Jump to content

చర్చ:సమాచారం

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

అనువాద సమస్యలు

[మార్చు]

దీప గారూ ఈ వ్యాసంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని కింద ప్రస్తావిస్తున్నాను. మీరు సవరించండి లేదా, అర్థం కాకపోతే అడగండి.

  • వ్యాసం మొదట్లోనే నిజానికి, ఇది ఒక పదం నుండి వచ్చింది దీనర్ధం ఏదో ఒక రూపం ఇవ్వటం అని ఉంది. ఇది అర్థవంతంగా లేదు. ఇది ఏ పదం నుంచి వచ్చింది? ఏ పదానికి ఏదో ఒక రూపం ఇవ్వడం అని అర్థం?
  • దాని తర్వాతి వాక్యమే చూడండి. సమాచారం అనగా ఏదో ఒకటి అది ప్రజలు నేర్చుకునేలా, తెలుసుకునేలా, లేదా అర్థం చేసుకునేలా చేయగలుగుతుంది. ఈ వాక్యాన్ని సమాచారం అంటే ప్రజలు ఏదో ఒకటి నేర్చుకునేలా, తెలుసుకునేలా, అర్థం చేసుకునేలా చేసేది ఇలా రాస్తే బాగుంటుంది కదా, ఆలోచించండి.
  • అనిశ్చితి పరిష్కారంగా భావించవచ్చు. ఈ వాక్యం పూర్తిగా అర్థవంతంగా లేదు. సమాచారాన్ని అనిశ్చితి పరిష్కారంగా భావించవచ్చుననా మీరు అనేది?
  • ఆంగ్ల వికీలో it answers the question of "What an entity is" అని ఉంది. దాన్ని మీరు ఇది ఒక ప్రవేశ మార్గం అంటే ఏమిటి అనే ప్రశ్నకు సమాధానమిస్తుంది అని అనువాదం చేశారు. అది తప్పు కదా? ఒక అంశం అంటే ఏమిటీ అన్న ప్రశ్నకు సమాచారం సమాధానమిస్తుంది అనడం మెరుగ్గా ఉంటుంది.

ఇలాంటివి వ్యాసం నిండా ఉన్నాయి. ప్రస్తుతానికి పై ఉదాహరణలు ఇస్తున్నాను. వాటిని మీరు మెరుగు పరచండి. మిగతా విషయాలు తర్వాత రాస్తాను. ఇలా వ్యాసం మొత్త మెరుగు పడేదాకా ఈ వ్యాసానికి నేను చేర్చిన గమనిక అలాగే ఉంటుంది. ఎందుకంటే అది వ్యాస నిర్వహణకు సంబంధించింది. చదువరులకు ఏ వ్యాసం ఎంత నాణ్యతతో ఉందో తెలిపే ఒక సూచీ అన్నమాట. - రవిచంద్ర (చర్చ) 17:09, 24 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

రవిచంద్ర సార్, భారతీయ భాషల్లో ఉన్న అన్ని సమాచారం వ్యాసాలు లోని ముఖ్యమైన భాగాలను ఇక్కడ చేర్చాను ఇంతకంటే ఇంకేం చేయలేను సరిపోతుందేమో చూడండి. మరింత సవరణలు చేయాలి, ఉంటే మీరు చేయగలరు. దీపా చర్చ 07:52, 25 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

దీప గారూ, మీకు వీలైనన్ని సవరణలు చేసినందుకు ధన్యవాదాలు. వ్యాసం కొంచెం మెరుగైంది. ఇంకా మరికొన్ని సవరణలు నేను చేసి చూపిస్తాను. నేను ప్రస్తుతం వ్యక్తిగత సమస్యలపై వికీలో ఎక్కువ సమయం కేటాయించలేకున్నందున, కొంచెం నెమ్మదిగా చేస్తాను. రవిచంద్ర (చర్చ) 06:38, 10 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@Deepa Kammagani: గారూ, ఈ కింది వాక్యాల అర్థం ఏమిటన్నది స్పష్టంగా లేదు: ఏదేమైనా, సమాచారం అనే పదాన్ని కలిగి ఉన్న. సమాచారం ద్వారా సరైన సమయంలో బదిలీ చేయవచ్చు, డేటా నిల్వ ద్వారా, అంతరిక్ష సమాచారం టెలిసమాచారం . సమాచారం గ్రహీతలు అందుకున్న సందేశాల కంటెంట్ అని చెప్పవచ్చు. ప్రత్యక్ష లేదా పరోక్ష పరిశీలన ద్వారా వ్యక్తీకరించబడుతుంది. గ్రహించిన దాన్ని దాని స్వంత సందేశంగా భావించవచ్చు ఆ కోణంలో, సమాచారం ఎల్లప్పుడూ సందేశం కంటెంట్‌గా తెలియజేయబడుతుంది. సమాచారం ఖచ్చితమైనది కాదు. ఇది నిజం లేదా అబద్ధం కావచ్చు, లేదా అది పడిపోయే చెట్టు శబ్దం కూడా కావచ్చు. సాధారణంగా, సందేశంలో ఎక్కువ సమాచారం, దాని ఖచ్చితత్వం ఎక్కువ మీరే దిద్దలేకపోతున్నట్టైతే ఈ వాక్యాలను మీరు ఎక్కడి నుంచి అనువదించారో ఆ ఒరిజినల్ టెక్స్ట్ ఇవ్వండి. నేను ఏమైనా సరిజేయగలనేమో చూస్తాను. --పవన్ సంతోష్ (చర్చ) 05:05, 23 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]