వికీపీడియా:దశాబ్ది ఉత్సవాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలుగు వికీపీడియా దశాబ్ది ఉత్సవం గురించిన చర్చలు ఇక్కడ.


మహోత్సవం కార్యక్రమ ప్రణాళిక (నమూనా)[మార్చు]

చేయాల్సిన పని బాధ్యత వహించే వికీ సభ్యులు సలహాలు/సూచనలు
నిర్వహణ సభ్యులు
ప్రెస్ నోట్ రూపకల్పన, బాధ్యతలు
స్థల నిర్ణయము, బాధ్యతలు
సి.డి రూపకల్పన
ముందస్తు అకాడమీల నిర్వహణ
కార్యక్రమంగురించి ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియాల ద్వారా ప్రచారం కల్పించడం
పూర్తి కావలసిన ప్రాజెక్టులు

తెవికీ దశవార్షికోత్సవ పండుగ చేసుకొనటానికి సూచనలు[మార్చు]

తెవికీ 10 డిసెంబరు 2013 న విజ్ఞాన సర్వస్వ నిర్మాణంలో పది సంవత్సరాలు పూర్తి చేసుకొనబోతున్నది. దీనిని సముచిత రీతిని ఆచరిస్తే బాగుంటుంది. సభ్యులు తమ సూచనలు ఒక వారం లోపు చర్చించమని కోరుతున్నాను--అర్జున (చర్చ) 04:53, 4 అక్టోబర్ 2013 (UTC)

మొదటి చర్చ తరువాత అనుకున్న అంశాలు[మార్చు]

    • దశవార్షికోత్సవ తేదీలు : డిసెంబర్ 14 & 15
    • వేదిక : IIIT RGUKT, Nuzvid/ KBN college, Vijayawada/Siddartha college, Vijayawada
    • వారం-వారం వికీపీడియాలోని ఒక అంశంపై ప్రెస్ నోట్
    • తెవికీ పరిచయ పుస్తకం
    • తెవికీ ఆండ్రాయిడ్ ఆప్ ( సాధారణ వికీ ఆప్ కు తెలుగు రూపముండే తెరతో)
    • ప్రముఖ మ్యాగజైనులతో తెవికీ వ్యాసాలు కలిగిన సీడీ పంపిణీ చేయడం మరియు/లేక పాఠశాలలకు పంపిణి చేయడం
    • ఇతర ఉత్సవ కానుకలు(టీ షర్ట్, స్టికర్ మొ॥)

రహ్మానుద్దీన్ (చర్చ) 03:53, 6 అక్టోబర్ 2013 (UTC)

