వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/తెవికీ పాఠ్య ప్రణాళిక/విధానాలు, మార్గదర్శకాల పేజీల సూచిక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రణయ్ గారూ, పేజీల జాబితా తయారు చేసినందుకు ధన్యవాదాలు. ఈ పేజీల్లో ఉన్న సమాచారానికి సంబంధించి, కొన్ని సూచనలు, అభిప్రాయాలు:

  1. సమాచారానికి కాలదోషం పట్టిందా? అయితే ఎంత?
    1. కాలదోషం పట్టిన సమాచారం ఎంత ఉందో లెక్కేసేందుకు ఒక సూచన: ఒక పేరాలో కాలదోషం పట్టిన సమాచారం ఒక్కటైనా ఉంటే ఆ పేరాకు కాలదోషం పట్టినట్టే. పేజీలో మొత్తం పది పేరాలుంటే, వాటిలో రెండిట్లో ఉన్న సమాచారానికి కాలదోషం పడితే, ఆ పేజీ 20% కాలదోషం పట్టినట్టుగా భావించవచ్చు.
  2. కొత్త సమాచారాన్ని చేర్చాల్సి ఉందా? ఇంగ్లీషు పేజీని గమనించి తత్ప్రకారం ఇక్కడి పేజీని అంచనా గట్టాలి.
  3. పేజీ లోని విధానాలు, పద్ధతులు, మార్గదర్శకాలూ ఏ ఎడిటింగు పద్ధతిని వివరిస్తున్నాయి? విజువల్ ఎడిటింగా, 2010 వికీటెక్స్టా, 2017 వికీటెక్స్టా.. అనేది స్పష్టంగా పేజీకి పైన ఒక మూస ద్వారా తెలియజేయాలి. ఇందుకోసం మూసలు తయారు చేసుకోవాలి.
    1. ప్రస్తుతం వికీలో విజువల్ ఎడిటింగు, 2017 వికీటెక్స్టు ఎడిటింగు పద్ధతులను వాడుతున్నాం. అవిగాక ఇతర పద్ధతులను తెలిపే పేజీలు ప్రస్తుత పరిస్థితికి సరిపోవు. ఆ పేజీల్లో "కాలం చెల్లిన పేజీ" అనో మరోరకం గానో తెలియజేసి, పక్కన పెట్టేయాలి. వాటిపై ఇక మరేపనీ చెయ్యకూడదు.
    2. అలా పక్కన పెట్టేసిన పేజీల స్థానే కొత్త పేజీలను, ప్రస్తుత పద్ధతులను వివరించే పేజీలను, తయారు చేసుకోవాలి.

పరిశీలించండి.__చదువరి (చర్చరచనలు) 11:43, 21 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

మీ సూచనలకు ధన్యవాదాలు చదువరి గారు. మీరు సూచించిన వివరాలతో పేజీలకు సంబంధించి మరింత సమాచారం తయారుచేస్తాను.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 19:28, 21 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారూ,

  1. విధానాలు, మార్గదర్శకాల పేజీల్లోని సమాచారాన్ని, ఇంగ్లీషు పేజీల ప్రకారం చూడగా... ప్రస్తుతమున్న తెలుగు పేజీల్లో అవసరమైనంత మేరకు సమాచారం ఉందని తేలింది. కాకపోతే, జాబితాలో ఉన్న ఎర్రలింకు పేజీల (10) ను సృష్టించాలి. కొన్ని (10) పేజీలలోని ఆంగ్ల పాఠ్యాన్ని అనువదించాలి.
  2. విధానాలు, మార్గదర్శకాల పేజీల్లోని సమాచారం వికీ విధానాలు, మార్గదర్శకాల గురించి తెలియజేస్తోంది. అయితే, ఈ పేజీల్లోని సమాచారం ఏ ఒక్క ఎడిటరుకో సంబంధించినది కాదు, అన్ని రకాల ఎడిటింగు పద్ధతులకు ఇది వర్తిస్తోంది.
  3. పేజీల్లోని సమాచారంలో కాలదోషం పట్టిన సమాచారాన్ని, కాలం చెల్లిన పేజీలను గుర్తించే పని జరుగుతోంది.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 05:04, 17 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]

కొన్ని పేజీల శ్రేయస్సు[మార్చు]

ప్రణయ్ గారూ నేను ఈ ప్రాజెక్టు పేజీకి చెందిన ఈ కూర్పు గురించి రాస్తున్నాను. ఇందులో 60, 61, 62 పేజీలను అర్జున గారు సృష్టించినట్లు రాసారు. పేజీలను సృష్టించినది ఆయనే గానీ, అందులోని సమాచారాన్ని సృష్టించినది ఆయన కాదు. ఆ మూడు చర్చలను మొదలుపెట్టినది వేరేవారు. వికీపీడియా:రచ్చబండ (పాలసీలు) పేజీలో జరిగిన చర్చలను, నిర్వహణలో భాగంగా, అర్జున గారు కాపీ చేసి ఈ పేజీల్లో అతికించి సృష్టించారు. (ఈ తేడాను, దీని తరువాతి తేడానూ చూస్తే అర్థమౌతుంది.) సాంకేతికంగా ఈ పేజీల సృష్టికర్త అర్జున గారే అయినప్పటికీ, ఆ చర్చలను మొదలుపెట్టినది ఆయన కాదు. నిజానికి ఆ చర్చల్లో ఆయన పాల్గొననే లేదనుకుంటాను కూడా. మీరు ఆ చర్చను మొదలుపెట్టినవారెవరో చూసినా ఆ సంగతి తెలుస్తుంది. మీ పరిశీలన కోసం రాస్తున్నాను. __చదువరి (చర్చరచనలు) 05:20, 26 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు చదువరి గారు. మీరు సూచించిన ఆ మూడు పేజీల వివరాలలో పాలసీని ప్రతిపాదించిన వారి పేరు కూడా చేర్చాను.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 06:56, 9 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]