచిత్రాలను బహూకరించారు.

13.10.2018

[మార్చు]

"ప్రజలకై రూపొందిన పుస్తకాలు ప్రజలకే అంకితం"

  • భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ
  • స్వేచ్ఛా నకలు హక్కుల్లో భాషా సాంస్కృతిక శాఖ ప్రచురించిన పలు పుస్తకాల విడుదల
  • తెలుగు వికీపీడియన్లకు సత్కారం

ప్రజల కోసం తమ శాఖ ద్వారా రూపొందించిన పుస్తకాలను స్వేచ్ఛా నకలు హక్కుల్లో ఎవరైనా హాయిగా వాడుకునేందుకు వీలుగా కాపీహక్కులు విడుదల చేస్తున్నామని, ఈ పుస్తకాలన్నిటినీ ఈ విధంగా జాతికే అందిస్తున్నామని భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తెలిపారు. తెలంగాణ తేజో మూర్తులు, కళా తెలంగాణం, స్మర నారాయణీయం, కొత్తసాలు, తొలిపొద్దు, పటం కథలు, ఆకుపచ్చని పొద్దుపొడుపు వంటి గ్రంథాలను, 36 మంది తెలంగాణ తేజోమూర్తుల వర్ణచిత్రాలను స్వేచ్ఛా నకలు హక్కుల్లో విడుదల చేయడం ద్వారా ఎవరైనా వాటిని వినియోగించుకోవడానికి, పంచుకోవడానికి అవకాశం లభిస్తుందని సదస్సు నిర్వాహకుడు, తెలుగు వికీపీడియన్ ప్రణయ్‌రాజ్ సంతోషం వ్యక్తం చేశారు. వీటిని తెలుగు వికీసోర్సు ద్వారా అందరికీ అందుబాటులోకి తెస్తామని తెలుగు వికీపీడియన్ డాక్టర్ రాజశేఖర్ పేర్కొన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, డిజి"టెల్" తెలంగాణ సంయుక్తాధ్వర్యంలో డిజిటల్ మాధ్యమాల్లో తెలంగాణ సాహిత్యం, సంస్కృతి, కళలు, పండుగలు సదస్సు ఆఖరు రోజున భాషా సాంస్కృతిక శాఖ ప్రచురించిన పలు పుస్తకాలను స్వేచ్ఛా నకలు హక్కుల్లో విడుదల చేశారు. తెలుగు వికీపీడియా ద్వారా దాదాపు 13 వేల పైచిలుకు తెలంగాణ గ్రామాల వ్యాసాలను సర్వాంగ సుందరంగా విద్య వైద్యం ఆరోగ్యం మొదలైన సమాచారంతో పాటు జిల్లాల పునర్విభజన ప్రకారం ఖచ్చితమైన వివరాలతో పూర్తిచేశామని తెలుగు వికీపీడియన్ యర్రా రామారావు పేర్కొన్నారు. గ్రామగ్రామం నుంచి గుడినో, బడినో, మరేదైనా ప్రదేశాన్నో ఫోటో తీసి వికీమీడియా కామన్స్ ద్వారా అందిస్తే ఆయా గ్రామాల్లో ఫోటోలు కూడా చేరుస్తామన్నారు. సదస్సు నిర్వాహక బృంద సభ్యుడు, తెలుగు వికీపీడియన్ పవన్ సంతోష్ మాట్లాడుతూ గ్రామాల పేర్లపై శాస్త్రీయమైన రచనల ఆధారంగా గ్రామ వ్యాసాల్లో సమచారం చేరుస్తామని, ప్రధానమైన ఉద్యమాలు, చారిత్రక సంఘటనల్లో ఆయా గ్రామాలు పాలుపంచుకున్న తీరును వివరించే పరిశోధన రచనల ఆధారంగా గ్రామాల్లో సమాచారం చేర్చే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. డిజిటల్ తెలుగు ఉద్యమకారుడు వీవెన్ మాట్లాడుతూ టీవీ మీద మనకు కనిపించే మెనూ నుంచి కార్ డ్యాష్‌బోర్డుల్లో కనిపించే అంశాల వరకూ సమస్తం తెలుగులోనే వచ్చిననాడే, ప్రతీ తెలుగువాడూ ఏటీఎంతో సహా ప్రతీ డిజిటల్ అంశాన్నీ తెలుగులో వినియోగించుకోగలిగిన నాడే మనకు నిజమైన డిజిటల్ విప్లవం వస్తుందని చెప్పారు.

