వికీపీడియా:వికీప్రాజెక్టు/వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2022
ఈ వికీప్రాజెక్టు కాలం విజయవంతంగా ముగిసింది. |
వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2022 |
మొదటి పేజి | న్యాయ నిర్ణేతలు | పాల్గొనేవారు | ఫలితాలు | వనరులు | నియమాలు |
వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ (WPWP) అనేది ప్రతి యేటా నిర్వహించే ఉద్యమం. దీనిలో పాల్గొనే వాడుకరులు బొమ్మలు లేని వ్యాసాలలో బొమ్మలను చేరుస్తారు. వికీమీడియా నిర్వహించే అనేక ఫోటోగ్రఫీ పోటీలద్వారా, ఫోటో వాక్‌ల ద్వారా సేకరించిన ఫోటోలను వికీపీడియా వ్యాసాలలో ఉపయోగించడాన్ని ప్రోత్సహించడమే ఈ ఉద్యమం ఉద్దేశం. బొమ్మలు పాఠకుల దృష్టిని అక్షరాలకన్నా ఎక్కువగా ఆకర్షిస్తాయి. సచిత్ర వ్యాసాలు బొమ్మలు లేని వ్యాసాలతో పోలిస్తే ఆకర్షణీయంగా ఉండి పాఠకుల మనసును ఆకట్టుకుంటాయి.
వికీ లవ్స్ మాన్యుమెంట్స్, వికీ లవ్స్ ఆఫ్రికా, వికీ లవ్స్ ఎర్త్, వికీ లవ్స్ ఫోక్లోర్ వంటి అనేక అంతర్జాతీయ పోటీలద్వారా, ఇతర అనేక మార్గాల ద్వారా వికీమీడియా కామన్స్‌లో ఎన్నో వేల చిత్రాలను చేర్చారు. ఐతే వీటిలో కొన్ని మాత్రమే వికీపీడియా వ్యాసాలలో ఉపయోగించబడ్డాయి. ఈ ఖాళీని పూరించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం.
ఎలా పాల్గొనాలి?
[మార్చు]ఇందులో పాల్గొనే ముందు, కింద చూపిన సూచనలు, నియమాలను సంపూర్ణంగా చదవడం ముఖ్యం. ఈ నియమాలను పాటించకపోతే, మీ దిద్దుబాట్లు పోటీకి అనర్హమయ్యే అవకాశం ఉంది.
మీకు ఈసరికే ఏ వికీమీడియా ప్రాజెక్టులోనైనా ఖాతా ఉంటే అందులోకి లాగినవండి. ఈ పోటిలో పాల్గొనడానికి వికిలో ఖాతా తెరిచి కనీసం ఒక సంవత్సర కాలం అయి ఉండాలి.
ఫొటో చేర్చాల్సిన అవసరమున్న వ్యాసం ఒకదాన్ని ఎంచుకోండి. ఇలాంటి వ్యాసాలను పట్టుకోవడానికి కింది వర్గాలను చూడవచ్చు. ఈ వర్గాలు ఎందులోనూ లేని వ్యాసాల్లో కూడా బొమ్మలు లేకుండా ఉండే అవకాశం ఉంది. అలాంటి వ్యాసాల్లో కూడా బొమ్మను చేర్చవచ్చు. అలాగే ఈ వర్గం లోని వ్యాసాల్లో కొన్నిటిలో బొమ్మ ఉండి ఉండవచ్చు కూడా. అలాంటి వ్యాసాలలో మరో బొమ్మను చేర్చకండి. చేర్చినా అవి పోటీ లోకి పరిగణించబడవు.
- వర్గం:బొమ్మలు కావలసిన గ్రామాల వ్యాసాలు (525 వ్యాసాలు)
- వర్గం:బొమ్మలు కావలసిన వ్యక్తుల వ్యాసాలు (2,114 వ్యాసాలు)
- వర్గం:బొమ్మలు కావలసిన సినిమా వ్యాసాలు (679 వ్యాసాలు)
- వర్గం:బొమ్మలు కావలసిన పుస్తకాల వ్యాసాలు (280 వ్యాసాలు)
- వర్గం:బొమ్మలు కావలసిన శాస్త్ర సాంకేతిక వ్యాసాలు (16 వ్యాసాలు)
- వర్గం:బొమ్మలు కావలసిన సంస్థల వ్యాసాలు (0 వ్యాసాలు)
- వర్గం:బొమ్మలు కావలసిన చరిత్ర వ్యాసాలు (0 వ్యాసాలు)
- వర్గం:బొమ్మలు కావలసిన వ్యాసాలు (308 వ్యాసాలు) - పై వర్గాలకు చెందని వ్యాసాలు ఈ వర్గంలో ఉంటాయి.
