Jump to content

వాడుకరి చర్చ:Lekhanandaswamy

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

స్వాగతం

[మార్చు]
Lekhanandaswamy గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం!!

Lekhanandaswamy గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

వికీపీడియాలో దిద్దుబాట్లు ఎలా చెయ్యాలో మీకు వివరించేందుకు, మీ సందేహాలను తీర్చేందుకూ వాడుకరి:రవిచంద్ర గారిని ప్రత్యేకంగా మీకోసం గురువుగా కేటాయించారు. ఏ సంకోచమూ లేకుండా వారిని మీ సందేహాలు అడగవచ్చు. మీకు ప్రత్యేకంగా ఒక హోంపేజీ కూడా ఉంది చూడండి. అక్కడ మీకవసరమైన ఏ సహాయమైనా చేసేందుకు రవిచంద్ర గారు సిద్ధంగా ఉన్నారు. వారిని పలకరించండి.
  • తెలుగు వికీపీడియా పరిచయానికి అంచెలంచెల(step by step) పారస్పరిక (interactive)బోధన, వికీపీడియాలో రచనలు చేయుట (2014 ఈ-పుస్తకం) చూడండి. తెలుగు వ్యాసరచన గురించి విషయ వ్యక్తీకరణ, కంప్యూటర్ లో తెలుగు టైపు చెయ్యడం గురించి టైపింగు సహాయం, కీ బోర్డు వ్యాసాలు ఉపయోగపడతాయి.
  • "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
  • వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
  • చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని () బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
  • వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
  • వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.
  • వికీపీడియాలో సవరణలు చెయ్యాలంటే కొత్తవారికి "విజువల్ ఎడిటరు" తేలిగ్గా, చాలా సౌకర్యంగా ఉంటుంది. దాన్ని మీ డిఫాల్టు ఎడిటరుగా ఎంచుకోండి. ఎలా ఎంచుకోవాలో తెలుసుకోండి.

ఇకపోతే..


  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Nrgullapalli (చర్చ) 12:55, 12 ఆగస్టు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు చేర్చిన వ్యాసం

[మార్చు]

నమస్కారమండి. లింగనబోయిన లేఖానంద స్వామి వ్యాసం సృష్టించినందుకు అభినందనలు, ధన్యవాదాలు. ఆ వ్యాసాన్ని బట్టి చూస్తే మీకు తెవికీ కొత్త కాదనిపిస్తోంది. ఖాతా సృష్టించుకుని రాయడం మొదలుపెట్టినందుకు అభినందనలు. ఈ వ్యాస విషయంగా ఉన్న వ్యక్తికి విషయ ప్రాముఖ్యత ఉన్నట్లు అనిపించడం లేదు. విషయ ప్రాముఖ్యత ఉంది అంటే దానర్థం - ఈ వ్యక్తికి తెవికీలో వ్యాసం రాయాల్సినంత ప్రాముఖ్యత ఉంది అని చెప్పడం. నేను ఆ ప్రాముఖ్యత కోసం జాలంలో వెతికాను గానీ నాకు సదరు సమాచారం లభించలేదు. ఈ వ్యాసాన్ని సృష్టించినది మీరు కాబట్టి మీకు దాని గురించి మరింత సమాచారం తెలిసి ఉండవచ్చని మీకు రాస్తున్నాను.

విషయ ప్రాముఖ్యత లేని వ్యాసాలను తెవికీలో ఉంచరు. పై లింకుతో పాటు వికీపీడియా:విషయ ప్రాముఖ్యత (వ్యక్తులు), వికీపీడియా:విషయ ప్రాముఖ్యత (రచయితలు) అనే లింకులను కూడా పరిశీలించండి. ఆ పేజీల్లో ఉన్న ప్రమాణాల్లో దీనికి సరిపోయేలా ఉన్నా వ్యాసాన్ని ఉంచవచ్చు. ఆ ప్రమాణాలకు సరిపోయేలా ఉందని నిరూపించే లింకులు ఆ వ్యాసపు చర్చ పేజీలో ఇవ్వండి. తదనుగుణంగా ఆ వ్యాసపు కొనసాగింపుపై నిర్ణయం తీసుకుంటారు.

ఈ విషయంపై ఆ వ్యాసపు చర్చ పేజీలో చర్చ జరుగుతున్నది, పరిశీలించండి. మీ అభిప్రాయాలను, విషయ ప్రాముఖయతను నిరూపించే లింకులనూ అక్కడ రాయండి.

ఒక్క గమనిక, వ్యాసాన్ని ఏ విధంగా తొలగించకుండా ఉంచాలా అనేది నా ఆలోచన.. తొలగించేందుకు కాదు. అంచేతనే నేను వ్యాసంలో తొలగింపు మూసను ఇంకా పెట్టలేదు. __ చదువరి (చర్చరచనలు) 23:48, 21 ఫిబ్రవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]

కృతజ్ఞతలు. నేను వికీపీడియాలో తమవంటి సహచర వికీపీడియా సహకారంతో కొంత పరిజ్ఞానం కలిగి ఉన్నాను. అయినను ఇంకా తెలుసుకోవలసి ఉన్నది. మీ సూచనలను తప్పకుండా పాటిస్తాను. కాకపోతే కొంత సమయం అవసరం అవుతుంది. అయితే వీరి విషయంలో అంతర్జాల సమాచారం తక్కువగా లభించడానికి పలు కారణాలు ఉన్నాయి. అయినను వారు వ్యక్తి, విషయ ప్రాధాన్యత కలిగిన వారు కావడంతో నేను ఈ వ్యాసం సృష్టించాను. మీ సహకారానికి ధన్యవాదాలు. 2409:40F0:1129:D508:8000:0:0:0 05:36, 22 ఫిబ్రవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]