వికీపీడియా:నిర్వాహకుల పనుల సమీక్ష/చదువరి/2023 జనవరి - జూన్
ఏప్రిల్ నుండి వికీపీడియాలో చురుగ్గా పాల్గొనలేక పోయాను. అందుచేత నిర్వాహకుడు, అధికారి బాధ్యతల నుండి స్వచ్ఛందంగా తప్పుకున్నాను. ఇకపై నాకు వీలైనప్పుడు వికీ కృషి చేస్తూంటాను. ఈ సమీక్షతో నిర్వాహకుడిగా ఈ బాధ్యత ముగుస్తుంది.
వికీపీడియా:నిర్వాహకత్వ హక్కుల ఉపసంహరణ పేజీలో నిర్వాహకులు చెయ్యాల్సిన కనీసమాత్రపు పని ఎంతో సముదాయం నిర్ణయించింది. ఆ సూచనల మేరకు 2019 మార్చి నుండి ఇప్పటి వరకు 7 సార్లు ఆరు నెలల సమీక్ష చేసుకుంటూ వచ్చాను. ఇది 8 వ సమీక్ష. 2023 జనవరి 1 నుండి 2023 జూన్ 3 వరకు ఉన్న సుమారు 6 నెలల కాలంలో నేను చేసిన నిర్వాహకత్వ పనుల వివరాలను ఈ పేజీలో పెట్టాను. ఈ లెక్క లోకి ప్రధాన పేరుబరిలో చేసిన మార్పుచేర్పులు రావు కాబట్టి, వాటిని పరిగణించలేదు.
నిర్వాహక చర్యలు
[మార్చు]ఈ కాలంలో నేను చేసిన మొత్తం నిర్వాహక చర్యలు: 1,746. ఈ నిర్వాహక చర్యల వివరాలను ఎక్స్ టూల్స్ పరికరంలో చూడవచ్చు.
చెప్పుకోదగ్గ పనులు
[మార్చు]ఈ కాలంలో నేను చేసిన ప్రత్యేకమైన పనులు ఇక్కడ ఉంటాయి. ఇవి నిర్వాహకేతర పనులు కూడా ఉండవచ్చు. ప్రత్యేకమైన పనులు కాబట్టి వాటిని ఇక్కడ ఉదహరిస్తున్నాను. (మామూలుగా చేసే నిర్వాహక పనులను ఇక్కడ పరిగణించలేదు):
- మూలాల్లో లోపాలను సవరించే పనిని చేపట్టాను. దీని కోసం ఒక ప్రాజెక్టును రూపొందించి ఇతర వాడుకరులతో కలిసి పని చేసాను. వర్గం:CS1 errors లోని ఉపవర్గాల్లోని 9,000 పైచిలుకు పేజీల్లో లోపాలను సవరించి ఆ పేజీల సంఖ్యను 450 వరకు చేర్చాను.
- వికీపీడియాలో పలు రకాలైన దోషాలను సవరించే చెక్ వికీపీడియా ప్రాజెక్టును మొదలుపెట్టాను. వికీ పేజీల్లో దొర్లే అనేక సాధారణ లోపాలను సెమీ ఆటోమాటిగ్గాను, మానవికం గానూ సరిచేసేందుకు సృష్టించిన ప్రాజెక్టు ఇది.
- కొత్త Vector 2022 రూపుకు సంబంధించి తలెత్తిన సాంకేతిక సమస్యలను డెవలపర్ల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారమయ్యేలా కృషి చేసాను.
- వికీలోకి ఒక రెండు గాడ్జెట్లను చేర్చాను
పేరుబరి వారీగా నా దిద్దుబాట్లు
[మార్చు]- వికీపీడియా: 195. ఇందులో రచ్చబండలో రాసినవి: 67
- మూస: 772
- సహాయం: 32
- వర్గం: 271
- మీడియావికీ: 56
- మాడ్యూల్: 155
ఈ కాలంలో వికీలో నేను చేసిన మొత్తం దిద్దుబాట్లు: 5,664. ఈ కాలంలో ట్రాన్స్‌లేట్‌వికీలో నేను చేసిన అనువాదాల సంఖ్య: 276.
నా నిర్వాహకత్వం గురించి చెప్పేదేమైనా ఉంటే, ముఖ్యంగా విమర్శ ఉంటే, దీని చర్చా పేజీలో రాయండి.