- గమనిక: పై వర్గాల్లో "చర్చ:" పేరుబరి లోని పేజీలుంటాయి. బొమ్మలను చేర్చవలసినది ఈ పేజీల్లో కాదు; వాటికి సంబంధించిన వ్యాసాల పేజీల్లో చేర్చాలి.
కామన్సులో సముచితమైన బొమ్మ ఒకదాన్ని ఎంచుకోండి. సరైన బొమ్మ పేరును గానీ, వర్గం పేరును గానీ వాడి బొమ్మ కోసం వెతకండి. వేతికేందుకు అనేక పద్ధతులున్నాయి. బొమ్మలను వాడడంలో సూచనల కోసం ఇది చూడండి. బొమ్మలను చేర్చడం లోని ఉద్దేశం, వ్యాసానికి సంబంధించిన వ్యక్తులు, వస్తువులు, కార్యకలాపాలు, భావనలకు సంబంధించిన బొమ్మలతో వ్యాస విషయం గురించి తెలుసుకోవడంలో పాఠకులకు మరింత సహాయపడడమే. బొమ్మకు వ్యాసానికి ఉన్న సంబంధ మేంటనేది స్పష్టంగా తెలిసిపోతూ ఉండాలి. బొమ్మలు ప్రధానంగా అలంకారం కోసం కాకుండా వ్యాసంలో సందర్భోచితంగా ఉండాలి.
వ్యాసంలో బొమ్మను ఎలా చేర్చాలో తెలుసుకునేందుకు సహాయం:విజువల్ ఎడిటరుతో బొమ్మల పరిచయం/3 పేజీ చూడండి. వ్యాసం పేజీలో ఏ విభాగంలో బొమ్మను చేర్చితే సముచితంగా ఉంటుందో, ఎక్కడ పెడితే పాఠకుడి అవగాహనకు దోహదపడుతుందో ఆ విభాగాన్ని ఎంచుకోండి. "సవరించు" నొక్కి బొమ్మను చొప్పించండి. బొమ్మ వ్యాసంలో దేన్ని వర్ణిస్తోందో చెబుతూ క్లుప్తంగా కొంత వివరణను చేర్చండి. అందుబాటులో ఉన్న అత్యుత్తమ నాణ్యత గల బొమ్మలను వాడండి. సరైన నాణ్యత లేని బొమ్మలను —మసకగా, అస్పష్టంగా ఉన్నవి; బొమ్మలో వస్తువు బాగా చిన్నవిగా ఉన్నవి, అనేక వస్తువుల మధ్య దాగి ఉన్నవి,సందిగ్ధంగా ఉన్నవి; వగైరా— కచ్చితంగా తప్పనిసరైతే తప్ప వాడరాదు. వ్యాస విషయాన్ని ఏ బొమ్మలు అత్యుత్తమంగా వర్ణిస్తాయో జాగ్రత్తగా ఆలోచించండి. మీరు చేసే దిద్దుబాటు లన్నిటికీ తప్పనిసరిగా దిద్దుబాటు సారాంశాన్ని ఇవ్వాలి. "మునుజూపు" చూసుకుని ఏమైనా మార్పులవసరమైతే చెయ్యండి. ఇలా బొమ్మలను చేర్చి మెరుగుపరచిన దిద్దుబాట్ల సారాంశాల్లో #WPWPTE,#WPWP అనే హ్యాష్‌ట్యాగులను చేర్చండి. అప్పుడు "మార్పులను ప్రచురించు" ను నొక్కండి. మరిన్ని వివరాలకు మెటా వికీమీడియా లో ఉన్న ఈ గైడు పేజీని చూడండి.
బొమ్మ సింటాక్సు ఎలా ఉండాలో చూసుకోండి! సమాచారపెట్టెల్లో బొమ్మలను చేరుస్తూంటే, దాని సింటాక్సు చాలా తేలిగ్గా ఉంటుంది — దస్త్రం పేరు ఇస్తే చాలు. అంటే [[File:Obamas at church on Inauguration Day 2013.jpg|thumb|వాషింగటన్ డిసి లోని ఆఫ్రికన్ మెథడిస్ట్ ఎపిస్కోపల్ చర్చిలో ప్రార్థన చేస్తున్న ఒబామా కుటుంబం. 2013 జనవరి]]
అని ఇచ్చే బదులు The Obamas at church on Inauguration Day 2013.jpg
అని టైపు చేస్తే సరిపోతుంది.
