చర్చ:కోళ్లూరు గనులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకిలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు జాబితా చేసి ఆ పుస్తకాల ద్వారా వికీపీడియాలోని వ్యాసాలు అభివృద్ధి చేయడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


మహా మొఘల్ కోహినూర్ ఒక్కటే

[మార్చు]

ప్రఖ్యాత చరిత్రకారుడు దిగవల్లి వేంకటశివరావు రచించిన కథలు గాథలులో కోహినూరు వజ్రము-నెమలి సింహాసనం అన్న వ్యాసం ఉంది. దానిలో మహా మొఘల్ అనే విలువైన వజ్రం, కోహినూర్ వజ్రం ఒక్కటేనని వ్రాశారు. నిజానికి కోహినూర్ అన్న పేరు దానికి నాదిర్షా పెట్టాకా వచ్చింది. పెట్టకముందు ఇంతటి విలువైన వజ్రానికి వేరే పేరుండాలి. దానికి మొఘల్ పాదుషాల వద్ద ఉన్నప్పుడు మహా మొఘల్ అన్న పేరే ఉండేదని వ్రాశారు. ఇక వీటి బరువులు కూడా వేర్వేరుగా కనిపిస్తున్నా అదంతా వేరే కాలాల్లో మెరుగులు పెట్టేప్పుడు జరిగే మార్పులని భావించవచ్చు. రెండూ ఒకటో కాదో నిర్ధారించేందుకు వేరేదేనా విలువైన సోర్సులున్నాయంటారా? ఎవరైనా చెప్పగలరా?--పవన్ సంతోష్ (చర్చ) 15:59, 11 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

సరియైన పేరు గురించిన చర్చ

[మార్చు]
క్రింది చర్చ ముగిసింది. దయచేసి దీనిని మార్చవద్దు. కొత్త వ్యాఖ్యలు ఎవైనా కొత్త విభాగంలో చేర్చండి.

కొల్లూరు గనులు అన్న పదమే ప్రసిద్ధిలో ఉంది తప్పించి సరైన పేరైనా కూడా కోళ్ళూరు గనులు అన్న పదం అంత వాడుకలో లేదు. ఉదాహరణకు గూగుల్లో కొల్లూరు వజ్రాలు అంటే 3,290 ఫలితాలు, కొల్లూరు గనులు అంటే 2560 ఫలితాలూ, కోళ్ళూరు గనులు అంటే పాతిక ఫలితాలూ, అందులోనూ కేవలం వికీ కానివి మూడే మూడు. వికీపీడియాలో నామకరణ పద్ధతులు పరిశీలిస్తే సాధారణంగా గుర్తుపట్టదగ్గ పేరు ఉండాలని ఉంటుంది. దీన్నే సాధారణ నామం పాలసీ అనవచ్చు. (ఆంగ్లంలో కామన్ నేమ్) ఆంగ్ల వికీలో కూడా ఇదే పద్ధతిని అనుసరించి "నార్త్ కొరియా" అని పేరు పెడతారు, నిజానికి ఆ దేశం అసలైన అధికారికమైన పేరు "డెమోక్రాటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్‌ కొరియా", "గ్రేట్ పిరమిడ్ ఆఫ్‌ ఈజిప్ట్" అనే పేరుపెట్టారు తప్ప సరైన పేరైన "పిరమిడ్ ఆఫ్‌ ఖొఫూ"ను పట్టించుకోలేదు. కాబట్టి, సాధారణ నామం విధానం కింద దీన్ని కొల్లూరు గనులు అన్న పాత పేరుకు మార్చాలని, వ్యాసంలో మాత్రం మొదటి పదంలోనే (ఆపైన వ్యాసభాగంలో విడిగా ఓ పేరా కేటాయించి, వివరంగా రాయాలి) దీని అసలుపేరు కోళ్ళూరు గనులు అన్న విషయాన్ని రాయాలని ప్రతిపాదిస్తున్నాను. కోళ్ళూరు గనులు అన్న అసలైన పేరును వెలికి తెచ్చిన యర్రా రామారావు గారి కృషిని తక్కువ చేయడం ఉద్దేశం కాకపోయినా విధానాల పరంగానూ, జనంలో నానిన పేరు కావడంతో కొల్లూరు గనులు అన్న పేరే ఉండాలని ప్రతిపాదన. --పవన్ సంతోష్ (చర్చ) 03:33, 13 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