పై అంశాలు రహ్మనుద్దీన్, నేను ఇటీవల బెంగుళూరులో కలిసినప్పుడు అనుకున్నవి. ఈ రోజు సిఐఎస్ శిక్షణా శిబిరంలో కలిసిన కశ్యప్, ప్రణయ్, విష్ణు మరియు విశ్వనాధ్ తో కూడా ముచ్చటించాము. పై వాటిపై స్పందనలు మరిన్ని సలహాలు చేర్చండి.--అర్జున (చర్చ) 14:23, 6 అక్టోబర్ 2013 (UTC)
  • 6 అక్టోబర్ CIS లో జరిగిన చర్చల సారాంశం
  • కార్యక్రమం డిసెంబర్ 10 తరువాత జనవరి 2014 చివరివారం లోపు జరపాలని నిర్ణయించబడినది.
  • వేదిక నిర్ణయం అప్పటి పరిస్థితుల బట్టి నిర్ణయించబడును.
  • ప్రెస్ నోట్ సమిష్టి కృషితో రూపొందించాలి, వికీపీడియా మూసలో ఈ ప్రెస్ నోట్ రూపొందించబడును.
  • తెవికీ పరిచయ పుస్తకం ప్రెస్ నొట్ సంక్షిప్తంగా రూపొందించాలి...విశ్వనాధ్ (చర్చ) 03:54, 7 అక్టోబర్ 2013 (UTC)
వేదిక నిర్ణయం త్వరలో ఖరారు చేయటం మంచిది. ఎందుకంటే దూరప్రాంతాలనుండి వచ్చేవారికొరకు ఏర్పాట్లు చేయాలికదా.--అర్జున (చర్చ) 04:37, 8 అక్టోబర్ 2013 (UTC)
వేదిక విజయవాడగా నిర్ణయించారు. కాని ప్రస్తుత పరిస్థితుల దృశ్ట్యా మార్పులు చేసే అవకాసం ఉంది కనుక కొన్ని రోజుల అనంతరం నిర్ణయించాలని అనుకొంటున్నాం..విశ్వనాధ్ (చర్చ) 03:52, 10 అక్టోబర్ 2013 (UTC)
వాడుకరి:రహ్మానుద్దీన్ తెవికీ పరిచయపుస్తక అనువాదం వివరాలు తెలియపరిస్తే దానిని ఇతరులు సమీక్షించవచ్చు. --అర్జున (చర్చ) 04:38, 8 అక్టోబర్ 2013 (UTC)
వేదిక విజయవాడ గా నిర్ణయించి; జై సమైక్యాంధ్ర ఇంకా కొనసాగుతుంటే హైదరాబాదు థియేటర్ ఔట్రీచ్ యూనిట్ కు మార్చవచ్చును. అంతవరకు వేచిచూడకుండా కార్యక్రమాల ప్రణాలిక సిద్ధం చేసుకుంటే బాగుంటుంది. సమావేశానికి ముందుగా 3-4 అకాడమీలు RGUKT లాంటి విద్యాసంస్థలలో నిర్వహిస్తే విద్యార్ధులలో అవగాహన కలుగుతుంది. ఇక నిర్వహణ బాధ్యతలను రహ్మానుద్దీన్ తెవికీ ఛైర్ గా నిర్వహించి ప్రసాద్, మల్లాది మరియు విశ్వనాథ్ గార్లు కార్యక్రమ కోర్ కమిటీ సభ్యులుగా పాల్గొంటే బాగుంటుంది. విజయవాడలో అందుకు తగిన వేదిక ముందుగా ఆలొచించి వారితో మాట్లాడాలని వారిని కోరుతున్నాను.Rajasekhar1961 (చర్చ) 05:22, 10 అక్టోబర్ 2013 (UTC)
కార్యక్రం జరిగే లోపున కొన్ని అకాడమీలు జరిపే ఆలోచన రహమాన్, విష్ణు గార్లు చేసారు. తెలిసిన కాలేజీలను సంప్రదించిన తరువాత ఇరువురూ వివరాలను ఇస్తామన్నారు. అంతవరకూ మిగిలిన పనులపై దృష్టి పెట్టాలి..13:40, 12 అక్టోబర్ 2013 (UTC)
