Jump to content

వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/భారతదేశ జిల్లాల పేజీల పునర్వ్యవస్థీకరణ

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

వేరే పేర్లతో పేజీలు

[మార్చు]

కొన్ని జిల్లాలకు పేజీలు ఉన్నప్పటికీ మనకు తెలియడం లేదు. మనం వెతికే పేరుతో కాక వేరే పేరుతో పేజీ ఉండడం వలన ఇది జరుగుతోంది. ఇతర రాష్ట్రాల్లోని జిల్లాల పేర్లు మనకు సరిగ్గా తెలియకపోవడం వలన గానీ, జిల్లాల పేర్లు మార్చడం వలన గానీ ఇలా జరుగుతోంది. కాబట్టి కొత్త పేజీని సృష్టించే ముందు కింది జాగ్రత్తలు తీసుకోవాలి.

  1. స్పెల్లింగు దగ్గరగా ఉన్న వేరే పేర్లతో వెతకాలి; ఉదాహరణకు అమేథి కోసం వెతుకుతున్నామనుకోండి.. అమేథీ (చివర్లో దీర్ఘం), అమెథి, అమెథీ కోసం కూడా వెతకాలి. అలాగే చివర్లో గర్హ్ (garh) అని ఉండే పేర్లను గఢ్ అని పలకాలి. ఉదా: చత్తీస్‌గఢ్, చండీగఢ్, హనుమాన్ గఢ్ ఇలాగ. ఇలాంటివి గర్హ్ అని రాసారేమో వెతకాలి.
  2. ఉత్తరాది పేర్లలో మధ్యలో పొల్లు వస్తూంటుంది. అలాంటి చోట్ల పదాన్ని విడదీసీ, విడదీయకుండానూ వెతకాలి.
  3. పేజీకి హిందీలో పేరు ఏముందో చూడండి. అమేథీకి పేజీపేరు హిందీలో అమేఠీ అని ఉంది. ఆ పేరుతో తెవికీలో వెతకాలి.
  4. ఆ రాష్ట్రపు జిల్లాల వర్గంలో వేరే పేరుతో పేజీ ఏదైనా ఉందేమో చూడండి.

