మూస చర్చ:స్వాగతం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సూచనలు[మార్చు]

తెవికీలో నిర్వహిస్తున్న వికీప్రాజెక్టులకు కూడా ఒక లింకు తతగిలిస్తే కొత్తగా చేరిన సభ్యులకు మార్గనిర్దేశం చేసినట్లు ఉంటుంది. సభ్యుల పట్టికకు మీ పేరు జతచేయండి., అనే వాక్యం బదులుగా మీకు నచ్చిన వికీప్రాజెక్టులో మీ పేరు నమోదు చేసుకోండి. అనే సందేశం ఎలా ఉంటుంది. __మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 11:04, 27 నవంబర్ 2006 (UTC)

కొత్త మూస సరళంగా బాగుంది.
  1. సభ్యుల పట్టిక అలా ఉంచుదాం. దానితోపాటుగా వికీప్రాజెక్టు కూడా చేర్చుదాం.
  2. సహాయానికి అధికారిక మెయిలింగులిస్టు (WikiTe-L@wikipedia.org) మరియు IRC లని కూడా ఉపయోగించుకొమ్మనే సందేశం ఇవ్వాలి.
--వీవెన్ 13:47, 27 నవంబర్ 2006 (UTC)
ప్రదీపు, ఈ మూస అందరికీ ఉపయోగపడేటట్టు చేసినందుకు కృతజ్ఞతలు. మీ ఇద్దరి ఆలోచనలు బాగున్నాయి అందుకు తగిన విధముగా పై మూసను మీరే దిద్దండి. --వైఙాసత్య 14:35, 27 నవంబర్ 2006 (UTC)
వికీప్రాజెక్టులను, అధికారిక మెయిలింగులిస్టు చేర్చాను, కానీ ఇప్పుడు మళ్ళీ ఆక్కడి సమాచారం సరళత దెబ్బతిందేమో అని అనిపిస్తుంది. __మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 06:10, 28 నవంబర్ 2006 (UTC)
బొమ్మలు కూడా చేరిస్తే ఎలా ఉంటుంది. __మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 06:11, 28 నవంబర్ 2006 (UTC)

రెండవ తరం మూస గురించి చర్చలు[మార్చు]

చాలా మంది తెలుగు రాయడానికి నానావస్థలు పడుతున్నరు వారికి స్వాగతం పేజిలోనే లేఖిని లింకు ఇవ్వమని నా సూచన లింకు ప్రస్ఫుటం గా కనిపించాలి. --మాటలబాబు 08:50, 18 జూన్ 2007 (UTC)

వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు. సభ్యుల పట్టికకు మీ పేరు జత చేయండి. అని స్వాగతం మెదటి వాక్యంలోనే అన్నప్రాసన రోజే ఆవకాయ పెడుతున్నాం. దయచేసి చూడండి ఆ సభ్యుల పట్టిక ఉన్న పేజిని గాని ఏమాత్రమైన సరళం చెయ్యచ్చేమౌ, లేకపోతే ఆ వాక్యమే తీసేయండి. --మాటలబాబు 09:13, 18 జూన్ 2007 (UTC)
తెలుగు వికీపీడియాలో లేఖిని లేకుండానే టైపు చెయ్యవచ్చు కదా! మళ్లీ లేఖిని లింకు ఎందుకు? ఇక సభ్యుల పట్టికకు పేరు జతచేయమని చెప్పటం చాలా ఇబ్బందులు పెడుతున్నట్టు నాకూ అనిపించింది. ప్రస్తుతానికి దాన్ని తొలగిస్తా --వైజాసత్య 11:56, 18 జూన్ 2007 (UTC)
ప్రదీపు గారు ఇదివరకే ఈ వాక్యాన్ని సరళీకృతం చేసినట్టున్నారు. దీని తాలూకు ప్రభావం ఎలా ఉంటందో కొన్ని రోజులు వేచిచూద్దాం. --వైజాసత్య 12:02, 18 జూన్ 2007 (UTC)
ఉదాహరణ కు పూర్ణాస్వరం "ం" ఇవ్వడం తెలియక 0 ఉపయౌగిస్తున్నారు.--మాటలబాబు 12:32, 18 జూన్ 2007 (UTC)
EDITBOXకు పైన కింద రెండు చోట్లా తెలుగులో టైపు చేయడానికి సూచనలు ఉన్నాయి. అవి వారికి ఎట్లా కనిపించడంలేదో నాకు అర్ధం కావడం లేదు. కొంతమందికి "ం"కి బదులుగా 'o', 'O' లేదా '0' లను ఉపయోగించడం అలవాటయిపోయి, ఇక్కడ కూడా అదే ఉపయో గించేస్తూ ఉంటారనుకుంటా. వీరి లేఖిని గురించి చెప్పినా పెద్దగా ఉపయోగం ఉండక పోవచ్చు. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 12:51, 18 జూన్ 2007 (UTC)
ప్రదిప్ గారు అలా అనకండి నేను ఆ త్రోవా లో వెళ్ళిన వాడినే నాకు మెదట్లో తెలియక చచ్చేది. ఆ తరువాత నేను నెమ్మదిగా నెర్చుకొన్నాను--మాటలబాబు 13:11, 18 జూన్ 2007 (UTC)
మాటలబాబు అన్నట్టు స్వాగతం మూసను సరళీకరించాలని నేనూ అనుకుంటున్నాను. కొత్త సభ్యులను స్వాగతించేటపుడు "వికీ గురించి వాళ్ళకేమాత్రం తెలియదని" మనం భావించాలి. మొదటినుండి మనం మన స్థాయిలో ఆలోచించాం గానీ, కొత్త వాళ్ళకి వికీ చూడగానే ఎంత అయోమయంగా ఉంటుందో మనం పరిగణించలేదు. కొత్తవాళ్ళని దృష్టిలో ఉంచుకుని దీన్ని మరికాస్త ఉపయోగకరంగా చెయ్యాలి! కొన్ని సూచనలు..
  • కొత్తవాళ్ళకి అన్నన్ని లింకులు చూపిస్తే తికమక పడతారేమోననిపిస్తోంది. దాని బదులు ఒకటో రెండో లింకులు ఇచ్చి నేర్చుకునేందుకు దోహదం చేస్తే బాగుంటుందేమో! ఉదాహరణకు.. పరిచయం, 5 నిమిషాల్లో వికీ -ఈ రెంటినీ ముందు చదవమందాం.
  • నవీన్, ప్రవీణ్ లు తయారు చేసిన సినిమా లాంటిది ఇక్కడ బహు ప్రయోజనకరం. సినిమా చూసి త్వరగా నేర్చుకోగలరు, ఆసక్తికరంగా కూడా ఉంటుంది.
ఆలోచించండి!! __చదువరి (చర్చరచనలు) 15:53, 18 జూన్ 2007 (UTC)
ఆహా! చదువరీ, మీకు మీరే సాటి. ఆలోచనలు బాగున్నాయి. వాటిని అమలుచేద్దాం. వాళ్ల వీడియోలో సౌండు ఉన్నట్టు లేదుకదా..నేనొకటి, రెండు వీడియోలు తీసి ప్రయత్నిస్తా..గొంతు బాగోకపోతే మాటలబాబు చే డబ్బింగ్ చేయించాల్సిందే ;-) --వైజాసత్య 16:05, 18 జూన్ 2007 (UTC)

మూడో తరం మూస[మార్చు]

ఇప్పుడున్న సందేశాన్ని మళ్ళీ మారుతున్న అవసరాలకు, మనకు వస్తున్న ఫీడ్ బాక్ కు అనుగుణంగా మార్పులు చేర్పులు చెయ్యాల్సిన సమయం వచ్చింది.

మూసను వీలైనంతగా సరళీకరించి పెద్దగా వికీఫార్మాటింగు, పట్టికలు లేకుండా చేయ్యాలని నాకనిపించింది. ఏదైనా రాయాలని చర్చాపేజీ తెరిచినవాళ్ళకి 5 కేబీల క్లిష్టమైన వికీఫార్మాట్లో పట్టికలతో ఉన్న గందరగోళాన్ని చూసి జడుసుకుంటున్నారేమోనని నా అనుమానం.
ఇక ఈ మూడు లైన్ల వళ్ల పెద్ద ఉపయోగమేమీ లేదు. ఒక్కోదాని కింద వ్యాఖ్యానిస్తా. --వైజాసత్య 09:36, 9 ఆగష్టు 2007 (UTC)
నేను కొత్త మూసకు ఒక ప్రయత్నం ఇక్కడ ప్రారంభిస్తా. మీరూ మార్పులు చేర్పులు చెయ్యండి. మూస:స్వాగతం/మూడో తరం
ఇక చర్చ ఇక్కడ కొనసాగించబడుతున్నది మూస చర్చ:స్వాగతం/మూడో తరం --వైజాసత్య 12:07, 10 ఆగష్టు 2007 (UTC)

స్వాగతం మూస మార్పులు[మార్చు]

రమేష్ గారు, ఒక్కసారి subst: వాడితే ఆ కాలం లో మూసలో వున్న విషయం చేరిపోతుంది. మీరు సభ్యుడు పేరు ఉదాహరణ లో తొలగించినట్లున్నారు. సభ్యుడు పేరు వుండాలి. ఇది చర్చాపేజీలో వాడతాము కాబట్టి, ఒక రికార్డుగా మిగిలి పోతేనే బాగుంటుంది. దీనితో మీరు అంగీకరించితే మీ మార్పుని రద్దుచేయమని విజ్ఞప్తి.--అర్జున 04:02, 13 జనవరి 2012 (UTC)

