Jump to content

వికీపీడియా:వికీప్రాజెక్టు/భారతదేశ జిల్లాల పేజీల పునర్వ్యవస్థీకరణ

వికీపీడియా నుండి

ప్రాజెక్టు పరిధి: భారతదేశపు జిల్లాలకు, వాటి ముఖ్యపట్టణాలకూ విడివిడిగా పేజీలను తయారుచెయ్యడం. ప్రస్తుతమున్న పేజీల్లో సంబంధిత మార్పులు చెయ్యడం

రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని జిల్లాలన్నిటికీ గతంలో పేజీలు తయారు చేసాం. ప్రస్తుతం చాలా జిల్లాలకు, జిల్లాకు జిల్లా ముఖ్యపట్టణానికీ ఒకే పేజిiని వాడుతున్నాం. అలా కాకుండా ఈ రెండు పేజీలను వేరుచేసే, సంబంధిత పేజీల్లో లింకులను సరిచేసే పని సమన్వయ పరచడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం.

సమస్య ఏంటి?

[మార్చు]

ముందుగా సమస్య ఏంటో చూద్దాం..

  • తొలి అడుగు పేజీలు: పని మొదలుపెట్టేందుకు ఒక ఆరంభ స్థలమే ఈ తొలి అడుగు పేజీ. అది భారతదేశ జిల్లాల జాబితా పేజీ కావచ్చు. లేదా ఏదైనా రాష్ట్రపు పేజీని తీసుకోవచ్చు. ఉదాహరణకు పంజాబ్. లేదా వర్గం:పంజాబ్ జిల్లాలు అనే వర్గం పేజీని కూడా తొలి అడుగు పేజీగా తీసుకోవచ్చు.
  • పై తొలి అడుగు పేజీల్లో ఉన్న జిల్లాల పేజీలను పరిశీలించండి. ఫలానా జిల్లాకు ఫలానా ("ఫలానా జిల్లా" అని కాకుండా) అనే పేరుతో పేజీ ఉంది, ఈ జిల్లాకు ముఖ్యపట్టణం ఫలానా పట్టణమే. (జిల్లాకు ముఖ్యపట్టణం ఏదో ఖచ్చితంగా తెలుసుకునేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వ అధికారిక సైటు చూడవచ్చు.) ఉదాహరణకు పటియాలా జిల్లాను తీసుకుంటే ఇక్కడ "పటియాలా జిల్లా", "పటియాలా" (పట్టణం) అనే రెండు పేజీలుండాలి. కానీ తొలి అడుగు పేజీల్లో మాత్రం రెంటికీ ఒకటే పేజీని చూపిస్తున్నాయి (చాలా రాష్ట్రాల్లోని జిల్లాలకు అలానే ఉంది).

ఇప్పుడు జిల్లా పేజీని, ముఖ్య పట్టణం పేజీని విడివిడిగా సృష్టించడమే ఈ ప్రాజెక్టు ముఖ్యోద్దేశం. దాంతోపాటు చెయ్యవలసిన అనుబంధ పనులు కూడా ఇందులో భాగమే.

ఏమేం పనులు చెయ్యాలి, ఎలా చెయ్యాలి

[మార్చు]

ఇప్పుడు చెయ్యాల్సిన పనులేంటో చూసేందుకు పటియాలా పేజీనే ఉదాహరణగా తీసుకుని కొనసాగుదాం.

వెతకడం: "పటియాలా జిల్లా" అనే పేజీ అసలు ఉందా అనేది చూడాలి. జిల్లాకు విడిగా పేజీ ఉన్నప్పటికీ, తొలి అడుగు పేజీల్లో దాన్ని చూపించక పోయి ఉండవచ్చు. అమృత్‌సర్ విషయంలో అలా జరిగింది. అమృత్‌సర్ జిల్లా అనే పేజీ ఉంది. అమృత్‌సర్ పట్టణం పేజీ కూడా ఉంది. కానీ అమృత్‌సర్ జిల్లా అని ఉండాల్సిన చోటల్లా అమృత్‌సర్ పట్టణం లింకే ఉంది. అంచేత ముందుగా జిల్లా పేజీ ఉందో లేదో వెతికి చూడాలి. ఆ తరువాత..

