వాడుకరి చర్చ:రవిచంద్ర/పాత చర్చ 3

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శివ లింగం గురింఛి[మార్చు]

రవిచంద్రగారూ,మీరు ఇచ్చిన సలహాకు కృతజ్నతలు. థన్క్స్

ప్లేటో వ్యాసం[మార్చు]

రవిచంద్రగారూ, నమస్తే, ప్లేటో వ్యాసం గురించి తెలిపినందుకు ధన్యవాదాలు. ప్లాటో వ్యాసంలోని కొద్ది సమాచారాన్ని, ప్లేటో వ్యాసము నందు చేర్చాను. ఇంకొక విషయం, గంగులాస్ గారు, ప్లాటో వ్యాసానికి దారిమార్పునిచ్చారు, కానీ సమాచారం అంతా ఆవ్యాసంలో అలానే వున్నది, ప్లాటో పేజీ తొలగించి ఆతరువాత దారిమార్పు ఇస్తే బాగుంటుందా తెలుప గలరు. అహ్మద్ నిసార్ 12:06, 6 ఫిబ్రవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

అగంతకుడు మూస గురించి తెలిపినందుకు ధన్యవాదాలు రవిచంద్రగారూ :)అహ్మద్ నిసార్ 08:28, 22 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ వారపు బొమ్మ సైజు[మార్చు]

రవిచంద్రగారూ, శుభోదయం. మీరు బొమ్మసైజు మార్చిన తరువాత, ఇపుడు నాకు మామూలుగానే కనుబడుతోంది. అహ్మద్ నిసార్ 05:28, 20 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

కొత్త మూస కొరకు సూచన[మార్చు]

రవిచంద్రగారూ! నమస్తే. నేను జయదేవ్ వ్యాసం వ్రాసినాక, ఆయనను ఇ మైల్ ద్వారా సంప్రతించటం జరిగింది. ఫలితం!! ఊమెన్ వ్యాసం. వారు తెలుగులోని ఇతర వ్యంగ్య చిత్రకారుల (బాబు, రాగతి పండరి, బాలి, సత్యమూర్తి, తులసీరామ్)గురించిన వివరాలు సేకరిస్తున్నారు. ఆయనతో కలసి వ్యాస రచన నాకు ఎంతగానో ఆనందాన్ని ఇస్తున్నది. నా కోరిక ఏమంటే, ఇలా వ్యంగ్య చిత్రకారుల గురించి వ్రాసే వ్యాసాలకు ఒక ప్రత్యేక మూస ఉంటే బాగుంటుంది. తెలుగు వ్యంగ్య చిత్రకారులు(కార్టూనిస్టులు) అని ఒక మూస చెయ్యగలరా. దయచేసి పరిశీలించండి.మీకు తీరిక దొరికినప్పుడు చూడండి.--S I V A 18:40, 12 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

నిర్వాహకుల వాండలిజం[మార్చు]

వాడుకరి:వైజాసత్య మాటి మాటికి మూలాలున్న పేజిలతో సహా అనేక వ్యాసాలు తొలిగిస్తోంది. క్లారా జెట్కిన్ వ్యాసం కూడా పొంతన లేని కారణాలు చెప్పి తొలిగించింది. మోడరేటర్లకి నీతి నియమాలు అవసరం లేదన్న మాట.

శివ ధన్యవాదాలు[మార్చు]

మీ మంచి వాఖ్యలకు ధన్యవాదాలు. వెన్నూతల గురించి మరింత సమాచార సేకరణకొరకు ప్రయత్నిస్తున్నాను. మా నాన్నగారు ఆయన చిన్నతనంలో ఆ ఊరు వదలిన తరువాత(దాదాపు 70 సంవత్సరాల క్రితం) నేను 4-5 సార్లు మాత్రమే అక్కడకు వెళ్ళగలిగాను. త్వరలో మరిం త సమాచారం పొందుపరచటానికి ప్రయత్నిస్తున్నాను.--SIVA 09:45, 11 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు[మార్చు]

రవిచంద్ర గారూ! నమస్కారం, మీరిచ్చిన కానుకకు 'మన॰పూర్వక ధన్యవాదాలు'. మిత్రుడు Nisar 13:02, 6 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఎల్లోరా గుహలు[మార్చు]

రవిచంద్ర గారూ, నమస్తే, ఎల్లోరా గుహలు మరియు ఎల్లొరాగుహలు అనే పేర్లతో రెండు వ్యాసాలున్నవి, కొద్దిగా చూడండి ప్లీజ్, రెండిటినీ కలిపి ఒకటి చేస్తే బాగుంటుంది. మిత్రుడు నిసార్ అహ్మద్ 11:21, 14 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

థాంక్స్[మార్చు]

అదేంటో రావాలనిపిచ్చింది. సైలెంట్‌గా నా పని నేను చేసుకుందామనుకున్నా. కానీ కనిపెట్టేసిండ్రు కదా!చానా చానా థాంక్స్ రవిచంద్ర గారూ! δευ దేవా 08:24, 23 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఏంటి రవిచంద్ర గారూ! ఈ మధ్య మీరు తెవికీలో అసలు కనబడటం లేదు. బిజీగా ఉన్నారా ఏంటి? δευ దేవా 11:23, 10 జూలై 2008 (UTC)[ప్రత్యుత్తరం]

కొత్త ఉద్యోగం ముబారక్ హో[మార్చు]

రవిచంద్రగారూ, మీరు ఉద్యోగంలో చేరారని తెలిసింది, ముబారక్ హో. కృషీవల వికీపీడియన్లు ఎకాయకిగా కనబడకపోతే, మిగతావారికి కొంచెం ఆందోళనకలుగుతుంది గదా! తెవికీలో కనబడుతూ ఉండండి. తెవికీ, వికీపీడియన్లతో కళకళలాడుతూ ఉండాలి. మిత్రుడు నిసార్ అహ్మద్ 05:13, 13 జూలై 2008 (UTC)[ప్రత్యుత్తరం]

చిట్కాలు[మార్చు]

రవీ! నీ సమాచారం కోసం. నేను కొన్ని చిట్కాలు "ఆగస్టు" పేరుతో చేశాను. అయితే వాటిని జాబితాలో పెట్టడం మరచి పోయాను. నువ్వు అదే తేదీలకు "ఆగష్టు" పేరుతో చేశావు. ప్రస్తుతం వాటిని క్రమబద్ధీకరిస్తున్నాను. ఏది సరైన వెల పేరో నాకు తెలియదు. కనుక "ఆగష్టు" అని ప్రస్తుతం వాడుతున్నాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 06:49, 1 ఆగష్టు 2008 (UTC)

ఈ వారం వ్యాసం[మార్చు]

ఈ వారం వ్యాసం గా స్వామీ వివేకానంద పెడదామా?- రవిచంద్ర(చర్చ) 04:46, 5 ఆగష్టు 2008 (UTC)

అలాగే పెట్టు. నన్ను అడగక్కరలేదు. అంతే కాకుండా నీకు వీలయినప్పుడల్లా "ఈ వారం వ్యాసం" శీర్షిక నిర్వహణ చూస్తుంటే బాగుంటుంది. (1) నాకుకొంత పని భారం తగ్గుతుంది. (2) అంతకంటే ముఖ్యమైన విషయం - ఇలాంటి శీర్షికలు కేవలం ఒక్కరి అభిరుచులకు పరిమితం కాకూడదు --కాసుబాబు - (నా చర్చా పేజీ) 09:02, 5 ఆగష్టు 2008 (UTC).