నియమాలు
[మార్చు]ఆడియోలు/వీడియోలు చేర్చడానికి మార్గదర్శకాలు
- మీరు చేర్చే ఆడియో వికీ కామన్స్ లో పబ్లిక్ డొమైన్లో పొందుపరచబడి ఉండాలి.
- మీరు ఒకవేళ ఏదైనా విషయానికి సంబంధించిన ఫైలు కామన్స్ లో చేరిస్తే వాటిని కూడా పబ్లిక్ డొమైన్‌లోనే ఉంచాలి.
- అయితే గూగుల్ నిఘంటువు మాదిరి పదాల ఉచ్ఛారణలు ఇక్కడ చేర్చడం నిషిద్ధం. (ప్రస్తుత ప్రాజెక్టులో ఇవి వద్దని అనుకుంటున్నాం).
- ఏదైనా సంస్కృతీ సంప్రదాయాలు, సంగీత వాద్యాలు, వికీ విషయ ప్రాముఖ్యత కలిగిన వ్యక్తుల మాటలను అలాగే వికీ విషయ ప్రాముఖ్యత కలిగిన ఏదైనా వ్యాసంలో మీరు కొత్త ఫైళ్లను సృష్టించి చేర్చవచ్చు.
మీరు ఆడియోలు చేర్చే వ్యాసాల్లో అంతకు ముందు ఎటువంటి ఆడియోలు ఉండకూడదు, అప్పుడే దాన్ని కొత్త దిద్దుబాటుగా పరిగణిస్తాం. అలాగే విడియోలకి కూడా.
వ్యాసానికి సరిపోయే ఫొటోలు/ఆడియోలు/వీడియోలను పట్టుకోవడంలో కొన్ని చిట్కాలు
[మార్చు]వ్యాసానికి సరిపోయే ఫొటోలను వెదకడంలో కింది చిట్కాలను పాటించవచ్చు
- వ్యాసపు అంతర్వికీ లింకులను చూడండి (పేజీకి ఎడమవైపున పట్టీలో ఉంటాయి). ఆయా భాషల పేజీలకు వెళ్ళి అక్కడ వాళ్ళు ఏ ఫొటోలను పెట్టారో చూడండి. వాటిలో బాగా సరిపోయే ఫొటోను మీరు ఇక్కడి వ్యాసంలో చేర్చండి. అలాగే అంతర్వికీ లింకుల్లో "Wikimedia commons" అనే లింకు ఉంటే, నేరుగా ఆ లింకుకు వెళ్ళి అక్కడున్న బొమ్మల్లో ఒకదాన్ని ఎంచుకుని ఈ పేజీలో చేర్చవచ్చు.
- అంతర్వికీ లింకులు లేకపోతే, ఇప్పుడు చేర్చండి. దానితో మీ పని నెరవేరడమే కాదు, ఆ మేరకు తెవికీ మెరుగు పడుతుంది కూడాను. అంతర్వికీ లింకులు ఇవ్వడం ఎలాగో తెలుసుకోండి.
- ఒకవేళ మీరు ఎంచుకున్న ఫొటో కామన్సులో లేకపోతే, ఏ వికీలోనైతే ఆ ఫొటోను చూసారో, ఆ వికీ నుండి ఫొటోను దించుకుని, తెవికీ లోకి ఎక్కించండి. దాన్ని పేజీలో చేర్చండి.
- అసలు ఇతర భాషల్లో ఈ పేజీ లేకపోయినా, పేజీ ఉన్నా వాటిలో కూడా బొమ్మ ఏమీ లేకపోయినా పై చిట్కా ఫలించదు. అలాంటపుడు, కామన్సులో బొమ్మ కోసం వెతకండి. ఇంగ్లీషు పేరుతో వెతకండి. వ్యక్తుల పేర్లు, ప్రదేశాల పేర్లు అయితే ఆ పేరుతోటే వెతకాలి. ఇతర పేజీల కోసం వెతికేటపుడు ఏ పేరుతో వెతకాలో సందేహం వస్తే, అంతర్వికీ లింకుల్లో ఇంగ్లీషు వ్యాసం పేరుతో వెతకండి.
- ప్రత్యేక:వాడనిఫైళ్లు అనే ప్రత్యేక పేజీలో అసలు ఏ పేజీలోనూ వాడని బొమ్మలను చూడవచ్చు. తెలుగు వికీపీడియాలో అసలు ఎక్కడా వాడని బొమ్మలు దాదాపు 1,800 ఉన్నాయి. ఆ బొమ్మలకు సంబంధించిన వ్యాసం పేజీలను చూసి, వాటిలో బొమ్మలేమీ లేకపోతే, ఈ బొమ్మలను ఆ పేజీల్లో చేర్చవచ్చు.
