Jump to content

ద కౌంట్ ఆఫ్ మాంటీ క్రిస్టొ

వికీపీడియా నుండి
The Count of Monte Cristo
రచయిత(లు)అలెగ్జాండర్ డ్యుమాస్
in collaboration with అగస్టె మార్కట్
మూల శీర్షికLe Comte de Monte-Cristo
దేశంఫ్రాస్ స్
భాషఫ్రెంచి
శైలిచారిత్రక నవల
సాహస యాత్ర
ప్రచురించిన తేది
1844–1845 (ధారావాహికలుగా)

ద కౌంట్ ఆఫ్ మాంటీ క్రిస్టొ (ఆంగ్లం- The count of monte cristo. ఫ్రెంచ్-Le Comte de Monte-Cristo) అను ప్రఖ్యాత నవలను అలెగ్జాండర్ డ్యుమాస్ 1844 లో రచించారు. డ్యుమాస్ యొక్క ఇతర రచనలు, The three musketeers లాగే ఇది కూడా ప్రసిద్ధి చెందింది. ఈ నవల ఫ్రాన్, ఇటలీ, మెడిటెర్నన్ లోని పర్వత ప్రాంతాలలో కథ నడుస్తుంది. ఈ నవల ప్రారంభం చారిత్రక "వంద రోజుల వ్యవధి (నెపొలియన్ చరసాల నుంచి తప్పించుకుని తిరిగి రాజ్యాధికారం చేపట్టడం) నుండి లూయిస్ ఫిలిప్ ఫ్రాన్ ను పరిపాలించిన కాలం వరకు నడుస్తుంది. ఈ నవల ఫ్రెంచి చరిత్రలో నెపొలియన్ పరిపాలించిన రోజులతో ముడిపడి ఉంది. ఈ కథ మఖ్యంగా మనిషి జీవితంలో లేదా ఒక మనిషికి జరిగే ఆశ, న్యాయం, ప్రతీకారం, దయాగుణం క్షమాగుణం, ప్రేమ, మోసం, స్వార్థం, నిజాయతి లాంటి అంశాల ఇతివృత్తంతో నడుస్తుంది. అకారణంగా జీవిత ఖైదు కాబడిన ఒక వ్యక్తి జైలు నుంచి తప్పించకుని జైలులో పరిచయమైన వ్యక్తి ద్వారా ధనవంతుడై తనను జైలు జీవితం గడపడానికి కారకులైన వారిని శిక్షిస్తూ ప్రతీకారం తీర్చుకుంటాడు.

మూలాలు

[మార్చు]

[1]

నవలా రచయిత అలెగ్జాండర్ డ్యుమాస్

బయటి లంకెలు

[మార్చు]