Jump to content

వికీపీడియా:నిర్వాహకుల పనుల సమీక్ష/చదువరి/2020 అక్టోబరు - 2021 మార్చి

వికీపీడియా నుండి
చదువరి
నిర్వాహకత్వ సమీక్షలు
2019 ఏప్రిల్ - సెప్టెంబరు
2019 అక్టోబరు - 2020 మార్చి
2020 ఏప్రిల్ - సెప్టెంబరు
2020 అక్టోబరు - 2021 మార్చి
2021 ఏప్రిల్ - సెప్టెంబరు
2021 అక్టోబరు - 2022 జూన్
2022 జూలై - డిసెంబరు
2023 జనవరి - జూన్

వికీపీడియా:నిర్వాహకత్వ హక్కుల ఉపసంహరణ పేజీలో నిర్వాహకులు కనీసమాత్రం చెయ్యాల్సిన పని ఎంతో సూచన చేసారు. ఆ సూచనల మేరకు 2020 అక్టోబరు 1 నుండి 2021 మార్చి 31 వరకు ఉన్న ఆర్నెల్ల కాలంలో నేను చేసిన నిర్వాహకత్వ పనుల వివరాలను ఈ పేజీలో పెట్టాను. ఈ లెక్క లోకి ప్రధాన పేరుబరిలో చేసిన మార్పుచేర్పులు రావు కాబట్టి, వాటిని పరిగణించలేదు.

అడ్మిన్ స్కోరు

[మార్చు]

ఈ కాలంలో నేను చేసిన మొత్తం నిర్వాహక చర్యలు: 1110. ఎక్స్ టూల్స్ పరికరంలోని నిర్వాహక చర్యల వివరాలు కింది లింకులో చూడవచ్చు.

https://xtools.wmflabs.org/adminstats/te.wikipedia.org/2020-10-01/2021-03-31?actions=delete%7Crevision-delete%7Clog-delete%7Crestore%7Cre-block%7Cunblock%7Cre-protect%7Cunprotect%7Crights%7Cmerge%7Cimport%7Cabusefilter

చెప్పుకోదగ్గ పనులు

[మార్చు]

ఈ కాలంలో నేను చేసిన ప్రత్యేకమైన పనులు. ఇవి నిర్వాహక పనులు కావు. కానీ ప్రత్యేకమైన పనులు కాబట్టి ఇక్కడ ఉదహరిస్తున్నాను. (మామూలుగా చేసే నిర్వాహక పనులను ఇక్కడ పరిగణించలేదు):

  1. వికీపీడియాకు సంబంధించి అనేకమైన గణాంకాలను తయారుచేసాను. ఈ గణాంకాలను క్వారీలో సీక్వెల్ క్వెరీలను నడిపి తయారుచేసాను. వాడుకరులు, పేజీలు, కాలావధులు వగైరాల పరంగా తయారు చేసిన ఈ విస్తారమైన గణాంకాలను వికీపీడియా:గణాంకాలు అనే పేజీతో మొదలుపెట్టి చూడవచ్చు. వీటిలో కొన్ని రకాల గణాంకాలను ఆధారం చేసుకుని కొందరు వాడుకరులు కొన్ని నిర్వహణ పనులు కూడా చేసారు.
  2. కొత్త వాడుకరులను నిలుపుకునే నిమిత్తం వికీమీడియా ఫౌండేషను మొదలుపెట్టిన గ్రోత్ ఎక్స్పెరిమెంట్స్ ప్రాజెక్టును స్థాపించాను. దానికి ఆవశ్యకమైన అన్ని పనులనూ పూర్తి చేసి భూమికను ఏర్పరచాను. తెవికీలో చర్చ మొదలుపెట్టాను. సముదాయం ఈ ప్రతిపాదనను ఆమోదించాక, గ్రోత్ బృందంతో మాట్లాడి ప్రాజెక్టును స్థాపింపజేసాను.
  3. కొత్త వాడుకరుల కోసం సహాయం పేజీలను ఎన్వికీ నుండి దిగుమతి చేసుకుని అనువదించాను. 70 పైచిలుకు ఉన్న ఈ పేజీలను సహాయం:పరిచయం పేజీ నుండి చూడవచ్చు.
  4. భారతదేశ జిల్లాల పేజీల పునర్వ్యవస్థీకరణ ప్రాజెక్టును మొదలుపెట్టి, నిర్వహించాను.

పేరుబరి వారీగా నా దిద్దుబాట్లు:

[మార్చు]
  • వికీపీడియా: 1122. ఇందులో రచ్చబండలో రాసినవి: 137
  • మూస: 639
  • సహాయం: 505
  • వర్గం: 169
  • మీడియావికీ: 32
  • మాడ్యూల్: 125

ఈ కాలంలో ట్రాన్స్‌లేట్‌వికీలో నేను చేసిన అనువాదాల సంఖ్య: 2179 ఇందులో 550 అనువాదాలు (దిద్దుబాట్లు) గ్రోత్ ప్రాజెక్టు కోసం చేసినవే. మిగతావి మీడియావికీ కోసం చేసినవి. నా నిర్వాహకత్వం గురించి చెప్పేదేమైనా ఉంటే, ముఖ్యంగా విమర్శ ఉంటే, దీని చర్చా పేజీలో రాయండి.


ఈ కాలంలో నేను చేసిన మొత్తం దిద్దుబాట్లు: 6,176