వికీపీడియా:నిర్వాహకుల పనుల సమీక్ష/చదువరి/2019 అక్టోబరు - 2020 మార్చి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చదువరి
నిర్వాహకత్వ సమీక్షలు
2019 ఏప్రిల్ - సెప్టెంబరు
2019 అక్టోబరు - 2020 మార్చి
2020 ఏప్రిల్ - సెప్టెంబరు
2020 అక్టోబరు - 2021 మార్చి
2021 ఏప్రిల్ - సెప్టెంబరు
2021 అక్టోబరు - 2022 జూన్
2022 జూలై - డిసెంబరు
2023 జనవరి - జూన్

వికీపీడియా:నిర్వాహకత్వ హక్కుల ఉపసంహరణ పేజీలో నిర్వాహకులు కనీసమాత్రం చెయ్యాల్సిన పని ఎంతో సూచన చేసారు. 2019 అక్టోబరు 1 నుండి 2020 మార్చి 31 వరకు ఉన్న ఆర్నెల్ల కాలంలో నేను చేసిన నిర్వాహకత్వ పనుల వివరాలు. ఇందులో ప్రధాన పేరుబరిలో నేను చేసిన మార్పుచేర్పులను అసలు పరిగణించనే లేదు - పరిగణించకూడదు కాబట్టి.

అడ్మిన్ స్కోరు[మార్చు]

ఈ కాలంలో నేను తీసుకున్న మొత్తం నిర్వాహక చర్యలు: 3,196. ఎక్స్ టూల్స్ పరికరంలోని అడ్మిన్ స్కోరు కింది లింకులో ఉంది.

https://xtools.wmflabs.org/adminstats/te.wikipedia.org/2019-10-01/2020-03-31?actions=delete%7Crevision-delete%7Clog-delete%7Crestore%7Cre-block%7Cunblock%7Cre-protect%7Cunprotect%7Crights%7Cmerge%7Cimport%7Cabusefilter

చెప్పుకోదగ్గ పనులు[మార్చు]

ఈ కాలంలో నేను చేసిన ప్రత్యేకమైన పనులు. ఇవి నిర్వాహక పనులు కావు. కానీ ప్రత్యేకమైన పనులు కాబట్టి ఇక్కడ ఉదహరిస్తున్నాను. (మామూలుగా చేసే నిర్వాహక పనులను ఇక్కడ పరిగణించలేదు):

  1. వాడుకరులకు ఆటోవికీబ్రౌజరు అనుమతులను ఎలా ఇవ్వాలనే విషయమై ఒక చర్చ మొదలు పెట్టి, ఆ చర్చ ఒక ఒడ్డుకు చేర్చడంలో ఇతర వాడుకరులతో కలిసి పనిచేసాను.
  2. గూగుల్ యాంత్రికానువాద వ్యాసాల విషయాన్ని సముదాయంలో మళ్ళీ చర్చకు పెట్టాను. ఈ సమస్యపై సముదాయం నిర్ణయం తీసుకోవడంలోను, నిర్ణయాన్ని అమలు చెయ్యడం లోనూ పాత్ర పోషించాను.
  3. గూగుల్ యాంత్రిక అనువాద పరికరం ద్వారా వచ్చే పాఠ్యంలో నాణ్యతను మెరుగుపరచేందుకు కింది చర్యలు తిసుకున్నాను
    1. "మరియు" ఉన్న పాఠ్యాన్ని ప్రచురించడాన్ని నిరాకరించేలా ఒక వడపోతను సృష్టించాను.
    2. అనువాదంలో మానవిక అనువాదం పాలు కనీసం 30% లేనిదే ప్రచురించనీయకుండా, సంబంధిత డెవలపరుతో చర్చించి, పరిమితులను విధించేలా చేసాను.
  4. తోటి వాడుకరులతో కలిసి పనిచేసి ఈ సరికే "మరియు" లున్న 20 వేల పైచిలుకు వ్యాసాలను AWBతో సవరించాను.
  5. తెవికీ 16 వ పుట్టినరోజు వేడుకల ఏర్పాట్లలో పాల్గొన్నాను. ఆనాటి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు కొన్నిటి అమలును మొదలు పెట్టడంలో చొరవ తీసుకున్నాను. ఉదా: అయోమయ నివృత్తి పేజీలకు ఇచ్చిన లింకుల తొలగింపు.
  6. బాటు ద్వారా చెయ్యాల్సిన కొన్ని పనులను వికీపీడియా:బాటు సహాయానికి అభ్యర్ధనలు పేజీలో చేర్చాను.
  7. క్రియాశీల వాడుకరులు సృష్టించిన మొలక వ్యాసాల జాబితా ఒకదాన్ని తయారు చేసాను. వివిధ వాడుకరులు చురుగ్గా స్పందించి తమతమ మొలకలను విస్తరించి, ఇతరులకు గొప్ప స్ఫూర్తినిచ్చారు.
  8. వెంకటరమణ, యర్రా రామారావు తదితరులతో కలిసి తొలగించాల్సిన వ్యాసాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకోవడంలో దోహదపడ్డాను.
  9. వికీపీడియా:రచ్చబండ (పాలసీలు)/తెలుగేతర పేర్లను రాయడం ఎలా? అనే ఒక మార్గదర్శకాన్ని ప్రతిపాదించాను గానీ, దానికి సముదాయం నుండి పెద్దగా స్పందన రాలేదు.

ప్రత్యేకమైన పనులు[మార్చు]

ఈ కాలంలో నేను చేసిన ప్రత్యేకమైన పనులు. ఇవి నిర్వాహక పనులు కావు, వికీపీడియా:నిర్వాహకత్వ హక్కుల ఉపసంహరణ నియమాల పరిధి లోకి రావు. కానీ ప్రత్యేకమైన పనులు కాబట్టి ఇక్కడ ఉదహరిస్తున్నాను. అయితే ఇవి తెలుగు వికీపీడియాను ప్రభావితం చేసేవే.

  1. అనువాదాలు: 1034 స్థానికీకరణలు చేసాను.

పేరుబరి వారీగా నా దిద్దుబాట్లు:[మార్చు]

  • వికీపీడియా: 626. ఇందులో రచ్చబండలో రాసినవి: 126
    • వికీపీడియా చర్చ: 36
  • మీడియావికీ: 15
  • మాడ్యూల్: 88

నా నిర్వాహకత్వం గురించి చెప్పేదేమైనా ఉంటే, ముఖ్యంగా విమర్శ ఉంటే, దీని చర్చా పేజీలో రాయండి.


ఈ కాలంలో నేను చేసిన మొత్తం దిద్దుబాట్లు: 4184