ప్రధానమైన మార్పులు

[మార్చు]

ప్రధానమైన మార్పు ఏంటంటే.., జిల్లాకు ముఖ్య పట్టణానికీ వేరువేతు పేజీలు ఉండేలా చూట్టం. ఇందులో రెండు సంభావ్యతలున్నాయి:

  • జిల్లాకు, ముఖ్య పట్టణానికీ వేరువేరు పేజీలు ఉన్నాయి, కానీ తొలి అడుగు పేజీల్లో వాటిని చూపించలేదు: ఉదాహరణకు అమృత్‌సర్ అన్నమాట. అంటే కొత్తగా జిల్లాకు పేజీ సృష్టించాల్సిన పని లేదు. సింపులుగా తొలి అడుగు పేజీలో జిల్లా పేజీ లింకును ఫలానా జిల్లా అని మారిస్తే సరిపోతుంది. ఫలానా పట్టణానికి ఫలానా అనే పేరే ఉంటుంది. ఉదాహరణకు, అమృత్‌సర్ జిల్లాకు పట్టణానికీ వేరువేరు పేజీలున్నాయి గానీ, చూపించలేదు. ఇక్కడ జిల్లా పేజీ లింకును మారిస్తే సరిపోతుంది.
  • జిల్లాకు, ముఖ్య పట్టణానికీ వేరువేరు పేజీలు లేవు:
    • ఆ పేజీని తెరవండి. అందులో జిల్లా గురించి రాసారా, పట్టణం గురించి రాసారా అనేది చూడండి
    • జిల్లా గురించి రాసి ఉంటే దాన్ని ఫలానా జిల్లా అనే పేరుకు తరలించండి. ఉదాహరణకు: పటియాలా --> పటియాలా జిల్లా. ఆ తరువాత "పటియాలా" పట్టణం కోసం ఒక కొత్త పేజీని సృష్టించండి.
    • ఆ పేజీలో పట్టణం గురించిన సమాచారం ఉంటే, "పటియాలా జిల్లా" అనే పేరుతో కొత్త పేజీని సృష్టించండి.
    • ఒకవేళ ఆ పేజీలో రెండింటి గురించి రాసి ఉంటే, దాన్ని జిల్లా పేజీగా చెయ్యండి. అందులోని పట్టణ సమాచారాన్ని తీసేసి, దాంతో పట్టణం పేజీని కొత్తగా సృష్టించండి.

గమనిక: కొత్త పేజీల్లో రాసేందుకు సమాచారం కోసం వెతకవద్దు. నేరుగా ఇంగ్లీషు వికీలోని పేజీకి వెళ్ళి ఆ సమాచారాన్ని అనువదించి ఇక్కడ పెట్టండి.

ఇతర మార్పులు

[మార్చు]

పేజీలో చెయ్యాల్సిన మార్పులు

[మార్చు]

జిల్లాకు, ముఖ్యపట్టణానికీ వేరువేరు పేజీలను సృష్టించేసాక, ఇకా ఆ పేజీల్లో ఈసరికే ఉన్న పాఠ్యంలో ఏమేం మార్పులు చెయ్యాలో చూడాలి. కింది పనులను పరిశీలించండి.

  1. జిల్లా పేజీలో జిల్లాకు సంబంధించిన సమచారం మాత్రమే ఉండాలి. పట్టణానికి సంబంధించిన సమాచారం పరిమితంగా, ఉచితమైనంత మాత్రమే ఉండాలి. అంతేతప్ప జిల్లా పేజీలో పట్టణ చరిత్ర అంతా రాసెయ్యకూడదు.