ధన్యవాదాలు[మార్చు]

రవిచంద్ర గారు, మీ సూచనకు ధన్యవాదాలు. నేను ఉపయోగించే ఐపి అడ్రసులు వేరేవి. మీ సమాచారము బట్టి అజ్ఞాత వ్యక్తి ఢిల్లీ వాస్తవ్యుడు అయి ఉండాలి.Kumarrao 15:36, 29 ఆగష్టు 2008 (UTC)

రవిచంద్ర గారు, 61.2.212.145 చేసిన మిగతా దిద్దుబాట్లు చూశాను. ఉదాహరణకు యోని అను సంస్కృత పదానికి అచ్చ తెలుగు పదాలు ఆయన వ్రాశాడు. మీరు దానిని తొలగించారు. నాకు ఒక సందేహం. సంస్కృత పదం సభ్యమైనది, తెలుగు పదాలు అసభ్యమైనవి ఎలా అవుతాయి? ఇది అందరూ అలోచించాల్సిన విషయము.Kumarrao 06:32, 31 ఆగష్టు 2008 (UTC)
అవి అచ్చతెలుగు పదాలని కాదు తొలగించలేదనుకుంటా. విజ్ఞానసర్వస్వం యొక్క భాషలో కొంతైనా ప్రామాణికత ఉండాలి. ఆ ఫలానా అచ్చతెలుగు పదాలు అచ్చు (ప్రింట్ మీడియా)లో అంతగా ప్రాచుర్యమైనవి కానందునే యోని అన్నపదం సమంజసమనుకుంటా --వైజాసత్య 19:50, 31 ఆగష్టు 2008 (UTC)
మీ అభిప్రాయము, వైజాసత్య గారి అభిప్రాయము సమంజసముగా ఉన్నాయి.Kumarrao 04:31, 1 సెప్టెంబర్ 2008 (UTC)
మీ అభిప్రాయాలు సరే! నాదొక చిన్న అనుమానం. అసభ్యపదాలను కూడా వికీపీడియాలో చేర్చితే బాగుంటుందేమో! ఆంగ్లవికీకి సమానంగా. తెలుగులో అసభ్యపదాల వాడుకను గురించి తెలిపే డిక్షనరీ కానీ ఎన్‌సైక్లోపీడియా గానీ లేవనుకుంటకదా! δευ దేవా 06:27, 1 సెప్టెంబర్ 2008 (UTC)
"తెలుగులో అసభ్య పదాలు" అనే వ్యాసము వ్రాయవచ్చునేమో! (నేను అశక్తుడిని).Kumarrao 06:53, 1 సెప్టెంబర్ 2008 (UTC)

టైటానిక్ నౌక[మార్చు]

టైటానిక్ వ్యాసం మెరుగు పరచడానికి ఏమి చెయ్యాలో సలహాలు ఇవ్వండి. దానికి మరింత సమాచారం చేరుస్తాను. వైవిధ్యం కోసమే నేనూ ఈ వ్యాసాన్ని ప్రతిపాదించాను. ఎప్పుడూ వ్యక్తులూ, ప్రదేశాలూ గురించే మొదటి పేజీ వ్యాసాలు ఉంటే బావుండదని! రవిచంద్ర(చర్చ) 14:45, 25 సెప్టెంబర్ 2008 (UTC)


అలాగే. రెండు రోజులు ఆగు. జవాబు వికీపీడియా చర్చ:ఈ వారపు వ్యాసం జాబితా లో వ్రాస్తాను. తరువాత కూడా అది ఉపయోగంగా ఉంటుంది.--కాసుబాబు - (నా చర్చా పేజీ) 15:55, 25 సెప్టెంబర్ 2008 (UTC)


టైటానిక్ నౌక వ్యాసం బాగానే ఉన్నది. అంతర్వికీ లింకులు మాత్రం ఉంచాలి. 41వ వారం వ్యాసంగా పెడదాము. కనుక ఈ వ్యాసం సంక్షిప్త రూపంలో వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2008 40వ వారంలో వ్రాయి. బంగాళదుంప వ్యాసం ఇంకా సిద్ధం కాలేదు కనుక అది 41వ వారానికి పెడదాము. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 20:06, 26 సెప్టెంబర్ 2008 (UTC)

ఆంగ్ల వికీ బొమ్మలు[మార్చు]

రవీ! ఆంగ్ల వికీలోని బొమ్మలు తెలుగు వికీలో వాడాలంటే క్రింది విషయాలు గమనించు.

  • అవి వికీమీడియా కామన్స్‌లో ఉంటే సమస్యే లేదు. నేరుగా వాడేయవచ్చును.
  • అవి ఆంగ్ల వికీలో మాత్రమే ఉండి, ఉచిత కాపీహక్కు బొమ్మలైతే
    • నువ్వు వాటిని తెలుగు వికీలోకి తిరిగి లోడ్ చేసావు. ఇది నిషేధం కాదు కాని అంతగా ప్రోత్సహింపబడదు. ఆంగ్ల వికీనుండి వికీమిడియా కామన్స్‌కు ఎగుమతి చేయడం సరైన పద్ధతి. ఇందుకు ఆ ఆంగ్ల వికీ బొమ్మలో {{copy to commons}} ఆనే మూస పెట్టడం ద్వారా చేయడం మంచి పద్ధతి.
    • నువ్వు వికీమీడియా కామన్స్‌లో సభ్యత్వం తీసుకొని ఎగుమతి చేసేయవచ్చును.
  • ఒకవేళ అది ఉచిత బొమ్మకాకపోయినట్లైతే "Non-free Fair Use" క్రింది తెలుగు వికీలో వాడాలి. అప్పుడు దానిని తెలుగు వికీలోకి అప్‌లోడ్ చేయాల్సిందే.

