అడపా వరలక్ష్మీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అడపా వరలక్ష్మీ
అడపా వరలక్ష్మీ
జననంఆగస్టు 16, 1974
సుపరిచితుడు/
సుపరిచితురాలు
సామాజికవేత్త
జీవిత భాగస్వామిజి.ఎన్‌.వి. సంజయ్‌ కుమార్‌
పిల్లలుకుమార్తె (భార్గవి),
కుమారుడు (కిరీటి)
తల్లిదండ్రులు
  • అడపా సూర్యప్రకాష్ రావు (తండ్రి)
  • సౌదామని (తల్లి)

అడపా వరలక్ష్మీ, మహిళా సామాజికవేత్త. తెలుగు రాష్ర్టాలకు స్కిల్‌ డెవల్‌పమెంట్‌ ఇంచార్జిగా, ఫిల్మ్‌ సెన్సార్‌ బోర్డు మెంబరుగా పనిచేసింది. మహిళా సాధికారత కోసం 'హెవెన్‌ హోమ్స్‌ సొసైటీ' అనే సంస్థను స్థాపించి మహిళలపై జరుగుతున్న దౌర్జన్యాలపై, మత్తు పదార్థాలపై అవగాహన కలిగిస్తున్నది.[1] తన సంస్థ తరపున తెలంగాణ శిశు సంక్షేమశాఖ సహకారంతో ప్రతి కళాశాలో మహిళా రక్షణ అవగాహనతోపాటు కౌన్సెలింగ్‌ సెక్షన్‌ కూడా ఏర్పాటుచేస్తున్నది. స్పై కెమెరాలపై కేస్‌స్టడీస్‌ చేసి వాటిపై అవగాహన కలిగించేందుకు 'యాంటీ రెడ్ ఐ' ఉద్యమాన్ని ప్రారంభించింది.[2]

జననం, విద్య[మార్చు]

వరలక్ష్మీ 1974, ఆగస్టు 16న అడపా సూర్యప్రకాష్ రావు - సౌదామని దంపతులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఎన్.టి.ఆర్. జిల్లా, విజయవాడలో జన్మించింది. తండ్రి సూర్యప్రకాశ్‌ రావు పోలీసు డిపార్ట్‌మెంట్‌లో పనిచేశాడు. వరలక్ష్మీ డిగ్రీ వరకు చదువుకున్నది. కొంతకాలం కొత్తగూడెంలో ‘ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌ ట్రైనింగ్‌’ సెంటర్‌ ను ఏర్పాటుచేసి, టైలరింగ్‌, బ్యూటీపార్లర్‌, సాఫ్ట్‌వేర్‌, పెయింటింగ్‌ లో శిక్షణలు ఇచ్చింది.[2]

వ్యక్తిగత జీవితం[మార్చు]

వరలక్ష్మీకి తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం పట్టణానికి చెందిన వ్యాపారవేత్త జి.ఎన్‌.వి. సంజయ్‌ కుమార్‌ తో వివాహం జరిగింది. వారికి ఒక కుమార్తె (భార్గవి), ఒక కుమారుడు (కిరీటి) ఉన్నారు.[3]

హెవెన్‌ హోమ్స్‌ సొసైటీ[మార్చు]

మహిళా సాధికారత కోసం 2012లో ‘సెవెన్‌ హోమ్స్‌ సొసైటీ’ స్థాపించింది. కానీ, మహిళలు ఎదర్కుంటున్న సమస్యలపై పోరాటం చేయాలనుకున్నది. ‘స్పై కెమెరా’ల ద్వారా కొందరు రహస్యంగా వీడియోలు తీసి మహిళలను వేధిస్తున్నారని గమనించిన వరలక్ష్మీ, ఎనిమిది నెలలపాటు శ్రమించి స్పై కెమెరాలపై కేస్‌స్టడీస్‌ చేసి 2017లో 'యాంటీ రెడ్ ఐ' ఉద్యమాన్ని ప్రారంభించింది. నల్లగొండ జిల్లాలో హెచ్‌ఐవీపై అవగాహన కల్పించింది.[4]

పురస్కారాలు[మార్చు]

  • ఆదర్శ మహిళ అవార్డు (ఖమ్మం జిల్లా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్)
  • వాయిస్ ఆఫ్ ఉమెన్ అవార్డు

మూలాలు[మార్చు]

  1. Maitreyi, M. l Melly (2018-09-22). "Going all out against spy cameras". The Hindu. ISSN 0971-751X. Archived from the original on 2020-11-09. Retrieved 2022-07-20.
  2. 2.0 2.1 రాళ్లపల్లి, రాజావలి (2022-07-20). "డ్రగ్స్‌ రహిత సమాజం కోసమే..." www.andhrajyothy.com (in ఇంగ్లీష్). Archived from the original on 2022-07-20. Retrieved 2022-07-20.
  3. పురాణపండ, వైజయంతి (2018-10-04). "కంటికి కన్ను". Sakshi. Archived from the original on 2018-10-03. Retrieved 2022-07-20.
  4. నిర్మలారెడ్డి (2021-07-18). "'స్పై' కెమెరాలపై 'స్పై'..మూడో కన్నుతో చూడొద్దు!". Sakshi. Archived from the original on 2021-07-18. Retrieved 2022-07-20.