తెలుగు స్వేచ్ఛా విజ్ఞాన రచయితలకు సత్కారం ఈ సందర్భంగా తెలుగు స్వేచ్ఛా విజ్ఞానమైన వికీపీడియా, ఇతర సోదర ప్రాజెక్టుల్లో స్వచ్ఛందంగా కృషిచేస్తున్న పలువురు వికీపీడియన్లను సత్కరించారు. తెలుగు వికీపీడియన్లు విశ్వనాథ్.బి.కె., రహ్మానుద్దీన్, మీనాగాయత్రి, భాస్కరనాయుడు, రామేశ్వరం, గుళ్ళపల్లి నాగేశ్వరరావు, సుజాత, శ్రీరామమూర్తి, వై.వి.ఎస్.రెడ్డి, కశ్యప్, అహ్మద్ నిసార్,మురళీమోహన్, ఆదిత్య పకిడె, అజయ్ బండి, వీవెన్, పవన్ సంతోష్, డాక్టర్ రాజశేఖర్, ప్రణయ్ రాజ్‌లను సన్మానించారు.[3]


వికీపీడియా వెనుక విజ్ఞాన వారధులు ఒక చోట చేరిన తెలుగు వికీపీడియన్లు న్యూస్‌టుడే, రవీంద్రభారతి

తమకు తెలిసిన, సేకరించిన ఎలాంటి సమాచారాన్నైనా పది మంది చెప్పాలనే ఉద్దేశంతో ‘వికీపీడియన్లు’ ఆయా అంశాలకు అక్షర రూపాన్నిచ్చి అంతర్జాలంలో భద్రపరుస్తున్నారు. ‘డిజిటల్‌ మాధ్యమాల్లో తెలంగాణ కళలు, సాహిత్యం, సంస్కృతి, పండగలు’ అంశంపై డిజిటల్‌ తెలంగాణ, భాషా సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో నిర్వహించిన రెండు రోజుల జాతీయ సదస్సులో తెలుగు రాష్ట్రాల్లోని వికీపీడియన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘న్యూస్‌టుడే’ వారిని పలకరించినప్పుడు పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

ఏం చేస్తారంటే.. తమకు తెలిసిన సమాచారాన్ని క్రోడీకరించడం, వ్యాసంగా తీసుకురావడం అనేది వ్యాసకర్త చేస్తాడు. కానీ తను రాసిన ‘మూలం’ ఎక్కడుందో కచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. విషయాలను ఎక్కడి నుంచి సేకరించామనేది పేర్కొనాలి. అవసరమైతే లింక్‌ ఇవ్వాలి. పత్రికల్లో అయితే.. ఎప్పుడు, ఏ పేజీలో ప్రచురించారు.. అనే విషయాలు చెప్పాల్సి ఉంటుంది. ఇలా రాసేవారిలో యువకులే కాదు వయోధికులు, మహిళలూ ఉన్నారు.

ప్రపంచ రికార్డు.. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 30కిపైగా మంది వికీపీడియన్లు ఉన్నారు. 69వేలకు పైగా తెలుగులో సమగ్ర సమాచారంతో కూడిన వ్యాసాలున్నాయి. ఇంకా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి సమాచారాన్ని సేకరించాలనే చర్యలపై సదస్సులో చర్చిస్తున్నారు. తెలంగాణ సంస్కృతి, కళలు, చరిత్రను వికీపీడియాలో చేర్చడానికి నిర్విరామంగా 761 రోజులు వ్యాసాలు రచించారు.. నగరానికి చెందిన ప్రణయ్‌. ఈ కృషికి ప్రపంచ రికార్డులో చోటు దక్కింది. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రణయ్‌ను ప్రత్యేకంగా నన్ను అభినందించారు.