తెవికీ గూర్చి వాడుకరులకు తెలియజేయాలి[మార్చు]

తెలుగు వికీపీడియా యొక్క ఔన్నత్యాన్ని, దాని చరిత్రను క్రొత్త వాడుకరులకు తెలియవలసిన అవసరం ఉన్నది. కనుక ఈ మూసలో మొదటి పాయింట్ గా వికీపీడియా:వికీపీడియా - స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము ను చేర్చితే బాగుండునేమో పరిశీలించగలరు.--Quill and ink.svg కె.వెంకటరమణ చర్చ 06:56, 28 మే 2013 (UTC)

మూసలో మార్పులతో స్వాగతించిన వాడుకరి చర్చాపేజీలకు అధిక ప్రాధాన్యత[మార్చు]

ఇటీవల జరిగిన మూస మార్పులలో "ఏ విషయంలో సాయం అవసరమైనా సరే... నా చర్చా పేజీలో రాయండి. సంతకంలో నా చర్చ పేజీ లింకు ఉంది, చూడండి" అనే మార్పు సరికాదు అనిపిస్తుంది. స్వాగతించేవారు చాలా కొద్దిమంది, వారికి తెవికీ గురించిన సందేహాలపై స్పష్టత ఇవ్వగలిగే శక్తి ఉండకపోవచ్చు, లేక వెంటనే స్పందించకపోవచ్చు. ఈ వాక్యానికి ముందే {{సహాయం కావాలి}} గురించి తెలిపాము. కావున ఈ మూస వాడి ఏ చర్చాపేజీలోనైనా సందేహం రాసి అందరికీ తెలిపే అవకాశమున్నప్పుడు, స్వాగతించిన వ్యక్తి చర్చాపేజీకి అదనపు ప్రాముఖ్యం మంచిది కాదని నా అభిప్రాయం. User:Chaduvari గారు మరల పరిశీలించమని కోరుతున్నాను. అర్జున (చర్చ) 05:09, 26 ఫిబ్రవరి 2020 (UTC)

అర్జున గారూ, స్వాగత సందేశాన్ని అలా మార్చడానికి కారణాలేంటంటే..
  1. కొత్తవారు సాయం పొందే విధానం వీలైనంత తేలిగ్గా ఉండాలని భావించాను.
  2. కొత్త వాడుకరి సాయం కోసం ఒక వ్యక్తిని అడిగేంత తేలిగ్గా, చొరవగా మూసను వాడి అడగక పోవచ్చు అని నా భావన.
  3. స్వాగత సందేశం మరీ ఫార్మల్‌గా కాకుండా, వీలైనంత వ్యక్తిగత సాన్నిహిత్యం చూపించేలా ఉంటే, కొత్తవారు బిడియపడకుండా అడుగుతారని భావించాను.
  4. స్వాగతించేవారు ఆ మాత్రం బాధ్యత తీసుకుంటారని అనుకున్నాను.
మొదటి మూడింటినీ దృష్టిలో ఉంచుకుని, నాలుగోదాన్ని సవరించండి సార్. __చదువరి (చర్చరచనలు) 06:13, 26 ఫిబ్రవరి 2020 (UTC)
చదువరి గారికి, చర్చా పేజీలో స్వాగత సందేశం లో కేవలం "ఇక్కడ" అనే లింకు పై నొక్కడం ద్వారా మూస చేరేటట్లుగా ఏర్పాటు వున్నది కావున, అంతకంటే తేలికగా సాయం పొందే విధానం లేదనిపిస్తుంది. ఎక్కువగా స్వాగతించేవారిలో చాలా మందికి బాధ్యత తీసుకునే శక్తి లేదు అని నా అభిప్రాయం. అందువలన ఆ వాక్యం అవసరంలేదని నా అభిప్రాయం.-- అర్జున (చర్చ) 04:52, 27 ఫిబ్రవరి 2020 (UTC)
అర్జున గారూ, నేను చెప్పాల్సింది చెప్పేసాను, ఇక చెప్పాల్సిందేమీ లేదు. మీకు ఉచితమనిపించిన విధంగా మార్చండి. __చదువరి (చర్చరచనలు) 05:52, 27 ఫిబ్రవరి 2020 (UTC)
చదువరి గారికి, మీ స్పందనకు ధన్యవాదాలు. మార్పు చేశాను.అర్జున (చర్చ) 04:19, 3 మార్చి 2020 (UTC)