ముందుగా మిత్రులందరికీ దసరా శుభాకాంక్షలు. తెవికీ దశాబ్ది ఉత్సవాలను నిర్వహించాలన్న ఆలోచన నిజంగా అద్భుతం...! విజ్ఞాన సర్వస్వాన్ని ఒక్క చోట భద్రపరచి, ఎవ్వరైనారైనా,ఎప్పుడైనా ఉచితంగా ఉపయోగించుకోగలిగే సౌకర్యంతో బాటు, తమ దగ్గరున్నవిలువైన, ఖచ్చితమైన, రేపటి తరానికి చేర్చదగిన సమాచారాన్ని తమంతట తామే స్వయంగా ఇక్కడ భద్రపరచగలిగే అవకాశం తెలుగు వికీపీడియాలో మాత్రమే ఉందన్నవిషయం తెవికీ ప్రారంభమై పదేళ్ళు కావస్తున్నా ఇప్పటికీ జనసామాన్యంలోకి వెళ్ళలేదు ఇలాటి ఉత్సవాలు ఏటేటా జరపడంవల్ల కొన్నేళ్ళకైనా ఈ ప్రయోజనం చేకూరగలదు. ఏ విధమైన లాభాపేక్ష లేని ఇటువంటి అక్షర సేవా కార్యక్రమం పదేళ్ళపాటు నిర్విరామంగా, నిబద్ధతతో కొనసాగడం నిజంగా ఘనవిజయమే. అందుకే ఈ దశాబ్ది ఉత్సవాలను “ పదేళ్ళ తెవికీ సంబరాలు”గా జరుపుకోవడం చాలా సముచితం. ఈ సంబరాలు దిగ్విజయవంత మయ్యెందుకు నా వంతు సేవ తప్పక చెయ్యగలను. ఉగాది వేడుక హైదరాబాద్ లో జరిపాము కాబట్టి, ఈ ‘సంబరాలు’ ఈసారి విజయవాడలో నిర్వహించడం చక్కగా ఉంటుంది. అక్కడ ఉత్సవాల వేదికగా కేబిఎన్, పిబి సిద్ధార్థ కాలేజీలు రెండూ బావుంటాయి. నూజివీడు కాలేజీ విజయవాడ సిటీకి దూరంగా వుంటుంది కాబట్టి, ఉత్సవాలు విజయవాడలో జరిపి, ఒక రోజున తెవికీ అవగాహనా సదస్సు + అకాడెమీ నూజివీడు కాలేజీలో నిర్వహిస్తే చక్కగా వుంటుంది. ఇకపోతే... మనం కళాశాలలో ఉత్సవాలు జరుపుతున్నాం కాబట్టి, విద్యార్ధినీ విద్యార్థులకు అత్యధిక ప్రయోజనం చేకూరే విధంగా ప్రోగ్రాం ప్లాన్ చేస్తే తెవికీని అత్యధికులకు చేరువ చెయ్యగలుగుతాం. అందుకే ఒకరోజున ఒక సెషన్ ను “నాలెడ్జ్ ఓరియంటేషన్” కోసం కేటాయించడం బావుంటుంది. అంటే ఈ సెషన్ లో ఎడ్యుకేషన్, ఎర్నింగ్ నాలెడ్జ్, కెరీర్ ప్లానింగ్, కమునికేషన్ స్కిల్స్, ఎమ్మేన్సీ కంపెనీలు ఎటువంటి అభ్యర్ధుల కోసం ఎదురు చూస్తుంటాయి .... లాంటి వివరాలతో బాటు, విద్యార్ధులకు ఉపయోగపడే టెక్నికల్ స్కిల్స్ గురించి కనీసం ఏడెనిమిది ప్రముఖ కంపెనీలలో ప్రాముఖ్యత కలిగిన ప్రముఖులతో అవగాహనా సదస్సు నిర్వహించడం తెవికీ స్థాయినీ, రేపటి తరం పట్ల తెవికీ బాధ్యతనూ చాటి చెప్పిన వాళ్ళమవుతాం. తద్వారా విద్యార్ధినీ విద్యార్ధులకు మరింతగా చేరువ అవుతాం. ఈ కార్యక్రమంలోనే వికీ టెక్నికల్ స్కిల్స్ తో బాటు, నాలెడ్జ్ షేరింగ్ ఆవశ్యకతను వివరించి, వాడుకరులుగా వారిని సాదరంగా ఆహ్వానించవచ్చు. ఈ కార్యక్రమానికి అత్యంత ఆదరణ లభిస్తుందని నా నమ్మకం. ఈ సక్సెస్ పీపుల్ ను ఎంపిక చెయ్యడం, సంప్రదించడం, రప్పించడం... వంటి బాధ్యతలను అర్జున, విష్ణు, రాధాకృష్ణ గార్లు స్వీకరిస్తే బావుంటుంది. మనందరి సహకారం ఎలాగూ ఉంటుంది. ఇక... మన సర్వసభ్య సమావేశం, “ పదేళ్ళ తెవికీ సంబరాలు”సభ, వివిధ కాలేజీల్లో అకాడెమీలు ఉండనే ఉంటాయి. ఇన్ని కార్యక్రమాలు జరపవలసి ఉన్నందున వేడుకలు మూడు రోజులపాటు జరిపితే బావుంటుంది. మరో ముఖ్య విషయం ఏమిటంటే... తెవికీ ఆరంభ కాలంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ తెవికీ పురోభివృద్ధికి విశేషంగా కృషి చేసిన ఆనాటి అక్షర యోధుల్ని ( వీలైనంత వరకూ నాగార్జున, వైజా సత్య గార్లతో సహా) రప్పించే ప్రయత్నం చేయ్యడం చాలా అవసరం. ఆనాటి ప్రముఖుల్ని మళ్ళీ తెవికీకి దగ్గర చెయ్యడం మన తెవికీ పురోగతిని పరుగులు పెట్టిస్తుంది. ఉగాది వేడుకలకు రాలేకపోయినా చంద్రకాంతరావు, చావాకిరణ్ తదితర పెద్దలు ఈ సభలకు తప్పక హాజరయ్యేలా ఇప్పట్నుంచే సంప్రదిం చడం మంచిది. Malladi kameswara rao (చర్చ) 20:17, 14 అక్టోబర్ 2013 (UTC)
హైదరాబాదు డిసెంబర్ 14 నుండి 25 వరకు, విజయవాడ జనవరి 1 నుండి 15 వరకు, పుస్తక ప్రదర్శన నిర్వాహకులను సంప్రదిస్తే తెలుగు వికీపీడియా|తెవికీ వ్యాసాలు కలిగిన సీడీ , తెవికి కరపత్రాలు వచ్చిన]సందర్శకులకు ఇవ్వటానికి వీలుగా ఉటుంది , హైదరాబాదులో ప్రతి ఏడూ e తెలుగు ఒక స్టాలును ఏర్పాటు చేస్తోంది , ఈ సంవత్సరం ఇంకా ఖరారు కాలేదు ఈ పుస్తక ప్రదర్శన లలో ఒక 15 లక్షల మంది సందర్సకులు రావచ్చు . మీడియా కవరేజి ప్రతిరోజూ ఉంటుంది .Kasyap(చర్చ)
Kasyap గారి సూచనకి ధన్యవాదాలు. ఇంతకుముందు e-తెలుగు సహకారంతో అమలైనదే. సీడి లక్షలలో ఇవ్వాలంటే ఖర్చు భరించలేకపోవచ్చు. గణాంకాలనుచూస్తే దీనివలన మనకు ప్రత్యేకంగా లాభించినది అంతగాలేదు. ఈ సంవత్సరము ఇలాంటివాటితో పాటు దశాబ్ది వుత్సవమును వినూత్నంగా నిర్వహిస్తే బాగుంటుంది. --అర్జున (చర్చ) 06:51, 17 అక్టోబర్ 2013 (UTC)
దశాబ్ది వుత్సవ నిర్వహాకులందరికి అభనందనలు.నాదొక చిన్నమనవి.ఈ కార్యక్రమంలో ఒకరోజు తెవికీగురించి పెద్దగా అవహాగన లేనినావంటివరకు ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించాలి,ఉందులో ఉపన్యాసకులుగా తెవికీలో రచనానుభం,కంప్యుటరు జ్ఞానం,మరియు నియమాళి గురించి అవగాహానవున్నవారు పాల్గొనవలెను.3 సంవత్సరాలనుంచి రచనలు చేస్తున్నాను.ఇప్పటికి నాకు మూసలు ఎంపిక చేసుకోవటం, తయారుచెయ్యడంరాదు,పట్టికలు(Table)చెయ్యడం,ఏఅవసరానికి ఏరకంపట్తిక చేయ్యడంరాదు,అవిఎక్కడుంటాయో,ఎలాగుర్తించాలో తెలియదు.వేలసంఖ్యలో మూసలు దిగుమతి చేస్తున్నారు,అందులో ఏవి ఉపయోగకరమో,వాటిని ఎలాఉపయోగించాలో తెలియదు,మామూలు సభ్యూడుగా ఒకరచనలు కాకుండ ఇంకేమి చెయ్యగల అవకాశం వుంది,సమీకరనణాలను ఎలా వ్రాయాలి? మానుంచి మరిన్ని రచనలు త్వరగా నాణ్యతగా రావాలంటే వీటి పట్లమాకు అవగాహనవుంటేనే సాధ్యం.కావున ఒకరోజు మాలాంటి వరకు ట్రైనింగ్ కై కేటాయించండి.అలాగే కొశ్చేను అవరుకూడా,రచనతొలగింపు,ట్యాగులు తగిలించడం,విలీనం వంటి మా సందేహలకు సమాధానలకై కెటాయించండి.పాలగిరి (చర్చ) 11:15, 24 అక్టోబర్ 2013 (UTC)