--కాసుబాబు - (నా చర్చా పేజీ) 08:38, 3 అక్టోబర్ 2008 (UTC)

కామన్స్ లోకి బొమ్మను చేర్చి తెవికీ నుంచి తీసేస్తాను. అప్పుడు ఓకే కదా! రవిచంద్ర(చర్చ) 08:55, 3 అక్టోబర్ 2008 (UTC)
ఓ.కే. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 09:39, 3 అక్టోబర్ 2008 (UTC)

గమనించ వలెను[మార్చు]

రవీ (వైజా సత్య) ‍మరియు రవీ (రవి చంద్ర) ! నేను డిసెంబరు మాసంలో ఆఫీసు పనిలో బిజీగా ఉంటాను. 2009 జనవరి, ఫిబ్రవరి నెలల్లో సెలవు లేదా పని వత్తిడిలో ఉంటాను. కనుక ఈ విషయాలు గమనించగలరు. (1) ఈ వారం వ్యాసం, ఈ వారం బొమ్మలు 52 వారాల వరకు సిద్ధం చేస్తాను. 2009 బొమ్మలు, వ్యాసాలు కొంత కాలం మీరు చూసుకోండి. (2) ఈ రోజు చిట్కా ఖాళీగా ఉన్న రోజులలో రవి పూర్తి చేయగలడనుకొంటాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 18:02, 24 నవంబర్ 2008 (UTC)

రవీ! అహమ్మద్ నిసార్ గారిని నిర్వాహకునిగా ప్రతిపాదించగలవా? నేను కాస్త బిజీగా ఉన్నాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 05:18, 9 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

అనామక సభ్యుడు[మార్చు]

వైజాసత్య గారూ! అనామక సభ్యుని వ్యవహారం శృతి మించుతున్నది. కనీసం చర్చించకుండా ఇష్టం వచ్చినట్లు మార్పులు చేస్తున్నారు. ఏదో ఒక చర్య తీసుకోవాలి. రవిచంద్ర(చర్చ) 05:10, 4 డిసెంబర్ 2008 (UTC)

ప్రస్తుతానికి నేనా వ్యాసంలో అనామక సభ్యులు మార్పులు చేయకుండా సంరక్షణ విధించాను. మరీ వితండంగా ప్రవర్తిస్తే సభ్యునిపై ఒక్కరోజు నిషేధం విధించండి. నేను కాసేపట్లో బజ్జుంటున్నాను --వైజాసత్య 05:28, 4 డిసెంబర్ 2008 (UTC)

అనామకం కాదు[మార్చు]

గతంలో నేను ఆంగ్ల వికిపీడియాలో వ్యాసాలు వ్రాసాను. అక్కడ ఇంత కంటే పెద్ద వాండల్స్ ఉన్నారు, సాక్ పప్పెట్స్ కూడా ఎక్కువే. చాలా వెబ్ సైట్స్ లో ఆంగ్లవికిపీడియా పైన విమర్శలు వచ్చాయి. ఆంగ్ల వికిపీడియా ఒక పెద్ద జోక్ అయిపోయింది కాబట్టి నేను దాన్ని వదిలేశాను. నేను కూడా నెట్ వర్క్ ఇంజినీర్ నే. నేను కూడా సొంతంగా డెజైన్ చేసిన వెబ్ సైట్స్ ఉన్నాయి. అప్పుడప్పుడూ ఓపెన్ ప్రొజెక్ట్స్ కి కూడా వెళ్తుంటాను.

అభినందనలు[మార్చు]

వివాదాస్పద వ్యాసాలు, వాటిని తయారుచేసినవారిపట్ల, నిర్వాహకుడిగా మీరు ప్రదర్శించిన ప్రతిస్పందనలు అమోఘం. ఇందుకు నా మన॰పూర్వక అభినందనలు. సోదరుడు. నిసార్ అహ్మద్ 05:00, 14 డిసెంబర్ 2008 (UTC)

అంతర్వికీలు[మార్చు]

ఒక్క భాషలో అంతర్వికీ పెడితే చాలండి - పైథాన్ బాట్ (ఉదా: డ్రాగన్ బాట్) మిగతావి సరిచూస్తుంది. --Gurubrahma 19:42, 15 డిసెంబర్ 2008 (UTC)

బాట్ సాధారణంగా ఎప్పుడూ పని చేస్తూనే ఉంటుంది. ఐతే, ఎన్నో భాషల వికీపీడియాలవల్ల సమయం పడుతుంది. --Gurubrahma 05:25, 16 డిసెంబర్ 2008 (UTC)

తెలుగు వికీపీడియాకు మారుపేరు వైజాసత్య గారు[మార్చు]

ప్రారంభం నుంచి తెలుగు వికీపీడియాకు అహర్నిషలు కృషిచేసిన వైజాసత్య గారి పైన కొందరు పిచ్చిపట్టిన అనామక వ్యక్తులు విమర్శలు చేయడం భాధ కలుగుతుంది. ఇది లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేనేలేదు. తెలుగు వికీపీడియన్ల సంపూర్ణ మద్దతు అప్పుడూ, ఇప్పుడూ, ఎల్లప్పుడూ వైజాసత్య గారికి ఉంటుంది. వైజాసత్య గారు ఏది చేసిననూ అది తెవికీ అభివృద్ధికేనన్న మాట సంపూర్ణ తెలుగు సమాజానికి తెలుసు. తెలుగు వీపీడియాపై విమర్శలు చేసిన పిచ్చి వ్యక్తికి ఏ మాత్రం జ్ఞానం ఉన్నా ఇక ఈ విజ్ఞానసర్వస్వం లోకి రానేకూడదు. అతను చేసిన అన్ని రచనలకు ఇక తొలిగించడమే తరువాయి. దీనికి చర్చ కూడా అనవసరం. తెలుగు వికీపీడియాకు వ్యతిరేకంగా నీచవ్యాఖ్యలు చేసిన అతడి రచనలను మనం మాత్రం ఎందుకుంచాలి. సభ్యులందరూ దీన్ని గమనించగలరు. -- C.Chandra Kanth Rao(చర్చ) 09:04, 28 డిసెంబర్ 2008 (UTC)

కృతజ్ఞుణ్ణి[మార్చు]

రవిచంద్రగారూ, నా తెవికీ నిర్వాహక హోదా అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపినందులకు కృతజ్ఞుడిని, ధన్యవాదాలు. అహ్మద్ నిసార్ 09:02, 19 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

రవిచంద్రగారూ నమస్తే, నా నిర్వాహక హోదా అభ్యర్థిత్వానికి ఓటింగ్ ప్రక్రియ చేపట్టారు, దీని తరువాత కార్యక్రమమేమిటి కొంచెం తెలుప గలరా. అహ్మద్ నిసార్ 08:19, 28 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా:Configuring on Linux అనే పేజీలో విషయం బాగానే ఉం(డే)ది. ఆ పేజీకి వెళ్తే మీరు దాన్ని తొలగించినట్టు చూపిస్తుంది. కానీ, ఆ పేజీని తొలగించాల్సిన అవసరమేమీ నాకు కనబడలేదు. పొరపాటున కానీ ఆ పేజీని తొలగించారా? — వీవెన్ 13:29, 9 మార్చి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

