వాడుకరి చర్చ:Divya4232

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్వాగతం[మార్చు]

Divya4232 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

Divya4232 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

 • తెలుగు వికీపీడియా పరిచయానికి వికీపీడియాలో రచనలు చేయుట, 2014 (ఈ-పుస్తకం), తెలుగులో రచనలు చెయ్యడం (వికీ వ్యాసాలు), టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
 • "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
 • వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
 • చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని (OOUI JS signature icon LTR.png) బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
 • వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
 • వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.
 • వికీపీడియాలో సవరణలు చెయ్యాలంటే కొత్తవారికి "విజువల్ ఎడిటరు" తేలిగ్గా, చాలా సౌకర్యంగా ఉంటుంది. దాన్ని మీ డిఫాల్టు ఎడిటరుగా ఎంచుకోండి. ఎలా ఎంచుకోవాలో తెలుసుకోండి.

ఇకపోతే..


 • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
 • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
 • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   Nrgullapalli (చర్చ) 04:24, 30 మార్చి 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters[మార్చు]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:37, 30 జూన్ 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]

మ్యాపులు చురుకుగా చేరుస్తునందుకు ధన్యవాదాలు[మార్చు]

దివ్య గారూ అనతికాలంలోనే తెవికీలో చురుకుగా గ్రామ పుటలలో, ప్రత్యేకంగా స్థానిక స్వపరిపాలన సంస్థల పుటలను గుర్తించి మ్యాపులు చేరుస్తున్నందుకు ధన్యవాదాలు.తెవికీ పరంగా ఏమైనా సందేహాలు ఉంటే ఇప్పుడు నేను సంప్రదించినట్టే, నాచర్చాపేజీ ద్వారా మీరూ సంప్రదించవచ్చు. యర్రా రామారావు (చర్చ) 18:44, 26 ఆగస్టు 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.

ఆహ్వానం : ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం - మొదటి Edit-a-thon ( 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకు)[మార్చు]

నమస్కారం ,

తెలుగు వికీపీడియాలో భారత స్వాతంత్ర పోరాటం లో వెలుగు చూడని వీరుల గాథలు, మహిళా స్వాతంత్ర సమరయోధులు, స్వతంత్ర భారతంలో వెలుగు చూసిన ఉద్యమాలు, కీలక సంఘటనల గురించిన సమాచారం, సంబంధిత ఫొటోలు లాంటి విషయాలకు అనుగుణంగా 75 రోజులు ఆజాదీ కా అమృత్ మహోత్సవం అనే పేరుతో నిర్వహిస్తున్నాము, ఇందులో భాగంగా ఈ బుధవారం 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకూ జరిగే మొదటి విడత ఎడిట్ థాన్ కార్యక్రమంలో లో వికీపీడియన్లు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాము. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకోడానికి సభ్యులందరు తప్పక చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నాము. ఆసక్తి గల సభ్యులు, మరిన్ని వివరాలకు , పాల్గొనటానికి ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం ప్రాజెక్టు పేజీ చూడగలరు : Kasyap (చర్చ) 05:59, 1 సెప్టెంబరు 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]

అభినందనలు[మార్చు]

వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2021 ప్రాజెక్టులో మీ కృషి అమోఘం. అభినందనలు. త్వరలో మీకు WPWP సావినీర్లు, సర్టిఫికెట్ పంపబడతాయి. దయచేసి వెంటనే ఈ క్రింది లంకెలో ఉన్న ఫారంలో మీ వివరాలు తెలియజేయండి.

https://docs.google.com/forms/d/e/1FAIpQLSd-TaLmENAW9Y3HbSDtLyBsneiZqiGFbStEjrr-lC9ASAZywA/viewform

--స్వరలాసిక (చర్చ) 09:45, 9 సెప్టెంబరు 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]

కానుక[మార్చు]

WPWPTE logo 2.png బొమ్మలు చేర్చిన నేర్పరులు
వికీపీడియా పేజీలలో సముచితమైన బొమ్మలను చేర్చినందులకు గుర్తుగా ఈ మెడల్‌ను స్వీకరించండి.--స్వరలాసిక (చర్చ) 09:31, 14 సెప్టెంబరు 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]


Movement Charter Drafting Committee - Community Elections to take place October 11 - 24[మార్చు]

నమస్కారం దివ్య గారూ ,

వికీమీడియా ఉద్యమంలో వికిపీమీడియన్ల పాత్రలు బాధ్యతలను ఉద్యమ చార్టర్ నిర్వచిస్తుంది. అందరి భాగస్వామ్యంతో వ్యూహాత్మక దిశలో కలిసి పనిచేయడానికి ఈ ఫ్రేమ్‌వర్క్ ఉపయోగపడననుంది.

