Jump to content

చర్చ:జీరంగి

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

జీరంగి / కీచురాయి

[మార్చు]

జీరంగి అనే కీటకాన్ని గురించి కొంత వ్రాశాను. కీచురాయి అనే కీటకము పై కొంత సమాచారము తెవికిలో వున్నది. అక్కడ ఆ కీటకము బొమ్మను బట్టి చూస్తే జీరంగికి కొంత పోలికలున్నాయి.. కనుక జీరంగి ..... కీచు రాయి అనే ఈ రెండు కీటకాలు ఒకటే ననే అనుమానమున్నది. దానిని జీరంగి అని పిలిచే ప్రాంతంలో దానికి కీచురాయి అనే పేరు వాడుకలో వున్నట్లు లేదు. ఈ రెండు ఒకటే అయితే విలీనము చేయ వచ్చునేమో పరిశీలించ వచ్చును. సామాన్యంగా.... రాత్రి పూట ఇండ్లలోను, పొలాల లోను "గీ మని చప్పుడు చేసే కీటకాలను కీచు రాళ్ళు అని అనడం విన్నాను. ఈ కీటకాలు చాల చిన్నవి. జీరంగి వాటికి రెండు మూడింతలు పెద్దది. పైగా జీరంగి శబ్దం చాల దూరం వరకు వినబడుతుంది. Bhaskaranaidu (చర్చ) 05:41, 25 అక్టోబర్ 2013 (UTC)

జీ + రంగి = జీ (multi) + రంగీ (coloured) = multi coloured beetle. మేము చిన్నప్పుడు ఈ జీరంగీలను పట్టుకుని చిన్న చిన్న పెట్టెలలో, ఖాళీ అగ్గిపెట్టెలలో ఉంచేవాళ్ళం. వాటికి ఆహారంగా చింతాకులను వేసేవారం. అవి గోధుమ గింజల సైజులలో తెల్లటి గ్రుడ్లు పెట్టేవి. ఈ జీరంగీ శరీరం అనేక రంగులతో నిండి వుండేది. వీటి రెక్కలు మెరిసే ఆకుపచ్చని, నెమలి నీలం రంగులు కలిగి వుంటాయి. దీని రంగులు అద్భుతంగానూ ఆకర్షణీయంగానూ వుంటాయి. చిన్నపిల్లలకు వీటి రంగులు అమితానందం కలిగించేవి.

వీటి శబ్దాల గురించి మాత్రం తెలియదు. బహుశా కీచు శబ్దాల కీటకం ఇది కాకపోవచ్చు. అహ్మద్ నిసార్ (చర్చ) 15:20, 25 అక్టోబర్ 2013 (UTC)

జీరంగి,కీచురాయి ఒక్కటికాదు,జీరంగి రెక్కలపైన రెండు డిప్పవంటివి బలంగా వుండి మెరైన్ రంగులో వుండును.చెట్టలపై కన్పిస్తుంది. డిప్పదళసరిగా వుండి క్రింద మళ్ళి రెక్కలుండును. .కీచురాయి రెక్కలు పలుచగా వుండును.పాలగిరి (చర్చ) 16:16, 25 అక్టోబర్ 2013 (UTC)
.పాలగిరి గారు తెలియజేసిన ప్రకారం జీరంగి యొక్క ఆంగ్ల అర్థం నిఘంటువు ప్రకారం "A green beetle, the emerald wing cases of which are fastened on emrboidery as an ornament" అని ఉన్నది. green beetle అనే పదంతో ఆంగ్ల వికీలో గల వ్యాసములైన green june beetle మరియు ఎమరాల్డ్ గ్రీన్ బీటిల్ వ్యాసములు కలవు. వీటిలో ఏదైనా "జీరంగి" కి చెందుతుందా?----K.Venkataramana (talk) 09:37, 12 నవంబర్ 2013 (UTC)