నేను పునఃస్థాపించాను. -- C.Chandra Kanth Rao-చర్చ 22:10, 9 మార్చి 2009 (UTC)[ప్రత్యుత్తరం]
రవిచంద్ర గారూ, నమస్తే. నేను పొరపాటున లాగిన్ అవకుండా, బిర్జూ మహరాజ్ దిద్దుబాటు చేశాను. నా ఐ.పి. అడ్రెస్: 59.96.100.23 - ఇప్పుడెలా? మార్చడాని కేమైనా అవకాశం ఉంటుందా? ---- --Nagaraju raveender 15:31, 18 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

బొమ్మలు[మార్చు]

కాసుబాబు గారూ! ఈ మధ్యనే నేను బోటు మీద రాజమండ్రి నుంచి భద్రాచలం వెళ్ళాను (పాపికొండలు మద్యలోనుంచి). చాలా ఫోటోలు తీశాను. వాటిలో కొన్ని మంచి బొమ్మలు చూసి వికీలో అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. తెవికీ వరకే ఎక్కించనా? లేక కామన్స్ లోకి ఎక్కించనా? -- రవిచంద్ర(చర్చ) 05:44, 27 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]


రవీ! అది నీ యిష్టం. ఇంతవరకూ నేను తెలుగు వికీలోనే అప్‌లోడ్ చేస్తున్నాను. కామన్స్‌లో బొమ్మలు ఎక్కించడం ఇంకా నాకు అలవాటు కాలేదు. కాని బాగా ఉన్న పూర్తి ఉచిత లైసెన్సు బొమ్మలు కామన్స్‌లో అప్‌లోడ్ చేయడమే అభిలషణీయం. అలా చేస్తే గనుక (1) స్పష్టమైన వివరణ (2) కాపీ హక్కుల గురించిన ట్యాగ్ (3) సముచితమైన వర్గీకరణ మరచిపోవద్దు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:57, 27 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

శోభన పేజీ[మార్చు]

రవిచంద్రగారూ నమస్తే, నేనిప్పుడే లాగిన్ అయ్యాను, అదేదో అనుకోకుండా అన్-ఎక్స్‌పెక్టెడ్ క్లిక్ అయినట్టున్నది, తీరా చూస్తే శోభన పేజీలో కొద్ది మార్పులు జరిగినట్టున్నాయి. దీనిని కొంచెం సరిచేయగలరా. అహ్మద్ నిసార్ 11:28, 27 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]

గ్రామాల గురించి వ్యాసాలు[మార్చు]

రవీ! వీవెన్ గారి చర్చా పేజీలో వ్రాసిన విషయం ఇక్కడ కూడా వ్రాస్తున్నాను. నువ్వు హైదరాబాదులో ఉంటున్నావనుకొంటాను. స్థానికంగా ఉన్నవారెవరైనా పూనుకొంటే ఇలాంటి ప్రయత్నం చేయవచ్చును. నీ ఐడియాలు ఏమయినా ఉంటే చెప్పగలవు. -


"గ్రామాల ప్రాజెక్టు" గురించి మీతో చర్చించాలి. గ్రామాల వ్యాసాలు కొన్నయినా సాధించడానికి మనమేదయినా initiative మొదలుపెట్టాలని చాలాకాలంగా అనుకొంటున్నాను. లేకపోతే ఇన్నివేల ఒక వాక్యం వ్యాసాలు ఉంచడం ప్రశ్నార్ధకం గానే ఉంటుంది. ఏదైనా ప్రయత్నం చేయాలి. నేను ఇంతకుముందు సెలవులలో ఉన్నపుడు మండల్ ఆఫీసు ఉద్యోగులతో చర్చలు మొదలుపెట్టాను కాని సమయాభావం వలన ముందుకు సాగలేదు. అంతా ఎలక్షన్ల జాబితాల హడావుడిలో ఉన్నారట. నా ఆలోచన ఏమంటే (1) ఉపాధ్యాయులు (2) మండల్ ఆఫీసు ఉద్యోగులు - వీళ్ళ ద్వారా మనం కొంత సమాచారం సంపాదించవచ్చును. ఇందుకు ఒక request mailer లేదా advertisement pamphlete ను తయారు చేద్దామనుకొంటున్నాను. మీరేమయినా సలహాలు ఇవ్వగలరా? అంతే కాకుండా ఉపాధ్యాయులు, మండల్ ఉద్యోగులకు చేరే పత్రికలు (ఉదాహరణకు ఉపాధ్యాయ అసోసియేషన్ పత్రికలు) ఏవయినా ఉన్నాయా? లేదా వారి postal mailing list ఏదైనా సాధించగలమా? పోస్టల్ అడ్రస్ క్రింద హైదరాబాదులో ఏదయినా అడ్రసు ఇవ్వడం కుదురుతుందా? ఇలాంటి ప్రయత్నం గురించి మీరు ఏమంటారు? - కాసుబాబు 12:32, 16 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]


గ్రామాల వ్యాసాల గురించి మీ ఆలోచనలు చాలా బాగున్నాయి. నాకు కూడా వ్యక్తిగతంగా కొంతమంది ఉపాధ్యాయులు తెలుసు. కానీ మండలాధికారులు మాత్రం పెద్దగా తెలియదు. కానీ ఈసారి ఊరెళ్ళినపుడు మాత్రం వాళ్ళను కలవడానికి ప్రయత్నిస్తాను. అదేవిధంగా శ్రీకాళహస్తిలో ఉన్న శాఖా గ్రంథాలయంలో గ్రామాల గురించిన సమాచారం ఉందేమో కనుక్కుంటాను. అయితే మొదట ముఖ్యమైన సమాచారమైన జన సంఖ్య, ఓటర్ల సంఖ్య, ఆయకట్టు వివరాలు మొదలైన సేకరించడం సులభం అనుకుంటా. ఇంకా మనం ఒక గ్రామం వ్యాసంలో ఏ సమాచారం ఉండాలి అనే విషయంపై కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ఇంకా నాకు స్పురణకు వచ్చిన విషయాలను గ్రామల ప్రాజెక్టు పేజీలో చేరుస్తూ ఉంటాను. ప్రస్తుతానికి వాళ్ళను సమాచారాన్ని పోస్టల్ ద్వారా అబ్యర్థించినా నెమ్మదిగా వాళ్ళను కూడా ఈమెయిల్ వైపు మళ్ళించడం మంచిదనుకుంటూన్నాను. నాకు తెలిసి ప్రతి పాఠశాలలో/మండల్ ఆఫీసులో కంప్యూటర్ గురించి తెలిసిన ఒకరైనా ఉంటారనుకుంటున్నాను. ఇంక వాళ్ళు ఏ ఫార్మాట్ లో పంపించాలనే విషయంపై మనం చర్చిద్దాం. -- రవిచంద్ర(చర్చ) 12:51, 16 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]
ఏమేం వ్రాయవచ్చునో ఇదివరకు వికీపీడియా:WikiProject/ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు/వికీలో మీవూరు 1 అనే పేజీలో వ్రాశాను. ఇప్పుడు ఇలాంటిదే మరొక ప్రచార వ్యాసం తయారు చేస్తాను. తరువాత చర్చించుదాము --కాసుబాబు 19:43, 16 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]
రవీ! ప్రస్తుతం ఈ కార్యక్రమం అమలు చేసే ప్రతిపాదనలు తయారు చేస్తున్నాను. వీవెన్ చర్చా పేజీ కూడా చూస్తూండు. నీ తరపునుండి ఇవి సాధ్యమేమో తెలియజేయగలవు. (1) ఉత్తరాలు పంపడానికి ఏదైనా అనుకూలమైన పోస్టల్ అడ్రస్ చెప్పగలవా? (2) రచయితలు ఒకవేళ ఫోనులో సంప్రదించాలంటే మనం కొన్ని ఫోన్ నెంబరులు ఇవ్వడం మంచిది. అందుకు నీవు సిద్ధంగా ఉన్నావా? (నీ ఆఫీసు, వ్యక్తిగత ఫోనులు కాకుండా వేరే ఫోను నెంబరైతే మరీ మంచిది) --కాసుబాబు 04:11, 17 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]