రెండవ చర్చ తర్వాత అనుకున్న అంశాలు[మార్చు]

  • కార్యక్రమ రూపకల్పనకు కార్యవర్గ ఎన్నిక జరగాలి
  • విజయవాడ కేంద్రంగా కార్యక్రమం జరగాలి
  • మరింత మంది పాల్గొనేందుకు కార్యక్రమాన్ని జనవరికి వాయిదావేయాలి
  • నిదుల సేకరణకు మార్గాలు సుగమం చేసుకోవాలి
  • కార్యక్రమ ప్రణాలిక తయారుచేసుకోవాలి

సిడి తయారీ సాధ్యాసధ్యాలు[మార్చు]

CD రూపొందించడంపై మళయాళ వికీఅనుభవాలు మనకి వుపయోగపడవచ్చు.అర్జున (చర్చ) 08:10, 18 అక్టోబర్ 2013 (UTC)

క్రియాశీలక బాధ్యతలను గుర్తించుట[మార్చు]

ఇప్పటివరకు స్పందించినవారందరికీ ధన్యవాదాలు. చాలా మంది సూచించినట్లు దీనికి ఒక కార్యనిర్వాహకవర్గాన్ని ఎంపిక చేయడం ప్రథమ బాధ్యత. దీనిలో కనీసం ఒకరైనా విజయవాడ లేక విజయవాడ దగ్గరి ప్రాంతాల వాస్తవ్యులైతే బాగుంటుంది. దీనికి సంబంధించి సభ్యులు తమ ఆసక్తిని తెలియచేయమని కోర్తాను.--అర్జున (చర్చ) 00:57, 15 అక్టోబర్ 2013 (UTC)

కార్యనిర్వాహకవర్గంలో రహ్మానుద్దీన్, మల్లాది మరియు విశ్వనాథ్ గార్లు బాధ్యతలను చేపడతారని ప్రార్ధిస్తున్నాను. నేను, అర్జున, విష్ణు, చంద్రకాంతరావు, రమణ, పాలగిరి మొదలైన వారు మామా బాధ్యతలను పోషిస్తాము. అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని సంఘటితంగా ప్రజలలోని తెలుగు వికీపీడియాని తీసుకొని వెళ్ళడానికి కృషిచేద్దాము.Rajasekhar1961 (చర్చ) 04:50, 15 అక్టోబర్ 2013 (UTC)
తెలుగు వికీపీడియాలో భాగస్వామినైనందుకు చాలా సంతోషంగా ఉంది. వికీపీడియా:దశాబ్ది ఉత్సవాలకు నావంతు బాధ్యతలను నిర్వహిస్తాను. Pranayraj1985 (చర్చ) 06:43, 15 అక్టోబర్ 2013 (UTC)
  • కార్యనిర్వాహక వర్గం ఎన్నుకోవడం తప్పక జరగాలి. అయితే ఇది బెంగుళూరు కేంద్రంగా ఇద్దరు ముగ్గురు సభ్యులు, విజయవాడ కేంద్రంగా మరొక్క ముగ్గురు, హైదరాబాద్ కేంద్రంగ మరో ముగ్గురు, విజయవాడకు బయట మరొక ముగ్గురు ఇలా కొందరు ఉంటే మేలని నా ఆలోచన.
  • మల్లాది గారు స్వయంగా పాల్గొనగలరో లేదో ! హైదరాబాద్ నుండి ఇక్కడకు వచ్చి పాల్గొనడం ప్రయాస కనుక ముందుగా ఆయన అనుమతి తీసుకొనడం అవసరం.
  • విష్ణు గారు ముందుగా ప్రతిస్పందించి కోశాధికారిక ప్రకటన లేదా తత్సంభంధ విషయాలలో అనుకూలతలను తెలియచేస్తే పనులు వేగవంతం చేసే అవకాశం ఉన్నది.
  • రహమనుద్దీన్ గారు వేదిక పరిస్థితుల గురించి మీ యొక్క ఆలోచనలను పంచుకోవాలని మా విజ్నప్తి. నేనుకూడా కొంచెం దగ్గరలో ఉన్నను కనుక ఏదైనా పని ఉంటే తప్పక చెసేందుకు ప్రయత్నిస్తాను.... విశ్వనాధ్ (చర్చ) 12:23, 15 అక్టోబర్ 2013 (UTC)