పైన సూచించిన విధంగా ఆడియోలు, వీడియోలను కూడా శోధించండి, ఏవైతే వ్యాసాల్లో ఆ ఫైళ్లు లేవో అక్కడ వాటిని చేర్చండి.
పని చేసే పద్ధతులు
[మార్చు]ఈ పోటీలో పని చేసే పద్ధతులను వివరించే పేజీని చూడండి. కొత్తవారికి ఈ పేజీ ఉపయోగంగా ఉంటుంది.
లక్ష్యం
[మార్చు]తెలుగు వికీపీడియాలో బొమ్మలు లేని వ్యాసాలు 4,000కు పైగా ఉన్నాయి. వాటిని బొమ్మలు కావలసిన వ్యాసాలు అనే వర్గంలో చూడవచ్చు. వాటిలో కనీసం 1500 పేజీలలో బొమ్మలు చేర్చడం ఈ ప్రాజెక్టు మొదటి లక్ష్యం.
ఆపై తెలుగు వికీపీడియాలోని 20 వ్యాసాలలో ఆడియోలు,20 వ్యాసాలలో వీడియోలు అలాగే వికీ కామన్స్‌లో 150 చిత్రాలు చేరుస్తూ, తెలుగు వికీపీడియాలో ఈ ప్రాజెక్టు సమయంలో కనీసం 20 వ్యాసాలను సృష్టించాలన్నది ఈ ప్రాజెక్టు రెండవ లక్ష్యం.
కాలక్రమ వివరాలు
[మార్చు]ఈ WPWP పోటీ ఏటా జరుగుతుంది.
- పోటీ ప్రారంభం: 2022 జూలై 1 00:01 (UTC)
- పోటీ చివరి తేదీ: 2022 ఆగస్టు 31 23:59 (UTC)
- పోటీకి అదనపు జోడింపు : 2022 అక్టోబరు 6 00:01 (UTC) నుండి అక్టోబరు 31 23:59 (UTC) వరకు
- ఫలితాల ప్రకటన: 2022 నవంబర్ 3
అంతర్జాతీయ బహుమతుల వివరాలు
[మార్చు]ఫొటోలను చేర్చి అత్యధిక వికీపీడియా వ్యాసాలను మెరుగుపరచిన మొదటి ముగ్గురు వాడుకరులకు బహుమతులు:
- మొదటి బహుమతి ― ప్లేక్ అవార్డు + WPWP సావనీర్లు + సర్టిఫికెట్
- రెండవ బహుమతి ― ప్లేక్ అవార్డు + WPWP సావనీర్లు + సర్టిఫికెట్
- మూడవ బహుమతి ― ప్లేక్ అవార్డు + WPWP సావనీర్లు + సర్టిఫికెట్
ఆడియోలను చేర్చి అత్యధిక వికీపీడియా వ్యాసాలను మెరుగుపరచిన వాడుకరికి బహుమతి:
- ప్లేక్ అవార్డు + WPWP సావనీర్లు + సర్టిఫికెట్
వీడియోలను చేర్చి అత్యధిక వికీపీడియా వ్యాసాలను మెరుగుపరచిన వాడుకరికి బహుమతి:
- ప్లేక్ అవార్డు + WPWP సావనీర్లు + సర్టిఫికెట్
ఫొటోలను చేర్చి అత్యధిక వికీపీడియా వ్యాసాలను మెరుగుపరచిన కొత్త వాడుకరికి బహుమతి:
- ప్లేక్ అవార్డు + WPWP సావనీర్లు + సర్టిఫికెట్
తెలుగు వికీపీడియా స్థానిక బహుమతుల వివరాలు
[మార్చు](గమనిక: ఈ ప్రాజెక్టుకి ఉద్దేశించిన గ్రాంటు ఆలస్యంగా రావటం వలన, ప్రాజెక్టుని మరో ఇరవై అయిదు రోజులు అనగా 2022 అక్టోబరు 6 నుండి 31 వరకు, ఒక ప్రత్యేక జోడింపుని చేర్చడం జరుగుతుంది. మొదటిగా రెండు నెలల పాటు అనగా జులై 1 నుండి ఆగస్టు 31 వరకు జరిగిన కృషి ఆపై ఈ ఇరవై అయిదు రోజుల కృషిని పరిగణిస్తూ క్రింద ప్రకటించిన బహుమతులు అందించబడతాయి)