దీనికి ఆలస్యంగా సమాధానం ఇస్తున్నానని ఏమీ అనుకోకండి. హైదరాబాదులో నేనుండే ఇంటి పోస్టల్ అడ్రస్ ఇవ్వడానికినాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కాకపోతే అది అద్దె ఇల్లు కాబట్టి ఎప్పుడైనా మారిపోయే అవకాశం ఉంది. ఎవరైనా హైదరాబాదులో స్థిర నివాసం ఏర్పరుచుకున్న వాళ్ళను అన్వేషిద్దామా? అలాగే వ్యక్తిగత ఫోను నంబరే ఇచ్చి కొన్ని నిర్ణీత సమయాల్లో నే (అంటే శని ఆది వారాలు, నేను ఖాళీ గా ఉంటాను కాబట్టి). ఫోన్ చేయమని చెబుతాం. — రవిచంద్ర(చర్చ) 04:41, 25 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]


కొంత సమయం పట్టినా గాని మంచి పరిష్కారానికి ప్రయత్నిద్దాము. ఎందుకంటే ఇది సుదీర్ఘకాలం నడుపవలసిన ప్రాజెక్టు. వీవెన్‌ను కూడా అడిగాను. అన్నట్టు నువ్వు హైదరాబాదులో నెలనెలా జరిగే ఈ-తెలుగు సమావేశాలకు ఎప్పుడైనా హాజరు అయ్యావా? హాజరైతే మంచిదని నా సలహా --కాసుబాబు 19:29, 26 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

చిరుకానుక[మార్చు]

తన విశేష ప్రతిభతో అనేక రంగాల్లో తెవికీ అభివృద్ధి కొరకు కృషిచేసిన రవిచంద్ర గారికి, తెవికీ సభ్యుల తరఫున అహ్మద్ నిసార్ సమర్పిస్తున్న చిరుకానుక

.

దీనిని మరియు దేవాగారు సమర్పించిన తెలుగు పతకాన్ని, మీ సభ్యుని పేజీలో అలంకరించవలసినదిగా కోరుచున్నాను. అహ్మద్ నిసార్ 18:50, 24 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]


పతకం అందించిన అహమ్మద్ నిస్సార్ కు, అందుకొన్న రవిచంద్రకు అభినందనలు. రవిచంద్ర ఎంతో శ్రమతోను, అణకువతోను సభ్యుల మెప్పు పొందాడు. --కాసుబాబు 19:06, 24 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]
మీ అభినందనలకు నా కృతజ్ఞతాభివందనాలు. ఈ శుభసందర్భంలో నాకు ఇంతకంటే మాటలు రావడం లేదు. — రవిచంద్ర(చర్చ) 04:30, 25 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]
నేను చూడనేలేదు. పతకాన్ని అందుకున్న సందర్భంగా అభినందనలు. మీకు తగిన బహుమానం. కొన్ని క్లిష్ట వ్యవహారాలలో మీరు సంయమనంతో వ్యవహరించి నిర్వాహకుడిగా నడుచుకున్న తీరు అభినందనీయం. --వైజాసత్య 04:18, 10 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]
  • సముచిత కానుక అందుకున్న రవిచంద్ర గారికి నా అభినందనలు. సంయమనం పాటిస్తూ సమగ్రమైన వ్యాసాలనందిస్తూ వికీ కృషికి తోడపడుతున్న రవిచంద్రగారికిది తగిన సత్కారం.--t.sujatha 04:46, 10 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]
వైజాసత్యగారికీ, సుజాత గారికీ ధన్యవాదాలు. మీ అభిమానం నన్ను తెవికీ వ్యాప్తికి ఇంకా విశేష కృషి చేసేందుకు ప్రోత్సహిస్తాయని ఆశిస్తున్నాను. —రవిచంద్ర 04:50, 10 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]

జయంత్ కుమార్[మార్చు]

నేను చెసిన మార్పులన్ని ఒకే విధమైన మార్పులు. అవి చుక్కలు మాత్రమే( . ). వాటిని ఒకే సారి మార్చాలి అంటే ఎలా ? మీ యెక్క సలహాకు నా యొక్క వందనాలు.--జయంత్ కుమార్ 10:45, 7 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]

ఇక పై ఆలాంటి చిన్న మార్పులు చేయను రవిచంద్ర గారు. --జయంత్ కుమార్ 11:36, 7 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]


ఓసారి పరికించండి[మార్చు]

రవిచంద్రగారూ నమస్తే, హిందువులపై అకృత్యాలు వ్యాసంలో, వర్గీకరణలు చేస్తూ, అందులోని వర్గాలు హిందూ మతము, ఇస్లాం మతము మరియు క్రైస్తవ మతము తీసివేసి, చరిత్ర వర్గం చేర్చాను. అందుకు సదరు సభ్యులు, ఆవ్యాసపు చర్చాపేజీలో చేసిన వ్యాఖ్యలు గమనించండి. ఇందులో గుట్టు చప్పుడు ఏమిటి? అతని వ్యాఖ్యలు ఎంతవరకు సబబో చెప్పాలని కోరుచున్నాను. అహ్మద్ నిసార్ 17:00, 9 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]

please note[మార్చు]

ravi, can you please see your g-mail once? --కాసుబాబు 16:07, 11 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]

ఒరాకిల్[మార్చు]

రవీ! ఈ వ్యాసాన్ని మొలక స్థాయి దాటించగలవా? --కాసుబాబు 18:53, 8 ఆగష్టు 2009 (UTC)

కామన్స్ గురించి[మార్చు]

