Jump to content

వికీపీడియా చర్చ:దశాబ్ది ఉత్సవాలు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

పేరు స్థానం పరిశీలించి మార్చండి

[మార్చు]

కార్యనిర్వాహక వర్గం, సహాయ మండలిని వేరు చేశాను. విశ్వనాధ్.బి.కె పేరుని తగిన స్థానమునకు మార్చమని కోరిక.--అర్జున (చర్చ) 13:01, 15 అక్టోబర్ 2013 (UTC)

తెలుగు వికీపీడియా దశమ వార్షికోత్సవ కార్యవర్గ సభ్యుల సమావేశాల వివరాలు

[మార్చు]

1. తెలుగు వికీపీడియా దశమ వార్షికోత్సవ కార్యవర్గ సభ్యుల మొదటి సమావేశం (05.11.2013)

[మార్చు]

ఇందులో పాల్గొన్నవారు విష్ణువర్ధన్, రహ్మనుద్దీన్, కశ్యప్, ప్రణయ్ రాజ్

తెలుగు వికీపీడియా దశమ వార్షికోత్సవం జరుపుకోవడానికి ముఖ్య ఉద్ధేశ్యం

  • తెలుగు వికీపీడియాలో వ్యాసాల నాణ్యతను, సంఖ్యను పెంచడం
  • తెలుగు వికీపీడియా వాడుకరులను పెంచడం
  • తెలుగు సమాచారాన్ని ఉచితంగా అందరికి అందుబాటులో ఉంచడం
  • తెలుగు వికీపీడియా వాడుకరులు కొత్త వాడుకరులను తయారుచేసేలా ప్రోత్సహించడం
  • తెలుగు వికీపీడియాకు గుర్తింపు వచ్చేలా, ప్రజలందరికి తెలిసేలా చేయడం
  • గ్లోబల్ లెవల్ లో తెలుగు వికీపీడియాకు విజిబులిటి కల్పించడం

స్థలం

  • తెలుగు వికీపీడియా దశమ వార్షికోత్సవం నిర్వహించడానికి స్థల నిర్ణయంకు మరికొన్ని రోజుల సమయం అవసరం. వార్షికోత్సవ తేదీలు - జనవరి మూడు లేదా నాలగో వారం.
  • వార్షికోత్సవానికి ముందుగా నవంబర్, డిసెంబర్ నెలల్లో అక్కడక్కడ (విజయవాడ, వైజాగ్, నూజివీడు మొ.) తెలుగు వికీపీడియా శిక్షణా శిబిరాలను నిర్వహించాలి. దీనిద్వారా అక్కడి పరిస్థితులు, పరిసరాలు, పరికరాలు మొదలైనవాటిగురించి ఒక అవగాహన ఏర్పడుతుంది.

చేయవలసిన పనులు

  • కశ్యప్ గారు, మల్లాది గారు కేబీఎన్ కాలేజీ వారితో మాట్లాడి వార్షికోత్సవానికి స్థల నిర్ధారణ చేసి, శిక్షణా శిబిరాన్ని నిర్వహించడానికి అనుమతి తీసుకోవాలి.
  • కార్యవర్గ సభ్యులందరూ కలిసి వార్షికోత్సవ ప్రణాళిక సిద్ధం చేయాలి.
  • ప్రెస్ నోట్ సమిష్టి కృషితో రూపొందించాలి.

జరిగిన పనులు

  • కశ్యప్ గారు కేబీఎన్ కాలేజీ వారితో మాట్లాడారు. వారు త్వరలో తమ నిర్ణయం తెలియజేస్తామని చెప్పారు.
  • కార్యవర్గ సభ్యులందరూ కలిసి వార్షికోత్సవ ప్రణాళికను 20వ తేదీ లోపున తయారుచేస్తామని చెప్పారు. ఈ బాధ్యతను రాజశేఖర్ గారు స్వీకరించారు.
  • ప్రెస్ నోట్ విషయమై మరింత చర్చ జరగాలి.

