మల్లు స్వరాజ్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మల్లూ స్వరాజ్యం

మాజీ పార్లమెంటు సభ్యురాలు, అసెంబ్లీ సభ్యురాలు (9 సంవత్సరాలు)
నియోజకవర్గము తుంగతుర్తి

వ్యక్తిగత వివరాలు

జననం 1931 (age 88–89)
హైదరాబాదు రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ సి.పి.ఐ (ఎం)
జీవిత భాగస్వామి మల్లు వెంకట నరసింహారెడ్డి
నివాసము నల్గొండ, తెలంగాణ,భారతదేశం
మతం హిందూ

మల్లు స్వరాజ్యం[1] తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు. మల్లు వెంకట నరసింహారెడ్డి సతీమణి

జివిత విశేషాలు[మార్చు]

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కొత్తగూడెం గ్రామంలో 1931లో జన్మించిన మల్లు స్వరాజ్యం నిజాం సర్కారుకు ముచ్చెమటలు పట్టించి, రజాకార్ల పాలిటి సింహస్వప్నమై నిలిచింది. 1945-48 సంవత్సరాల్లో సాయుధ పోరాటాల్లో క్రియాశీలక పాత్ర పోషించి నైజాం సర్కారును గడగడలాడించింది. ఈమె పోరాటాల ధాటికి తట్టుకోలేక 1947-48లో ఈమె ఇంటిని పూర్తిగా దగ్ధం చేశారు. మల్లు స్వరాజ్యం [వరంగల్], కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనులను మేల్కొల్పింది.

ఈమె జానపద బాణీల్లో పాటలు కట్టి స్వయంగా పాడి గ్రామాలలోని ప్రజలను ఆకట్టుకునేది. ఈమె ఆంధ్రప్రదేశ్ శాసనసభకు నల్గొండ జిల్లా తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి 1978-1983[2] ,1983-1984[3] సంవత్సరాలలో రెండు పర్యాయాలు సి.పి.ఐ.(ఎం)పార్టీ తరఫున ఎన్నికైంది. నల్లగొండకు చెందిన ప్రముఖ సాహితీవేత్త, తెలంగాణా యోధుడు, పార్లమెంటేరియన్ భీమిరెడ్డి నరసింహారెడ్డి ఈమెకు సోదరుడు.వామపక్ష భావాలతో, స్త్రీల ఆధ్వర్యంలో మొదలైన పత్రిక 'చైతన్య మానవి' సంపాదకవర్గంలో ఈమె ఒకరు.

ఈమె పాటల్లో ఒక ఉయ్యాలపాటలో[4] కొంత భాగం:

వీరమరణం చెందిన 'మట్టారెడ్డి', 'అనంతరెడ్డి'లను స్మరిస్తూ బతకమ్మ పాటశైలిలో ఇలా వివరించింది.

వీరిమట్టారెడ్డి ఉయ్యాలో
ధీర అనంతారెడ్డి ఉయ్యాలో
మీవంటి వీరులు ఉయ్యాలో
మా మధ్య నిలబడి ఉయ్యాలో
మాకు వెలుగులు చూపి ఉయ్యాలో
ఓర్వదీ ప్రభుత్వంబు ఉయ్యాలో
పాత సూర్యాపేట ఉయ్యాలో
పోరాటమును చూడు ఉయ్యాలో
ప్రజల బలమును జూసి ఉయ్యాలో
పారిపోయిరి వాళ్ళు ఉయ్యాలో
మన ప్రజల రాజ్యమును
పొంది తీరాలమ్మ ఉయ్యాలో

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2015-02-09 న ఆర్కైవు చేసారు. Retrieved 2014-11-17. Cite web requires |website= (help)
  2. "ఆరవ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యుల జాబితా". మూలం నుండి 2013-10-12 న ఆర్కైవు చేసారు. Retrieved 2014-11-18. Cite web requires |website= (help)
  3. "ఏడవ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యుల జాబితా". మూలం నుండి 2013-12-06 న ఆర్కైవు చేసారు. Retrieved 2014-11-18. Cite web requires |website= (help)
  4. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2016-03-04 న ఆర్కైవు చేసారు. Retrieved 2014-11-17. Cite web requires |website= (help)

ఇతర లింకులు[మార్చు]