కిన్నెరసాని వన్యప్రాణుల అభయారణ్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కిన్నెరసాని వన్యప్రాణుల అభయారణ్యం
IUCN category IV (habitat/species management area)
View from a dam in Kinnarsani WS, AP W IMG 5776.jpg
కిన్నెరసాని వన్యప్రాణుల అభయారణ్యం
ప్రదేశంతెలంగాణ, భారతదేశం
సమీప నగరంభద్రాచలం
విస్తీర్ణం635.40 kమీ2 (157,010 acres)
పాలకమండలితెలంగాణ అటవీశాఖ

కిన్నెరసాని వన్యప్రాణుల అభయారణ్యం తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కిన్నెరసాని నదికి సమీపంలో ఉన్న వన్యప్రాణుల అభయారణ్యం. ఇది పాల్వంచ పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది.

చరిత్ర[మార్చు]

పాపికొండల నుండి జయశంకర్ జిల్లాలోని అటవీ ప్రాంతం వరకు విస్తరించివున్న కిన్నెరసాని అభయారణ్యం 1977లో 635.4 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మించబడింది. టేకు, మద్ది, వెదురు వంటి వృక్షాలు పెరుగుతున్న ఈ అభయారణ్యంలో చిరుత, ఎలుగుబంట్లు, మనుబోతులు, మచ్చలజింక, సింహాలు, కృష్ణ జింకలు, అడవి పందులు, నక్కలు, హైనాలు, సరీసృపాలు, తుట్టె పురుగులు, గుర్రాలు, కొంగలు, కింగ్‌ఫిషర్‌, గిజిగాడు మొదలైన పక్షులు నివసిస్తున్నాయి.[1]

ఇతర వివరాలు[మార్చు]

  1. 2000 సంవత్సరంలో తొమ్మిది పులులు ఉండగా, 2012లో మూడు, 2016లో ఆ సంఖ్య రెండుకు చేరింది. ఇరవైతొమ్మిది చిరుత పులులు ఉండగా, 2012లో పదహారు, 2016 పన్నెండు చిరుతలు మిగిలాయి. కృష్ణజింకలు, నెమళ్లు కూడా కనిపించకుండా పోయాయి. ఇక్కడి మొసళ్ళు హైదరాబాదులోని నెహ్రూ జంతుప్రదర్శనశాలకు తరలించబడ్డాయి. ప్రస్తుతం ఈ జలాశయంలో వేల సంఖ్యల్లో మొసళ్లున్నాయి. 4,278 దుప్పులు, 658 కొండ గొర్రెలు, 1,892 అడవి గేదెలు, 412 ఎలుగుబంట్లు, 508 కనుజులు ఈ అభయారణ్యంలో సంచరిస్తున్నాయి.[2]
  2. పర్యాటకులను ఆకర్షించడంకోసం 2017లో మూడు లక్షల రూపాలతో రెండు నల్లరంగు హంసలను తీసుకొచ్చారు.[3]

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

  1. నమస్తే తెలంగాణ, జిందగీ వార్తలు (27 July 2018). "పచ్చని చేలా.. పావడ గట్టిన కిన్నెరసాని". మధుకర్ వైద్యుల. మూలం నుండి 15 జూన్ 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 15 June 2019. Cite news requires |newspaper= (help)
  2. ఆంధ్రజ్యోతి, తెలంగాణ (23 December 2017). "కళ తప్పుతున్న 'కిన్నెర'". మూలం నుండి 15 June 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 15 June 2019. Cite news requires |newspaper= (help)
  3. The Hindu, Telangana (30 August 2017). "New attraction at Kinnerasani wildlife sanctuary". P. Sridhar. Retrieved 15 June 2019. Cite news requires |newspaper= (help)

ఇతర లంకెలు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.