ఫొటోలను చేర్చి అత్యధిక తెలుగు వికీపీడియా వ్యాసాలను మెరుగుపరచిన మొదటి ముగ్గురు వాడుకరులకు బహుమతులు:
- మొదటి బహుమతి ― ₹15000 గిఫ్ట్ కార్డు + WPWP సావనీర్లు + సర్టిఫికెట్
- రెండవ బహుమతి ― ₹7500 గిఫ్ట్ కార్డు + WPWP సావనీర్లు + సర్టిఫికెట్
- మూడవ బహుమతి ― ₹5000 గిఫ్ట్ కార్డు + WPWP సావనీర్లు + సర్టిఫికెట్
ఆడియోలను చేర్చి అత్యధిక వికీపీడియా వ్యాసాలను మెరుగుపరచిన వాడుకరికి బహుమతి:
- ₹5000 గిఫ్ట్ కార్డు + WPWP సావనీర్లు + సర్టిఫికెట్
వీడియోలను చేర్చి అత్యధిక వికీపీడియా వ్యాసాలను మెరుగుపరచిన వాడుకరికి బహుమతి:
- ₹5000 గిఫ్ట్ కార్డు + WPWP సావనీర్లు + సర్టిఫికెట్
ఫొటోలను చేర్చి అత్యధిక వికీపీడియా వ్యాసాలను మెరుగుపరచిన కొత్త వాడుకరికి బహుమతి:
- ₹5000 గిఫ్ట్ కార్డు + WPWP సావనీర్లు + సర్టిఫికెట్
పోటీ దారులకి ప్రాజెక్టు నుండి అందిస్తున్న ప్రత్యేక ప్రోత్సహాకాలు
[మార్చు]గమనిక: ప్రాజెక్టులో జులై, ఆగస్టు నెలల్లో జరిగిన కృషి ఆధారంగా, ఉత్సహాంగా పాల్గొన్న వారికి మాత్రమే ఈ ప్రోత్సాహకాలు అందించబడతాయి.
రీఛార్జ్ సదుపాయం
[మార్చు]ప్రాజెక్టులో భాగంగా 20 వాడుకరులకు మొబైలు అలవెన్సు సదుపాయం అందిస్తున్నాము. అయితే దీనికి అర్హతగా, ఈ ప్రాజెక్టులో కనీసం 50 వ్యాసాలలో చిత్రాలు/ఆడియోలు/వీడియోలు ఎక్కించి ఉండాలి.
ఇలా ప్రాజెక్టులో ఇది వరకే 50 దిద్దుబాట్లు చేసిన వాడుకరులు, అలాగే ప్రాజెక్టు అదనపు జోడింపు సమయం అక్టోబరు 6 నుండి 31 వరకు కూడా ఈ దిద్దబబాట్ల మార్కు దాటితే ఇక్కడ మీ అభ్యర్థన చేయండి.
CIS A2K వారు అందించే మొబైలు అలవెన్సు సదుపాయం పొందుతున్న వారు, దీనికి అనర్హులు.
చిత్ర యాత్ర (photo travel)
[మార్చు]చిత్ర యాత్ర అంటే యాత్రల్లో తిరుగుతూ చిత్రాలు తీయాలేమో అనుకుంటున్నారా!
అవును! మీరు అనుకున్నది అక్షరాలా నిజం !
ఈ సారి ప్రాజెక్టులో మీరు మీ ప్రాంతానికి చుట్టుపక్కన ఉన్న ఊర్లలో/ప్రదేశాలలో తిరుగుతూ ఏవైతే వికీ వ్యాసాల్లో చిత్రాలు అవసరమో అవి చిత్రించి వికీ కామన్స్ లో చేర్చాలి.
ఆగండి ! ఇంతటితో అయిపోలేదు, మీరు కామన్స్ లో ఎక్కించిన చిత్రాలు తెలుగు వికీలోని వ్యాసాల్లో చేర్చాలి(పోటీ షరతులు వర్తిస్తాయి సుమీ).
చిత్ర యాత్రలో పాల్గొనాలి అనుకునే వాడుకరులు అక్టోబరు 8 లోగా ఇక్కడ మీ అభ్యర్థనలు తెలుపవచ్చు.
చిత్ర యాత్రకు మార్గదర్శకాలు
- ప్రాజెక్టులో భాగంగా 10 మంది వాడుకరులు ప్రతి ఒక్కరు మూడు రోజుల పాటు ఈ చిత్ర యాత్రలో పాల్గొనవచ్చు.