మరొక్క సంగతి - కేవలం గూగుల్‌లోనే కాదు, దిగవల్లి వెంకట శివరావు రాసిన కథలు-గాథలు రెండవ సంపుటిలోని 21వ పేజీలో "కోహినూరు" అన్న విభాగంలో "కోహినూరువజ్రం మన తెలుగుదేశంలో గుంటూరుసీమలో సత్తెనపల్లితాలూకాలో కొల్లూరు అనే గ్రామంలో ఒక వజ్రపుగనిలో దొరికింది." అనే రాశారు. --పవన్ సంతోష్ (చర్చ) 04:06, 13 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
గోగుల్ ఫలితాలు కాసేపు పక్కన బెడతాం.ఆ ప్రాంతం అసలు పేరు కోళ్లూరు.కొల్లూరు గనులు అని అనటానికి కొల్లూరు పేరుతో చాలా గ్రామాలు ఉన్నవి.కోళ్లూరును, కోల్లూరు అనటానికి అవకాశాలు ఉన్నవి.పూర్వపు సత్తెనపల్లి తాలూకాలో, కొల్లూరు అనే పేరుతో ఏ గ్రామం లేదు. ఇది సత్తెనపల్లి తాలూకా,పూర్వపు రాజుపాలెం సమితిలో కోళ్లూరు అనే పేరుతో గ్రామం ఉంది. బహుశా అది ఇప్పుడు పులిచింత ప్రాజెక్టు క్రింద ముప్పు గ్రామం మారి ఉండవచ్చుఅనుకుంటాను. ఈ సమితి పరిధిలో నేను పనిచేసాను.ఆ సమయంలో ఆ ప్రాంతానికి దగ్గరగా వెళ్లుట జరిగింది.అప్పటినుండి ఆ గ్రామం పేరు కోళ్లూరు అని నాకు తెలుసు.అందువలన ఆప్రాంతం కోళ్లూరుకు చెందినందున కోళ్లూరు గనులు అని తరలించి, కొల్లూరు అనే పేజీని తొలగించాను.కోల్లూరు అనే మరియొక పేజీని సృష్టించి దారిమార్పు చేస్తే బాగుంటుందని నాఅభిప్రాయం. లేదూ ఇంకా సౌలభ్యం కోసం కొల్లూరు గనులు అనే మరియొక పేజీని కూడా సృష్టించి దారిమార్పు చేయవచ్చు. వజ్రం దొరికింది ఈ ప్రాంతంలోనే అనే దానికి,ఆ ప్రాంతాన్ని కోళ్లూరు,కోల్లూరు అనే దానికి తగిన ఆధారాలుగా ఈ దిగువ లింకులను పరిశీలించవచ్చును.అయితే చివరి లింకులోకోల్లూరు, కొల్లూరు అని ఉంది --యర్రా రామారావు (చర్చ) 08:08, 13 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
దాని సరైన పేరు లేదా అధికారిక నామం కోళ్ళూరు అన్నది నిస్సంశయం రామారావు గారూ. ఆ వాస్తవాన్ని వ్యతిరేకించడం లేదు, అంగీకరిస్తున్నాను. (బీబీసీ రాసిన కోల్లూరు కూడా నేను చూశాను. కానీ, మీరన్న కోళ్ళూరు, జనం నోళ్ళలో నానిన కొల్లూరు కాక మధ్యలో ఉంది కదాని విడిచిపెట్టాను.) కానీ జనానికి తెలిసింది కొల్లూరు గనులు అనే. అందుకు విస్తృతమైన ఆధారాలు ఇంటర్నెట్ నిండా ఉన్నాయి, నేనిచ్చిన చారిత్రక గ్రంథాల్లోనూ ఉన్నాయి. సాధారణ నామాన్ని పేరుగా ఉంచి, సరైన, అధికారిక నామాన్ని వ్యాసంలో ఒక వాక్యంలో చెప్పవచ్చని సూచిస్తున్నాను. ఈ పాలసీ చూడ్డానికి విడ్డూరంగానే ఉంటుంది. ఉదాహరణకు