చర్చ:వరంగల్ (పట్టణం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వరంగల్ నగరం కదా[మార్చు]

వరంగల్ నగరం కదా పట్టణమని వ్యాసం పెట్టారేమిటి? బహుశా వరంగల్ పట్టణ జిల్లా వ్యాసం నుంచి విడదీసి చేశారో ఏమో. వరంగల్ నగరంగా దీని పేరు మార్చవచ్చా?--పవన్ సంతోష్ (చర్చ) 09:30, 27 డిసెంబరు 2018 (UTC)

దేన్ని పట్టణం అంటారు, దేన్ని నగరం అంటారు అనే దానికి మన దగ్గర ఉన్న కొలమానం ఏమిటి? రవిచంద్ర (చర్చ) 10:02, 27 డిసెంబరు 2018 (UTC)
నాకు తెలినంతవరకు నగరపాలక సంస్థ హోదా ఉన్నది నగరం అని,పురపాలక సంఘం,నగర పంచాయితీ హోదా కలిగి ఉన్న వాటిని పట్టణాలు అని అంటారు.--యర్రా రామారావు (చర్చ) 11:14, 27 డిసెంబరు 2018 (UTC)
యర్రా రామారావు చెప్పినదే నా ఆలోచన కూడాను రవిచంద్ర గారూ. శివారు గ్రామాలు, తండాలు >> పంచాయితీ రెవెన్యూ గ్రామ హోదా ఉన్నవి గ్రామాలు >> మేజర్ పంచాయితీ హోదా ఉన్నవి పెద్ద గ్రామాలు >> నగర పంచాయితీ, పురపాలక సంఘ హోదా ఉన్నవి పట్టణాలు >> నగర పాలక సంస్థ కలిగినవి నగరాలు >> గ్రేటర్ హోదా కలిగినవి మహా నగరాలు --పవన్ సంతోష్ (చర్చ) 12:07, 28 డిసెంబరు 2018 (UTC)