- అలాగే సముదాయంలో అనుభవం గల వాడుకరుల్లో ఎవరైనా ఒక్కరు 5 రోజుల పాటు ఈ చిత్ర యాత్రలో పాల్గొనే అవకాశం ఉంది.
- ఈ చిత్ర యాత్రలో భాగంగా ప్రతి రోజు మీరు మీకు వీలైన ప్రదేశాలలో తిరుగుతూ ఆయా ప్రాంతాలకు సంబంధించిన వ్యాసాలలో అవసరమైన బొమ్మలు చిత్రీకరించి కామన్స్‌లో చేర్చి ఆపై వ్యాసాలలో పొందుపరచాలి.
- తీసిన చిత్రాలన్నీ కూడా కామన్స్ లో చేర్చేటప్పుడు CC0., CC BY-SA 4.0 లేదా పబ్లిక్ డొమైన్లో ఉండే లైసెన్సులను మాత్రమే ఉపయోగించాలి.
- చిత్ర యాత్రలో భాగంగా కామన్సులో ఎక్కించే చిత్రాలకి #WPWPTE అనే హాష్ ట్యాగ్ తప్పనిసరి ఉపయోగించాలి. (అంటే తెలుగు వికీపీడియాలో ఎలాగైతే దిద్దుబాటు సారాంశంలో (#WPWPTE) అని రాస్తారో అలాగే వికీ కామన్స్ లో కూడా చిత్రం చేర్చే దిద్దుబాటు సారాంశంలో #WPWPTE చేర్చాలి.)
- ఇక మీరు చిత్రాన్ని చేర్చే వ్యాసంలో ఇది వరకు ఏ బొమ్మ ఉండకుండా ఉండాలి (మ్యాపులకి మినహాయింపు కలదు), అలాగే ఆ వ్యాసం తప్పనిసరిగా మొలక స్థాయిని దాటి ఉండాలి.
- అలా వ్యాసంలో చిత్రం చేర్చేటప్పుడు యధావిధిగా నియమాల ప్రకారం #WPWPTE ఉపయోగించాలి.
ఇక మిగిలిన నియమాలు అన్ని పోటీలో యధావిధిగా ఉంటాయి.
ఈ యాత్రలో పాల్గొనే వారు తమ మూడు రోజుల వ్యవధి పూర్తి చేసుకొని ఆ చిత్రాలని తెలుగు వికీ వ్యాసాల్లో పొందుపరచినాక మీకు ఈ అలవెన్సు అందించబడుతుంది.
శిక్షణా శిభిరాలు/కార్యశాలలు
[మార్చు]ఈ కార్యక్రమంలో భాగంగా వికీలో అనుభవం గల వాడుకరులు ఎవరైనా సరే వికీ శిక్షణా శిభిరం నిర్వహించే వెసులుబాటు కల్పిస్తున్నాము. ఇందులో భాగంగా హైదరాబాద్ మినహాయించి రెండు తెలుగు రాష్ట్రాల్లో నాలుగు ప్రాంతాల్లో శిక్షణా శిబిరాలు నిర్వహించవచ్చును, ఒక్కో రాష్ట్రంలో రెండేసి నిర్వహించాల్సి ఉంది.
కారశాలలు నిర్వహించ దలచిన వారు, అక్టోబరు 5వ తారీఖులోగా ఇక్కడ మీ ప్రతిపాదనలు తెలపండి.
నిర్వహణ మార్గదర్శకాలు
- స్థానిక వికీపీడియన్లు తమ సొంత ప్రదేశానికి దగ్గరలోని ఊర్లోనే ఈ కార్యశాలలు జరపాలి.
- కార్యక్రమ స్థలానికి దగ్గరలో ఉన్న వికీపీడియను/న్లు ఈ కార్యశాలకి వెళ్లే విధంగా వారి సమ్మతి తెలుసుకోవాలి. ( అలా మనం చిన్న చిన్న గుంపులుగా కలిసే వీలు ఏర్పడుతుంది)
- నిర్వాహకులు, న్యాయ నిర్ణేతలు లేదా వికీ శిక్షణ అందించడంలో అనుభవం గల వారిలో ఎవరో ఒక్కరు మాత్రమే కార్యక్రమానికి హాజరు అవ్వచ్చు. (స్థానిక వికీపీడియను తానె స్వయంగా శిక్షణ నిర్వహించగలిగితే ఇలా ఒకరు వెళ్ళ వలసిన అవసరం లేదు)
- కార్యశాల నిర్వహించదలచిన వారు, కార్యక్రమ పేజీ ఒకటి రూపొందించాలి.
