వేద రజిని
వేద రజిని | |||
పదవీ కాలం 2023 జూలై 7 – 07 డిసెంబర్ 2023[1] | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
---|---|---|---|
జననం | 1986, మార్చి 4 జడ్చర్ల, మహబూబ్‌నగర్ జిల్లా, తెలంగాణ | ||
వృత్తి | నృత్యకారిణి | ||
జీవిత భాగస్వామి | సాయిచంద్ | ||
పిల్లలు | చరీష్ (కుమారుడు), నది (కుమార్తె) |
వేద రజిని, తెలంగాణకు చెందిన నృత్యకారిణి. మలిదశ తెలంగాణ ఉద్యమంలో అనేక వేదికల మీద గజ్జెకట్టి నాట్యం చేసింది.[2] 2023 జూలై 7న తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా నియమించబడింది.[3]
జననం, విద్య
[మార్చు]రజిని 1986, మార్చి 4న తెలంగాణ రాష్ట్రం, మహబూబ్‌నగర్ జిల్లా, జడ్చర్ల పట్టణంలో జన్మించింది. జడ్చర్లలోని నాగార్జునా హైస్కూల్ లో పాఠశాల విద్యను, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను పూర్తిచేసింది.
వివాహం
[మార్చు]రజినికి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉద్యమ గాయకుడు సాయిచంద్ తో పరిచయమయింది. ఉద్యమ సమయంలో ఇద్దరూ కలిసి అనేక వేదికల మీద ఆటపాటలతో ప్రజలను ఉత్తేజపరిచారు. ఆ పరిచయం ప్రేమగా మారి పెద్దల అంగీకారంతో 2012లో వివాహం చేసుకున్నారు. వారికి కుమారుడు చరీష్ (చెర్రీస్), కుమార్తె నది ఉన్నారు. సాయిచంద్ 2023, జూన్ 29న గుండెపోటుతో మరణించాడు.[4]
చైర్‌పర్సన్‌గా
[మార్చు]గిడ్డంగుల శాఖ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఉన్న సాయిచంద్ మరణించడంతో సాయిచంద్ భార్య రజినికే ఆ బాధ్యతలను అప్పజెప్పాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించగా, రజినిని చైర్‌పర్సన్‌గా నియమిస్తూ 2023 జులై 7న తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు (జీవో ఆర్టీ నెంబరు 983) జారీ చేసింది. ఆమె జులై 20న తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించింది.[5]
తమ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల ఒక నెల వేతనం నుంచి సాయిచంద్ కుటుంబానికి రూ. కోటిన్నర ఆర్థికసాయాన్ని అందజేయనున్నట్లు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించాడు.[6][7]
మూలాలు
[మార్చు]- ↑ V6 Velugu (11 December 2023). "54 కార్పొరేషన్ల చైర్మన్లు ఔట్". Archived from the original on 19 February 2024. Retrieved 19 February 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "Rajini: సాయిచంద్ భార్యకు పదవి.. కోటిన్నర ఆర్థిక సాయం ప్రకటించిన కేటీఆర్". Samayam Telugu. 2023-07-07. Archived from the original on 2023-07-07. Retrieved 2023-07-07.
- ↑ "Telangana government has given a key post to Saichand's wife". Vaartha. 2023-07-07. Archived from the original on 2023-07-07. Retrieved 2023-07-07.
- ↑ Eenadu (30 June 2023). "తెలంగాణ ఉద్యమ గాయకుడు సాయిచంద్ హఠాన్మరణం". Archived from the original on 30 June 2023. Retrieved 30 June 2023.
- ↑ Andhra Jyothy (21 July 2023). "గిడ్డంగుల సంస్థ చైర్‌పర్సన్‌గా రజినీ సాయిచంద్ బాధ్యతల స్వీకరణ". Retrieved 21 July 2023.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ Namasthe Telangana (7 July 2023). "సాయిచంద్ సతీమణి వేద రజనీకి గిడ్డంగుల శాఖ కార్పొరేషన్ నియామక పత్రం అందజేత". Archived from the original on 7 July 2023. Retrieved 7 July 2023.
- ↑ T News Telugu (20 July 2023). "రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ గా రజిని సాయి చంద్ ప్రమాణం". Archived from the original on 20 July 2023. Retrieved 20 July 2023.