వికీపీడియా:వికీప్రాజెక్టు/మొలక వ్యాసాల అభివృద్ధి ఉద్యమం 2021 ఏప్రిల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వికీపీడియాలో మొలకల అభివృద్ధి చేసే కార్యక్రమం మొదటిసారిగా 2020 ఏప్రిల్ 1 నుండి 30 వరకు మొలకల అభివృద్ధి ఉద్యమం 2020 నిర్వహించుకున్నాం. ఆ తరువాత జూన్ నుండి ఆగష్టు వరకు మొలకల విస్తరణ ఋతువు 2020 నిర్వహించుకున్నాం.ఈ రెండు కార్యక్రమలలో 3000 పై చిలుకు మొలక వ్యాసాలు అభివృద్ధి చేయుట మనందరం గర్వించతగ్గ విషయం.మొలకపేజీల నియంత్రణ విధానం 2013 ఏప్రిల్ 1 నుండి సముదాయం అమలులోకి తీసుకు వచ్చింది.దీనిని పురష్కరించుకొని "ద్వితీయ వార్షిక మొలకలు అభివృద్ధి కార్యక్రమం-2021" అనే కార్యక్రమం 2021 ఏప్రిల్ 1 నుండి నిర్వహించటానికి ఈ ప్రాజెక్టుపేజీ రూపొందించటమైనది.

ప్రాజెక్టు లక్ష్యం[మార్చు]

  1. వర్గం:మొలక లోని ఉపవర్గాల్లో ఉన్న వ్యాసాలను విస్తరించి మొలక స్థాయిని దాటించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం
  2. ప్రాజెక్టు గరిష్ఠ స్థాయి: మొత్తం 3223 వ్యాసాలు
  3. ప్రాజెక్టు కనీస లక్ష్యం: 2000 వ్యాసాలు (విలీనాలు, తొలగింపులూ కాకుండా)

ప్రాజెక్టు పని కాలం[మార్చు]

  1. 30 రోజులు. 2021 ఏప్రిల్ 1 న మొదలై 2021 ఏప్రిల్ 30 న ముగుస్తుంది.

మొలక విస్తరణకు నిర్వచనం[మార్చు]

  1. వ్యాసాలను కనీసం 5120 బైట్ల స్థాయికి తీసుకు పోవాలి. ఈ స్థాయిలో వ్యాసం మూణ్ణాలుగు పేరాలుండి, పాఠకుడికి సంతృప్తికరమైన ప్రాథమిక స్థాయి సమాచారాన్ని అందిస్తుంది. ఇంకా పెద్దదిగా విస్తరించేందుకు అభ్యంతరమేమీ లేదు
  2. అవసరమైన చోట్ల మూలాలను చేర్చాలి.
  3. ఇతర పేజీల నుండి వ్యాసానికి ఇన్‌కమింగు లింకులు చేర్చాలి. కనీసం ఒక్కటైనా చేర్చాలి, మూడుంటే మంచిది
  4. పేజీని కనీసం ఒక వర్గంలో నైనా చేర్చాలి (మొలక-వర్గం నిర్వహణ సంబంధ వర్గం మాత్రమే. పైగా అది తాత్కాలికమే. మొలక మూసను తీసెయ్యగానే అది పోతుంది.)
  5. అంతర్వికీ లింకులు చేర్చాలి.
  6. పైవన్నీ అయ్యాక, పేజీకి అడుగున ఉన్న మొలక మూసను తీసెయ్యాలి. మరచిపోకండి, ముఖ్యమైన పని ఇది.

