Jump to content

రాంరెడ్డి దామోదర్‌రెడ్డి

వికీపీడియా నుండి
రాంరెడ్డి దామోదర్‌రెడ్డి
రాంరెడ్డి దామోదర్‌రెడ్డి


ఐటీ శాఖ మంత్రి
పదవీ కాలం
2008 – 2009
నియోజకవర్గం సూర్యాపేట

పదవీ కాలం
2009 – 2014
తరువాత గుంటకండ్ల జగదీష్‌రెడ్డి

పదవీ కాలం
2004 – 2009
ముందు సంకినేని వెంకటేశ్వర రావు
తరువాత మోత్కుపల్లి నర్సింహులు
నియోజకవర్గం సూర్యాపేట
పదవీ కాలం
1985 – 1999
ముందు మల్లు స్వరాజ్యం
తరువాత సంకినేని వెంకటేశ్వర రావు
నియోజకవర్గం తుంగతుర్తి

వ్యక్తిగత వివరాలు

జననం 1952 సెప్టెంబరు 14
లింగాల, ఖమ్మం జిల్లా, తెలంగాణ, భారతదేశం [1]
మరణం 2025 అక్టోబరు 1(2025-10-01) (వయసు: 73)
హైదరాబాదు
జాతీయత భారతదేశం
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి వరూధినీ దేవి
బంధువులు రాంరెడ్డి వెంకటరెడ్డి (అన్న), గోపాల్‌రెడ్డి, క్రిష్ణారెడ్డి
సంతానం సర్వోత్తమ్ రాంరెడ్డి
నివాసం సూర్యాపేట, తెలంగాణ, భారతదేశం
వృత్తి రాజకీయ నాయకుడు

రాంరెడ్డి దామోదర్‌రెడ్డి (1952 సెప్టెంబరు 14 - 2025 అక్టోబరు 1), తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి. ఆయన తుంగతుర్తి శాసనసభ నియోజకవర్గం, సూర్యాపేట శాసనసభ నియోజకవర్గం ల నుండి ఎమ్మెల్యేగా పనిచేశాడు.[2] ఆయన 1991 నుండి 1992 వరకు రాష్ట్ర భూగర్భజలవనరుల శాఖ మంత్రిగా, 2008 నుండి 2009 వరకు  ఐటీ శాఖ మంత్రిగా పని చేశాడు.[3][4]

రాంరెడ్డి దామోదర్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలు, అన్ని పార్టీల నాయకులు ‘టైగర్‌ దామన్న’ అని పిలిచేవారు. ఆయన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో, స్థానిక సమస్యల పరిష్కారంలో కృషి చేశారు.

రాజకీయ జీవితం

[మార్చు]

రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి 1985లో జరిగిన ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయన 1989లో జరిగిన ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కకపోవడంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి హ్యాట్రిక్ సాధించాడు. ఆయన 1994, 2004 ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు, ఆ తరువాత నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణతో సూర్యాపేటకు మారి 2009 ఎన్నికల్లో సూర్యాపేట నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వరుసగా 2014, 2018, 2023 శాసనసభ ఎన్నికల్లో సూర్యాపేట శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయాడు.[5][6]

పోటీ చేసిన నియోజకవర్గాలు

[మార్చు]
సంవత్సరం నియోజకవర్గం పేరు గెలుపొందిన అభ్యర్థి పేరు పార్టీ ప్రత్యర్థి పేరు పార్టీ ఫలితం
1985 తుంగతుర్తి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ సి.పి.ఎం గెలుపు
1989 తుంగతుర్తి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ గెలుపు
1994 తుంగతుర్తి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి స్వతంత్ర వర్డెల్లి బుచ్చి రాములు సి.పి.ఎం గెలుపు
1999 తుంగతుర్తి సంకినేని వెంకటేశ్వర రావు టీడీపీ రాంరెడ్డి దామోదర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఓటమి
2004 తుంగతుర్తి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ సంకినేని వెంకటేశ్వర్లు టీడీపీ గెలుపు
2009 సూర్యాపేట రాంరెడ్డి దామోదర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ పి.చంద్రశేఖర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి గెలుపు
2014 సూర్యాపేట జి.జగదీశ్వర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఓటమి
2018 సూర్యాపేట జి.జగదీశ్వర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఓటమి
2023 సూర్యాపేట జి.జగదీశ్వర్ రెడ్డి భారత్ రాష్ట్ర సమితి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఓటమి

మరణం

[మార్చు]

రాంరెడ్డి దామోదర్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాదు, గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ 2025 అక్టోబరు 1న మరణించాడు.[7][8][9]

మూలాలు

[మార్చు]
  1. Eenadu (4 November 2023). "ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి ఇక్కడే గెలిచారు". Archived from the original on 4 November 2023. Retrieved 4 November 2023.
  2. Sakshi (27 November 2018). "హ్యాట్రిక్‌.. వీరులు!". Sakshi. Archived from the original on 2 జూన్ 2021. Retrieved 2 June 2021.
  3. Eenadu (10 November 2023). "ఉత్కంఠకు తెర.. కాంగ్రెస్‌ అభ్యర్థులు వీరే." Archived from the original on 10 November 2023. Retrieved 10 November 2023.
  4. BBC News తెలుగు (29 March 2024). "ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: ఒకప్పుడు ఓ వెలుగు వెలిగి, తెరమరుగైన తెలుగు రాష్ట్రాల నేతలు, వారి వారసులు". Archived from the original on 2 July 2024. Retrieved 2 July 2024.
  5. Andhrajyothy (10 November 2023). "సూర్యాపేట టికెట్‌ దామోదర్‌రెడ్డికే". Archived from the original on 10 November 2023. Retrieved 10 November 2023.
  6. Eenadu (4 December 2023). "స్వల్ప తేడాతో దామోదర్‌రెడ్డి మరోసారి ఓటమి". Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
  7. "మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి (73) కన్నుమూత". Sakshi. 1 October 2025. Archived from the original on 1 October 2025. Retrieved 1 October 2025.
  8. "మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి కన్నుమూత". Eenadu. 2 October 2025. Archived from the original on 2 October 2025. Retrieved 2 October 2025.
  9. "రాంరెడ్డి దామోదర్‌రెడ్డి కన్నుమూత". Andhrajyothy. 2 October 2025. Archived from the original on 2 October 2025. Retrieved 2 October 2025.