ఐషే ఘోష్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఐషే ఘోష్
2021 జూలైలో ఘోష్
JNUSU స్టూడెంట్స్ యూనియన్ కార్యదర్శి
In office
2019–2020
అంతకు ముందు వారుఎన్ సాయి బాలాజీ
వ్యక్తిగత వివరాలు
జననం (1995-10-22) 1995 అక్టోబరు 22 (వయసు 29)
దుర్గాపూర్, పశ్చిమ బెంగాల్, భారతదేశం
రాజకీయ పార్టీకమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)
చదువుదౌలత్ రామ్ కళాశాల (బిఎ), జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (ఎంఎ)
వృత్తివిద్యార్థి కార్యకర్త

ఐషే ఘోష్ [1] భారతీయ రాజకీయవేత్త, విద్యార్థి కార్యకర్త. ఆమె జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షురాలు, స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో సభ్యురాలు. 2021 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలలో జమురియా నియోజకవర్గం నుండి CPI(M) అభ్యర్థిగా పోటీచేసి, హరేరామ్ సింగ్ చేతిలో ఓడిపోయింది.[2][3]

ప్రారంభ జీవితం, విద్య

[మార్చు]

1995 అక్టోబరు 22 న జన్మించిన ఘోష్, పశ్చిమ బెంగాల్‌లోని పశ్చిమ్ వర్ధమాన్ జిల్లాలోని దుర్గాపూర్ నగరంలో పెరిగింది. ఆమె దేబాశిష్ ఘోష్, శర్మిష్ట ఘోష్‌ల పెద్ద బిడ్డ. తండ్రి దేబాశిష్ ఘోష్‌, దామోదర్ వ్యాలీ కార్పొరేషన్‌లో ఉద్యోగి, అతనికి భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) కార్మిక విభాగమైన సెంటర్ ఫర్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (CITU) తో అనుబంధం ఉంది. తల్లి శర్మిష్ట ఘోష్ గృహిణి. [4] ఆమె చెల్లెలు ఇషికా ఘోష్, ప్రస్తుతం న్యూఢిల్లీలోని శ్యామా ప్రసాద్ ముఖర్జీ కళాశాలలో అండర్ గ్రాడ్యుయేషన్ చేస్తోంది.[5]

ఢిల్లీ యూనివర్శిటీలోని దౌలత్ రామ్ కాలేజీ నుండి పొలిటికల్ సైన్స్‌లో పట్టా పొందిన తర్వాత ఘోష్, జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుండి మాస్టర్స్ డిగ్రీని అందుకుంది. 2024 నాటికి ఆమె, జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుండి స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీని అభ్యసిస్తోంది.[6]

రాజకీయ జీవితం

[మార్చు]

2019 సెప్టెంబరులో, జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షురాలిగా ఘోష్ ఎన్నికైంది.[7][8] ఆ పాత్రలో ఘోష్, ఫీజు పెంపుదల, లైబ్రరీ నిధుల కోతలు, హాస్టల్ కొరత, పెరిగిన విద్యుత్ ఛార్జీలు, విశ్వవిద్యాలయ విద్యార్థులపై దుస్తులు, సమయ పరిమితులకు వ్యతిరేకంగా నిరసనలలో పాల్గొంది.[9][10] 2019 అక్టోబరులో కొత్త నిబంధనలను ప్రవేశపెట్టిన తరువాత, ఈ విశ్వవిద్యాలయం భారతదేశంలోనే అత్యంత ఖరీదైన కేంద్రీయ విశ్వవిద్యాలయంగా మారింది.[11] ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు లాభాపేక్షతో కూడిన సంస్థలలా వ్యవహరించకూడదని ఆమె అభిప్రాయపడింది.[12] లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న ప్రొఫెసర్ అతుల్ జోహ్రీకి శిక్ష విధించకుండా, యూనివర్సిటీ జెండర్ సెన్సిటైజేషన్ కమిటీని తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ చేసిన నిరసనల్లో ఘోష్ కూడా పాల్గొంది.[13] విద్యాసంస్థలకు మద్దతు ఇవ్వడంలో భారతీయ జనతా పార్టీ నిర్లక్ష్యంగా ఉందని భావించి ఆమె, ఆ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఈ విశ్వవిద్యాలయంపై దాడి చేస్తోందని విమర్శించింది.