అలాగే జిల్లా పేజీలో జిల్లా పేజీకి సంబంధించిన మూసలే ఉండాలి, పట్టానికి చెందిన మూసలు ఉండరాదు. ఉదాహరణకు అమృత్‌సర్ జిల్లా పేజీలో పంజాబ్ పట్టణాలు అనే మూస ఉండకూడదు. అమృత్‌సర్ పట్టణం పేజీలో పంజాబ్ జిల్లాలు అనే మూస ఉండరాదు.

మూసల్లో చెయ్యాల్సిన మార్పులు

[మార్చు]
  • రాష్ట్రం లోని జిల్లాల పేజీలన్నిటినీ ఒకచో చేర్చి మూసను తయారు చేసాం. దానిలో జిల్లా పేజీ లింకులను సరిచెయ్యాలి. అంటే అందులో పట్టణం పేజీకి లింకు ఉంటే దాన్ని జిల్లా పేజీకి మార్చాలి.
  • మూస పేరు (మూసలో ఉండే name అనే పరామితి), మూస పేజీపేరు రెండూ ఒకటే ఉండాలి. అలా లేకపోతే name పరామితిని సరిచెయ్యాలి. మరిన్ని వివరాలకు వికీపీడియా:వాడుకరులకు సూచనలు#మూసపేరు, మూస పేజీపేరు చూడండి.

సూచిక పేజీల్లో మార్పులు

[మార్చు]

జాబితా పేజీల్లో, రాష్ట్రం పేజీల్లోను, (పైన చూపించిన తొలి అడుగు పేజీలన్న మాట) ఇతర సూచిక పేజీల్లోనూ లింకులు మార్చాలి. అలాంటి కొన్ని పేజీలు ఇవి:

  1. రాష్ట్రం పేజీ. ఉదా: పంజాబ్
  2. రాష్ట్రంలోని జిల్లాలు అనే పేజీ. ఉదా: పంజాబ్ జిల్లాలు
  3. భారతదేశ జిల్లాల జాబితా పేజీ

ఇతర ఇన్‌కమింగు లింకుల్లో మార్పులు

[మార్చు]

మన ఉదాహరణలో పటియాలా పేజీని పటియాలా జిల్లా కు తరలించాం, పటియాలా కు కొత్త పేజీని సృష్టించాం. ఇప్పుడు పటియాలా అనే పేజీకి ఉన్న ఇన్‌కమింగు లింకులను సవరించాలి. గతంలో రెంటికీ ఒకటే పేజీ ఉంది కాబట్టి, అన్ని లింకులూ దానికే వచ్చేవి. ఇప్పుడు ఆ లింకుల్లోంచి పట్టణానికి వెళ్ళాళ్సిన లింకులను అలాగే ఉంచేసి, జిల్లాకు వెళ్ళాల్సిన వాటిని మాత్రం పటియాలా జిల్లాకు సవరించాలి. అసలు ఏయే లింకులున్నాయో చూసేందుకు, నేవిగేషను పట్టీ లోని "ఇక్కడికి లింకున్న పేజీలు" అనే అంశాన్ని వాడుకోవాలి.

వర్గాల్లో మార్పులు

[మార్చు]

జిల్లా పేజీ, పట్టణం పేజీలు సరైన వర్గం లోనే ఉన్నాయని నిర్ధారించుకోవాలి. ఉదాహరణకు అమృత్‌‌సర్ జిల్లా పేజీ వర్గం:పంజాబ్ జిల్లాలు అనే వర్గంలో ఉండాలి. అమృత్‌‌సర్ పేజీ వర్గం:పంజాబ్ జిల్లాలు వర్గంలో ఉండకూడదు. అది వర్గం:పంజాబ్ పట్టణాలు, నగరాలు అనే వర్గంలో ఉండాలి. ఆ సవరణలు చెయ్యాలి.

