వికీపీడియా:వికీప్రాజెక్టు/వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2021/పద్ధతులు
స్వరూపం
రెండు మార్గాలు
[మార్చు]పైజీల్లో బొమ్మలను చేర్చాలంటే మనకు రెండు అంశాలు కావాలి - మొదటిది బొమ్మ లేని పేజీ, రెండవది దానికి సరిపడే బొమ్మ. ఈ పని రెండు విధాలుగా చెయ్యవచ్చు
- ముందు బొమ్మ లేని పేజీని పట్టుకుని ఆ తరువాత దానికి సరిపడే బొమ్మను చూసి దాన్ని పేజీలో చేర్చడం. "బొమ్మ లేని పేజీని పట్టుకుని" విభాగం చూడండి
- ముందు బొమ్మను పట్టుకుని ఆ తరువాత దానికి సరిపడే పేజీలో దాన్ని పెట్టడం. అది అటునుండి నరుక్కు వచ్చే పద్ధతి. దీని కోసం "ముందు బొమ్మను పట్టుకుని" విభాగం చూడండి
బొమ్మ లేని పేజీని పట్టుకుని
[మార్చు]- ముందుగా ప్రాజెక్టు పేజీకి వెళ్లండి
- అక్కడ, "ఎలా పాల్గొనాలి?" అనే విభాగంలో ఫొటోలు అవసరమైన పేజీలను వివిధ వర్గాల్లో చేర్చి చూపించారు. వాటిలో మీకు నచ్చిన వర్గాన్ని ఎంచుకోండి. ఆ వర్గంలో ఏదో ఒక పేజీని తెరవండి.
- మీరు తెరిచినది, "చర్చ" పేజీ. ఇప్పుడు దాని "వ్యాసం" ట్యాబుకు వెళ్ళండి. అందులో బొమ్మ ఉందో లేదో చూడండి. అందులో -
- బొమ్మ ఉంటే ఇక చేసేదేమీ లేదు. మళ్ళీ చర్చ పేజీకి వెళ్ళి అక్కడ ఉన్న {{బొమ్మ అభ్యర్థన}} అనే మూసను తీసేసి ఆ పేజీని ప్రచురించండి. ఆ వర్గానికి తిరిగి వెళ్ళి వేరే పేజీని ఎంచుకుని మళ్ళీ పని మొదలెట్టండి.
- ఒకవేళ ఆ పేజీలో బొమ్మ లేనట్లైతే.. ఆ పేజీకి సరిపడే బొమ్మను వెతకాలి. అందుకు ప్రధానంగా రెండు పద్ధతులు -
- అంతర్వికీ లింకుల ద్వారా ఇంగ్లీషు వికీలో లేదా ఇతర వికీల్లో బొమ్మ ఉంటే దాన్ని తెచ్చి ఇక్కడ పెట్టడం. "అంతర్వికీ లింకుల ద్వారా" అనే విభాగం చూదండి
- సరైన బొమ్మ కోసం కామన్సు లోను, తెవికీ లోనూ వెతికి ఆ బొమ్మను పేజీలో పెట్టడం. "బొమ్మ కోసం వెతకడం" అనే విభాగం చూడండి
అంతర్వికీ లింకుల ద్వారా
[మార్చు]- పేజీలో ఎడమ పక్కన ఉన్న పట్టీలో "ఇతర భాషలు" అనే శీర్షిక కింద ఉన్న లింకులను చూడండి. [అక్కడ లింకులేమీ లేకపోతే, ఇక చేసేదేమీ లేదు. ఈ పద్ధతిలో ఇక ముందుకు పోలేరు. వేరే పద్ధతిని అనుసరించడమే.] ఒకవేళ లింకులు ఉంటే, అందులో "ఇంగ్లీషు" లింకుకు వెళ్లండి.
- ఆ ఇంగ్లీషు పేజీలో బొమ్మ ఉందేమో చూడండి. [లేకపోతే, ఇక చేసేదేమీ లేదు. ఈ పద్ధతిలో ఇక ముందుకు పోలేరు. వేరే పద్ధతిని అనుసరించడమే.] ఉంటే ఆ బొమ్మను తెచ్చి మన పేజీలో పెట్టుకోవచ్చు.
- ఆ బొమ్మపై డబుల్‌క్లిక్కు చెయ్యండి. బొమ్మ ఒక్కటే పేజీలో తెరుచుకుంటుంది. ఆ పేజీలో కుడివైపు కింద "More details" అని కనిపిస్తుంది.
- దానికి ముందు ఉన్న బొమ్మ కామన్సు లోగో అయితే, ఇక ముందుకు సాగవచ్చు. ఆ బొమ్మ ఫైలు పేరును కాపీ చేసుకోండి
- ఇక, తెలుగు వికీలోని పేజీకి వచ్చి దాన్ని దిద్దుబాటు పద్ధతిలో తెరవండి.
- "చొప్పించు" మెనూలో "మీడియా" ఉపమెనూను నొక్కి, అప్పుడు వచ్చే డయలాగు పెట్టెలో మీరు కాపీ చేసుకున్న బొమ్మ ఫైలు పేరును ఇవ్వండి.
