Jump to content

మేడే రాజీవ్ సాగర్

వికీపీడియా నుండి
మేడే రాజీవ్ సాగర్
మేడే రాజీవ్ సాగర్


పదవీ కాలం
2022 జూన్ 30 – 07 డిసెంబర్ 2023[1]
ముందు కొమ్ముల తిరుమల్ రెడ్డి

వ్యక్తిగత వివరాలు

జననం జనవరి 8
వెలుగుపల్లి, తుంగతుర్తి, సూర్యాపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
నివాసం హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
పూర్వ విద్యార్థి ఎమ్మెస్సీ కెమిస్ట్రీ
వృత్తి రాజకీయ నాయకుడు

మేడే రాజీవ్‌ సాగర్‌ తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఉద్యమకారుడు, రాజకీయ నాయకుడు. ఆయన 2022 జూన్ 30న తెలంగాణ ఫుడ్స్ చైర్మన్‌గా నియమితుడయ్యాడు.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

రాజీవ్‌ సాగర్‌ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసి కల్వకుంట్ల కవిత నేతృత్వంలో తెలంగాణ జాగృతి నిర్మాణంలో ఆ తరువాత తెలంగాణ జాగృతిని గ్రామస్థాయి వరకు తీసుకెళ్ళి తెలంగాణవాదాన్ని వినిపించాడు. ఆయన 2006 నుండి 2008 వరకు తెలంగాణ జాగృతి కోశాధికారిగా, 2008 నుండి 2014 వరకు తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శిగా, 2014 నుంచి ఇప్పటివరకు జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు.

రాజీవ్‌ సాగర్‌ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ అనుబంధ క్రైస్తవ సామాజికవర్గ సేవా కార్యక్రమాలు చేపట్టాడు. ఆయన నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కంప్యూటర్ శిక్షణ, కంప్యూటర్ సెంటర్, జాబ్ మేళాలు, మెడికల్ క్యాంపులు, కళ్లద్దాల పంపిణీ లాంటి సామజిక కార్యక్రమాలు నిర్వహిస్తూనే, నల్లమల అడవుల పరిరక్షణ, చెంచుల హక్కుల పరిరక్షణకు ఉద్యమించాడు. రాజీవ్‌ సాగర్‌ సేవలకు గుర్తింపుగా ఆయనను 2022 జూన్ 30న తెలంగాణ ఫుడ్స్‌ చైర్మన్‌గా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[3]

మూలాలు

[మార్చు]
  1. V6 Velugu (11 December 2023). "54 కార్పొరేషన్ల చైర్మన్లు ఔట్". Archived from the original on 19 February 2024. Retrieved 19 February 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Namasthe Telangana (30 June 2022). "తెలంగాణ ఫుడ్స్‌ చైర్మన్‌గా రాజీవ్‌ సాగర్‌". Archived from the original on 30 June 2022. Retrieved 30 June 2022.
  3. Mana Telangana (30 June 2022). "కార్పొరేషన్లుకు చైర్మన్ల నియామకం". Archived from the original on 30 June 2022. Retrieved 30 June 2022.