ఇంటి పనులు చేసుకుంటూనే.. గృహిణిగా ఇంటి పనులు చేసుకోవడమే కాదూ.. ఇంకా ఏదైనా చేయాలనే ఆలోచనతో వికీపీడియా గురించి తెలుసుకున్నాను. దేశంలోని 640 జిల్లాలకు సంబంధించి సమాచారాన్ని సేకరించి, వికీపీడియాలో ఉంచాను. చాలా వరకు ఆంగ్లంలోనే సమాచారాన్ని భద్రపరిచాను. ఇప్పుడు తెలుగులో కార్యక్రమాలు మొదలుపెట్టా. మహాభారతంలోని 18 పర్వాల్లో నాకున్న పరిజ్ఞానం మేరకు, తెలిసిన విషయాలను క్లుప్తంగా అందించే ప్రయత్నం చేశాను. ఏదైనా పెద్ద ప్రాజెక్టుకు వికీపీడియన్లమంతా కలిసి పని చేస్తాం. వందకుపైగా మహిళల పరిశోధనలను తీసుకొచ్చాను. ఇంట్లో పనులు ముగించుకుని కంప్యూటర్‌తో కుస్తీపడతాను. - సుజాత, చెన్నై

ప్రదేశాల నుంచి ప్రజల జీవనశైలి వరకు.. సాంకేతిక యుగంలో అంతర్జాలం అందుబాటులోకి వచ్చిన తరువాత మీటనొక్కితే చాలు.. ప్రపంచ విజ్ఞానమంతా కళ్లముందు ప్రత్యక్షమవుతోంది. ఆయా దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, పట్టణాలు, గ్రామాలు అక్కడ జనాభా, విస్తీర్ణం, అక్కడి సామాజిక పరిస్థితులు, ప్రజల జీవన స్థితిగతులు వంటి అంశాలతో పాటు ఆయా ప్రాంతాల్లోని సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్ర వంటివి ఆసక్తికరమైన అనేక విషయాలను పొందుపరుస్తున్నాం. - ప్రణయ్‌, హైదరాబాద్‌

బ్లాగర్‌గా మొదలై... 11ఏళ్లుగా వికీపీడియన్‌గా పని చేస్తున్నా. గతంలో వయోధికులను సంప్రదించడమో, పుస్తకాలను తిరగేయడం చేసేవాళ్లం. సంబంధించిన పుస్తకాలూ దొరకడం కష్టంగా మారేది. అలా మా ఊరి గురించి చేసిన పరిశోధనలో ఇబ్బంది ఎదురైంది. క్రమంగా ఆ పరిశోధన ఫలాలు వికీపీడియాలో పెట్టాలనే సంకల్పంతో పరిశోధన మొదలుపెట్టా. గ్రామాల్లోని సౌకర్యాలు ప్రధానంగా విద్య, వైద్యం, రవాణ, విద్యుత్తు వంటి అంశాలను సేకరించి వ్యాసాలుగా అప్‌లోడ్‌ చేశా. జగిత్యాల, సిరిసిల్ల వంటి అనేక ప్రాంతాలకు సమాచారం ఇప్పుడు వికీపీడియాలో దొరుకుతుంది. నేను మొదట్లో బ్లాగర్‌ను. - విశ్వనాథ్‌, పశ్చిమగోదావరి జిల్లా, పోడూరు

తప్పుల్లేకుండా చూసుకోవాలి పంచాయతీరాజ్‌లో పని చేసి ఉద్యోగ విరమణ చేశాను. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ మండలాలు, గ్రామాలకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వుల (జీవో) ప్రకారమే ఆయా వివరాలను వికీపీడియాలో పెడుతున్నాం. ఇప్పుడు తెలంగాణలో జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణ పనులు మొదలుపెట్టాను. నల్గొండ, హైదరాబాద్‌ జిల్లాల వివరాలను పొందుపర్చాల్సి ఉంది. ఆయా గ్రామాలు, పట్టణాలకు సంబంధించిన చిత్రాలను సేకరించి, వ్యాసంతో పాటు పొందుపరుస్తున్నాం. తప్పుల్లేకుండా చూసుకోవడం ముఖ్యం. - ఎర్ర రామారావు, కారంపూడి[4]

మీడియా స్రవంతి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. http://epaper.sakshi.com/c/33062517
  2. http://epaper.vaartha.com/c/33055785
  3. సాక్షి, హైదరాబాదు, పుట 20. (14 October 2015). "పుస్తకాలు ప్రజలకే అంకితం". Archived from the original on 14 October 2018. Retrieved 14 October 2018.{{cite news}}: CS1 maint: multiple names: authors list (link) CS1 maint: numeric names: authors list (link)
  4. ఈనాడు, హైదరాబాదు, పుట 13. (14 October 2015). "వికీపీడియా వెనుక విజ్ఞాన వారధులు". Archived from the original on 14 October 2018. Retrieved 14 October 2018.{{cite news}}: CS1 maint: multiple names: authors list (link) CS1 maint: numeric names: authors list (link)