సమాచారపెట్టెల సవరణ, శీర్షికల వ్యాసాల లింకులు కలుపుట

[మార్చు]

జిల్లా వ్యాసాల, ముఖ్య పట్టణాల వ్యాసాలలోని సమాచారపెట్టెలలో కొన్ని మార్పులు చేయవలసిన అవసరముంది.ఈ పని కొద్దిగా కష్టంగా ఉండవచ్చు.కొంత సమాచారం ఆంగ్లంలో ఉంది.కొంత సమాచారం తెలుగులో ఎర్ర లింకులలో ఉంది. తెలుగులో ఉన్న ఎర్ర లింకులు కేవలం సరియైన తెవికీ వ్యాసం పేజీ లింకులు గమనించి కలపనందున అలా ఎర్ర లింకులు ఉన్నవి.వాటిని సవరణలు చేసేటప్పుడు గమనించాలంటే కష్టంగా భావించి, ఆ శీర్షికల పేజీలు దిగువన వివరించటమైనది.ఇందులో కొన్ని శీర్షికల పదాలు వ్యాసాల సమాచారంలో కూడా ఎక్కువుగా ఉంటాయి.గమనించినవాటికి లింకులు కలపవచ్చు.

అంతర్వికీ లింకుల్లో మార్పులు

[మార్చు]

జిల్లా పేజీ సృష్టించడానికి ముందు, ముఖ్యపట్టణం పేజీకీ ఇంగ్లీషు వికీ లోని జిల్లా పేజీకీ లింకు పెట్టి ఉండవచ్చు. ఇప్పుడు జిల్లా పేజీని సృష్టించాం కాబట్టి తెవికీ లోని జిల్లా పేజీని ఎన్వికీ జిల్లా పేజీకి, తెవికీ లోని ముఖ్యపట్టణం పేజీని ఎన్వికీ ముఖ్యపట్టణం పేజీకీ లింకు చెయ్యాలి. ఇందుకు వికీడేటా లోని అంశం పేజీలో వికీపీడియా లింకులను మార్చాల్సి ఉంటుంది.

రాష్ట్రాల, జిల్లాల పునర్వ్యవస్థీకరణ వివరాలు

[మార్చు]

ఇది అరుదుగా జరిగే పని. కానీ జరుగుతాయి. ఉదాహరణకు జమ్మూ కాశ్మీరు రాష్ట్రం నుండి లడఖ్ విడిపోయింది. అలాంటివి ఇంకా ఏమైనా జరిగి వికీ పేజీల్లో తగు మార్పులు చెయ్యలేదేమో చూడాలి. కొన్ని రాష్ట్రాల్లో కొత్త జిల్లాలు ఏర్పడవచ్చు. ఉదాహరణకు తెలంగాణ. అలాంటివి ఇంకా ఏమైనా ఉన్నాయేమో చూడాలి. అందుకుగాను కింది వనరులను సంప్రదించవచ్చు.

వనరులు

[మార్చు]

రాష్ట్రాల్లో ఏయే జిల్లాలున్నాయనే విషయాన్ని కింది భారత ప్రభుత్వ వెబ్‌సైట్లలో చూసి నిర్ధారించుకోవచ్చు.

  1. భారత ప్రభుత్వ సైటు
  2. భారత ప్రభుత్వ వెబ్ డైరెక్టరీ

వ్యవధి

[మార్చు]

కచ్చితమైన గడువు తేదీ అంటూ ఏమీ లేదు. మీ వీలును బట్టి పని చెయ్యవచ్చు.

పాల్గొనే వారు

[మార్చు]

ఆసక్తి ఉన్నవారెవరైనా ఈ పనిలో పాలుపంచుకోవచ్చు. కింద సంతకం చేసి, ఆ కింది పట్టికలోంచి ఏదో ఒక రాష్ట్రాన్నో కేంద్రపాలిత ప్రాంతాన్నో ఎంచుకుని పనిచెయ్యండి.