2020 జనవరి 5 న క్యాంపస్‌లో జరిగిన దాడుల్లో ఘోష్ తలకు గాయం కావడంతో ఆమె ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. హిందూ జాతీయవాద సంస్థ అయిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ ఈ దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.[14] [15] [16] క్యాంపస్‌పై దాడికి విస్తృతంగా కవరేజీ వచ్చింది. దీని తరువాత ఎగసిన నిరసన ఉద్యమంలో ఆమెకు జాతీయస్థాయి గుర్తింపు వచ్చింది. [17]

JNU, JNUSU, Aishe Ghosh
JNUSU అధ్యక్షురాలు ఐషే ఘోష్, తోటి విద్యార్థులతో కలిసి MHRD కార్యాలయానికి నిరసన ర్యాలీ నిర్వహించింది. ఈ ఫొటోలో ఆమె, MHRD అధికారిని కలిసి ఆఫీసు భవనం నుండి తిరిగి వస్తోంది.

ఆమెను కలవడానికి స్వయంగా వచ్చిన నటి, దీపికా పదుకొనే, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో సహా ఆమెకు విస్తృత మద్దతు లభించింది.[18][19] ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు ఐషే ఘోష్‌పై విధ్వంసం, దాడికి పాల్పడడం వంటి అభియోగాలు మోపారు, కానీ అరెస్టులేమీ చేయలేదు.[20] తమ ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయాలనే ఉద్దేశ్యంతో ఈ దాడి చేసిన వారికీ, పోలీసులకూ, జెఎన్‌యు పాలకవర్గానికీ మధ్య సంబంధాలు ఉన్నాయని ఆమె ఆరోపించింది. [21] ఈ సంఘటన తరువాత, ఆమె సిఎఎ, ఎన్సిఆర్ లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన ఉద్యమంలో పాల్గొంది. [22]

బాలీవుడ్ నటి దీపికా పదుకొణె జెఎన్‌యు క్యాంపస్‌ను సందర్శించి, గూండాల పాశవిక దాడిని వ్యతిరేకిస్తూ గుమిగూడిన విద్యార్థులకు సంఘీభావంగా బహిరంగ నిరసనకు హాజరయ్యారు. ఈ నిరసన 2020 జనవరి 7వ తేదీన జరిగింది.

ఆమె జేఎన్యూఎస్ యూ అధ్యక్షురాలి హోదాలో, యూనివర్సిటీ విధించిన "ఏకపక్ష" ఫీజు పెంపు, జరిమానాలకు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. [23]

2020 ఫిబ్రవరిలో, కోల్‌కతాలోని రెండు ప్రభుత్వ విశ్వవిద్యాలయాల క్యాంపస్‌ సమావేశాల్లో ప్రసంగించేందుకు ఘోష్‌కు అనుమతి నిరాకరించాయి. పశ్చిమ బుర్ద్వాన్‌లో ర్యాలీ నిర్వహించేందుకు పశ్చిమ బెంగాల్‌లోని జిల్లా యంత్రాంగం ఆమెకు అనుమతి నిరాకరించింది. [24]

2021 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు

[మార్చు]

ఐషే గోష్ 2021 పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో జమూరియా (విధాన సభ నియోజకవర్గం) నుండి సిపిఐ(ఎం) తరఫున పోటీ చేసి, అఖిల భారత తృణమూల్‌ కాంగ్రెస్‌ కు చెందిన హరేరామ్‌ సింగ్‌ చేతిలో ఓడిపోయింది.[25]