పసివాడి ప్రాణంచర్చలో కామన్స్ లో చిత్రం ఉన్నట్టయితే అదే చిత్రాన్ని తెవికీలోనూ, ఆంగ్లవికీలోనూ కనిపించటానికి వీలౌతుంది అని సెలవిచ్చారు. ఇది మరింత వివరంగా తెలుపగలరా? ఉదా: http://commons.wikimedia.org/wiki/File:Birla_Temple_Hyderabad.jpg మొదట దీనిని నేను తెవికీ లో ప్రచురించాను. ఇప్పుడు కామన్స్ లో ప్రచురించాను. దీనిని ఆంగ్ల వికీలో ఎలా ఉపయోగించటం? వీర శశిధర్ జంగం 12:31, 29 జనవరి 2010 (UTC)[ప్రత్యుత్తరం]

మూలాల గురించి[మార్చు]

శ్వేత సౌధం వ్యాసంలో మూలాలుగా ఈనాడు పత్రికలో వచ్చిన శీర్షిక ను మూలంగా పేర్కొన్నాను. ఇలా ఇవ్వకూడదా? ఇది ఏ నిబంధనకు విరుద్ధం? నాకు కొంచెం అర్థమయ్యేలా చెప్పగలరు. —రవిచంద్ర (చర్చ) 17:32, 26 మార్చి 2010 (UTC)[ప్రత్యుత్తరం]

మూలాలను పేర్కొనడానికి ముఖ్యఉద్దేశ్యం వ్యాసం మన సొంతంగా, ఊహాజనితం కాదు అనే కాకుండా ప్రామాణిక గ్రంథాలనుండి సేకరించిన సమాచారం ఈ వ్యాసంలో ఉంది అని చెప్పడానికి. సాధారణంగా మూలాలను ప్రామాణిక గ్రంథాలనుంచి ఇవ్వవలసి ఉంటుంది. కాని దురదృష్టవశాత్తూ తెలుగులో ఉన్నతమైన ప్రామాణిక గ్రంథాలు అందరికీ అందుబాటులో ఉండటం లేదు. అందుబాటులో ఉన్నవారందరూ ఇక్కడ పనిచేయడం లేదు. ప్రామాణిక గ్రంథాలకు ISBN కోడ్ తో పాటు సాధారణంగా కాపిరైట్ హక్కు ఉంటుంది. అలాంటి గ్రంథాల నుంచి కొన్ని వ్యాసాలను తీసుకొని వ్యాసాలలో రెపరెన్సుగా పేర్కొంటే వ్యాసం చదివేవారికి ఉపయోగకరంగా ఉండటమే కాకుండా రచించిన వారికి గుర్తింపు ఉంటుంది. ఇటీవల జరిగిన పరిణామాలకు సంబంధించి మాత్రం సాధారణంగా వార్తాపత్రికలపైనే ఆధారపడిఉండవలసి వస్తుంది. వార్తాపత్రికల నుండి వర్తమాన సంఘటనలు కాకుండా వార్తపత్రికలలో ప్రముఖులు వ్రాసిన ఆర్టికల్స్‌ నుండి కొన్ని వాక్యాలను కూడా తీసుకొంటూ పత్రికపేరు, ఆర్టికల్ రచయిత పేరు రెపరెన్స్‌లో చూపే వీలుంది. కాని చిన్నపిల్లల కోసం వస్తున్న హాయ్ బుజ్జీ శీర్షిక నుండి విజ్ఞాన సర్వస్వంలో వాక్యాలు తీసుకున్నట్లు వ్రాస్తే మనం చులకనవుతాం. మనం కేవలం కాపీరాయుళ్ల మాదిరిగానే మిగిలిపోతాము. దీనికి సంబంధించి నిబంధనల గురించి చెప్పలేను కాని నైతికంగా ఆలోచించినా ఇది బాగుండదు. ఇలా అవకాశం ఇస్తే రేపు కొందరు రెండవ తరగతి, మూడవ తరగతి పాఠ్యపుస్తకాల నుంచి కూడా సమాచారం వ్యాసాలలొ చేర్చినట్లు రెఫరెన్స్ ఇవ్వవచ్చు. ఇది వరకు బ్లాగుల నుంచి కాపీ చేసిన సమాచారానికి కూడా నేను ఒప్పుకోలేను. వ్యాసాలలొ ఎన్ని రెఫరెన్సులు ఉన్నాయన్నది ముఖ్యం కాదు, అవి ఎంతవరకు ప్రామాణికం అన్నదే ప్రధానము. రెఫరెన్సులు లేకున్నా సరే పెద్దగా ఇబ్బంది ఉండదు, అలాంటి వ్యాసాలు ఇప్పటికే చాలా ఉన్నాయి, కాని ఇచ్చే రెఫరెన్సులు ఆలోచించి ఇస్తే చాలు. నేను చెప్పేది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను, ఇంకనూ చెప్పే అవసరం లేదనుకుంటా. నిన్న నార్మాన్ బోర్లాగ్ వ్యాసంలో కూడా నేను చేసిన మార్పులను గమనించే ఉంటారు.-- C.Chandra Kanth Rao-చర్చ 18:55, 26 మార్చి 2010 (UTC)[ప్రత్యుత్తరం]
హాయ్ బుజ్జీ శీర్షికను మూలంగా చేర్చటంలో తప్పేమీ లేదు కానీ వీలైనంతగా అలాంటివాటిని మూలాలుగా ఇవ్వకండి. అందునా వైట్ హాస్ గురించి బోల్డెంత సమాచారం పలుచోట్ల లభిస్తుంది. మూలాలకు ధృవీకరణ, విశ్వసనీయత, ప్రామాణికత ముఖ్యం. ఈనాడు లింకులకు శ్వాశతత్వం లేదు. అవి మూన్నెల్లలో పుటుక్కుమంటాయి. ఒక సంవత్సరం మీరు వ్రాసిందాన్ని మూలాలతో ధృవీకరించాలనుకున్నవాళ్ళకి అది వీలుపడదు. అందుకే తెలుగులో లేకపోయినా కాస్త కుదురుగా ఉండే లింకులని చూడండి. పుస్తకాలకు లింకులైతే మరీ భేషు. మీరు సమాచారాన్ని ఆ శీర్షికనుండి సేకరించినా, ముఖ్యమైన సమాచారాలకు కొన్ని పదిలమైన మూలాలని వెదికి పెట్టండి. ఉదాహరణకి గూగుల్ బుక్స్ లో "white house history" అని వెతకండి, చాలానే దొరుకుతాయి. ఇక మరీ ఎక్కడా దొరకని సమాచారమైతే అలాంటి మూలలిచ్చినా ఫర్వాలేదు. బ్లాగుల్లో సమాచారంతో పాటు వ్యక్తిగత అభిప్రాయాలు ఎంతగా కలగలిపి ఉంటాయంటే వాటిని ఉదహరించేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. --వైజాసత్య 17:30, 27 మార్చి 2010 (UTC)[ప్రత్యుత్తరం]
అంటే శ్వేత సౌధం, నార్మన్ బోర్లాగ్ అనే వ్యాసాలు అసలు వికీలో లేకుండా ఉండడం కన్నా ఏదో కొంత సమాచారం ఉంటే బాగుంటుందని భావించి అలా అంశాన్ని వికీకరించి వ్యాసాలుగా చేర్చడం జరిగింది.దీని వరకు మీకు అభ్యంతరాల్లేవనుకుంటాను. కానీ మూలాల విషయంలో మీరు చెప్పినది సబబుగా తోస్తున్నది కాబట్టి ఇక నుంచి అలానే చేయడానికి ప్రయత్నిస్తాను. మీ సమయం వెచ్చించినందుకు ధన్యవాదాలు. —రవిచంద్ర (చర్చ) 19:17, 26 మార్చి 2010 (UTC)[ప్రత్యుత్తరం]
మీరు పైన రెండవసారి చెప్పిన విషయాలతో ఏకీభవిస్తున్నాను. వ్యాసాలను చేర్చడంలో ఎక్కడి విషయాలైననూ చేర్చవచ్చు. అసలు ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి విషయాలను సేకరిస్తున్నారనేది తెలుసుకోవడం కష్టసాధ్యమే. నేను మూలాల గురించే చెప్పాను కాని వ్యాససమాచరం వృద్ధిచేయడానికి ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదు. కాకుంటే ప్రామాణిక గ్రంథాలతో పోలిస్తే చిన్నపిల్లలకు ఉద్దేశించిన వ్యాసాలలో వాక్యాల కూర్పులో తేడా ఉంటుంది. విజ్ఞాన సర్వస్వంలో చేర్చేటప్పుడు కొద్దిగా వాక్యశైలిని మారిస్తే సరిపోతుంది. సమాచారం చేర్చడంతో పొరపాటు లేదు ఎందుకంటే ఆ వ్యాసాలలోని సమాచారం ప్రత్యేకంగా ఎవరూ తయారుచేసినది కాదు, అలాంటి సమాచారం ప్రామాణిక గ్రంథాలలో కూడా ఉంటుంది. -- C.Chandra Kanth Rao-చర్చ 19:50, 28 మార్చి 2010 (UTC)[ప్రత్యుత్తరం]