కార్యనిర్వాహకవర్గం[మార్చు]

  1. విశ్వనాధ్.బి.కె
  2. ప్రణయ్‌రాజ్ వంగరి
  3. కశ్యప్
  4. విష్ణు
  5. రహ్మానుద్దీన్

సహాయమండలి[మార్చు]

  1. అర్జున
  2. రాజశేఖర్
  3. --t.sujatha (చర్చ) 15:05, 17 అక్టోబర్ 2013 (UTC)
  4. మల్లాది కామేశ్వరరావు 18:33, 18 అక్టోబర్ 2013 (UTC)

కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కార ఎంపిక మండలి[మార్చు]

కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కార ఎంపిక మండలిచూడండి

ఆసక్తివున్నా ఇతర కారణాలవలన పై వాటిలో పాల్గొనలేనివారు
  1. Svpnikhil (చర్చ) 12:48, 17 అక్టోబర్ 2013 (UTC)
  2. జె.వి.ఆర్.కె.ప్రసాద్ - తెలుగు వికీపీడియా పదవ వార్షికోత్సవం కోసం (ఉగాది 2013 కార్యక్రమము వలే ) కూడా నా వంతు పూర్తి సహాయ సహకారములు, సేవలు (అవకాశము ఉన్నా, వచ్చినా, రాకపోయినా సరే) ఆ సమయ సందర్భాలకు తగిన విధముగా తప్పకుండా మా అందరి కార్యక్రమమునకు హాజరయ్యేందుకు ప్రయత్నించగలను. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 14:00, 23 అక్టోబర్ 2013 (UTC)
  3. <పై వరుసలో # మరియు మీ పేరు చేర్చండి>




వికీపీడియా దశమ వార్షికోత్సవం, ముందస్తు వికీ అకాడెమీ[మార్చు]

కేబిఎన్ కళాశాల వారితో పోయిన శుక్రవారం మాట్లాడాను , వారు సుమఖత వ్యక్తం చేసారు . Dhanekula Engineering college వికీ అకాడమీ కి ,వికీపీడియా దశాబ్ది ఉత్సవాలలో ,వాలంటిరులు గా కూడా విజయవాడలో పాల్గొనటానికి సుమఖత వ్యక్తం చేసారు . - కశ్యప్ --కశ్యప్ 06:06, 27 అక్టోబర్ 2013 (UTC)

  • ఒక రోజున తెవికీ అవగాహనా సదస్సు + అకాడెమీ నూజివీడు కాలేజీలో (నిర్ధారించాలి)
  • ఒక సెషన్ ను “నాలెడ్జ్ ఓరియంటేషన్” ఈ సెషన్ లో ఎడ్యుకేషన్, ఎర్నింగ్ నాలెడ్జ్, కెరీర్ ప్లానింగ్, కమునికేషన్ స్కిల్స్, (ఎమ్మేన్సీ కంపెనీలు ఎటువంటి అభ్యర్ధుల కోసం ఎదురు చూస్తుంటాయి .... లాంటి వివరాలతో బాటు, విద్యార్ధులకు ఉపయోగపడే టెక్నికల్ స్కిల్స్ గురించి కనీసం ఏడెనిమిది ప్రముఖ కంపెనీలలో ప్రాముఖ్యత కలిగిన ప్రముఖులతో అవగాహనా సదస్సు నిర్వహించడం)