2. తెలుగు వికీపీడియా దశమ వార్షికోత్సవ కార్యవర్గ సభ్యుల రెండవ సమావేశం (13.11.2013)

[మార్చు]

ఇందులో పాల్గొన్నవారు విష్ణువర్ధన్, రాజశేఖర్, రహ్మనుద్దీన్, విశ్వనాథ్, ప్రణయ్ రాజ్,

ఈ రెండవ సమావేశంలో కార్యవర్గ సభ్యులకు ఈ క్రింది బాధ్యతలు అప్పగించబడ్డాయి

  • సమావేశంలో చర్చించుకున్న అంశాలు, కార్యవర్గ సభ్యులకు అప్పగించిన బాధ్యతలు, జరిగిన పనుల గురించిన పూర్తి సమాచార సేకరణ ప్రణయ్ రాజ్
  • నూజివీడు కళాశాలలో శిక్షణా శిబిరానికి రహ్మనుద్దీన్ గారు, విష్ణు కళాశాలతో శిక్షణా శిబిరానికి విశ్వనాథ్ గారు అనుమతి తీసుకుంటామన్నారు. చుట్టుప్రక్కల ఉన్న వికీపీడియన్లను ఈ శిబిరాలలో పాల్గొనేలా చేయాలని నిర్ణయించారు.
  • AP Tourism, Residential Schools వాళ్ళకి శిక్షణా శిబిరాలు నిర్వహించడానికి అనుమతి తీసుకొనడం విష్ణువర్ధన్
  • డిసెంబర్ 7 నుండి 17 వరకు ఎన్.టి.ఆర్ స్టేడియం, హైదరాబాద్ లో జరిగే బుక్ ఫెయిర్ కి E-Telugu వారు ఏర్పాటు చేసే ఒక స్టాల్ లో తెవికీ ప్రెసెంటేషన్, వాడుకరుల ఫోటోలు, ప్రొఫైల్స్ స్క్రీనింగ్ చేయడం. దీనికి సంబంధించిన PPT ని విష్ణువర్ధన్, రహ్మనుద్దీన్ లు తయారుచేస్తారు. దానిని మిగతా సభ్యులు చూసి, conform చేసాక presentationకి ఇవ్వడం జరుగుతుంది. మాటామంతిలో వాడుకరుల వివరాలు ఉంటాయి. తెవికీ తరపున రొజుకొకరు ఆ స్టాల్ లో పాల్గొనాలి. రోజువారి సమీక్షను రాజశేఖర్ గారు నిర్వహిస్తారు.
  • గోల్డెన్ త్రెషోల్డ్ లో శిక్షణా శిబిరం నిర్వహించాలని కశ్యప్ గారి సూచన. పెద్ది రామారావుగారితో మాట్లాడి, అనుమతి తీసుకునే బాధ్యతను ప్రణయ్ రాజ్ కు అప్పగించడం జరిగింది.
  • Times of India city edition లో, FM లలో తెలుగు వికీపీడియా దశమ వార్షికోత్సవం గురించిన ప్రకటనలు వచ్చేలా చూడడం విష్ణువర్ధన్
  • వచ్చే సమావేశంలోపు కార్యవర్గ సభ్యలందరూ కార్యక్రమ ప్రణాళిక రూపొందించాలి. దీనికి రాజశేఖర్ గారు బాధ్యత వహిస్తారు.

తెలుగు వికీపీడియాలో

జరిగిన పనులు

  • విష్ణు కళాశాలలో వైఫై లేదు, అడ్మినిస్ట్రేషన్ తో మాట్లాడి త్వరలో శిక్షణా శిబిరానికి సంబంధించిన వివరాలు తెలియజేస్తానని విశ్వనాథ్ గారు చెప్పారు.
  • నూజివీడు కళాశాలలో శిక్షణా శిబిరానికి సంబంధించిన వివరాలు 25వ తేదిన తెలియజేస్తానని రహ్మనుద్దీన్ గారు చెప్పారు.
  • AP Tourism, Residential Schools వాళ్ళకి శిక్షణా శిబిరాలు నిర్వహించడానికి అనుమతి ప్రక్రియ ప్రారంభమైందని డిసెంబర్ 7వ తేదిలోపు హైదరాబాద్ లో శిక్షణా శిబిరం నిర్వహిస్తామని విష్ణువర్ధన్ గారు చెప్పారు.
  • బుక్ ఫెయిర్ కి E-Telugu వారు స్టాల్ ఏర్పాటు చేసేది లేనిది ఇంకా నిర్ధారణ కాలేదని రహ్మనుద్దీన్ గారు చెప్పారు.
  • గోల్డెన్ త్రెషోల్డ్ లో ఏ రకమైన శిక్షణా శిబిరం నిర్వహించదలచామో తెలిస్తే అనుమతికి అనుకూలంగా ఉంటుందని ప్రణయ్ రాజ్ గారు చెప్పారు.
  • Times of India city edition లో, FM లలో తెలుగు వికీపీడియా దశమ వార్షికోత్సవం గురించిన ప్రకటనల ప్రక్రియ ప్రారంభమైందని విష్ణువర్ధన్ గారు చెప్పారు.
  • కార్యక్రమ ప్రణాళిక రహ్మనుద్దీన్ గారు Google Docs లో అందరికి పంపించారు. అందరి అభిప్రాయాలు కావాలి.
  • వికీపీడియా:వికీప్రాజెక్టు/లీలావతి కూతుళ్ళు వ్యాసాల రచన గురించి ఇతర వికీపీడియన్లకు చెప్పామనీ, తాము కూడా రాస్తున్నామని విశ్వనాథ్, ప్రణయ్ రాజ్ లు చెప్పారు.