వైజాసత్య గారూ నేను మూలంగా ఈనాడు వెబ్‌సైటుకు లింక్ ఇవ్వలేదు. అది కొంత కాలం పాటు మాత్రమే ఉంటుందని నాకూ తెలుసు. నేను వ్యాసంలో లింకు <ref>ఈనాడు గురువారం, మార్చి 24 హాయ్ బుజ్జీ శీర్షిక</ref> అని ఇచ్చాను. కానీ అత్యవసరం అనుకుంటే తప్ప ఇకనుంచి అలా ఇవ్వడం మానేస్తాను. కానీ అలాంటి వ్యాసాలు మంచి ఆసక్తికరమైనవి. వికీలో ఉండదగినవి. అందుకనే వాటి నుంచి స్వీకరిస్తున్నాను. వికీలో రాసే ప్రతీ వ్యాసం ప్రామాణిక గ్రంథాలను చదివి రాయాలంటే చాలాకాలం పడుతుంది కదా! అసలు వ్యాసమే లేకుండా ఉండడం కన్నా ఏదో కొంత సమాచారమైనా ఉంటే బాగుంటుందని నా ఆలోచన. --రవిచంద్ర (చర్చ) 17:44, 27 మార్చి 2010 (UTC)[ప్రత్యుత్తరం]

"అసలు వ్యాసమే లేకుండా ఉండడం కన్నా ఏదో కొంత సమాచారమైనా ఉంటే బాగుంటుందని నా ఆలోచన." - అవును మీ ఆలోచనతో నేనూ అంగీకరిస్తున్నాను. --వైజాసత్య 00:04, 30 మార్చి 2010 (UTC)[ప్రత్యుత్తరం]

బిక్కవోలులో మార్పు గురించి[మార్చు]

రవిచంద్ర గారూ నాకు ఇంత వరకూ వికీపీడియా గురించి తెలియదు. అందుకే ఆపేజిలో మాఊరిగురించి రాసాను నాకు మరింత సహాయం కావాలి సహాయం చేయగలరా?

నా సమాధానం ఇక్కడ ఉంది. వాడుకరి చర్చ:Sureshdaniel51.--రవిచంద్ర (చర్చ) 05:46, 31 మార్చి 2010 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జున ధన్యవాదాలు[మార్చు]

నా నిర్వాహక అభ్యర్ధిత్వానికి మద్ధతు ప్రకటించినందుకు ధన్యవాదాలు. అర్జున 11:31, 28 ఏప్రిల్ 2010 (UTC)[ప్రత్యుత్తరం]

Hello!

I'm sysop on Papowo Biskupie Wiki. I organize action writing article Nowy Dwór Królewski on all languages version Wikipedia. Please writing article.

Link on Enclish Wikipedia: http://en.wikipedia.org/wiki/Nowy_Dwór_Królewski

Answer on this page: http://pl.papowo.wikia.com/wiki/Dyskusja_użytkownika:Kinrepok

పేజి తరలింపు సూచన[మార్చు]

భారతదేశంలోని జపనీస్ కారులు -> భారతదేశంలోని జాపనీయ కారులు? 218.186.8.253 16:50, 3 మే 2010 (UTC)[ప్రత్యుత్తరం]

భారతదేశంలో జపాన్ కార్లు అంటే ఇంకా సులభంగా ఉంటుందేమో.... —రవిచంద్ర (చర్చ) 05:06, 4 మే 2010 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రామాణికపదములు - సందేహము[మార్చు]