- ఆ పేజీ ద్వారా కార్యక్రమం జరిగే ప్రదేశం, అంశాలు, పాల్గొనే వారి వివరాలు, చిత్రమాలిక, కార్యక్రమం జరపడం వలన చేరుకున్న లక్ష్యాలను గురించి వివరించాలి.
అయితే ఎవరైతే ఈ శిభిరాలు నిర్వహించదలిచారో మీ ప్రతిపాదనలు తెలిపిన తరువాత, ప్రాజెక్టులో మనకి అందుబాటులో ఉన్న సదుపాయాలతో యెంత మేరకు సహకారం అందించగలమో తెలుపుతాము.
ఒకవేళ సముదాయంలోని సభ్యులు కార్యశాలలు నిర్వహించడానికి ముందుకు రాని పక్షాన, ఈ కార్యక్రమాలలన్నింటిని ప్రాజెక్టు నిర్వాహకులు చేపడతారు.
పోటి దారులకి చదువరి గారు అందిస్తున్న ప్రోత్సాహకాలు
[మార్చు]- ఈ పోటీలో 800 దిద్దుబాట్లు చేసినవారికి 3000 రూపాయలు ప్రోత్సాహకంగా అందిచబడును. ఒకరి కంటే ఎక్కువ మంది 800 కంటే ఎక్కువ దిద్దుబాట్లు చేస్తే, వారి దిద్దుబాట్ల నిష్పత్తి ప్రకారం 800 దాటిన వారికి పంచుతాం. ఉదాహరణకు, వాడుకరి1 1000 దిద్దుబాట్లు, వాడుకరి2 800 చేసారనుకుందాం.. బహుమతి మొత్తంలో వాడుకరి1 కి 1,670 రూపాయలు, వాడుకరి2 కు 1,330 రూపాయలు వస్తాయి. 800 దిద్దుబాట్లు ఎవరూ చెయ్యకపోతే ఎవరికీ ఇవ్వడం జరగదు.
- 500 ఫొటోలను ఎక్కించిన (అప్లోడు చేసిన) వారికి 3000 రూపాయలు ప్రోత్సాహకంగా అందించబడును. ఒకరి కంటే ఎక్కువమంది అది సాధిస్తే బహుమతిని పైవిధంగానే నిష్పత్తిలో పంచుతాం. ఎవరూ చెయ్యకపోతే ఆ మొత్తాన్ని భవిష్యత్తు కోసం వాడతాం.
పోటీలో పాల్గొనేవారు రెండు బహుమతులకూ అర్హులే. ఇతర నిబంధనలన్నీ ఈ పోటీలో ఎలా ఉంటే అలానే.
ఫలితాలు
[మార్చు]ఫొటోల చేర్పు: పైన ప్రకటించిన ఫలితాలను బట్టి 800 పేజీల్లో ఫొటోలను ఎవరూ చేర్చలేదు కాబట్టి ఈ బహుమతి ఎవ్వరికీ ఇవ్వడం లేదు. ఫొటోల ఎక్కింపు: పోటీ కాలంలో (జూలై, ఆగస్టు నెలలు) ఎక్కించిన మొత్తం ఫొటోలు: 877. అందులో వాడుకరి:స్వరలాసిక గారు ఎక్కించినవి: 579. కామన్సులో చేసిన ఎక్కింపులను ఇందులో పరిగణించలేదు. అక్కడ ఎవరూ ఎక్కించలేదని భావిస్తున్నాను. ఒకవేళ ఎవరైనా ఎక్కించి ఉంటే ఇక్కడ తెలుపవలసినదిగా కోరుతున్నాను. వాడుకరి:Nskjnv గారూ మీ దృష్టికి వచ్చిన కామన్సు ఎక్కింపు గణాంకాలు ఏమైనా ఉన్నా, ఇక్కడ నేను ఇచ్చిన గణాంకాల్లో ఏమైనా తేడాలు గమనించినా ఇక్కడ తెలుపవలసినదిగా కోరుతున్నాను. 500 ఎక్కింపులు చేసినది స్వరలాసిక గారొక్కరే కాబట్టి బహుమతి సొమ్ము రూ 3,000 మొత్తాన్నీ ఆయనే గెలుచుకున్నారు. నాలుగు రోజుల్లో దీనిపై అభ్యంతరాలు ఏమీ రానట్లైతే, మిగతా బహుమతుల ప్రకటన పూర్తి కాగానే ఈ సొమ్ము పంపించే ఏర్పాటు చేస్తాను. స్వరలాసిక గారికి అభినందనలు. __చదువరి (చర్చ • రచనలు) 05:36, 27 సెప్టెంబరు 2022 (UTC)