మూలాలు

[మార్చు]
  1. "Who is Aishe Ghosh? All you need to know about JNUSU president Aishe Ghosh". The Times of India (in ఇంగ్లీష్). 10 January 2020. Retrieved 2021-07-30.
  2. "West Bengal polls: CPI(M) to focus on young candidates". Deccan Herald (in ఇంగ్లీష్). 2021-03-03. Retrieved 2021-07-30.
  3. "সম্ভাব্য বাম প্রার্থীদের চিনে নিন..." Ei Samay (in Bengali). Retrieved 2021-07-30.
  4. Harikrishnan, Charmy. "Youth should not remain neutral: Aishe Ghosh, JNUSU President". The Economic Times. Retrieved 2021-07-30.
  5. "A peek into 'studious and gritty' JNU student leader Aishe Ghosh's life". Hindustan Times (in ఇంగ్లీష్). 2020-01-08. Retrieved 2021-07-30.
  6. "Meet JNUSU president Aishe Ghosh — the research scholar who became a leader to stop student body from dissolving". Business Insider. Retrieved 2021-07-30.
  7. "After HC Order, JNUSU Results Declared: A Left Sweep Once Again". TheQuint (in ఇంగ్లీష్). 2019-09-06. Retrieved 2021-07-30.
  8. "United Left front sweeps JNU student union polls, SFI's Aishe Ghosh president". The Economic Times. Retrieved 2021-07-30.
  9. "JNU grinds to a halt as students call for university strike demanding revocation of new hostel rules". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2021-07-30.
  10. "The Aishe Ghosh Interview: Ever since the BJP came to power, they have attacked education in JNU". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2021-07-30.
  11. "Post fee hike, JNU to be India's most expensive central university: Students to shell out Rs 62k per year for single room". Firstpost. 2019-11-17. Retrieved 2021-07-30.
  12. "Students are being treated as customers: JNUSU president Aishe Ghosh on fee-hike protests". The Caravan (in ఇంగ్లీష్). Retrieved 2021-07-30.
  13. "We Are Fighting To Save Last Bits Of JNU's Essence: JNUSU President Aishe Ghosh". magazine.outlookindia.com/. Archived from the original on 2021-07-30. Retrieved 2021-07-30.
  14. "Violence inside JNU, student union president Aishe Ghosh attacked by masked mob". The New Indian Express. 5 January 2020. Retrieved 18 June 2022.
  15. "JNUSU president Aishe Ghosh discharged from AIIMS". India Today (in ఇంగ్లీష్). 6 January 2020. Retrieved 2021-07-30.
  16. "JNU violence: Police name masked woman in video, ABVP admits she is their member". The Indian Express (in ఇంగ్లీష్). 2020-01-15. Retrieved 2021-07-30.
  17. "A Blow to the Head Makes an Instant Hero in India". The New York Times (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-01-17. ISSN 0362-4331. Retrieved 2021-07-30.
  18. "Entire country with you, Pinarayi Vijayan tells Aishe Ghosh". The Times of India (in ఇంగ్లీష్). 12 January 2020. Retrieved 2021-07-30.
  19. "Deepika Padukone Attends JNU Meet Against Violence, BJP Now Wants Her Films Boycotted". The Wire. Retrieved 2021-07-30.
  20. "Charges against student leader Aishe Ghosh, but none held for JNU attacks". The Hindu (in Indian English). 2020-01-07. ISSN 0971-751X. Retrieved 2021-07-30.
  21. Tanushree, Pandey (6 January 2020). "Organised attack, nexus between JNU security and vandals, says JNUSU president Aishe Ghosh". India Today (in ఇంగ్లీష్). Retrieved 2021-07-30.
  22. Harikrishnan, Charmy. "Youth should not remain neutral: Aishe Ghosh, JNUSU President". The Economic Times. Retrieved 2021-07-30.
  23. "JNU students' union moves Delhi High Court against hostel fee hike, says varsity decision arbitrary". Hindustan Times (in ఇంగ్లీష్). 2020-01-21. Retrieved 2021-07-30.
  24. "Mamata Banerjee, Aishe Ghosh land in each other's crosshairs". Hindustan Times (in ఇంగ్లీష్). 2020-02-15. Retrieved 2021-07-30.
  25. "West Bengal Election Result 2021 | Jamuria Assembly Constituency: Ex-JNUSU President Aishe Ghosh Defeated By TMC's Hareram Singh". Moneycontrol (in ఇంగ్లీష్). Retrieved 2021-07-30.
"https://te.wikipedia.org/w/index.php?title=ఐషే_ఘోష్&oldid=4318252" నుండి వెలికితీశారు