  1. చదువరి (చర్చరచనలు) 04:18, 31 అక్టోబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  2. ప్రభాకర్ గౌడ్ నోముల(చర్చ)06:52, 31 అక్టోబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  3. --యర్రా రామారావు (చర్చ) 07:14, 2 నవంబర్ 2020 (UTC)
  4. ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 12:53, 3 నవంబర్ 2020 (UTC)
  5.  – K.Venkataramana  – 02:41, 8 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
  6. Nskjnv ☚╣✉╠☛ 16:08, 19 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

సంప్రదించేందుకు

[మార్చు]

ఈ ప్రాజెక్టు విషయమై ఏమైనా సందేహాలుంటే కింది వారిని సంప్రదించవచ్చు:

  1. చదువరి (చర్చరచనలు)

కృషి వివరం

[మార్చు]

ఈ ప్రాజెక్టులో మీరు చేసిన కృషి గురించిన సవివరమైన నివేదికను పురోగతి పేజీలో రాయండి. సారాంశాన్ని కింది పట్టికలో నమోదు చెయ్యండి. పని మొదలుపెట్టే ముందే ఈ పట్టికలో, సంబంధిత జిల్లా వరుసలో మీ పేరు చేర్చండి. తద్వారా ఆ రాష్ట్రం పేజీల్లో ఎవరెవరు పనిచేస్తున్నారో ఇతరులకు తెలుస్తుంది.

రాష్ట్రాలు

[మార్చు]
సం. రాష్ట్రం మొత్తం జిల్లాల

సంఖ్య

పని స్వీకరించిన

వాడుకరి

పని పూర్తి చేసిన

జిల్లాల సంఖ్య

పని స్వీకరించిన

వాడుకరి

పని పూర్తి చేసిన

జిల్లాల సంఖ్య

పని స్వీకరించిన

వాడుకరి

పని పూర్తి చేసిన

జిల్లాల సంఖ్య

మొత్తం మీద పని పూర్తయిన జిల్లాల సంఖ్య
1 అరుణాచల్ ప్రదేశ్ 25 యర్రా రామారావు 25 తలపెట్టిన పనంతా అయిపోయింది
2 అస్సాం 33 ప్రణయ్‌రాజ్ వంగరి 33 తలపెట్టిన పనంతా అయిపోయింది
3 ఆంధ్రప్రదేశ్ 13 యర్రా రామారావు 13 తలపెట్టిన పనంతా అయిపోయింది
4 ఉత్తరప్రదేశ్ 75 చదువరి 75 తలపెట్టిన పనంతా అయిపోయింది
5 ఉత్తరాఖండ్ 13 యర్రా రామారావు 13 తలపెట్టిన పనంతా అయిపోయింది
6 ఒడిశా 30 చదువరి 30 తలపెట్టిన పనంతా అయిపోయింది
7 కర్ణాటక 30 ప్రభాకర్ గౌడ్ నోముల 8 యర్రా రామారావు తలపెట్టిన పనంతా అయిపోయింది
8 కేరళ 14 నేతి సాయికిరణ్ 14 యర్రా రామారావు తలపెట్టిన పనంతా అయిపోయింది
9 గుజరాత్ 33 చదువరి, ౩౩ యర్రా రామారావు తలపెట్టిన పనంతా అయిపోయింది
10 గోవా 2 ప్రభాకర్ గౌడ్ నోముల 2 తలపెట్టిన పనంతా అయిపోయింది
11 చత్తీస్‌గఢ్ 27 చదువరి 27 తలపెట్టిన పనంతా అయిపోయింది
12 జార్ఖండ్ 24 చదువరి 24 తలపెట్టిన పనంతా అయిపోయింది
13 తమిళనాడు 38 ప్రభాకర్ గౌడ్ నోముల, 38 యర్రా రామారావు తలపెట్టిన పనంతా అయిపోయింది
14 తెలంగాణ 33 యర్రా రామారావు 33 తలపెట్టిన పనంతా అయిపోయింది
15 త్రిపుర 8 ప్రణయ్‌రాజ్ వంగరి 8 తలపెట్టిన పనంతా అయిపోయింది
16 నాగాలాండ్ 12 ప్రణయ్‌రాజ్ వంగరి 12 తలపెట్టిన పనంతా అయిపోయింది
17 పంజాబ్ 22 చదువరి 22 తలపెట్టిన పనంతా అయిపోయింది
18 పశ్చిమ బెంగాల్ 23 యర్రా రామారావు 23 తలపెట్టిన పనంతా అయిపోయింది
19 బీహార్ 38 చదువరి 38 తలపెట్టిన పనంతా అయిపోయింది
20 మణిపూర్ 16 ప్రణయ్‌రాజ్ వంగరి 16 తలపెట్టిన పనంతా అయిపోయింది
21 మధ్య ప్రదేశ్ 52 చదువరి 51 ఒక జిల్లా పేజీ, దాని ముఖ్యపట్టణం పేజీ తప్ప మిగతా పనంతా ఐపోయింది.

