సూరంపూడి సీతారామ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సూరంపూడి సీతారామ్ (1921 జనవరి 10 - 1987 సెప్టెంబరు 16) తెలుగు రచయిత, అనువాదకుడు, పాత్రికేయుడు. ఈయనఆంధ్ర సచిత్ర వార పత్రిక సంపాదకవర్గంలో పనిచేశాడు.

జీవిత విశేషాలు[మార్చు]

సూరంపూడి సీతారాం 1921 జనవరి 10వ తారీఖున, పశ్చిమగోదావరి జిల్లా, కోరుమిల్లి గ్రామంలో జన్మించారు. అత్తిలిలో మిడిల్‌ స్కూల్‌, తణుకులో హైస్కూలు, మచిలీపట్నంలో ఇంటర్‌ మీడియేట్‌, బి.ఏ. (లెక్కలు) విద్యాభ్యాసము చేసారు.

చిన్నవయసులోనే ఉపనిషత్‌లు, భగవద్గీత, శంకరాచార్యుల భాష్యములు, రచనలు స్వామి నిశ్రేయాసనందవారి సూచనతో చదవడం తటస్తించింది. మహాత్మాగాంధీ గారిని కూడా కలిసే సదవకాశము కల్గింది.

1944 అక్టోబరులో కలకత్తా ఈస్టర్న్‌ ఎక్స్‌ప్రెస్‌ సంస్థలో పనిచేస్తున్నపుడు బెంగాలీ భాషపై అభిమానం పెంచుకొని ప్రముఖుల సాహిత్యాన్ని చదివారు. బెంగాలీ మాతృకలను తెలుగులోకి అనువదించారు.

1944లో ఆంధ్రప్రభసబ్‌ ఎడిటర్‌గాను, తర్వాత 1947 నుండి ఆంధ్ర (దిన, వార) పత్రిక ల్లో 10 సంవత్సరాలు పనిచేసారు.

1946 లో 25 ఏళ్ళ వయస్సులో రచనా వ్యాసంగములో అడుగు పెట్టి న ఆయన తర్వాత భారత ప్రభుత్వ సమాచార శాఖలో వివిధ హోదాల్లో పనిచేసి డిప్యూటీ ప్రిన్సిపల్‌ ఇన్‌ఫర్మేషన్‌ ఆఫీసరుగా 1981 జనవరి 19న పదవీ విరమణ చేశారు..

ఆలిండియా రేడియో నించి రోజూ ఉదయం, సాయంత్రం సరీగ్గా 7:00 గంటలకి “వార్తలు, చదువుతున్నది, సూరంపూడి సీతారాం” అన్న ఆయన గళం అప్పట్లో తెలుగువారందరికీ సుపరిచయం.

సీతారాం రవీంద్రనాథటాగూర్‌ గారి “యోగాయోగ్”, బిభూతి భూషన్‌ బందో పధ్యాయగారి “ఆరన్యక”, మహాశ్వేతాదేవిగారి “ఆత్మజ” తెనుగులోకి అనువదించారు.

ఇంగ్లీషు నుండి తెలుగులోకి అనువదించబడిన నవలలు కౌంట్‌ ఆఫ్‌ మాంటె క్రిస్టో (ఫ్రెంచిలో 'అలెంగ్లాండర్‌ డ్యూమాస్‌' రచన ), ఘంటా రావము (ఇంగ్రీషులో విక్టర్‌ హ్యూగో రచన 'హంచ్‌ బ్యాక్‌ ఆఫ్‌ నాటర్‌ డామ్‌’ ) వారికి గొప్ప పేరు ప్రతిష్ఠలు తెచ్చిపెట్టాయి.[1]

1987 సెప్టెంబరు 16 వ తేదీన హైదరాబాద్‌లో పరమపదించారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

.ఆయన మరణం తెలుగు సాహిత్యానికి తీరని లోటు.

రచనలు[మార్చు]

అనువాదాలు[మార్చు]

  • అజేయుడు (మూలం: అలెగ్జాండర్ డ్యూమా)
  • ఘంటారావం (మూలం: విక్టర్ హ్యూగో)
  • వనవాసి (మూలం: బిభూతి భూషణ్ బంధోపాధ్యాయ) [2]
  • కౌంట్ ఆఫ్ మాంట్ క్రిస్టో (మూలం: అలెగ్జాండర్ డ్యూమా) [3]
  • ఒక తల్లి (మూలం: మహా శ్వేతాదేవి)
  • రాకాసి కోర (మూలం: మహా శ్వేతాదేవి)

మూలాలు[మార్చు]

  1. Count Of Monte Cristo Telugu Part 2 Of 2 06042020.
  2. "వనవాసి నవల - 14 - Harshaneeyam (podcast)". Listen Notes (in ఇంగ్లీష్). Retrieved 2022-01-28.
  3. అలెగ్జాండర్ డ్యుమా(మూలం), సూరంపూడి సీతారాం(అను ) (1951). కౌంట్ ఆఫ్ మౌంట్ క్రిస్టో.