తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నల్గొండ జిల్లా లోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ నియోజకవర్గం 6 మండలాలు ఉన్నాయి.

ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు[మార్చు]

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి. తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం 1967లో ఏర్పడింది. తొలి ఎన్నికల్లో భీమిరెడ్డి నరసింహారెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. నర్సింహారెడ్డి సోదరి మల్లు స్వరాజ్యం 1983 ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. రాంరెడ్డి దామోదర్‌రెడ్డి 1985, 1989, 1994లలో వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి నేదురుమల్లి జనార్ధనరెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు.[1][2]

సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2014 96 తుంగతుర్తి (SC) గాదరి కిషోర్ కుమార్ మగ తెలంగాణ రాష్ట్ర సమితి 64382 అద్దంకి దయాకర్ మగ భారత జాతీయ కాంగ్రెస్ 62003
2009 96 తుంగతుర్తి (SC) మోత్కుపల్లి నరసింహులు మగ తెలుగుదేశం పార్టీ 80888 గుడిపాటి నర్సయ్య మగ భారత జాతీయ కాంగ్రెస్ 69025

2004 ఎన్నికలు[మార్చు]

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీకి చెందిన రాంరెడ్డి దామోదర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సంకినేని వెంకటేశ్వరరావుపై 13184 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందినాడు. దామోదర్ రెడ్డికి 68821 ఓట్లు రాగా, వెంకటేశ్వరరావుకు 55637 ఓట్లు లభించాయి.

మూలాలు[మార్చు]

  1. నమస్తే తెలంగాణ, నిపుణ విద్యావార్తలు (25 July 2017). "నియోజకవర్గాలు-విశేషాలు". Retrieved 22 June 2018. Cite news requires |newspaper= (help)
  2. రేడియో జల్సా న్యూస్. "తుంగతుర్తి నియోజకవర్గం - సమీక్ష". www.radiojalsanews.blogspot.com. Devender Pulugujja. Retrieved 22 June 2018.

ఇవి కూడా చూడండి[మార్చు]