3. తెలుగు వికీపీడియా దశమ వార్షికోత్సవ కార్యవర్గ సభ్యుల మూడవ సమావేశం (20.11.2013)

[మార్చు]

ఇందులో పాల్గొన్నవారు విష్ణువర్ధన్, అర్జునరావు, రాజశేఖర్, టి. సుజాత, రహ్మనుద్దీన్, కశ్యప్ విశ్వనాథ్, ప్రణయ్ రాజ్.

ముందుగా గతవారం అనుకున్న పనులపై సమీక్ష జరిగింది. కార్యవర్గ సభ్యులు తమతమ బాధ్యతలు ఎంతవరకు వచ్చాయో తెలియజేశారు. అనంతరం మిగతా విషయాలపై చర్చ జరిగింది.

చేయవలసిన పనులు

  • ప్రెస్ నోట్ తయారి
  • కార్యక్రమ ప్రణాళిక (ఇది Table రూపంలో ఉంటే బాగుంటుంది. Table తయారి విశ్వనాథ్, ప్రణయ్ రాజ్)
  • వికీపీడియాలోని సమాచారాన్నంతటిని CDs రూపంలో అందరికి అందుబాటులోకి తేవడం. (దీనికి అర్జునరావు గారు బాధ్యత వహించగా సహాయం అందిస్తానని చెప్పారు. ఇంతకు ముందు సిడితయారీలో అనుభవమున్న కశ్యప్ లాంటి వారు నాయకత్వం తీసుకోవాలని కోరారు. విష్ణువర్ధన్ సముచిత వినియోగ హక్కుల గురించి సిఐఎస్ లో న్యాయనిపుణులతో చర్చిస్తానని చెప్పారు. ముఖచిత్రాన్ని విశ్వనాథ్ గారు తయారు చేయటానికి ముందుకువచ్చారు,
  • వికీపీడియాలో చురుగ్గా పనిచేస్తున్న వికీపీడియన్లను ఎంపికచేసి, వారి గురించిన వివరాలతో ప్రెస్ నోట్ ఇవ్వడం. అంతేకాకుండా నగదు పురస్కారం, సర్టిఫికేట్స్ అందించడం మంచిదని అర్జున సలహా ఇచ్చారు. (ఎంపికకు వైజాసత్యగారు న్యాయనిర్ణేతగా ఉంటారు. అర్జునరావు, రాజశేఖర్, టి. సుజాత గారుల సహకరిస్తారు. ఈ ఎంపిక విషయాలు రచ్చబండలో చర్చించవలసి ఉంటుంది). దీనిని వేగవంతంగా చేయటానికి దశాబ్ది ఉత్సవాల కార్యనిర్వహాకవర్గం నగదు పురస్కారానికి కేటాయింపుని రెండు రోజులలో ఖరారు చేయాలని కోరారు.


  • వికీపీడియాతో పరిచయం ఎలా ఏర్పడింది, వికీపీడియాలో ఎలాంటి వ్యాసాలు రాశారు అనే అంశంపై ప్రతి వికీపీడియన్ తో 5 ని.ల పరిచయం. ఇతర భాషా వికీపీడియన్లను దశమ వార్షికోత్సవానికి ఆహ్వానించడం.