చాలామంది రాజమహేంద్రవరం, ప్రయాగ్ రాజ్ అన్న అధికారిక పేర్లకు మార్చమని వివాదిస్తూ ఉంటారు. కానీ, ఆంగ్లంలో అవి సాధారణ నామాలైన రాజమండ్రి, అలహాబాద్‌గానే ఉంటాయి. అలానే దిల్లీ సరైన ఉచ్చారణ అయివుండొచ్చు. కానీ, మనం (ఈనాడు తరహాలో కాకుండా) ఇప్పటికీ ఢిల్లీ అనే వాడతాం. ఇదంతా కామన్ నేమ్ లేక సాధారణ నామం కారణంగానే. ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (చర్చ) 09:46, 13 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
మరొక్క ఉదాహరణ బుద్ధప్రసాద్ గారు రాసిన లండన్‍లో తెలుగు వైభవ స్మృతులు పుస్తకంలో కూడా కొల్లూరు గనులు అనే ప్రస్తావన ఉంది. అందులోనే తుమ్మల సీతారామమూర్తి చౌదరి గారి పాటలో చరణం ప్రస్తావించారు "కొల్లూరి కోహినూరు కొప్పలో బూవటే" అని. ఇలాంటి వ్యాప్తి ఉందని నా ఉద్దేశం. --పవన్ సంతోష్ (చర్చ) 09:53, 13 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ గారూ గూగుల్‌ ఫలితాలు మీద నాకు రెండు రకాలు అభిప్రాయాలు ఉన్నవి. అవగాహన ఉన్నవారు ఎక్కువమంది రాసిన పదాలుకు ఎక్కువ ఫలితాలు చూపిస్తాయి.అలాగే అవగాహన లేనివారు (ఇప్పటి తరం) తెలిసో తెలియకో తప్పుగా రాసే పదాలు ఎక్కువ ఉంటే ఈ పలితాలు చూపిస్తుందని నేను అనుకుంటాను. నా ఉద్ధేశ్యంలో గూగుల్ అన్ని వంటకాలు టేబుల్ మీద పెట్టి, మీ ఇష్టం వచ్చింది తినండి అనేవరకే దాని పాత్ర అని నా అభిప్రాయం. నేను కూడా కొన్ని పదాలు తప్పుగా రాసిన సందర్బాలు ఉండవచ్చు.సరే ఇది అలా ఉంచండి.ఈ విషయంలో మీరు ఎలా చేయాలనిపిస్తే అలా చేయండి.ఎలా చేసినా నాకు అభ్యంతరం ఏమీ లేదు.--యర్రా రామారావు (చర్చ) 16:51, 14 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు- రామారావు గారూూ, మనిద్దరం రెండు భిన్నమైన అభిప్రాయాలను కలిగివున్నందున ఎవరైనా ఇతరులు వచ్చి తమ ఉద్దేశం చెప్పనిద్దాం. ఇప్పటికి ఉంటానండీ. --పవన్ సంతోష్ (చర్చ) 13:41, 15 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ చర్చలో అభిప్రాయం ఎప్పుడో రాయాల్సింది. అప్పట్లో రాయడం ఆలస్యమైంది, ఆ తరువాత మరుగున పడింది. ఇప్పుడు మళ్ళీ రామారావు గారు "అభిప్రాయాల కోసం చర్చ" అనే మూస దీనికి పెట్టడంతో మళ్ళీ ముందుకొచ్చింది. ఇక ఇది మన దృష్టిని దాటిపోదు. ధన్యవాదాలు రామారావు గారు.