ఇంకా ఏమైనా కిటుకులుంటే ఇక్కడ రాయండి. __చదువరి (చర్చరచనలు) 03:15, 23 నవంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారు, ఇది మంచి ప్రాజెక్ట్ అండి. మీకు తోడుగా పూర్తి సమయం ఈ ప్రాజెక్టుకు నేను కేటాయిస్తా అనుకుంటున్నా పూర్తిగా ఖాళీగా ఉన్నా, నా ప్రాజెక్టు 40 శాతం దాటింది. ప్రస్తుతానికి ఆపేశాను. ఈ ప్రాజెక్టు కొద్దిరోజులు చేయాలనుకుంటున్నా ఇందులో మీ సహాయ సహకారాలు చాలా అవసరం ఉంది. మీకు తెలియంది కాదు, ప్రతి జిల్లా పేజీని, పట్టణ పేజీని కలిపి తయారు చేశారు. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలోని వ్యాసాలను విడదీసి రాయాలి. వాడుకరులకు ఈ ప్రాజెక్టు అనువైనది కాదు, మీకు వీలుంటే జిల్లా కేంద్రాన్ని, జిల్లా వ్యాసాన్ని వేరు చేసినచో ఉదా: ముందుగా గుల్బర్గా జిల్లా, గుల్బర్గా పట్టణం తొలగించారు. కానీ ఉన్నట్లుగా చూపిస్తుంది[[1]]. పెద్ద పేరు గల జిల్లా కాబట్టి దానితో ప్రారంభించాలనుకుంటున్నాను. మీరు దాన్ని చూడగానే నేను ప్రారంభిస్తాను. మీకు అభ్యంతరం లేకపోతే వాట్సాప్ లో ఏ పేజీ నాకు ఇబ్బంది ఉందో మీకు తెలియజేస్తాను. ధన్యవాదాలు. __ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 04:42, 18 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రభాకర్ గారూ, ధన్యవాదాలు. "గుల్బర్గా" పేజీని ఇదివరలో తొలగించారు. ఆ తొలగించిన పేజీకి గురిపెట్టిన దారిమార్పు పేజీ "గుల్బర్గా జిల్లా". గమ్యం పేజీ ఎలాగూ లేదు కాబట్టి ఈ దారిమార్పు పేజిని కూడా తొలగించాను. ఇక మీరు నిక్షేపంగా ఆ రెండు పేజీలనూ సృష్టించవచ్చు.
పోతే, వాట్సాప్ అనేది నేను అంతగా ఇష్టపడనండి. వికీ పనులకు సంబంధించిన చర్చలు వికీలోనే చెయ్యాలని నేను భావిస్తాను. అందుకే వాట్సాప్ వికీ గుంపుల్లో కూడా అంతగా పాల్గొనను. పైగా కంప్యూటర్లో వికీలో రాసుకున్నంత సుఖంగా హాయిగా ఆ వాట్సాపులో, మొబైల్లో రాయలేన్నేను. కానీ, మీరు అడిగారు కాబట్టి.. ఏదైనా ఒక విషయానికి సంబంధించి ఆ వాట్సాపే అనుకూలంగా ఉంటుందని మీరు ఎప్పుడైనా భావిస్తే, అలాగే రాయండి. ఇంకో సంగతేంటంటే.., మన సందేహాలు సమస్యలు ఇక్కడ చెబితే పదిమందీ చూస్తారు (వ్యాఖ్యానించకపోవచ్చు గానీ, చాలామంది చూస్తారు). దాని వలన రెండుపయోగాలు - మనకొచ్చిన సమస్యే ఇతరులకూ ఉంటే పరిష్కారం గురించి వాళ్లకూ తెలుస్తుంది. అలాగే మనం చెప్పే పరిష్కారం సరైనదో కాదో ఇతరులు కూడా చూసి తప్పైతే సరిచేసే వీలూ ఉంటుంది. పరిశీలించండి.
మీ ప్రాజెక్టు ఆపానని అంటున్నారు. ఆ వంద అనువాదాల ప్రాజెక్టేనా? ఆపడమెందుకు సార్.. కానివ్వండి. ఈ జిల్లాల ప్రాజెక్టు ఒక నెలలోనో రెణ్ణెల్ల లోనో అవగొట్టాల్సిన ప్రాజెక్టేమీ కాదు. ఇది సాగుతూ ఉంటుంది. మీరు దీనితో పాటు మీ ప్రాజెక్టునూ సాగించాలని నా కోరిక. (నేను దీని కోసం నా ఇతర పనులను ఆపెయ్యలేదు. కాకపోతే వాటికిచ్చే సమయం కుసింత తగ్గిందంతే) __చదువరి (చర్చరచనలు) 05:14, 18 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారు, చండీగఢ్ తెలుగులో వ్యాసం ఉంది. en:Chandigarh ఆంగ్లంలో కూడా జిల్లాకు నగరానికి కలిపి ఒకే పేజీ ఉంది. hi:चण्डीगढ़ హిందిలో కూడా జిల్లాకు నగరానికి కలిపి ఒకే పేజీ ఉంది. ఏమి చేయమంటారు. తెలుపగలరు. అలాగే, నిన్న మొన్న నేను చేసిన అనువాదం పేజీలు గోవా, డయ్యూ డామన్ పేజీల నాణ్యత ఎలా ఉంది. ఒక మాట చెప్పండి అని మనవి... అలాగే, నిన్న మొన్న నేను చేసిన అనువాదం పేజీలు గోవా, డయ్యూ డామన్ పేజీల నాణ్యత ఎలా ఉంది. ఒక మాట చెప్పండి అని మనవి...ఎందుకు అంటున్నాను అంటే నేను మాటవరసకి వికీ గురించి నాకు ఏమీ తెలియదు, అంటే నిజంగానే నన్ను జీరో చేశారు. నా ఉద్దేశం కొత్త అంశాలు నాకు తెలియనివి ఏమైనా చెప్తారేమో అని నేను భావించాను. చీమ 1 అనుకుంటే శివుడు ఒకటి అనుకున్నట్లు, నేను కుట్టగానే చనిపోవాలి(మనిషి అని) చీమ అనుకుంటే, ఓహో చీమ చనిపోవాలని అనుకుంటుంది, అని శివుడు అనుకున్నట్లు. జరిగింది నా విషయం. __ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 14:20, 21 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రభాకర్ గౌడ్ నోముల గారూ, చండీగఢ్ గురించి ఇంగ్లీషు పేజీని చూసానండి. మీరన్నట్టు జిల్లాకు, నగరానికీ ఒకే పేజీ ఉంది. బహుశా తరువాత విడదీస్తారేమో! జిల్లా సమాచారం సరిపడా ఉందని మీరు భావిస్తే పేజీని విడదీయండి. లేదంటే మనమూ అలాగే ఉంచేద్దాం.__ చదువరి (చర్చరచనలు) 18:48, 21 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారు, అలాగేనండి. దన్యవాదాలు __ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 18:55, 21 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