తేదీ : సమయం : వేదిక : కే.బి.ఎన్, లేదా పి.బి. సిద్ధార్థ కాలేజీలు (నిర్ధారించాలి)

వికీపీడియా - ప్రసార మాధ్యమాల (మీడియా) సదస్సు[మార్చు]

తేది : సమయం : ప్రదేశం :

వికీ పరిచయం
కార్యక్రమ అంశాలు

కార్యక్రమ నిర్వాహకులు :

  • ముందుమాట ( సమావేశానికి ఆహ్వానం) :
  • వికీపీడియా ఆవశ్యకత :
  • వికీపేడియా ప్రస్థానం :
  • ప్రస్తుతం వికీపీడియా :


వికీపీడియన్ల ఇష్టా గోష్టి[మార్చు]

తేది :
సమయం :
ప్రదేశం : :::

కార్యక్రమ అంశాలు :

  • కొందరి పాత, కొత్త వికీపిడియన్ల కొరకు ట్రైనింగ్ ప్రోగ్రాం (బాట్లు నడపడం, మూసలు తయారు చేయడం, వాడటం, ఇతర సాంకేతిక ఉపకరణాల వాడకంపై శిక్షణ).
  • తెలుగు వికీపీడియా చేపట్టే కొత్త ప్రాజెక్టులపై వికీ సభ్యుల ఇష్టా గోష్టి
  • తెలుగు వికీసోర్సులో కాపీలెఫ్ట్ పుస్తకాల యూనికోడ్ కన్వర్షన్ గురించి చర్చ.--Rajasekhar1961 (చర్చ) 04:47, 25 అక్టోబర్ 2013 (UTC)
  • తెలుగు బ్లాగుల నిర్వహకులకు తెలుగు వికీపీడియా గురించి అవగాహన మరియు వారు చేయదగిన సహాయం గురించి పరస్పర చర్చ.--Rajasekhar1961 (చర్చ) 04:47, 25 అక్టోబర్ 2013 (UTC)
సమన్వయకర్తలు :

వార్షికోత్సవ కార్యక్రమం[మార్చు]

తేది :
సమయం : ఉదయం : 9-00 గంటల
ప్రదేశం : :::
సభ నిర్వహణ :

కార్యక్రమ అంశాలు :

ఉ. 9.00 - 10.00 --అల్పాహారం
ఉ. 10.00 - 10.15 -- తెవికీ సభ్యుల పరిచయాలు,
ఉ. 10.15 - 10.30 --
ఉ. 10.30 - 11.15 --
ఉ. 11.00 - 11.15 --
ఉ. 11.30 - 12.00 --
ఉ. 12.00 - 12.15 --
ఉ. 12.15 - 14:00 --
మ. 2.00 - 2.30 --


ఇతరాలు[మార్చు]

మీడియా ప్రముఖుల నమోదు  :
వికీపీడియా సభ్యుల నమోదు "
వికీపీడియా బాడ్జిల పంపిణీ :
లేఖన సామాగ్రి (స్టేషనరీ), ఇతరములు పంపిణీ  :
ప్రశంశా పత్రాల పంపిణీ పర్యవేక్షణ  :
ప్రశంశా పత్రాలపై పేర్ల నమోదు  :
భోజన వసతి సౌకర్యాల ఏర్పాట్లు  :


పాల్గొనేవారు: విద్యార్ధులు, విద్యా సంస్థల ప్రతినిధులు తప్పక లాప్టాప్ లేక టేబ్లెట్ తెచ్చుకోవాలి, ఇంగ్లీషులో కంప్యూటర్ వాడుక ప్రాథమిక పరిజ్ఞానం కలిగివుండాలి.