- బొమ్మకు తగిన వ్యాఖ్యను రాయండి. ఇంగ్లీషు వికీలో ఉన్న వ్యాఖ్యను గైడుగా కోసం తీసుకోండి.
- మార్పులను ప్రచురించు ను నొక్కి, దిద్దుబాటు సారాంశాన్ని రాయండి.
- సారాంశంలో #WPWPTE #WPWP అనే హ్యాష్‌ట్యాగులను చేర్చండి. నమూనా సారాంశం ఇలా ఉంటుంది - "బొమ్మ చేర్చాను #WPWPTE #WPWP" (దిద్దుబాటు సారాంశం రాయడం, అందులో హ్యాష్‌ట్యాగులను చేర్చడం తప్పనిసరి. అది లేకపోతే, మీ దిద్దుబాటును పోటీ లోకి పరిగణించదు.)
- ఇప్పుడు దాని చర్చ పేజీకి వెళ్ళి, అక్కడ ఉన్న {{బొమ్మ అభ్యర్థన}} అనే మూసను తీసేసి ఆ పేజీని ప్రచురించండి
- అంతే.. ఒక పేజిని మెరుగుపరచే పని అయిపోయినట్లే.
బొమ్మ కోసం వెతకడం
[మార్చు]వికీపీడియాలో బొమ్మలను రెండు చోట్ల భద్రపరుస్తారు.
- కామన్సు లో: ఇది వికీమీడియా వారి ప్రత్యేక బొమ్మల సైటు. ఇక్కడి బొమ్మలను వికీమీడియా వారి ఏ ప్రాజెక్టులోనైనా వాడుకోవచ్చు. ఇక్కడ, కాపీహక్కుల్లేని, ఉచితంగా లభించే బొమ్మలు మాత్రమే ఉంటాయి. ఈ బొమ్మలను ఎవరైనా స్వేచ్ఛగా వాడుకోవచ్చు. కామన్సు ఇలాంటి బొమ్మలు 7 కోట్లకు పైబడి ఉన్నాయి.
- తెలుగు వికీపీడియా వంటి వివిధ ప్రాజెక్టుల్లో స్థానికంగా ఉండే బొమ్మలు. కాపీహక్కులకు లోబడి ఉన్న, కామన్సు లోకి ఎక్కించడానికి వీలుగాని, పరిమితమైన, సముచితమైన వినియోగం కోసం మాత్రమే వాడుకోగలిగే బొమ్మలను స్థానిక ప్రాజెక్టుల లోకి ఎక్కించాలి, తెలుగు వికీపీడియాలో ఇలాంటి బొమ్మలు 15 వేల దాకా ఉన్నాయి.
పేజీకి అవసరమైన బొమ్మలను ఈ రెండు చోట్ల వెతికి సరిపడే బొమ్మను పేజీలో చేర్చవచ్చు. ఈ పనిని కింది విధంగా చెయ్యాలి
- బొమ్మలేని పేజీని దిద్దుబాటు చేసేందుకు తెరవండి.
- బొమ్మను చేర్చదలచిన చోట కర్సరును ఉంచండి.
- దిద్దుబాటు మెనూలో "చొప్పించు" ట్యాబు కింద ఉన్న "మీడియా" మెనూను నొక్కండి.
- అప్పుడూ కనబడే పెట్టెలో బొమ్మ కోసం వెతకండి. వెతికేందుకు సంచితమైన పేరును ఇవ్వండి. ఇక్కడ పేరు ఇచ్చి వెతికినపుడు అది కామన్సు, తెవికీ రెండిట్లోనూ వెతుకుతుంది.`
- అది ఇంగ్లీషులో ఇవ్వండి. బొఇమ్మలను సాధారణంగా ఇంగ్లీషు పేరు తోనే ఎక్కిస్తారు. తెలుగు పేర్లను చాలా అరుదుగా వాడుతారు,
- సరైన పేజీ దొరక్కపోతే ఇచ్చిన పదాన్ని మర్చి వివిధ రకాలుగా వెతకండి.
- సముచితమైన బొమ్మ కనబడినపుడు ఆ బొమ్మపై నొక్కండి.
- ఆ తరువాత "ఈ బొమ్మను వాడండి" ని నొక్కండి.
- అప్పుడు వచ్చే పెట్టెలో "సాధారణ" ట్యాబులో బొమ్మకు తగిన వ్యాఖ్యను రాయండి.
- "ఉన్నత" ట్యాబులో బొమ్మను ఎలా పెట్టాలో చూపించండి. సాధారణంగా ఈ అంశాన్ని పెద్దగా మార్చేదేమీ ఉండదు.
- అంతా అయ్యాక "చొప్పించు" ను నొక్కండి. అంతే పేజీలో కర్సరు ఉన్న చోట బొమ్మ చేరుతుంది.