నిజమే, ప్రజా బాహుళ్యంలో ఎక్కువగా నానుతున్న పేరే మనమూ వాడాలి. కానీ అసలు ఈ గ్రామం పేరు కొల్లూరు కానే కాదు, అది కోళ్ళూరు. ఇంగ్లీషు నుండి తెలుగీకరణ చెయ్యడంలో పేరు అలా మారిపోయినట్టుగా తోస్తోంది. అలాంటి తప్పు పేరుతో దారిమార్పు పేజీని సృష్టించవచ్చు గానీ పేజీ పేరుగా మాత్రం అసలు పేరునే ఉంచాలి. తప్పు స్పెల్లింగులతో కూడిన పేర్లతో దారిమార్పు పేజీని సృష్టించడం మనకు తెలినిది కాదు. కానీ పేజీ మాత్రం సరైన స్పెల్లింగు తోనే కదా ఉండేది.
మరొక సంగతి.., మనకు కొల్లూరు అనే పేజీ ఇదొక్కటే అయితే, ఈ తప్పు పేరుతోనే పేజీని ఉంచే అవకాశం కొద్దో గొప్పో ఉండేదేమో. కానీ మనకు ఈ పేరుతో చాలా పేజీలున్నాయి. అవి కూడా తెలుగు రాష్ట్రాల్లోని గ్రామాలవే. అంటే చాలామందికి తెలిసినవే. అలా అనేక గ్రామాల్లో గనులున్న గ్రామం ఒక్కటే ఉండగా, అందునా దాని పేరు అసలు కొల్లూరే కానపుడు కొల్లూరు గనులు అని పెట్టకూడదనేది నా అభిప్రాయం. __చదువరి (చర్చరచనలు) 10:46, 12 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
అంచేత "కోళ్ళూరు గనులు" అనే పేరే ఉండాలని నా ఉద్దేశం. పరిశీలించండి.__చదువరి (చర్చరచనలు) 10:46, 12 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
కోళ్ళూరు గనులు అనే అభిప్రాయంపై 2009 ఫిబ్రవరి 16 న జరిగిన చర్చ:కోళ్ళూరు నందు గతంలోనే Nrahamthulla గారు ఈ దిగువ అభిప్రాయం వెలుబుచ్చారు.
" కొల్లూరు తెనాలి దగ్గర ఒక మండల కేంద్రం. కోళ్ళూరు బెల్లంకొండ మండలం లోని ఒక గ్రామం.కోహినూర్ వజ్రం దొరికింది కోళ్ళూరులో కానీ ఇంగ్లీష్ స్పెల్లింగ్ మహిమవలన చాలామంది పొరపాటుగా ఈ ఘనతను కొల్లూరుకు ఆపాదిస్తున్నారు." (వాడుకరి:Nrahamthulla 14:27, 16 ఫిబ్రవరి 2009 (UTC)) పరిశీలించగలరు. యర్రా రామారావు (చర్చ) 12:35, 17 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ చర్చలో పాల్గొనని గౌరవ వాడుకరులు ఎవరైనా చర్చలో తెలిపిన అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుని నిర్ణయం ప్రకటించవలసిందిగా కోరుచున్నాను. యర్రా రామారావు (చర్చ) 15:26, 9 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ఫలితం: ఎక్కువ మంది పాల్గొననందున చర్చ ముందుకు సాగలేదు. నిర్ణయమూ రాలేదు. అయితే, ఇరువైపులా అభిప్రాయాలు బలంగానే ఉన్నాయి. మరిన్ని అభిప్రాయాలు వచ్చి ఉంటే స్పష్టమైన నిర్ణయం చేసే వీలుండేది, బహుశా. అంచేత ప్రస్తుతానికి ఉన్న స్థితినే కొనసాగించాలని నిర్ణయిస్తున్నాను.

క్రింది చర్చ ముగిసింది. దయచేసి దీనిని మార్చవద్దు. కొత్త వ్యాఖ్యలు ఎవైనా కొత్త విభాగంలో చేర్చండి.