ఉద్యమ చార్టర్ డ్రాఫ్టింగ్ కమిటీ ఈ చార్టర్ ముసాయిదాను రూపొందిస్తుంది. కంటెంట్ ఈక్విటీ ఇన్ డెసిషన్ మేకింగ్ "అనే మూవ్మెంట్ స్ట్రాటజీ సిఫార్సును అనుసరిస్తుంది. కమిటీ పని ముసాయిదా రాయడం వరకు విస్తరించింది. ఇందులో కమ్యూనిటీలు, నిపుణులు, సంస్థలతో పరిశోధన ఇంకా సంప్రదింపులు ఉంటాయి. ఈ ముసాయిదా చార్టర్‌గా మారడానికి ముందు ఉద్యమం-అంతటా ఆమోదం ద్వారా ఏకాభిప్రాయం పొందాలి.

ఈ గ్రూపులో దాదాపు 15 మంది సభ్యులు ఉంటారు. ఇది ఉద్యమంలో వైవిధ్యాన్ని సూచిస్తుందని భావిస్తున్నారు. లింగం, భాష, భౌగోళికం అనుభవం లాంటి వివిధ వైవిద్యాలతో అభ్యర్థుల ఎంపిక జరగనుంది . ఈ సమూహ సభ్యులు ప్రాజెక్టులు, అనుబంధ సంస్థలు వికీమీడియా ఫౌండేషన్‌కి సంబందించిన కార్యకలాపాలలో పాల్గొనవలసి ఉంటుంది.

ఈ పోటీలో భారత్ నుండి 9 మంది వ్యక్తులు ఉండగా మన తెలుగు వికీ నుండి నేను ఒక్కడిని పాల్గొంటున్నాను అక్టోబరు 11 అనగా రేపటి నుండి దీని ఎన్నికలు జరగనున్నాయి. ఇది నా సభ్యత్వ పేజీ , పరిశీలించగలరు.

ఈ పోటీలో నాకు మీ మద్దతు ఉంటుందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. Nskjnv ☚╣✉╠☛ 06:25, 10 అక్టోబరు 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]

నేతి సాయికిరణ్ గారూ నమస్కారం, తప్పకుండా నా మద్దతు మీకు ఉంటుంది. ధన్యవాదాలు --Divya4232 (చర్చ) 08:47, 12 అక్టోబరు 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]

మీరు ఎక్కించిన ఫైళ్ల లైసెన్స్ వివరాలు చేర్చటం[మార్చు]

@Divya4232 గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. మీరు ఎక్కించిన క్రింది బొమ్మ(ల)కు లైసెన్స్ వివరాలు చేర్చలేదు. లైసెన్స్ లేని ఫైళ్లు వికీ సమగ్రతకు భంగం, వాటిని తొలగించే వీలుంది.

 1. File:Anuragalu-1975jpeg-242x300.jpg
 2. File:Allare_Allari_(2006)_Telugu_in_HD.jpg

వీటికి లైసెన్స్ వివరాలు సరిచేయటం సులభమే. ఈ పేజీలో {{Information}} లేక {{Non-free use rationale}} తో వర్గం:Wikipedia_image_copyright_templates లో సరిపోయిన లైసెన్స్ మూసను వాటికి తగిన శీర్షికలతో చేర్చాలి. ఉదాహరణలకు ఆంగ్లవికీలో అటువంటి ఫైళ్ల వివరాలు చూడండి. ఒకవేళ ఉచితం కాని ఫైళ్ల లెసెన్స్ వివరాలు గుర్తించలేకపోతే, వాటిని తొలగించమని కోరవచ్చు. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. పై వాటిని సవరించితే పై ఫైళ్ల వరుసలో సరిచేసిన వివరాలను చేర్చండి. ఒక వారంలోగా మీ నుండి స్పందన లేకపోతే బొమ్మలు తొలగించుతాను. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 05:59, 21 డిసెంబరు 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]

అంతర్వికీ లింకులు[మార్చు]

దివ్య గారూ, మీరు సృష్టించిన పేజీలకు ఇతర భాషల లింకులు ఇవ్వండి. దాని వలన రెండు ముఖ్యమైన ఉపయోగాలున్నై:

 1. వేరే పేరుతో మరొకరు ఆ పేజీని సృష్టించకుండా ఉండేందుకు పనికొస్తుంది.
 2. మీరు సృష్టించినది వేరేపేరుతో ఈసరికే ఉందేమో దీనిద్వారా తెలుస్తుంది.

__ చదువరి (చర్చరచనలు) 14:01, 25 మార్చి 2022 (UTC)Reply[ప్రత్యుత్తరం]

యాంత్రికనువాద వ్యాసాలు[మార్చు]

@Divya4232 గారూ, మీరు కొత్తగా రాస్తున్న వ్యాసాలను యాంత్రికనువాదం ద్వారా ఉన్నద్దున్నట్లుగా కాపీపేస్టు చేస్తున్నారు. అటువంటి వ్యాసాలు తొలగించబడుతాయి. గమనించగలరు.-- ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 17:46, 12 మే 2022 (UTC)Reply[ప్రత్యుత్తరం]

