హరీష్ రావత్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హరీష్ రావత్
హరీష్ రావత్


7వ ముఖ్యమంత్రి ఉత్తరాఖండ్
పదవీ కాలం
11 మే 2016 – 18 మార్చి 2017
గవర్నరు క్రిషన్ కాంత్ పాల్
ముందు రాష్రపతి పాలన
తరువాత త్రివేంద్ర సింగ్ రావత్
పదవీ కాలం
21 ఏప్రిల్ 2016 – 22 ఏప్రిల్ 2016
గవర్నరు క్రిషన్ కాంత్ పాల్
ముందు రాష్రపతి పాలన
తరువాత రాష్రపతి పాలన
పదవీ కాలం
1 ఫిబ్రవరి 2014 – 27 మార్చి 2016
గవర్నరు ఆజిజ్ క్కురేషి
క్రిషన్ కాంత్ పాల్
ముందు విజయ్ బహుగుణ
తరువాత రాష్రపతి పాలన

కేంద్ర జలవనరుల శాఖ మంత్రి
పదవీ కాలం
30 అక్టోబర్ 2012 – 31 జనవరి 2014
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్
ముందు పవన్ కుమార్ బన్సల్
తరువాత గులాం నబీ ఆజాద్

లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
2009 – 2014
ముందు రాజేంద్ర కుమార్ బడి
తరువాత రమేష్ పోఖ్రియాల్
నియోజకవర్గం హరిద్వార్
పదవీ కాలం
1980 – 1991
ముందు మురళీ మనోహర్ జోషి
తరువాత జీవన్ శర్మ
నియోజకవర్గం అల్మోరా

రాజ్యసభ సభ్యుడు
పదవీ కాలం
2002 – 2008
ముందు మనోహర్ కాంత్ ధ్యాని
తరువాత భగత్ సింగ్ కొష్యారి
నియోజకవర్గం ఉత్తరాఖండ్

వ్యక్తిగత వివరాలు

జననం (1948-04-27) 1948 ఏప్రిల్ 27 (వయసు 75)
అల్మోరా, ఉత్తరాఖండ్, భారతదేశం)
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
తల్లిదండ్రులు రాజేంద్ర సింగ్ రావత్ (తండ్రి)
దేవకీ దేవి (తల్లి)
సంతానం అనుపమా రావత్‌[1]
పూర్వ విద్యార్థి లక్నో యూనివర్సిటీ
వృత్తి రాజకీయ నాయకుడు

హరీష్ సింగ్ రావత్ ఉత్తరాఖండ్‌ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉత్తరాఖండ్ రాష్ట్రానికి 7వ ముఖ్యమంత్రిగా, 15వ లోక్‌సభలో మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రిగా పని చేశాడు.[2]

జననం, విద్యాభాస్యం[మార్చు]

హరీష్ రావత్ ఉత్తరాఖండ్ రాష్ట్రం, అల్మోరా జిల్లా, మోహన్రి గ్రామంలో 1948 ఏప్రిల్ 27న రాజేంద్ర సింగ్ రావత్, దేవకీ దేవి దంపతులకు జన్మించాడు. ఆయన లక్నో విశ్వవిద్యాలయం నుండి బీఏ, ఎల్‌ఎల్‌బీ డిగ్రీ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం[మార్చు]

హరీష్ రావత్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి నాలుగుసార్లు లోక్‌సభ సభ్యుడిగా, ఒకసారి రాజ్యసభ సభ్యుడిగా, ఒకసారి ఉత్తరాఖండ్ అసెంబ్లీ సభ్యుడిగా ఎన్నికై 2014లో ఉత్తరాఖండ్ 7వ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేశాడు. తరువాత 2016లో ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించడంతో 25 రోజుల రాష్ట్రపతి పాలన తర్వాత రావత్ 2016 ఏప్రిల్ 21 నుండి 2016 ఏప్రిల్ 22 వరకు ఒక రోజు ముఖ్యమంత్రిగా వ్యవహరించి రికార్డు నెలకొల్పాడు. హరీష్ రావత్ 19 రోజుల రాష్ట్రపతి పాలన తర్వాత తిరిగి 2016 మే 11న 3వ సారి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం 2017 మార్చి 18 వరకు భాద్యతలు నిర్వహించాడు. ఆయన పంజాబ్‌ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జిగా కూడా పని చేశాడు. హరీశ్ రావత్‌ 2022 ఉత్తరాఖండ్ శాసనసభ ఎన్నికల్లో లాల్కువాన్‌ నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప బీజేపీ అభ్యర్థి మోహన్‌ సింగ్‌ బిష్త్‌ చేతిలో 16వేల ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ[మార్చు]