- "మార్పులను ప్రచురించు" ను నొక్కి, దిద్దుబాటు సారాంశాన్ని రాసి, పేజీని భద్రపరచండి
- సారాంశంలో #WPWPTE #WPWP అనే హ్యాష్‌ట్యాగులను చేర్చండి. నమూనా సారాంశం ఇలా ఉంటుంది - "బొమ్మ చేర్చాను #WPWPTE #WPWP" (దిద్దుబాటు సారాంశం రాయడం, అందులో హ్యాష్‌ట్యాగులను చేర్చడం తప్పనిసరి. అది లేకపోతే, మీ దిద్దుబాటును పోటీ లోకి పరిగణించదు.)
- ఇప్పుడు దాని చర్చ పేజీకి వెళ్ళి, అక్కడ ఉన్న {{బొమ్మ అభ్యర్థన}} అనే మూసను తీసేసి ఆ పేజీని ప్రచురించండి
- అంతే.. ఒక పేజిని మెరుగుపరచే పని అయిపోయినట్లే.
ముందు బొమ్మను పట్టుకుని
[మార్చు]- ముందుగా ఉపయోగించని బొమ్మలు పేజీకి వెళ్ళండి. అక్కడ వేలకొద్దీ వాడని బొమ్మలు కనిపిస్తాయి. వాటిని వికీలోకి అప్‌లోడు చేసారంతే, ఇంకా ఏ పేజిలోనూ పెట్టలేదు. అంటే.., ఆ బొమ్మలకు సంబంధించిన పేజీల్లో బొమ్మ ఉండి ఉండకపోవచ్చు. అలాంటి పేజీలను తెరిచి వాటిలో ఈ బొమ్మను పెట్టేస్తే పని అయిపోతుంది. అది ఎలా చెయ్యాలో చూద్దాం.
- ఆ బొమ్మల్లో ఒకదాన్ని ఎంచుకోండి. ఉదాహరణకు: దస్త్రం:Lakshyam.jpg
- ఆ బొమ్మను బట్టి చూస్తే అది లక్ష్యం అనే సినిమాకు సంబంధించినది అని తెలుస్తోంది. ఇప్పుడు లక్ష్యం సినిమా పేజీని తెరవండి.
- అందులో వేరే బొమ్మ ఏదైనా ఉందేమో చూడండి. వేరే బొమ్మ ఈసరికే ఉంటే చేసేదేమీ లేదు. వేరే బొమ్మను ఎంచుకుని మళ్ళీ వెతకడమే. ఒకవేళ "లక్ష్యం" పేజీలో బొమ్మ లేనట్లైతే.
- దస్త్రం:Lakshyam.jpg బొమ్మను తీసుకెళ్ళి ఆ పేజీలో పెట్టండి.
- మార్పులను ప్రచురించు నొక్కినపుడు, దిద్దుబాటు సారాంశం అడుగుతుంది.
- సారాంశంలో #WPWPTE #WPWP అనే హ్యాష్‌ట్యాగులను చేర్చండి. నమూనా సారాంశం ఇలా ఉంటుంది - "బొమ్మ చేర్చాను #WPWPTE #WPWP" (దిద్దుబాటు సారాంశం రాయడం, అందులో హ్యాష్‌ట్యాగులను చేర్చడం తప్పనిసరి. అది లేకపోతే, మీ దిద్దుబాటును పోటీ లోకి పరిగణించదు.)
- ఇప్పుడు దాని చర్చ పేజీకి వెళ్ళి, అక్కడ ఉన్న {{బొమ్మ అభ్యర్థన}} అనే మూసను తీసేసి ఆ పేజీని ప్రచురించండి
- అంతే.. ఒక పేజీని మెరుగుపరచే పని అయిపోయినట్లే.
చెయ్యాల్సిన / చెయ్యకూడని పనులు
[మార్చు]- బొమ్మను చేర్చాల్సినది వ్యాసం పేజీలో మాత్రమే
- -చర్చ పేజీలో కాదు
- -దారిమార్పు పేజీల్లో కాదు
- -అయోమయ నివృత్తి పేజీల్లో కాదు
- వ్యాసంలో బొమ్మ చేర్చాక ప్రచురించేటపుడు దిద్దుబాటు సారాంశం రాసి తీరాలి, అందులో #WPWPTE #WPWP అనే ట్యాగులను చేర్చి తీరాలి. లేదంటే అది పోటీలోకి పరగణించబడదు
- బొమ్మను చేర్చి వ్యాసం పేజీని ప్రచురించాక, దాని చర్చ పేజీలో ఉన్న {{బొమ్మ అభ్యర్థన}} అనే మూసను తీసేయడం మరచిపోకండి.
- లాగినయ్యాకే పని చెయ్యాలి. లాగినవకుండా చేసినపనులు పోటీ లోకి పరిగణించబడవు
- పేజీలో ఈసరికే బొమ్మ ఉంటే (చర్చ పేజీలో బొమ్మ అభ్యర్థన మూస పొరపాటున చేర్చి ఉండవచ్చు) ఇక ఆ పేజీలో బొమ్మను చేర్చకండి. చేర్చినా అది పోటీ లోకి రాదు.
- బొమ్మకు సరిపడే వ్యాఖ్య రాయండి, తెలుగు లోనే రాయండి.