ఈ రెండు పేజీలు ఇంగ్లీషులో కూడా లేనందువల్ల సృష్టించలేక పోయాను.

22 మహారాష్ట్ర 36 ప్రభాకర్ గౌడ్ నోముల చదువరి (చర్చరచనలు) 36 తలపెట్టిన పనంతా అయిపోయింది
23 మిజోరం 11 ప్రణయ్‌రాజ్ వంగరి 11 తలపెట్టిన పనంతా అయిపోయింది
24 మేఘాలయ 11 ప్రణయ్‌రాజ్ వంగరి 11 తలపెట్టిన పనంతా అయిపోయింది
25 రాజస్థాన్ 33 యర్రా రామారావు 33 తలపెట్టిన పనంతా అయిపోయింది
26 సిక్కిం 4 ప్రణయ్‌రాజ్ వంగరి 4 తలపెట్టిన పనంతా అయిపోయింది
27 హర్యానా 22 చదువరి 22 తలపెట్టిన పనంతా అయిపోయింది
28 హిమాచల్ ప్రదేశ్ 12 చదువరి 12 తలపెట్టిన పనంతా అయిపోయింది

కేంద్రపాలిత ప్రాంతాలు

[మార్చు]
సం. కేంద్రపాలిత

ప్రాంతం

మొత్తం జిల్లాల

సంఖ్య

పని స్వీకరించిన

వాడుకరి

పని పూర్తి చేసిన

జిల్లాల సంఖ్య

మొత్తం మీద పని పూర్తయిన జిల్లాల సంఖ్య
1 అండమాన్ నికోబార్ దీవులు 3 యర్రా రామారావు 3 తలపెట్టిన పని అంతా పూర్తైంది
2 చండీగఢ్ 1 యర్రా రామారావు 1 తలపెట్టిన పని అంతా పూర్తైంది
3 జమ్మూ కాశ్మీరు 20 యర్రా రామారావు 20 తలపెట్టిన పని అంతా పూర్తైంది
4 ఢిల్లీ (జాతీయ రాజధాని ప్రాంతం) 11 యర్రా రామారావు 11 తలపెట్టిన పని అంతా పూర్తైంది
5 దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ

(ఈ రెంటినీ ఈమధ్య కలిపేసారు)

3 ప్రభాకర్ గౌడ్ నోముల 3 తలపెట్టిన పనంతా అయిపోయింది
6 పుదుచ్చేరి 4 యర్రా రామారావు 4 తలపెట్టిన పని అంతా పూర్తైంది
7 లడఖ్ 2 యర్రా రామారావు 2 తలపెట్టిన పని అంతా పూర్తైంది
8 లక్షద్వీప్ 1 యర్రా రామారావు 1 తలపెట్టిన పని అంతా పూర్తైంది