- చదువరిగారూ! మీరు పంపిన బహుమతి అందింది. చాలా సంతోషం. మీకు నా ధన్యవాదాలు. --స్వరలాసిక (చర్చ) 05:21, 30 సెప్టెంబరు 2022 (UTC)
- శుభాభినందనలు స్వరలాసిక గారు, ఈ ప్రాజెక్టులో మీ కృషి అమోఘం. ప్రాజెక్టుకి ఈ ప్రోత్సహాన్ని అందించిన చదువరి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. NskJnv 06:15, 30 సెప్టెంబరు 2022 (UTC)
- స్వరలాసిక గార్కి, అలాగే స్వంతనిధులతో ప్రోత్సహాక నగదు బహుమతి అందించిన వాడుకరి:Chaduvari గారికి, ప్రాజెక్టు నిర్వహకుడు సాయికరణ్ గార్కి, ఈ ప్రాజెక్టులో పాల్గొన్న వాడుకరులందరికి అభినందనలు. యర్రా రామారావు (చర్చ) 06:34, 30 సెప్టెంబరు 2022 (UTC)
- స్వరలాసిక గారూ, ధన్యవాదాలు, అభినందనలు. ప్రాజెక్టులో పాల్గొన్న ఇతర వాడుకరులకు, నిర్వాహకులకు కూడా అభినందనలు. __చదువరి (చర్చ • రచనలు) 06:52, 30 సెప్టెంబరు 2022 (UTC)
- వాడుకరి:Nskjnv గారు పైన తెలిపిన గణాంకాల్లో WPWP సంభందించిన లెక్కలు మాత్రమే తెలిపారు. కానీ WPWPTE సంభందించిన లెక్కలు తెలిపలేదు. ఈ ప్రాజెక్ట్ ఫలితాలు పేజీలో వికీపీడియా:వికీప్రాజెక్టు/వికీపీడియా_పేజస్_వాంటింగ్_ఫోటోస్_2022/ఫలితాలు నిర్వాహకులు గణాంకాలు తెలిపారు, కానీ ఇక్కడ పరిగణించ లేనట్టు ఉన్నది. --Divya4232 (చర్చ) 05:23, 1 అక్టోబరు 2022 (UTC)\
- నమస్కారం Divya4232 గారు!
అయితే ఈ విషయాన్నీ పరిశీలించాను, చదువరి గారు తెలిపిన బహుమతులలో మొదటిది 800 కంటే ఎక్కువ దిద్దుబాట్లు చేసిన వారికి ఉద్దేశించబడింది. అలా 800 దాటి ఎవ్వరు చేయలేదు కావున ఆ బహుమతి ఎవ్వరికీ అందలేదు. -ఇక రెండవది అత్యధికంగా చిత్రాలు(కామన్స్ లో గాని తెవికీ లో గాని) ఎక్కించిన వారికి (వ్యాసాలలో చేర్చిన వారికి కాదు) దీంట్లో స్వరలాసిక గారు 679 దస్త్రాలు ఎక్కించినట్లు తెలుస్తుంది. ఆ గణాంకాలు మీరు ఇక్కడ చూడవచ్చు. మీరు ఈ ప్రాజెక్టులో చేసిన దస్త్రపు ఎక్కింపులు 130, అవి ఇక్కడ చూడండి.
కావున ఈ బహుమతి విషయంలో ఎటువంటి అభ్యంతరం లేదు, ధన్యవాదాలు.
NskJnv 06:08, 1 అక్టోబరు 2022 (UTC)
ప్రాజెక్టు గడువు
[మార్చు]అందరికి నమస్కారం !
ప్రాజెక్టులో కృషి చేసిన తెలుగు వికీపీడియన్లకు అభినందనలు, ఉద్యమ కాలంలో మీరంతా చక్కటి దిద్దుబాట్లు చేసి తెలుగు వికీ అభివృద్ధిలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు.
2022 అక్టోబరు 31 తో ప్రాజెక్టు గడువు ముగిసింది, ఇక వచ్చే సంవత్సరం ఉద్యమ కాలంలో మళ్ళి కలుద్దాం. త్వరలో పోటీ ఫలితాలు తెలియజేస్తాము, అలాగే నవంబరు 12న (రెండవ శనివారం) నాడు హైదరాబాద్ రవీంద్రభారతిలో బహుమతుల ప్రధానోత్సవ వేడుక జరపదలిచాం. మీ అభిప్రాయాలు ప్రాజెక్టు చర్చా పేజీలో తెలియపరచగలరు.
ఇట్లు
ప్రాజెక్టు నిర్వాహకులు