విరమణ

[మార్చు]

చదువరి గారు, భారతదేశ జిల్లాల జాబితా/కర్ణాటక , 4, 5 నాలుగైదు వ్యాసాలు నేను చేశాను, మిగతావి అన్ని జిల్లా పేజీకి, పట్టణ పేజీకి దారి మార్పులు చేసి ఉన్నాయి, అవి అన్ని తొలగించాలి, వాడుకరులు చేసే పని కాదు, తమరు అన్ని చేస్తా అంటే నేను చేస్తాను, సిద్ధంగా ఉన్నాను లేదు అంటే ఆసక్తి ఉన్న సభ్యుల కాలం నుండి నా పేరు తొలగిస్తాను. __ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 10:42, 23 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రభాకర్ గారూ ప్రస్తుతం నేను చేస్తున్న పని కారణంగా బహుశా కొన్ని రోజుల పాటు నేను మీరడిగిన పని చెయ్యలేను. యర్రా రామారావు గారిని అడిగి చూస్తారా? __చదువరి (చర్చరచనలు) 11:24, 23 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారు, వికీపీడియా:వాడుకరుల గణాంకాలు/పేజీల సృష్టి గణాంకాలు పనులు చేస్తున్నారు కదా, చూశానండి, ప్రతి వాడుకరిని అబ్బురపరిచే విధంగా చాలా బాగా జరుగుతోంది. అలా పనులు చేస్తున్నారు, తెలుగు వికీపీడియాలో మీరొక ఎవరెస్ట్ శిఖరం అది ఎవరు కాదనలేని నిజం. ధన్యవాదాలు. __ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 11:51, 23 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఎర్రర్ లింకు వస్తుంది

[మార్చు]

చదువరి గారు, వెంకటరమణ గురువు గారు, ఈ ఆంగ్ల పేజీ en:Kallakurichi district అనువాద యంత్రంతో అనువదించ ప్రయత్నిస్తే ఎర్రర్ లింకు వస్తుంది. కారణం తెలియజేయండి లేదా సమస్య పరిష్కారం చేయాలని మనవి. __ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 16:59, 26 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రభాకర్ గౌడ్ నోముల గారూ, గమనించానండి. Critical error: Content translation failed to load due to internal error. అనే సందేశం వస్తోంది కదా. ఫ్యాబ్రికేటరులో నివేదించాను. చూద్దాం.__ చదువరి (చర్చరచనలు) 18:04, 26 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ పేజీ దయచేసి మార్చగలరు

[మార్చు]

చదువరి గారు, వెంకటరమణ గురువు గారు, ఈ పేజీ Ranipet రాణిపేట గా దయచేసి మార్చగలరు అనువాదం చేస్తుండగానే అనుకోకుండా ప్రచురితం అయింది. __ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 13:43, 27 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