@Pranayraj1985 గారూ, ఏమైనా అక్షర దోషాలు ఉంటే సరిచేయండి ప్రతి వ్యాసాలకు యాంత్రికనువాదం అని పేటి వ్యాసాలను తొలిగించవద్దు నేను వ్యాసాలు వ్రాయటం నేర్చుకొంటున్నాను. Divya4232 (చర్చ) 18:23, 12 మే 2022 (UTC)Reply[ప్రత్యుత్తరం]
@Divya4232 గారూ, మీరు వ్యాసాలు వ్రాయటం నేర్చుకుంటున్నట్లయితే అందుకు మీ ప్రయోగశాలను ఉపయోగించండి. అంతేకానీ, వికీపీడియాను ప్రయోగశాలగా మార్చకండి. మీరు రాస్తున్న వ్యాసాలలో చిన్నచిన్న అక్షర దోషాలు ఉంటే సరిచేయవచ్చు, కానీ ప్రతి వ్యాసం యాంత్రికనువాదంలోనే ఉంది. కాబట్టి, మీరు కొత్త వ్యాసాలను రాయడానికి ముందు గతంలో మీరు రాసిన యాంత్రికనువాద వ్యాసాలను శుద్దిచేసే పని చేపట్టండి. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 18:57, 12 మే 2022 (UTC)Reply[ప్రత్యుత్తరం]
@Divya4232 గారూ, వ్యాసాలలో పెట్టిన నిర్వాహణ మూసలను తొలగించారు. వ్యాసాలను శుద్ధి చేయకుండా ఆయా మూసలను తొలగించవద్దు. మీరు వ్యాసాలను శుద్ధి చేసిన తరువాత, ఆయా వ్యాసాల చర్చాపేజీలో తెలియపరిస్తే వికీ సభ్యులు పరిశీలించి సరిగా ఉన్న తరువాతే మూసలను తొలగిస్తారు. గమనించగలరు.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 05:14, 13 మే 2022 (UTC)Reply[ప్రత్యుత్తరం]
@Pranayraj1985 గారూ, వన విహార్ జాతీయ ఉద్యానవనం అనే వ్యాసంలో రవిచంద్ర@ గారూ సవరణ చేసారు అయిన మీరు దానిని యాంత్రిక అనువాదం అని పెట్టారు. సాధ్యమైన అంతవరకు మీరు తెలిపిన సూచనలు పాటించగలను Divya4232 (చర్చ) 05:23, 13 మే 2022 (UTC)Reply[ప్రత్యుత్తరం]
అలాగేనండీ @Divya4232 గారూ, ఆ వ్యాసాన్ని పరిశీలించి మూస తొలగిస్తాను. ఇకపై వ్యాసాలను యాంత్రిక అనువాదం నుండి రాసిన తరువాత వాటిని శుద్ధి చేయగలరు. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 09:05, 13 మే 2022 (UTC)Reply[ప్రత్యుత్తరం]

వికీ కామన్స్ లో ఫోటోల ఎక్కింపు[మార్చు]

నమస్కారం, వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ (WPWP) 2022 పాల్గొంటున్నందుకు ధన్యవాదాలు. ఈ పోటీలో భాగంగా కాపీరైట్స్ ఉన్న ఫోటోలను మీరు వికీ కామన్స్ లోకి ఎక్కిస్తున్నారు. సరైన లైసెన్స్ వివరాలు కూడా చేర్చడంలేదు. మీరు కామన్స్ లో ఎక్కించిన అన్ని సినిమా పోస్టర్లకు తొలగింపు మూస చేర్చబడింది. కాపీరైట్స్ ఉన్న ఫోటోలు వికీకామన్స్ నుండి తొలగించబడుతాయి. అప్పుడు వ్యాసాలలోని ఫోటో లింకు తెగిపోతుంది. మీరు పడిన శ్రమంతా వృధా అవుతుంది. సరైన లైసెన్స్ వివరాలతోనో లేదా కాపీరైట్స్ లేని ఫోటోలనో వికీకీమన్స్ లోకి చేర్చగలరు.-- ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 12:12, 23 జూలై 2022 (UTC)Reply[ప్రత్యుత్తరం]

@Pranayraj1985 గారూ, తెలియక ఫోటోలు పెట్టాను, ఇకనుండి లైసెన్స్ వివరాలు చూసుకొని పెడతాను. Divya4232 (చర్చ) 13:04, 23 జూలై 2022 (UTC)Reply[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు Divya4232 గారు, వికీ రచనలో ఏవైనా సందేహాలు ఉంటే మీరు నన్ను సంప్రదించవచ్చు.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 14:10, 23 జూలై 2022 (UTC)Reply[ప్రత్యుత్తరం]

సమాచార పెట్టే మూస దిగుమతి[మార్చు]

YesY సహాయం అందించబడింది

{{Infobox diocese}} ఈ సమాచార పెట్టేను దిగుమతి చేయండి Divya4232 (చర్చ) 14:49, 10 ఆగస్టు 2022 (UTC)Reply[ప్రత్యుత్తరం]

@Divya4232 గారు, దిగుమతి చేశాను. పరిశీలించండి. అర్జున (చర్చ) 23:48, 10 ఆగస్టు 2022 (UTC)Reply[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు Divya4232 (చర్చ) 14:24, 11 ఆగస్టు 2022 (UTC)Reply[ప్రత్యుత్తరం]