ఎలా చెయ్యడం[మార్చు]

  1. విస్తరణ: మొలకకు చేసే పోషణలో అన్నిటి కంటే ఉత్తమమైన పని ఇదేనని చెప్పనక్కర్లేదు
  2. విలీనం: ఒకే తరహాకు చెందిన చిన్నచిన్న మొలకలను (వాటిని విస్తరించలేని పక్షంలో) విలీనం చేసి ఒకే వ్యాసంగా చెయ్యవచ్చు. ఈ పాత పేజీలను దారి మార్పుగా చెయ్యవచ్చు. ఉదాహరణకు గృహోపకరణాల వర్గంలో ఉన్న బాన, మూకుడు, చెంచా, చట్టి వంటి కొన్ని వ్యాసాలను విలీనం చేసి, ఒకే పేజీగా చెయ్యవచ్చు. ఇది రెండో అత్యుత్తమ పద్ధతి.
  3. అలాగే ఉంచెయ్యడం: ఏమీ చెయ్యకుండా అలాగే ఉంచెయ్యడం. విస్తరించలేని, విలీనం చెయ్యలేని, తొలగించనూ లేని వ్యాసం కోసం ఈ పద్ధతి. అసలు అలాంటి వ్యాసాలుంటాయా అనేది ఆలోచించాల్సిన సంగతి.
  4. తొలగించడం: మొదటి రెండు పద్ధతులూ వీలు కానపుడు, ఇప్పుడున్న పరిస్థితిలోనే ఉంచేందుకూ, వీలు లేనపుడు తొలగించేందుకు ప్రతిపాదించాలి. మొదటి రెండు పద్ధతులూ ఎందుకు వీలు కావంటే..
    1. విస్తరించేందుకు అవసరమైన సమాచారం లభ్యం కానపుడు
    2. విస్తరించేందుకు వీలు కాని నిర్వచనాలైనపుడు (విక్షనరీలో ఉండాల్సిన వ్యాసమైతే)
    3. విలీనాలకు కూడా వీలు కానప్పుడు
    4. ప్రస్తుతమున్న స్థితిలోనే పేజీని ఉంచే వీలు లేనపుడు: ఉన్న కొద్ది సమాచారం మూలాలేమీ లేని ఊకదంపుడు లేదా రొడ్డకొట్టుడు సమాచారమైనపుడు గానీ, తప్పుడు సమాచారమైనపుడు గానీ దాన్ని ఉంచలేం.

మొలక వ్యాసాన్ని పెంచి పోషించి పెద్దది చెయ్యడం దీని ఉద్దేశం. కానీ అసలు మొలకే సరైనది కానపుడు, దానికి ఉండే అర్హతే లేనపుడు తొలగించటానికి కూడా వెనకాడ కూడదనేది మన నీతి.

వ్యాసాల ఎంపిక ఇలా[మార్చు]

  • వర్గం:మొలక లోని ఉపవర్గాల్లో ఉన్న వ్యాసాలలో మీకు నచ్చిన వ్యాసం విస్తరించగలరు. ఇందులోని ఉపవర్గాలు, వాటి లోని వ్యాసాల సంఖ్యనూ చూడండి.
మొలక(ఖాళీ)
ఉపవర్గాలు లేవు

పాల్గొనేవారు[మార్చు]

"రండి"

ప్రస్తుతం వికీలో చురుగ్గా రాస్తున్న వాడుకరులంతా ఈ ప్రాజెక్టులో పాల్గొని తెవికీ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని విజ్ఞప్తి. తాము విస్తరించిన వ్యాసాల వివరాలను "కృషి వివరం" అనే పేజీలో చేర్చితే చేసిన పనిని మదింపు చేసేందుకు వీలుగా ఉంటుంది.

  1. యర్రా రామారావు - కృషి వివరం
  2. ప్రణయ్‌రాజ్ వంగరి - కృషి వివరం
  3. చదువరి - కృషి వివరం
  4. -- K.Venkataramana - కృషి వివరం
  5. Kasyap - కృషి వివరం
  6. Prasharma681 - కృషి వివరం
  7. Nskjnv - కృషి వివరం

ప్రాజెక్ట్ కాలపరిమితి ముగింపు[మార్చు]

ఈ ప్రాజెక్ట్ కాలపరిమితి 2021 మే 1 ఉదయం గం:6-00 తో ముగిసింది. ఈ ప్రాజెక్టులో పాల్గొన్న గౌరవ వికీపీడియన్లు అందరికీ ధన్యవాదాలు.