తెలంగాణ జిల్లాల ముఖ్య పట్టణాల గురించి

[మార్చు]
చదువరి గారూ, తెలంగాణలో 33 జిల్లాలు ఉన్న సంగతి అందరికి తెలిసిన విషయమే! 33 జిల్లాల పేజీలు, 33 పట్టణాలు పేజీలు ఉన్నవి.అయితే 33 పట్టణ వ్యాసాలలో గద్వాల, మెదక్, నిజామాబాదు పట్టణాలకు మాత్రమే విడిగా పట్టణ వ్యాసాలు ఉన్నవి. మిగతా 30 పట్టణాలు భారత జనాభా లెక్కలు ప్రకారం అవి రెవిన్యూ గ్రామాలుగా కూడా గుర్తించబడినవి.పట్టణాన్ని గ్రామం అని అనలేం. రెవిన్యూ గ్రామం వేరు, పట్టణం వేరు.ప్రభుత్వ నిర్వచనం ప్రకారం ఎంత పెద్ద పట్టణం అయినా అది రెవెన్యూకు సంబందించినదైతే అది గ్రామంగా పరిగణించారు. గతంలో ఉన్న 30 పట్టణ వ్యాసాలనే జిల్లా ముఖ్య పట్టణాలగా, మండల ప్రధాన కేంద్రాలుగా, రెవెన్యూ గ్రామాలుగా పరిగణించి వాటికి మండలంలోని రెవెన్యూ గ్రామాలు మూస, కొన్ని పురపాలక సంఘం వ్యాసాలుకు ప్రత్యేక వ్యాసాలు లేనందున, జిల్లాలోని పురపాలక సంఘాలు మూసలు వాటికే తగిలించబడినవి.వాస్తవంగా అన్నీ వేరు వేరుగా పరిగణించాలి.ప్రస్తుతం ఉన్న 30 వ్యాసాలలో సందర్బానుసారం పరిశీలించి పట్టణ వ్యాసం లేదా రెవెన్యూ గ్రామ వ్యాసం ఈ రెండిటిలో ఏదో ఒకదానిని సృష్టించి, అవకాశం ఉన్నంత వరకు అభివృద్ధిపరచి, వర్గీకరించవలసి ఉంటుంది. --యర్రా రామారావు (చర్చ) 03:52, 6 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
యర్రా రామారావు గారూ, సరేనండి. మీరు విషయజ్ఞులు. మీరు చెప్పినట్టు గానే కానివ్వండి. __చదువరి (చర్చరచనలు) 01:51, 7 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

రాజస్థాన్ జిల్లాల ముఖ్య పట్టణాల గురించి

[మార్చు]

జైపూర్ రెండు వ్యాసాల విలీనం గురించి

[మార్చు]
చదువరి గారూ ఈ వ్యాసం జైపూర్ వ్యాసంలో విలీనం చేయాలనే ఉద్ధేశ్యంతో విలీనం మూస కూర్పు చేసారు.కానీ ఈ వ్యాసం వికీ డేటా లింకు పరిశీలించగా City Palace, Jaipur అనే ఆంగ్ల వ్యాసానికి కలుపబడింది.దీని శీర్షిక తప్పుగా ఉందనుకుంటాను.దీనిని జైపూర్ ప్యాలెస్ లేదా జైపూర్ రాజభవనం ఈ రెండిటిలో ఒకదానిని ప్రధాన శీర్షికగా సవరించి, రెండవది దారిమార్పు చేస్తే సరిపోతుందని నా అభిప్రాయం.ఈ వ్యాసం జైపూర్ (రాజస్థాన్) దీనికి వేరే వికీడేటా లింకు ఉంది. ఇది జైపూర్ జిల్లా ముఖ్యపట్టణ వ్యాసం.దీని విలీనం మూస తొలగిస్తే సరిపోతుంది.కాకపోతే ( జైపూర్ ) ఇంత పెద్ద వ్యాసం రాసారు,కానీవిచిత్రమేమిటంటే ఒక్కటంటే ఒక్క మూలం ఉంటే ఒట్టు. మనకు మంత్రసానితనం ఒప్పుకున్నాక తప్పుదు కదా? మీ అభిప్రాయం, సూచనలు, నిర్ణయం తెలుపగలరు.--యర్రా రామారావు (చర్చ) 11:55, 8 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]