రవిచంద్రగారు, తెవికీ దినదినాభివృద్దికి విశేష కృషిచేస్తున్న మీకు అభినందనలు. గుదము పేజీ కి దారితీస్తున్న రెండు లింకులను ప్రామాణిక పదములు కావన్న ఉద్దేశ్యముతో మీరు తొలగించారు. అసలు ఒక పదము ప్రామాణిక అర్హతలను ఏ ప్రాతిపదికన నిర్ణయిస్తారు? దీనికి తెవికీలో ఏమయినా నిర్ణీత పద్ద్దతిని అవలంభిస్తున్నారా? గుదము, మలద్వారము లాంటి గ్రాంధిక పదాలు ఎంతమంది తమ దైనందిక జీవనములో ఉపయోగిస్తున్నారు? ఇలాంటి పదాలు కేవలము రచనలలో మాత్రమే ఉపయోగిస్తారు. ఆయా వ్యాధిగ్రస్తులు వైద్యుని దగ్గరకు వెళ్ళినపుడు ఎంతో విద్యాధికుడయిన వైద్యులు కూడా ఈ పదాలు వాడరు. తెలంగాణా పల్లెలలో మరియు రాయలసీమ పల్లెలలో ఇప్పటికీ గుద భాగమును సంబోధించడానికి కుత్త, గుద్ద పదాలను వాడుతారు. కోస్తా జిల్లాలలో ముడ్డి పదాన్ని వాడుతారు. ఎక్కువ మంది ముడ్డి ని వాడుతారు కనుక బహుశా మీరు దానిని అలాగే ఉంచి మిగతా రెండు పదాలను తొలగించారు.గ్రామీణ ప్రాంతాలలో ఆయా పదాలను వివిధ సామెతలలో కూడా వాడతారు. ఉదాహరణకు పని తప్పించుకునే సోమరిపోతులను ఉద్దేశించి ఏం రా! గుద్ద నొప్పా? అని మందలిస్తారు. దీని భావము కేవలము వారికి పని పట్ల శ్రదాసక్తులు పెంపొందించడమేకాని బూతు అర్థము కాదు.ప్రపంచ ప్రసిద్ది పొంది మన అందరి చేత గొప్పగా కీర్తింపబడుతున్న ఆంగ్లభాషలో అత్యంత అసహ్యముగా భావించే FUCK అన్న పదానికి కూడా వికీపీడియా లో స్థానము కల్పించారు.ఇది చూడండి.తాటిచెట్టు కింద కూర్చొన్న ప్రతిఒక్కరూ తాగుబోతు కాదు అన్నట్లు, మన దృక్పధాన్ని బట్టి ఆయా సందర్భము ఆధారపడి ఉంటుంది. అలాగే మనము కూడా సంకుచిత దృష్టితో కాకుండా విశాల దృక్పధముతో దీనిని సముచిత దృష్టితో పరిశీలించి పైన పేర్కొన్న లింకులను తెవికీలో పునరుద్దరించగలరని ఆశిస్తున్నాను. --గండర గండడు 13:06, 6 మే 2010 (UTC)[ప్రత్యుత్తరం]

గండర గండడు గారూ, థాంక్యూ. తెవికీలో కృషి చేస్తున్నందుకు మీకు కూడా అభినందనలు.
తెవికీలో వాడే భాషకు ఒక ప్రామాణికత ఉన్నది. నేను తొలగించిన పదాలు కేవలం మీరన్నట్లు ప్రజల వాడుకలో ఉన్నవే కానీ ప్రామాణిక ప్రింట్ మీడియాలో ఎక్కడా వాడుకలో లేవు. అంటే ఇక్కడ రాసే భాష కు ఆధారం పుస్తక భాష అని గమనించగలరు. ఈ పద ప్రయోగాలు కేవలం Colloquial. కాబట్టి ఇక్కడ చేర్చడం కుదరదు. ఇక ఆంగ్ల వికీపీడియా, తెలుగు వికీపిడియా రెండు వేర్వేరు కమ్యూనిటీలు. ఇక్కడ వాడే భాష ప్రామాణికాలు ఇక్కడ పని చేసే సభ్యులే నిర్ణయిస్తారు.కాబట్టి అక్కడ fuck మీద వ్యాసం ఉన్నంత మాత్రాన మనం దైనందిన భాషలో వాడుకునే పదాలన్నింటి మీదా వ్యాసం సృష్టించాలంటే సాధ్యం కాదు. ఇది వరకే ఈ విషయమై కొన్ని చర్చలు కూడా జరిగాయి. వాటి ఫలితంగానే కేవలం ప్రామాణిక పదాలు వాడాలని నిర్ణయించడం జరిగింది. ఇక నేను సంకుచిత దృష్టితో ఆలోచిస్తే గుదరతి లాంటి వ్యాసాలు తొలగించకుండా కేవలం ఈ పదాలు మాత్రమే తొలగిస్తాను చెప్పండి? ఇలాంటి విషయాల గురించి రాసేటపుడు పత్రికల్లో, పుస్తకాల్లో వాడుతున్న భాషను ప్రామాణికంగా పరిగణించండి. ఉదాహరణకు కొన్ని పత్రికల్లో సెక్స్ సందేహాలు లో వాడే భాషనుపయోగించి రాస్తే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. —రవిచంద్ర (చర్చ) 17:19, 6 మే 2010 (UTC)[ప్రత్యుత్తరం]

రవిచంద్రగారు, సందేహ నివృత్తి చేసినందుకు ధన్యవాదములు. తెవికీ ని అన్ని వర్గాల పాఠకులకు చేరువ చేయాలనే ఉద్దేశ్యముతోనే ఆయా పేజీలను సృష్టించడము జరిగినది. అలాగే కొన్ని ఆంగ్ల మూసలు తెవికీలో లభ్యము కావడము లేదు.(ఉదాహరణ:newspaper).వీటిని తెవికీకరించడానికి మార్గమును తెలుపగలరు.

అర్జున ధన్యవాదాలు[మార్చు]

నా నిర్వాహక అభ్యర్ధిత్వానికి మద్ధతు ప్రకటించినందుకు ధన్యవాదాలు. అర్జున 03:36, 7 మే 2010 (UTC)[ప్రత్యుత్తరం]

పేజీ తొలగింపు సూచన[మార్చు]

రవిచంద్రగారు, వరప్రసాద్ అనే కొత్త పేజీని వ్యక్తిగత వివరాలతో సృష్టించారఉ. పరిశీలించి తొలగించగలరు.ధన్యవాదములు. ఆమ్రపాలి.

తెలియజేసినందుకు ధన్యవాదాలు. పేజీని తొలగించాను. --రవిచంద్ర (చర్చ) 17:38, 7 మే 2010 (UTC)[ప్రత్యుత్తరం]

ఫైలు సైజు సమస్య[మార్చు]

రవిచంద్రగారు, ఆంగ్ల వికీ లో ఉన్న కొన్ని బొమ్మ ఫైల్లు తెవికీ లో వాడినపుడు కనిపించడము లేదు. బొమ్మ బదులుగా ఫైలు సైజు కనబడుతోంది. ఉదాహరణకు ఆంగ్ల పోకిరి బొమ్మను తెవికీ లో వాడుతుంటే బొమ్మ కనబడవలసిన చోట 200K అని వస్తున్నది.ఇదే సమస్య వాషింగ్టన్ పోష్ట్ వ్యాసములో కూడా ఎదురవుతున్నది.దీనికి ఏమయినా పరిష్కారము ఉంటే తెలుపగలరు.--సుల్తాన్ ఖాదర్ 09:56, 10 మే 2010 (UTC)[ప్రత్యుత్తరం]

కొత్త లోగో[మార్చు]

కొత్త లోగోలో కన్నడ బదులు తెలుగు 'వి' ఉంది. చాలా బావుంది :) హింది కూడా సరిచేసారు.. 155.69.203.213 11:57, 21 మే 2010 (UTC)[ప్రత్యుత్తరం]