సంవత్సరం నియోజకవర్గం ఫలితం ఓటింగ్ శాతం ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ ప్రత్యర్థి ఓటింగ్ శాతం ఇతర
1980 అల్మోరా Won 46.31% మురళీ మనోహర్ జోషి జనతా పార్టీ 21.27%
1984 అల్మోరా Won 61.26% మురళీ మనోహర్ జోషి బీజేపీ 14.79%
1989 అల్మోరా Won 42.45% కాశీ సింగ్ ఐరీ ఉత్తరాఖండ్ క్రాంతి దళ్ 39.39%
1991 అల్మోరా ఓటమి 37% జీవన్ శర్మ బీజేపీ 45.94%
1996 అల్మోరా ఓటమి 26.59% బాచి సింగ్ రావత్ బీజేపీ 41.05%
1998 అల్మోరా ఓటమి 33.60% బాచి సింగ్ రావత్ బీజేపీ 52.39%
1999 అల్మోరా ఓటమి 45.50% బాచి సింగ్ రావత్ బీజేపీ 48.39%
2009 హరిద్వార్ Won 42.16% స్వామి యతినిద్రానంద్ గిరి బీజేపీ 25.99%
2019 నైనిటాల్ – ఉధంసింగ్ నగర్ ఓటమి 34.41% అజయ్ భట్ బీజేపీ 61.65% [3]

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ[మార్చు]

సంవత్సరం నియోజకవర్గం ఫలితం ఓటింగ్ శాతం ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ ప్రత్యర్థి ఓటింగ్ శాతం ఇతర
2012 ఉప ఎన్నిక దార్చుల అసెంబ్లీ నియోజకవర్గం Won 72.83% విష్ణు దత్ భారతీయ జనతా పార్టీ 24.75% [4]
2017 హరిద్వార్ గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గం ఓటమి 33.28% యతీశ్వరానంద్ భారతీయ జనతా పార్టీ 45.78%
2017 కిచ్చా అసెంబ్లీ నియోజకవర్గం ఓటమి 43.66% రాజేష్ శుక్ల భారతీయ జనతా పార్టీ 45.77% [5]
2022 లాల్కువాన్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఓటమి మోహన్‌ సింగ్‌ బిష్త్‌ భారతీయ జనతా పార్టీ [6]

మూలాలు[మార్చు]

  1. Sakshi (29 January 2022). "నాన్నా..'ఎస్‌ వికెన్‌ డూ ఇట్‌'!". Archived from the original on 10 March 2022. Retrieved 10 March 2022.
  2. Andhra Jyothy (10 March 2022). "నాటి ఒక్క రోజు సీఎం.. నేడు రాష్ట్రానికే పెద్ద దిక్కు... కాబోయే సీఎం కూడా?". Archived from the original on 10 March 2022. Retrieved 10 March 2022.
  3. "Election Commission of India".
  4. [1]
  5. Eenadu (3 May 2021). "ఈ ముఖ్యమంత్రులు.. ఓడిన సారథులు". Archived from the original on 10 March 2022. Retrieved 10 March 2022.
  6. Namasthe Telangana (10 March 2022). "ఉత్తరాఖండ్‌లో విజయం ఖరారు..! ఓటమిపాలైన ఇద్దరు సీఎం అభ్యర్థులు". Archived from the original on 10 March 2022. Retrieved 10 March 2022.