వికీపీడియా:నిర్వాహకుల పనుల సమీక్ష/చదువరి/2019 ఏప్రిల్ - 2019 సెప్టెంబరు
వికీపీడియా:నిర్వాహకత్వ హక్కుల ఉపసంహరణ పేజీలో నిర్వాహకులు కనీసమాత్రం చెయ్యాల్సిన పని ఎంతో సూచన చేసారు. నా పని ఎలా ఉందో ఆర్నెల్ల కోసారి చేసే మదింపు ఈ పేజీలో ఉంటుంది.
2019 ఏప్రిల్-సెప్టెంబరు
[మార్చు]2019 ఏప్రిల్ 1 నుండి 2019 సెప్టెంబరు 30 వరకు నేను చేసిన నిర్వాహకత్వ పనుల వివరాలు
అడ్మిన్ స్కోరు
[మార్చు]ఈ కాలంలో నేను తీసుకున్న మొత్తం నిర్వాహక చర్యలు: 758. ఎక్స్ టూల్స్ పరికరంలోని అడ్మిన్ స్కోరు కింది లింకులో ఉంది.
ప్రత్యేకమైన పనులు
[మార్చు]ఈ కాలంలో నేను చేసిన ప్రత్యేకమైన పనులు. ఇవి నొర్వహక పనులు కావు. కానీ ప్రత్యేకమైన పనులు కాబట్టి ఇక్కడ ఉదహరిస్తున్నాను. (మామూలుగా చేసే నిర్వాహక పనులను ఇక్కడ పరిగణించలేదు):
- వ్యక్తుల వర్గాలను క్రమబద్ధీకరించేందుకు గాను ఒక కొత్త ప్రాజెక్టును మొదలుపెట్టాను. అయితే ఇందులో వాడుకరులను పెద్దగా చేర్చలేకపోయాను. ఇద్దరు మాత్రమే పాల్గొన్నారు. వాడుకరులను ఇందులో పాల్గొనేలా చెయ్యలేకపోవడం నా వైఫల్యం. (ప్రాజెక్టులో తలపెట్టిన పని దాదాపు మొత్తాన్నీ నేను ఒక్కణ్ణే చేసాను. ఆ విధంగా ప్రాజెక్టు లక్ష్యం నెరవేరింది. కానీ అది నా నిర్వాహకత్వానికి సంబంధించినది కాదు). ఒక నిర్వాహకుడిగా నేను ఈ ప్రాజెక్టులో 10% మాత్రమే విజయం సాధించాను.
- ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోని గ్రామాల పేర్లలో ఉన్న తప్పులను సవరించేందుకు ఒక ప్రాజెక్టును మొదలుపెట్టాను. ఇందులో ఏడుగురు వాడుకరులు పాల్గొంటున్నారు. ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. నిర్వాహకత్వం పరంగా ఈ ప్రాజెక్టు నిర్వహణలో 30 శాతం విజయం సాధించినట్టు.
- ఉల్లేఖన పరికరంలో ఆటోమాటిక్ అంశాన్ని చేతనం చేసాను. గతంలో ఇది పనిచేసేది కాదు. ఇప్పుడు పనిచేస్తోంది. ఇది 100% విజయం.
- అనువాదాలు: స్థానికీకరణలు చాలానే చేసాను. లెక్కించలేదు.
పేరుబరి వారీగా నా దిద్దుబాట్లు:
[మార్చు]వికీపీడియా: 139 (రచ్చబండను మినహాయించి) :: వికీపీడియా చర్చ: 38
మీడియావికీ: 3
మాడ్యూల్: 105
నా నిర్వాహకత్వం గురించి చెప్పేదేమైనా ఉంటే, ముఖ్యంగా విమర్శ ఉంటే, దీని చర్చా పేజీలో రాయండి.
ఈ కాలంలో నేను చేసిన మొత్తం దిద్దుబాట్లు: 12663