Jump to content

గులాం నబీ ఆజాద్

వికీపీడియా నుండి
గులాం నబీ ఆజాద్‌
గులాం నబీ ఆజాద్


ప్రతిపక్ష నాయకుడు
రాజ్యసభ
పదవీ కాలం
8 June 2014 (2014-06-08) – 15 February 2021 (2021-02-15)[4]
ముందు అరుణ్ జైట్లీ
తరువాత మల్లికార్జున్ ఖర్గే

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి
పదవీ కాలం
22 May 2009 (2009-05-22) – 26 May 2014 (2014-05-26)
ప్రధాన మంత్రి మ‌న్మోహ‌న్ సింగ్
ముందు అన్బుమణి రామదాస్
తరువాత హర్షవర్థన్‌

పదవీ కాలం
2 November 2005 (2005-11-02) – 11 July 2008 (2008-07-11)
ముందు ముఫ్తీ మహమ్మద్ సయ్యద్
తరువాత ఒమర్ అబ్దుల్లా

పదవీ కాలం
11 February 2009 (2009-02-11) – 15 February 2021 (2021-02-15)
ముందు సైఫుద్దీన్ సోజ్
నియోజకవర్గం జమ్మూ కాశ్మీరు
పదవీ కాలం
30 November 1996 (1996-11-30) – 29 January 2006 (2006-01-29)
నియోజకవర్గం జమ్మూ కాశ్మీరు

వ్యక్తిగత వివరాలు

జననం (1949-03-07) 1949 మార్చి 7 (age 76)
భాలెస్స, జమ్మూ కాశ్మీరు, భారతదేశం
రాజకీయ పార్టీ డెమొక్రటిక్ ఆజాద్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ (1973-2022)
జీవిత భాగస్వామి షమీమ్ దేవ్ ఆజాద్
సంతానం సద్దాం నబి ఆజాద్[2]
సోఫియా నబీ ఆజాద్[3]
పూర్వ విద్యార్థి
  • గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ, భాదర్వాహ
  • గాంధీ మెమోరియల్ ప్రభుత్వ సైన్స్ కాలేజీ
  • జమ్మూ యూనివర్సిటీ
  • కాశ్మీర్ యూనివర్సిటీ
పురస్కారాలు పద్మభూషణ్‌ (2022)

గులాం నబీ ఆజాద్‌ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ కేంద్రమంత్రి. ఆయన జమ్మూ కాశ్మీరు రాష్ట్ర 7వ ముఖ్యమంత్రిగా, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశాడు. గులాం నబీ ఆజాద్‌కు భారత ప్రభుత్వం 2022లో పద్మభూషణ్‌ పురస్కారాన్ని ప్రకటించింది.[5][6]

న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతులమీదుగా పద్మభూషణ్‌ అవార్డు అందుకున్న అవనీ లేఖరా

గులాం నబీ ఆజాద్ 2022 ఆగస్టు 26న కాంగ్రెస్‌ పార్టీకి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా ప్రకటించాడు.[7] 2022 సెప్టెంబరు 26 తేదీ, ఆసాత్ తన సొంత రాజకీయ పార్టీని ప్రజాస్వామ్య ఆశాద్ పార్టీ అని ప్రకటించారు . 2022 డిసెంబరు 27న, అతను తన పార్టీ పేరును డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీగా మార్చుకున్నాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

గులాం నబీ ఆజాద్ బూత్ లెవల్ స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెట్టి 1973 నుంచి 1975 వరకు బ్లాక్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా, 1975-76 జమ్మూకశ్మీర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశాడు. ఆయన సంజయ్ గాంధీ నేతృత్వంలోని ఇండియన్ యూత్ కాంగ్రెస్ లో (IYC) 1977 నుంచి పనిచేసి 1978-79లో 40రోజుల పాటు తిహాడ్ జైల్లో ఉన్నాడు. ఆజాద్ సంజయ్ గాంధీ మరణం తర్వాత ఐవైసీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి అనంతరం రాజీవ్ గాంధీ మద్దతుతో జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించాడు.

గులాం నబీ ఆజాద్ 1980 పార్లమెంట్ ఎన్నికల్లో మహారాష్ట్రలోని వాసిం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి గెలిచి 1982లో ఇందిరా గాంధీ మంత్రివర్గంలో కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. ఆయన మాజీ ప్రధానులు రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ మంత్రివర్గాలలో మంత్రిగా పనిచేసి 1991లో తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యాడు.

ఆజాద్ రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా, ఐదుసార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశాడు. ఆయన 2006 నుంచి 2008 వరకు జమ్మూకశ్మీర్ శాసనసభ సభ్యుడిగా రెండుసార్లు ఎన్నికై 2006లో జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఆయన 2022 ఆగస్టు 26లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాడు.[8]

గులాం నబీ ఆజాద్ జ‌మ్ము క‌శ్మీర్‌లో డెమొక్ర‌టిక్ ఆజాద్ పార్టీ పేరుతో 2022 సెప్టెంబర్ 27న పార్టీని ప్ర‌క‌టించాడు.[9]

మూలాలు

[మార్చు]
  1. "Ghulam Nabi Azad named Leader of Congress in Rajya Sabha". India Today. Retrieved 29 June 2017.
  2. "Ghulam Nabi Azad's Son To Wed DLF Supremo's Grand-daughter". 2012-10-31. Archived from the original on 2014-02-09. Retrieved 18 June 2020.
  3. "My dad will do well, says Azad's daughter". Retrieved 18 Jun 2020.
  4. After Ghulam Nabi Azad, who could be the next Leader of Opposition? Hindustan Times
  5. Sakshi (25 January 2022). "Padma Awards 2022: గులాం నబీ ఆజాద్‌కు పద్మభూషణ్". Archived from the original on 27 January 2022. Retrieved 27 January 2022.
  6. Namasthe Telangana (21 March 2022). "కనులపండువలా పద్మ అవార్డుల ప్రదానం.. సీడీఎస్‌ బీపిన్‌ రావత్‌కు పద్మవిభూషణ్‌.. ఆజాద్‌కు పద్మభూషణ్‌". Archived from the original on 21 March 2022. Retrieved 21 March 2022.
  7. TV5 News (26 August 2022). "50 ఏళ్ల కాంగ్రెస్ బంధాన్ని తెంచుకున్న గులామ్ నబీ ఆజాద్.. ముఖ్య కారణం అతనే." (in ఇంగ్లీష్). Archived from the original on 27 August 2022. Retrieved 27 August 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  8. Eenadu (27 August 2022). "'విధేయుడి నుంచి తిరుగుబాటు వరకు'.. కాంగ్రెస్‌ పార్టీలో ఆజాద్‌ ప్రస్థానం ఇలా." Archived from the original on 27 August 2022. Retrieved 27 August 2022.
  9. V6 Velugu (26 September 2022). "ఆజాద్ కొత్త పార్టీ.. 'డెమొక్రటిక్ ఆజాద్'". Archived from the original on 28 September 2022. Retrieved 28 September 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)