ఒక్కో దానిలో మూడు గోళీలు కలిగిన నాలుగు సంచులు. గుణకారం చేస్తే పన్నెండు గోళీలు
గుణకారం అనేది ప్రాథమిక గణిత ప్రక్రియల్లో ఒకటి. ఒక సంఖ్యతో మరో సంఖ్యను హెచ్చవేయడమే గుణకారం. అందుకనే దీన్ని హెచ్చవేత అని కూడా అంటారు.
రెండు సంఖ్యల మధ్య గుణకారం అంటే వాటిలో మొదటి సంఖ్యను రెండవ సంఖ్య సూచించినన్ని సార్లు పదేపదే కూడడం. ఉదాహరణకు 3 ని 4 తో గుణించడాన్ని ఈ క్రింది విధంగా సూచించవచ్చు.
గుణకారము చేసేటప్పుడు కంప్యూటర్లు ఇదే పద్ధతిని ఉపయోగిస్తాయి. గుణకారం అంటే పడే పదే కూడడం. భాగారం అంటే పదే పదే తీసివెయ్యడం.